Saturday, December 31, 2022
AALO REMBAAVAAY-18
AALO REMBAAVAAY-17
పాశురము-17
*********
"శయ్య శయనిస్తున్నది అతిశయము మీర
శ్యామసుందరు లీల కనుడు కనులార."
ఆధ్యాత్మిక మయమైన నందగోప పాలకుని శయనమందిరమునకు అత్యంత భక్తిశ్రధ్ధలతో, ప్రవేశించిన వారలై,అపురూప భావనము-ఆరాధ్య సేవనముతో,వారు ఎన్ పెరుమాన్-ఎన్ పెరుమాట్టి-త్రివిక్రమ-బలరామ అని వారి మహోన్నతత్త్వమును కీర్తిస్తూ,వారిని నలుగురిని తాము నోముచేయుచున్న ప్రదేశమునకు విచ్చేసి,నోమును సుసంపన్నము చేయమని ప్రార్థిస్తున్న వారితో పాటుగా మనలను అనుగ్రహిస్తున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.
అంబరమే తణ్ణీరే శోరే అరం శెయ్యం
ఎంబెరుమాన్ నందగోపాల! ఎళుందిరాయ్
కొంబనార్కెల్లాం కొళుందే! కులవిళక్కే
ఎంబెరుమాట్టి! యశోదాయ్! అరివురాయ్
అంబరం ఊడరత్త ఓంగి ఉలగలంద
ఉంబర్కోమానే ఊరంగాదు ఎళుందిరాయ్
శెంపోర్ కళలడి శెల్వా బలదేవా
ఊంబియున్ నీయుం ఉరంగేలే రెంబావాయ్.
అంబరమే-తన్నీరే-శోరే ను ,అన్నము పరబ్రహ్మ స్వరూపము.అటువంటి అన్నమును-నీటిని-వస్త్రములను ధర్మముగా దానము చేయువాడు.
"వైకుంఠము-విరజానది- ఉపనిషత్తులను అంబరమే-తన్నీరే-శోరే గా ప్రస్తావించినది ఆండాళ్ తల్లి.
ఓం-నమో-నారాయణాయ అను అష్టాక్షరిని కూడ అంబరమే-తన్నీరే-శోరే లుగా ఆరాధిస్తారు."
Friday, December 30, 2022
AALO REMBAAVAAY-16
పాశురము-16
***********
హరి
"నీవేకావాలంటున్నది ప్రతితలపు
నీవెవరవంటున్నది ప్రతి తలుపు"
ఆ తలుపు
1 అష్టాక్షరి-ప్రణవము ఒక రెక్క-మంత్రశేషము మరొకటి
2.ద్వయి మంత్రము-పూర్వ ఖండము ఒక రెక్క-ఉత్తరఖండము మరొకటి
3.చరమశ్లోకము-పూర్వార్థము ఒక రెక్క-ఉత్తరార్థము మరొకటి.
ఆ తలుపు "నేశన్నిలైకడవం-గట్టుగా బిగించబడిన గడియను కలిగిఉంది.అన్వయప్రధానమైన
ఆ తలుపునకు "ఆచార్యసిద్ధి" అను గడియవేసిఉన్నది.దానిని తెరచుశక్తి" ఆచార్య సమాశ్రణమే" కలిగియున్నది.
"ఉన్నిమీషతి-అథోనిమీషతి" భగవాన్ అన్న ఆర్యోక్తిని సవరిస్తూ "ఆచార్యాన్ సర్వం ఉన్నిమీషతి"
బుద్ధి కర్మానుసారిణి -కర్మఫలితములను అనుభవించుటకు తగిన బుద్ధులను ప్రసాదించువాడు భగవంతుడైతే,బుద్ధులను సవరించి ఉద్ధరించువాడు ఆచార్యుడు
అన్న ఆచార్యవైభవ ప్రస్తావనమును తెలిపిన గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ.అనుగ్రహించినంతమేరకు అనుసంధానమును చేసుకునే ప్రయత్నమును చేద్దాము.
నాయగనాయ్ నిండ్ర నందగోపనుడయ
కోయిల్ కాప్పానే కొడితోన్రుం తోరణ
వాశల్ కాప్పానేమణిక్కదవం తాళ్తిరవాయ్
ఆయర్ శిరుమియరో ముక్కు అరైపరై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేరిందాన్
తూయోమాయ్ వందోం తుయల్ ఎళుప్పాడువాన్
వాయాల్ మున్న మున్నం మాట్రారేఅమ్మ నీ
నేశన్నిలై కదవం నీక్కేలో రెంబావాయ్.
స్వామి నిత్యప్రత్యక్షసేవాసౌభాగ్యమును పొందిన ధన్యులు నిత్యసూరిగణము.వారి స్వామి ప్రకతింపబడుచున్న అవతారముతో పాటుగా వారును వివిధ ఉపాధులలో ప్రకటనమగుతూ,పరమాత్మనే ఉపాయముగా సేవిస్తూ తిరిగి పరమాత్మతో పాటు తరలిపోయెదరు.అట్టి ద్వారపాలకుని,నందగోపాలుని,వారున్న దివ్యదేశమును,దానికి ఉన్న ప్రాకారమును-ప్రాసాదమును,వాటిని కావలి కాస్తున్న ద్వారశేషులను వారితో పరిశుద్ధులై వచ్చినవారి వినయపూర్వక సంభాషణమును గోదమ్మ వివరిస్తున్నది.మర్యాదగానే వారిని,
వాయాల్ మున్న మున్నం మాట్రారేఅమ్మ -మాటి మాటికి లోనికి పోనివ్వమని మమ్ములను అడ్దగించకండి అని చెప్పుచున్నది.
గోదమ్మతో సహా గోపికలు శ్రీకృష్ణుడు నిన్ననే వారికి అనుగ్రహిస్తానన్న "పర" అను వాయిద్యమును స్వీకరించుటకు,తూయోమాయ్-పరిశుభ్రులై,జితేంద్రియులై వచ్చి,
వారి నాయగనాయ్-నాయకుడైన
నందగోపన్ కోయిల్-నందగోపుని ఇంటి ముంగిట
అరై-పరై-అనుగ్రహిస్తానన్న పఱను
నోమునకు తీసుకువెళ్లుటకు
నిన్ర-నిలబడియున్నామని చెప్పారు
వారి ప్రాకారద్వారము -కోయిల్ కాప్పానే- దగ్గర ఇద్దరు ద్వారపాలకులున్నారు.బాహ్యమునకు సంబంధించినది.
భవనము మీద కట్టీణా కేతనము పరాక్రమమును చాటుతూ ఎగురుచున్నది.భగవత్తత్త్వ ప్రతీకగా వారిని అక్కడికి చేర్చినది.
కొంచము బ్రతిమిలాడగనే కావలివారు వీరిని,
ఆయర్ శిరుమియరో ముక్కు-ముక్కుపచ్చలారని గొల్లపడుచులని లోనికి ప్రవేశించుటకు అనుమతించారు.
వీరు బాహ్యరుగ్మతలను విడిచిన పరిశుద్ధులు కనుక బాహ్యద్వారా-ప్రాకార ద్వార ప్రవేశము లభించినది.
కాని అక్కడ వారికి మరియొక తలుపు కనిపించినది.దాని గడప అత్యంత మనోహరముగా ఉన్నది
.తలుపువైన కళాత్మకముగా చెక్కిన తోరణ శిల్పములు మరింత ఆకర్షణీయముగా నున్నది.గడియ సంగతి సరేసరి.మణులతో మెరిసిపోతు గట్టిగా బిగించియున్నది.దానిని కావలి కాస్తున్న-వాశల్ కాప్పానే - ద్వారశేషులు సామాన్యులు కారు.
వీరిని శీఘ్రముగా లోనికి అనుమతించలేదు.దానికి కారణము అది నందగోపుని మందిరము.మనస్వామి ఉంటున్న దివ్యదేశము.అసలు నందుడు-అనవచ్చుగా,లేదా నందప్రభువు అనవచ్చుగా
కాని గోదమ్మ నందగోపన్ నాయగనై అని సంబోధించినది.ఇది ఒక సంకేత నామము.
1.ఆనందకారకుడైన గోవిందుని గోప్యతను రక్షించువాడు.
2.బ్రహ్మవాక్యముగా గోకులమున జన్మించి శ్రీకృష్ణునిచే తండ్రిగా సేవింపబడుతున్న పుణ్యాత్ముడు.
2.అనవరతము బ్రహ్మానందములో రమించుచు,బాహ్యమునకు గోకులనాయకుడిగా ధర్మరక్షణమును గావించువాడు.
ఈ భవనము మణిమయము.తలుపు మణిమయము.గడియ మణిమయము.
బాహ్యబంధములు విడినంతమాత్రమున సరికాదు.బాహ్యాకర్షణలను సైతము జయించి భగవత్తత్త్వమునకై తపించుచుండాలి.మణుల భ్రాంతిని అధిగమించి మనసు మణివర్ణునిపై మరలగలగాలి.
మొదటిది-స్వయం ప్రకాశకత్వము.
రెండవది సర్వ ప్రసాద గుణత్వము.స్వామి వైభవమని గుర్తించగలగాలి.భావబంధములు సైతము దూరమయిన నాడే భాగవదనుగ్రహమును పొందగలము.
ప్రస్తుత పాశురములో గోపికలు పఱను తీసుకు వెళ్ళుటకు వచ్చామన్నారు.అది బాహ్యము.కనుక ద్వారపాలకులు అనుమతించలేదు.
రవ్వంత బాహ్యము వీడిపోయినది.వారిని/మనలను వీడవలసినది భావ బంధములు.అదియును వీడినది కనుకనే పఱ ప్రస్తావనను మరచి,
తుయల్ ఎళుప్పాడువాన్-స్వామి నిద్రావైభవమును వీక్షిస్తూ,సుప్రభాతమును పాడుటకు వచ్చామని అడ్డుపెట్టవద్దని ,అనుమతించమని అర్థిస్తున్నది గోదమ్మ.ఆచార్యానుగ్రహమనే గడియను తెరిచే ఉపాయముతో స్వామి రూప గు ణ లీలా విశేషములనుమాయాన్-మణివణ్ణన్- మమ్ములను అనుగ్రహించు స్వామిఅనుటకై, క్షేత్రపాలకుని సేవించి అనుమతిని పొంది వారిని దర్శించుటకు
,గోపికలతో పాటుగా మనలను తీసుకుని వెళుతున్న,
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం
Thursday, December 29, 2022
AALO REMBAAVAAY-15
పాశురము-15
***********
ప్రతి నాదము- హరి అష్టాక్షరి
ప్రతివాదము -హరి స్పష్టాకృతి.
పదిమంది గోపికలు ప్రగతికి కరదీపికలు.పరిపూర్ణ వైష్ణవ ప్రతిరూపములు,కొందరు భగవదాదేశము కనుక పరమార్థతత్త్వమును బోధించవలెననుకొనువారు,ఇంకొందరు తమను సమీపించినవారికి సన్మార్గమును చూపువారు,కొందరు తమ ధర్మముగా అడుగకున్నాను ఆదుకోవాలనుకొనువారు,
మరికొందరు తమకుతామె కుతూహలముతో కృష్ణసన్నిధిని చేర్చువారు,బహుముఖములుగా భాసించుచు పాశురములుగా మనలను ఆశీర్వదించువారు.
లేతచిలుక ప్రస్తావన సంకేతముగా మనలను సంస్కరించబోతున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,గోపికలను మేల్కొలుట యను రెండవ భాగము నందలి చివరి/ప్రస్తుత పాశురమును అనుసంధానము చేసుకుందాము.పది ఇంద్రియములు పరిశుద్ధములైనవి కనుక ఇక వాదోపవాదములుండవు.సూటిపోటి మాటలుండవు.పరాచికములుండవు.పరిహాసములుండవు.
లెక్కలుండవు-ఎక్కువతక్కువలుండవు.ఒక్కటే లక్ష్యము.ఒక్కటే లక్షణము.అరమరికలను అధిగమించిన పరిపూర్ణ పారమార్థికము.
ఎల్లే! ఇళంగిళియే ఇన్నం ఉరంగుదియో
శెల్లెన్మ్రాళే యే మిన్ నంగవీర్ పోదాగిన్రే
వల్లై ఉన్ కట్టురైగళ్ పండే ఉన్వాయ్ అరిదుం
వల్లీర్గళ్ నీంగళే నానేతాన్ ఆ ఇడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేరుడయై
ఎల్లారుం పోందారో పోందార్ పో ఎణ్ణిక్కుళ్
వల్లానై కొన్రానై మాట్రారై మాట్రళిక్క
వల్లానై మాయనై పాడేలో రెంబావాయ్.
సిత్తం శిరుకాలే పాశురమును భగవదనుభవమునకు అమ్ణిపూసగాను,ఎల్లే ఇలంకిళియే పాశురమును భాగవదనుభవమునకు మణిపూసగా భావిస్తూ,
ఈ పాశురమును వేదవిదులు" తిరుప్పావాయిలం తిరుప్పావై" గా కీర్తిస్తారు.
గోదమ్మ ఈ పాశురములములో మూడు విషయములను
ప్రస్తావిస్తు,మూలతత్త్వమును వివరిస్తు,ముముక్షత్వానికి మార్గము
చూపిస్తున్నది.కనుకనే ఈ పాశురమును" పరమాద్భుతమా" అంటు
ప్రారంభించినది.
ఎల్లే!- ఎంత ఆశ్చర్యము పరమాద్భుతము అని తన చిలుకను గురించి(మన గోపికను) ప్రస్తావించుచున్నది.
ఇళ్ళంగిళియే-లేత చిలుకా! అంటు మన గోపికను సంబోధించినది.
ఇక్కడ మనమొక సంఘటనను ముచ్చటించుకుందాము.
చిలుక తనంత తానుగా ఏమియును నేర్వలేనిది కాని పరమాత్మచే చక్కని (సాధనమార్గమును) వాక్ అనే ఇంద్రియమును ప్రసాదింపబడినది.
గోదమ్మ తన పెంపుడు చిలుకకు గోవింద-గోవింద అను గోవింద నామమును పలుకుట నేర్పించినది.అదియును అంతే శ్రధ్ధా భక్తులతో నేర్చుకున్నది.అప్పుడు గోదమ్మ దానితో నీవు ఎల్లప్పుడును నిర్విరామముగా-నిశ్చలముగా నామసంకీర్తనమును చేస్తూనే ఉండు.అది నాకెంతో ఇష్టము అని చెప్పినది.చిలుక క్రమమును తప్పక కీర్తిస్తూనే ఉంది.
కాని ఒకనాడు స్వామి విరహవేదనతో అన్యమనస్కయై, చిలుక నామ సంకీర్తనమునకు ఆగ్రహించి దానిని మౌనముగా ఉండమన్నది.కాని అది వినలేదు.తనపాటికి తాను తన్మయముతో గోవింద నామములను కీర్తిస్తూనే ఉంది.ఎందుకంటే దానికి బాహ్య విషయములతో గాని-వాటి ప్రభావములతో గాని సంబంధము లేదు.ఆ దశను ఎప్పుడోఅధిగమించేసినది.
మన గోపిక కూడ అదే స్థితిలో ఆనందిస్తుంటుంది.కనుకనే ,
ఇన్నం ఉరంగుదియే-ఇంకను నిద్రించుచున్నావా? అన్నను,నీంగల్ వల్లీర్గళ్-నీవు మాటకారివి అన్నను,ఉన్ కట్టుకైరల్ మున్నే అరిదుం-నీవు చెప్పేవన్ని కట్తుకథలని మాకు ముందేతెలుసు అని అన్నాగాని,కోపగించుకొనక,వినయముగా వారికి సమాధానమునిచ్చినది.పౌరషములేదు-పరుషవాక్యములు లేవు పదవ గోపికకు.
మనము చిలుకలమే.కాని సంసారమనే పంజరములో బంధింపబడి ఉన్నాము.అస్వతంత్రులము.కనుకనే అమ్మ,
ఇన్నం ఉరంగుదియో?ఇంకను మేల్కొనలేద?భవబంధములకు కట్తుబడిన చేతనులారా,మేల్కొనండి.
ప్రతిరాత్రి నిదురించుట-ఉదయమున మేల్కాంచుట-రాత్రి అవగానే తిరిగి నిద్రించుట-అనగా,
జన్మజన్మల పరంపరలను జ్ఞాన ప్రవృత్తి లేక కొనసాగించుచున్నవారలము.కనుక,
మేల్కొని వ్రతమునకు రండి అని పిలుచు
శెల్లాన్రు-పరుష వాక్యములను/నిందా వాక్యములను
ఆళయేన్-పలుకవద్దు.(చేతనులారా! పరుషముగా మాటలాదకండివాక్కుతో స్వామిని కీర్తించండి)
మీరు,(బయటనున్న గోపికలు)
నీంగళ్ వల్లీర్గళ్-వాక్చాతుర్యమును
పొందినవారు-వాచక అర్థము.
సర్వ సర్వజ్ఞులు-సమస్తమును తెలుసుకున్నవారు-అంతరార్థము.కనుక,
నాపై నిందలను మోపకండి అని అన్నది.
లోపల నున్న గోపిక అలా ఎందుకన్నది? అంటే అంతకు ముందు ఆమె వారితో ఏదో చెప్పబోతుందగా,చాలు-చాలు,
వల్లై-ఓ చమత్కార గోపిక,
నీవు చెప్పే,
కట్టురైకల్-కట్టుకథలు,
ఆరిదుం-మాకు తెలుసు.మేము మునుపు ఎన్నో విన్నాము అన్నారు..ఇది బాహ్యమునకు కనిపించు అభియోగము.
అవివేకము-వివేకము మధ్య జరుగుచున్నది సంభాషనము.వివేకము మేల్కొని అవివేకమును తరిమివేసినది.
నిజమునకు తల్లీ నీవు వినిపించు కట్టుకథలు అనగా కృష్ణుని లీలలు మాకెంతో ఆనంద దాయకములు అనుచున్నారు.ఇది అభిమానము.
అంతే కాదు అని వాదించలేదు గోపిక.అవును మీరే సరిగా చెప్పుచున్నరు.నేనే మీ దగ్గర ఓడిపోయాను అని అంటున్నది.
నానేతాన్ ఆ ఇడుగ-ఇక్కడ ఓడిపోయిన నానే ఐహికమునకు సంకేతము.విషయసంబంధములు వీడిపోఇనవి.
నేనేదాన్-నేనే,ఆ ఇడుగ-ఓడిపోయాను అని అంటున్నది.వారు అంతకు ముందు ఆమెను నోముకు కూడ రాలేనంత పనులు నీకేమున్నాయి? అని దెప్పిపొడిచారు.ఒకవేళ ఉన్నా అవి విషయ సంబంధములే గద అని ఎత్తిపొడిచారు.
ఉనక్కెన్న వేరుడయై-ఇంకేమి పనులున్నాయి నీకు?
అయినను మన గోపిక వాదనకు దిగక,అందరు వచ్చేశార? ఒక్కసారి చూడండి అన్నది.దానికి వారు,
ఎల్లారం పోందారో-అందరము వచ్చేసాము.
పోందార్పో-వచ్చి నిలబడియున్నాము.వచ్చినవి సంస్కరించబడిన ఇంద్రియములు.వాటికి కావలిసినది పరమాత్మ సాంగత్యము.దానికి వారు పాటించవలసిన పద్ధతులు.వాటిని అనుగ్రహించగలిగినది లోపలిగోపిక స్పర్శానుగ్రహము.
మా మాటమీద నమ్మకము లేకపోతే వచ్చి,నీ వేలితో మమ్ములను తాకుతు,
ఎణ్ణిక్కుళ్-లెక్కించు అన్నారు.( ఆచార్య స్పర్శానుగ్రహమును కోరుచున్నవారు)
ఒల్లె-త్వరగా,
నీ పోదాయ్-నీవు రమ్ము అని అంటుండగానే ఆమె బయటకు వచ్చి,
ఏ వాగింద్రియము పరుషములను పలికినదో దానిచే పురుషోత్తముని వైభవ సంకీర్తమును చేయించుట
ఈ రోజు స్వామి లీలలో దేనిని కీర్తిస్తు వెళదాము అని సూచించుట ,
వల్ల-పరాక్రమవంతమైన
అలనై-ఏనుగును
ఈ పాశురమును వేదవిదులు" తిరుప్పావాయిలం తిరుప్పావై" గా కీర్తిస్తారు.
గోదమ్మ ఈ పాశురములములో మూడు విషయములను ప్రస్తావిస్తు,మూలతత్త్వమును వివరిస్తు,ముముక్షత్వానికి మార్గము చూపిస్తున్నది.కనుకనే ఈ పాశురమును" పరమాద్భుతమా" అంటు ప్రారంభించినది.
ఎల్లే!- ఎంత ఆశ్చర్యము పరమాద్భుతము అని తన చిలుకను గురించి(మన గోపికను) ప్రస్తావించుచున్నది.
ఇళ్ళంగిళియే-లేత చిలుకా! అంటు మన గోపికను సంబోధించినది.
ఇక్కడ మనమొక సంఘటనను ముచ్చటించుకుందాము.
చిలుక తనంత తానుగా ఏమియును నేర్వలేనిది కాని పరమాత్మచే చక్కని (సాధనమార్గమును) వాక్ అనే ఇంద్రియమును ప్రసాదింపబడినది.
గోదమ్మ తన పెంపుడు చిలుకకు గోవింద-గోవింద అను గోవింద నామమును పలుకుట నేర్పించినది.అదియును అంతే శ్రధ్ధా భక్తులతో నేర్చుకున్నది.అప్పుడు గోదమ్మ దానితో నీవు ఎల్లప్పుడును నిర్విరామముగా-నిశ్చలముగా నామసంకీర్తనమును చేస్తూనే ఉండు.అది నాకెంతో ఇష్టము అని చెప్పినది.చిలుక క్రమమును తప్పక కీర్తిస్తూనే ఉంది.
కాని ఒకనాడు స్వామి విరహవేదనతో అన్యమనస్క్యై చిలుక నామ సంకీర్తనమునకు ఆగ్రహించి దానిని మౌనముగా ఉండమన్నది.కాని అది వినలేదు.తనపాటికి తాను తన్మయముతో గోవింద నామములను కీర్తిస్తూనే ఉంది.ఎందుకంటే దానికి బాహ్య విషయములతో గాని-వాటి ప్రభావములతో గాని సంబంధము లేదు.ఆ దశను ఎప్పుడోఅధిగమించేసినది.
మన గోపిక కూడ అదే స్థితిలో ఆనందిస్తుంటుంది.
మనము చిలుకలమే.కాని సంసారమనే పంజరములో బంధింపబడి ఉన్నాము.అస్వతంత్రులము.కనుకనే అమ్మ,
ఇన్నం ఉరంగుదియో?ఇంకను మేల్కొనలేద?
ప్రతిరాత్రి నిదురించుట-ఉదయమున మేల్కాంచుట-రాత్రి అవగానే తిరిగి నిద్రించుట-అనగా,
జన్మజన్మల పరంపరలను జ్ఞాన ప్రవృత్తి లేక కొనసాగించుచున్నవారలము.కనుక,
మేల్కొని వ్రతమునకు రండి అని పిలుచుచునది.
మాటే మంత్రము అన్న పవిత్రముగా మన వాక్కులను సద్వినియోగ పరచుకోవాలి అను విషయమును,వాదనలను వదిలివేద్దాము అని గోపిక చేత చెప్పకనే చెప్పించుచున్నది.
శెల్లాన్రు-పరుష వాక్యములను/నిందా వాక్యములను
ఆళయేన్-పలుకవద్దు.
మీరు,(బయటనున్న గోపికలు)
నీంగళ్ వల్లీర్గళ్-వాక్చాతుర్యమును
పొందినవారు-వాచక అర్థము.
సర్వ సర్వజ్ఞులు-సమస్తమును తెలుసుకున్నవారు-అంతరార్థము.కనుక,
నాపై నిందలను మోపకండి అని అన్నది.
లోపల నున్న గోపిక అలా ఎందుకన్నది? అంటే అంతకు ముందు ఆమె వారితో ఏదో చెప్పబోతుందగా,చాలు-చాలు,
వల్లై-ఓ చమత్కార గోపిక,
నీవు చెప్పే,
కట్టురైకల్-కట్టుకథలు,
ఆరిదుం-మాకు తెలుసు.మేము మునుపు ఎన్నో విన్నాము అన్నారు..ఇది బాహ్యమునకు కనిపించు అభియోగము.
నిజమునకు తల్లీ నీవు వినిపించు కట్టుకథలు అనగా కృష్ణుని లీలలు మాకెంతో ఆనంద దాయకములు అనుచున్నారు.ఇది అభిమానము.
అంతే కాదు అని వాదించలేదు గోపిక.అవును మీరే సరిగా చెప్పుచున్నరు.నేనే మీ దగ్గర ఓడిపోయాను అని అంటున్నది.
నేనేదాన్-నేనే,ఆ ఇడుగ-ఓడిపోయాను అని అంటున్నది.వారు అంతకు ముందు ఆమెను నోముకు కూడ రాలేనంత పనులు నీకేమున్నాయి? అని దెప్పిపొడిచారు.ఒకవేళ ఉన్నా అవి విషయ సంబంధములే గద అని ఎత్తిపొడిచారు.
ఉనక్కెన్న వేరుడయై-ఇంకేమి పనులున్నాయి నీకు?
అయినను మన గోపిక వాదనకు దిగక,అందరు వచ్చేశార? ఒక్కసారి చూడండి అన్నది.దానికి వారు,
ఎల్లారం పోందారో-అందరము వచ్చేసాము.
పోందార్పో-వచ్చి నిలబడియున్నాము.
మా మాటమీద నమ్మకము లేకపోతే వచ్చి,నీ వేలితో మమ్ములను తాకుతు,
ఎణ్ణిక్కుళ్-లెక్కించు అన్నారు.( ఆచార్య స్పర్శానుగ్రహమును కోరుచున్నవారు)
ఒల్లె-త్వరగా,
నీ పోదాయ్-నీవు రమ్ము అని అంటుండగానే ఆమె బయటకు వచ్చి,ఈ రోజు స్వామి లీలలో దేనిని కీర్తిస్తు వెళదాము అంటే,
వల్ల-పరక్రమవంతమైన
అలనై-ఏనుగును
వల్లానై మాయనై-అంటు ప్రారంభించినది.
మొదటిది-మదించిన ఏనుగు.
రెండవసారి అన్నప్పుడు మదించిన మన ఇంద్రియములు.
.
ఎల్లే!-ఎంతటి పరమాద్భుతమాలీల.
అదే కువలయ పీడనము.
స్వామి కువలయమనే పరాక్రమమైన ఏనుగును వధించి,దాని బాధను గోకులమునకు పోగొట్టినాడట.ఇది కథ.
కాని కు-చెడు,వలయములు-ఆలోచనలు.
చెడు ఆలోచనలను కలిగించునవి ఇంద్రియములు.నిజమునకు మన ఇంద్రియములు సర్వసమర్థవంతములు కావు.వాటికి నిర్దేశింపబడిన పరిమిత శక్తివంతములు.నిజమునకు కన్ను వినలేదు-చెవి చూడలేదు.అయినప్పటికిని అవి మహ బలపరాక్రమవంతములని భ్రమలో నుండి వాదనలను యుధ్ధములను గెలుపు తమదే నన్న నమ్మకముతో చేస్తూనే ఉంటాయి.
ఏ విధముగా కువలయము యొక్క దంతమే దాని అంతమునకు కారణమైనదో,అదే విధముగా భగవత్ప్రసాదములైన ఇంద్రియ దుర్వినియోగమే వినాశ హేతువు.దాని నియంత్రణయే ధ్యానము అను చక్కని సందేశమునిచ్చి,పది ఇంద్రియములను జయింపచేసిన స్థితిలో నున్న గోపికలతోపాటుగా,మన చేతిని పట్టుకుని,నిత్యసూరులను మేల్కొలుపుటకు కదులుచున్న,
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
వల్లానై మాయనై-అంటు ప్రారంభించినది.
మొదటిది-మదించిన ఏనుగు.
రెండవసారి అన్నప్పుడు మదించిన మన ఇంద్రియములు.
.
ఎల్లే!-ఎంతటి పరమాద్భుతమాలీల.
అదే కువలయ పీడనము.
స్వామి కువలయమనే పరాక్రమమైన ఏనుగును వధించి,దాని బాధను గోకులమునకు పోగొట్టినాడట.ఇది కథ.
కాని కు-చెడు,వలయములు-ఆలోచనలు.
చెడు ఆలోచనలను కలిగించునవి ఇంద్రియములు.నిజమునకు మన ఇంద్రియములు సర్వసమర్థవంతములు కావు.వాటికి నిర్దేశింపబడిన పరిమిత శక్తివంతములు.నిజమునకు కన్ను వినలేదు-చెవి చూడలేదు.అయినప్పటికిని అవి మహ బలపరాక్రమవంతములని భ్రమలో నుండి వాదనలను యుధ్ధములను గెలుపు తమదే నన్న నమ్మకముతో చేస్తూనే ఉంటాయి.
ఏ విధముగా కువలయము యొక్క దంతమే దాని అంతమునకు కారణమైనదో,అదే విధముగా భగవత్ప్రసాదములైన ఇంద్రియ దుర్వినియోగమే వినాశ హేతువు.దాని నియంత్రణయే ధ్యానము అను చక్కని సందేశమునిచ్చి,పది ఇంద్రియములను జయింపచేసిన స్థితిలో నున్న గోపికలతో నోమునకు వెళ్ళుచున్న గోదమ్మ చేతిని పట్టుకుని,మనము మన అడుగులను కదుపుదాము.
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
Wednesday, December 28, 2022
AALO REMBAAVAAY-14
పాశురము-14
***********
ప్రతి పదము-పరమ పథమే
పతి పదము-పరమపదమే.
నంగాయ్-నాణాదాయ్-నావుడయాయ్ అంటు గోపికను మేల్కొలుపుతున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,
"నెగిళిందు-కూంబిణగాం" అను ముకుళితము-వికసనము "
అను పరమార్థమైన పదములను ,పాశురమును అనుసంధానము చసుకునే ప్రయత్నమును చేద్దాము.
ఉంగళ్ పుళక్కడై తోటత్తు వావియుల్
శెంగుళునీర్వాయ్ నెగిళిందు ఆంబల్వాయ్ కూంబిణగాం
శెంగళ్పొడి కూరై వెణ్పల్ తవర్ తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోదందార్
ఎంగళై మున్నమెళుప్పువాన్ వాయ్పేశుం
నంగాయ్! ఎళుందిరాయ్! నాణాదాయ్! నావుడైయాయ్
శంగొడు శక్కరం ఏందు తడక్కైయన్
పంగయ కణ్ణానై ప్పాడు ఏలోరెంబావాయ్.
లక్ష్మీనారాయణులు లీలగా ఒకసారి దాగుడుమూతలాడుకొనుచున్నారట.స్వామికి కనిపించకుండా/స్వామిని పట్టుకోనీయకుండా మహాలక్ష్మి పద్మములున్న తోటలోనికి వచ్చి,వాటిని విప్పారకూడదని శాసించి తాను అందులో ఒక విశాలమైన అందమైన పదముములో కూర్చుండి దానిని ముకుళింపచేసినదట.స్వామి అమ్మను వెతుకువెతుకుతు తోటలోని పద్మములన్ని ముకుళించియుండుటను గమనించి ,వాటిని వికసింపచేయుటకై,తన కుడికన్ను మిక్కిలి ప్రకాశవంతము చేసినాడట.స్వామి నేత్రసౌందర్యాసక్తులైన పద్మములు అమ్మ మాటను సైతము నిర్లక్ష్యము చేసి విచ్చుకున్నాయట ఆ ఒక్క పద్మము తక్క.అప్పటివరకు వాటికి కాలనియమముననుసరించి వికసించు నియమము లేదని,స్వామి సూర్యుని ఉదయముతో పాటుగా తమ వికసనముతో ఉషోదయమును తెలియచేసే వరమును అనుగ్రహించాడట.
ప్రస్తుత పాశురములో
1.కమలముల వికసనము-కలువల ముకుళము
2.ఇటుకపొడి రంగు గల వస్త్రములు-తెల్లని దంతములు
వస్త్రములు విడువబడూవి-రజోగునము
దంతములు స్వీకరింపబడునవి-సత్వగుణము
అంటే
సత్వగుణ వికసనము-రజోగుణ విసర్జనము
3.విశాలమైన స్వామి భుజములు
శంఖ చక్రములు-పద్మములవంటి కన్నులు
కీర్తించబడినాయి.
మరికొందరు విజ్ఞులు సంఖమును సత్వగుణ ప్రకాశముతోను-చక్రమును పరాక్రమముతోను వాటికి ఉపమానములే పద్మములని-నల్ల కలువలని కూడా
భావిస్తారు.
ఇప్పటివరకు గోపి పెరటి తోటలోని మణికైరవ బావిలోన
కమలములు విచ్చినవి-కలువలు ముడుచుకొనినవికాషాయాంబర ధారులు- ధవళ వర్ణ దంతులుశంఖనాదార్చకులు గుడికి చేరుచున్నారుఅని చెప్పి గోపిక స్వభావమును చెప్పుచున్నది గోదమ్మ.
గోదమ్మ ఈ పాశురములో వాచ్యార్థముగా మేల్కొలుపబడుచున్న గోపికకు మూడు గొప్ప లక్షణములు కలదని,తన సంబోధనల ద్వారా తెలియచేయుచున్నది.
ఏమిటా మూడు గొప్ప లక్షణములు అను సందేహము మనకు రావచ్చును.గోపికలు ఆమెను బధ్ధకస్తురాలా-సిగ్గులేనిదానా-కపటస్వభావము గలదానా అని,తమను లోపలికి ఆమె పిలువలేదని,తెల్లవారినదని తాము గురుతులు చెప్పినను వాటిని చమత్కరించి బదులు చెప్పుతున్నదని భావిస్తున్నారు.
కాని అంతరార్థము అదేనా? అదే అయితే గోదమ్మ వాటిని ప్రస్తావిస్తుందా?
1.మొదటి సంబోధన " నంగాయ్" పరమాత్మ తత్త్వమునందు పరిపూర్ణ జ్ఞానము కలది.
2.రెండవది-నాణాదాయ్ -సిగ్గులేనిది వాచ్యార్థము.రాబోవు పాశురములలో గోపికలు కృష్ణునితో'అబిమానబంగ వందోం' అను చర్యకు సూచకముగానిపిస్తున్నది.అభిమానమునకుభంగము వా టిల్లునని తెలిసినను అన్నిటిని వదిలి నీదగ్గరకు వచ్చాము స్వామి అంటారు.
ఇక్కడ వారికి జరిగిన అభిమానమునకు భంగము దేహమునకా-ఆత్మకా? అని ఆలోచించినపుడు వారు దహర విద్యా నిష్ణాతులు.మన అంతరంగమే దహరము.దానిలోని కాశమే వెలుగు.తమ లోపల నున్న స్వామిని గుర్తించిన వారికి దేహాభిమానము ఎక్కడ ఉంటుంది? నేను అన్న మాటకు దేహము కాదని-దానిలోని పరమాత్మ అను విశేషమును తెలిసికొనిన వారు.ద్రౌపది-గజేంద్రుని వలె ఆత్మజ్ఞాన ప్రకాశకులు.
మూడవది-నావుడైయాయ్-కపటస్వభావము కలిగినది అనునది వాచ్యార్థము.లోపల స్వామిని దాచుకొనినది.స్వామితో సరస సంభాషణమును సలుపుతున్నది.స్వామి గోపిక కళ్ళను సరసముగా మూసినాడు తన చేతులతో.సంతోష పారవశ్యముతో నున్నాడు.దాని ఫలితమే కదా గోపిక కన్నులు నల్లకలువలై ముడుచు కొన్నాయి.స్వామి కన్నులు కెందామరలై కాంతితో పూర్తిగా విచ్చుకున్నాయి.(శెంగళ్ నీర్వాయ్ నెగిళిందు) (ఆంపల్వాయ్ కూంబిణగాం)
ఉంగళ్ నీయోక్క అను పదముతో ప్రారంభించినారు గోపికలు.వారు లోపలి గోపిక భగవద్గుణవైభవమును తానొక్క వారిని లోపలికి రానీయకుండా అనుభవిస్తున్నదన్న కినుకతో నున్నవారు.
ఈ విషయమును గ్రహించలేనికారు వారు బయటనున్న గోపికలు.కనుకనే గోపిక వారి ముఖములనే పద్మములుగా-కలువలుగా చమత్కరించినప్పటికి సంభాషణను కొనసాగిస్తున్నారు.వారు సంబంధ విషయజ్ఞానము కలవారు.
1. వారు దృశ్యము-వ్యూహము-శబ్దము (ఆప్త వాక్యము) అను మూడు ప్రమాణములను స్వీకరించి,మొదటిదైన దృశ్యమును గ్రహించి,నీ ఇంటి లోపలి దిగుడు బావిలోనే కాదు,మేము మీ ఇంటికి వచ్చు దారిలోను పద్మములు విచ్చుకొన్నవి-కలువలు ముడుచుకొనినవి అన్నారు.భువన భాండములే ఆ దిగుడుబావి.
రెండవది.
2.వ్యూహము అను జ్ఞానము వీరు ఊహించి నిర్ధారించగలరు.కనుకనే వారు గోపికతో నీ ఇంటి పెరటిలోని దిగుడు బావిలో కొన్ని పూవులు వికసించినవి.మరి కొన్ని ముడుచుకొని ఉన్నవి.అవి రజో తమో గుణములు కావచ్చును.అంతర్ముఖులు-బహిర్ముఖులైన ఆచార్యులును కావచ్చును.
ఇక్కఒక చిన్న ఉదాహరణమును మాట్లాడుకున్నాము.అంతర్ముఖులు దధికుంభుని వంటి వారు.తాను కూర్చున్న కుండయందు కృష్ణుని దాచుకొని,యశోదమ్మతో ఇంగన్ ఇళ్ళె స్వామి ఇక్కడ లేడు అని ముక్తిని పొందినవాడు.ప్రహ్లాదుడు స్వామి ఇందుకలడందులేడని సందేహము వలదనిన వాడు.దధి కుంభుడు తానొక్కదడే ముక్తిని పొందితే, ప్రహ్లాదుడు సకల జగములకు ముక్తి మార్గమును చూపించిన వాడు.
మూడవది నాదము
సంబంధ జ్ఞాన విషయమును శంఖనాదార్చుకులు కోవెలకు శంఖనాదమును చేయుటకు పోవు చున్నారని నాదమును తెలిపినారు.
శంఖనాదార్చకులు కాషాయ వస్త్రధారులుగా-తెల్లని పలువరుస కలిగిన వారై తాళపుచెవుల గుత్తిని ములుకోలకు తగిలించుకొని వెళ్ళుచున్నారట కాచుపొడి అద్దిన వస్త్రములట.అవి అనురాగ చిహ్నములు.దేహములోని దేవునిపై గల అనురాగమునకు గుర్తు.తెల్లని దంతములు వారి సత్వగుణమునకు ప్రతీక .నల్లని తమోగుణము వారిని చేరలేదు .వారి కదలికకు శబ్దమును చేయుచున్న తాళపుచెవులు "అనేన శరణం నాస్తి -త్వమేవ శరణం మమ" అని అంటున్నాయట.ఎంత చక్కటి భావనో కదా!.
మూడు ప్రమాణములను సోదాహరణముగా వివరించిన తరువాత మేల్కాంచిన గోపికతో పాటుగా మనలను సైతము చేయిపట్టి నడిపిస్తున్న,
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
Tuesday, December 27, 2022
AALO REMBAAVAAY-13
పాశురం-13
*********
నన్నాళాల్-పుళ్ళుం శిలబినకాణ్ అను పదములు మనకు ప్రథమపాశురములో నన్నానాళ్-పుళ్ళుం శిలంబినకాణ్ పుళ్లరయన్ అంటు మరల ప్రస్తావించుట లోని అంతరార్థమును అనుగ్రహించనున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పాశురమును అనుసంధానమును చేసుకుందాము.
పదమూడవ పాశురం
****************
పుళ్ళిన్వాయ్ కీండానై ప్పొల్లా అరక్కనై
క్కిళ్ళి క్కళైందానై క్కీర్తిమై పాడిప్పోయ్
పిళ్ళైగళ్ ఎల్లారుం పావై క్కళం పుక్కార్
వెళ్ళి ఎళుందు వ్యాళంఉరంగిట్రు
పుళ్ళుం శిలంబినకాణ్! పోదరికణ్ణినాయ్!
కుళ్లక్కుళిర క్కుడైందే నీరాడాదే
పళ్ళికిడత్తియో? పావాయ్! నీ నన్నాళాల్
కళ్ళం తవిరందు కలందేలో రెంబావాయ్
.
ఓం నమో భగవయే వాసుదేవాయ నమః.
************************
పొల్లా అరక్కన్-నల్లా అరక్కన్ అని జన్మను బట్టి రక్షసులే అయినప్పటికి,కర్మను బట్టి ఒకరు (విభీషణుడు) స్వామిచే రక్షింపబడినాడు.మరియొకరు (రావణుడు) అదే శ్రీరామునిచే శిక్షింపబడినాడు.దానికి కారణము రావణుని ఇంద్రియలోలత్వము.
అదేవిధముగా పొల్లా అరక్కన్ -
1. పొల్లా-మాయావి యైన,
భావ మాలిన్యముతో నిండిన బాహ్య సౌందర్యముతో అసురుడు అక్కడికి ప్రవేశించినాడు.గోపబాలురు ఆ అందమైన కొంగను చూచుటకు వచ్చి,దానిని చూస్తూ ఆనందిస్తున్నారు.
కాని ఆ కొంగ తనకు ఎరగా బాలకృష్ణుని నిర్ణయించుకొని,వానికై ఎదురుచూస్తున్నది.ఇది దాని జిహ్వ చాపల్యమునకు-ఇంద్రియ దుర్వినియోగమునకు సంకేతము.
స్వామి దాని జిహ్వేంద్రియమును సంస్కరించాలనుకొన్నాడు.దాని కోరికను తీరుస్తూ ఎరగా దాని నోటిలోనికి ప్రవేశించాడు.దానిని పవిత్రము చేశాడు.సమీపించాడు.సంహరించాడు.ధర్మ సంరక్షకునిగా సంకీర్తింపబడుతున్నాడు.
అరక్కన్-అసురుని,అందున పక్షిరూపముగా తన కామరూప శక్తితో వచ్చిన వానిని,
పుళ్ళన్-కొంగరూపముతో,అదియును అందమైన తెల్లని కొంగరూపముతో ఖదిరి వనమున ప్రవేశించిన వానిని,
కీండానై-వాడి నోటిని/ముక్కును విభజించి/చీల్చి,
కళందునె-సంహరించిన వానిని,మన గోవిందుని కీర్తిస్తున్నారు.
2. ప్రథమ పాశురములోని నన్నానాళ్-సంకల్పమునకు ఊతయై వ్రతమును చేయుటకు సహకరించినది.
ప్రస్తుత పాశురములోని నన్నానాళ్-వారి దీక్షకు ఎటువంటి ఆటంకమును కలుగనీయకుండా వారినందరిని
నోముస్థలికి చర్చినది.అదే విషయమును గోదమ్మ,
పిళ్ళైగళ్ ఎల్లారుం పావై క్కళం పుక్కార్
గోపికలందరును నోముచేయుస్థలములోనికి ప్రవేశించినారు అని చెబుతున్నది.
3. పుళ్ళుం శిలబినకాణ్ అని ఆరవపాశురములో గోపికను మేల్కొలిపినప్పుడు పక్షులు కూస్తున్నాయి అని తెలవారితోందనుటకు సంకేతముగా చెప్పినది.
అదే పక్షికూతలను తెలవారుతుందనుటకు సంకేతముగా చెప్పుచున్నప్పటికిని ప్రస్తుత పాశురములోని పక్షులు స్వామి అర్చిస్తూ,ఒక విధముగా కాయకముగా,వాచకముగా,మానసికముగా ఆచరిస్తున్నాయి.ఆరవ పాశురములో అవి స్వామిని సేవించాలనే సంకల్పముతో తక్కిన పక్షులను కలుపుకొని,సంసారబంధములను విడిచి,రెక్కలను విప్పుకొనుచు ఇంద్రియములను సరిచేసుకొనుచు వ్రతమును చేయు పేతినగా కూసినాయి.ఇప్పుడు వ్రతభాగముగా స్వామిని సంకీర్తిస్తున్నాయి.దానికి కారణము అందరి మనసులలోని అజ్ఞానము అస్తమించినది.జ్ఞానము ప్రవేశించి స్థిరపడినది.దాని మనకు అనుగ్రహించుటయే
4.వ్యాళం ఉరంగిట్రు-రేచుక్క అస్తమించినది.చీకటి అనే అజ్ఞానము తొలగి పోయినది.
దానికి కారణము,
వెళ్ళం ఎళుంది-పగటి చుక్క ఉదయించిగానేఉషోదయము కాగానే దాని ధాటికి తట్టుకొనలేక చీకటి/అజ్ఞానము కనుమరుగైనది.
నాస్తికత్వమును తొలగించి పరమాత్మ తత్త్వమును ప్రజ్వలింపచేసినది.
మరొక కోణముగా శుక్రాచార్యుడు కచునీ మృఏతసంజీవని విద్య ప్రదానముగా కూడా సంకేతిస్తారు విజ్ఞులు.
5.మేల్కొలుపబడుచున్న గోపిక నేత్ర సౌందర్యము బహుముఖములుగా కీర్తించుచున్నది గోదమ్మ.
" పోదరిక్ కణ్ణినాయ్"
-అని సంబోధించినది.
1. ఈమె కన్నులు పద్మములవలె జ్ఞానసంకేతములై వానిలో పూర్తిగా పరమాత్మను నింపుకున్నవి.స్వామి రూపమును అనుభవించుచున్నవి.నామమును కీర్తించుచున్నవి.గుణ వైభవమును అర్థము చేసుకొనుచున్నవి.పూర్తిగా తమకే సొంతము చేసుకొనుచున్నవి.
ఏవిధముగా అంటే,
2. ఈమె కన్నులు లేడి కన్నుల వంటివి.అతి శీఘ్రముగా చలించకలిగినవి.ఒకవేళ స్వామి తనను వీడి అటు-ఇటు కదలచూసినను నేత్రములు వేగముగా కదులుతూ సాగిపోనీయుట లేదు.
ఆ హరిణేక్షణ హరిని తన కన్నులలో బంధించి ఏమిచేయుచున్నదంటే,
3. ఆ గోపిక కన్నులు తుమ్మెదల వంటివి కనుక ఆమె తన నేత్రములతో శ్రీకృష్ణుని మధురామృతమును తనివి తీరా గ్రోలుతూ ( తానొక్కతియె గ్రోలుతూ) తమకమును వీడక తన్మయ స్థితులో నుండి,కన్నులను తెరువకున్నది.విరహమును కనీసము ఊహించలేని స్థితిలో నున్నది.
కనుకనే తోటి చెలులు/గోపికలు
" పోదరిక్ కణ్ణినాయ్"
-అని సంబోధించినది.
1. ఈమె కన్నులు పద్మములవలె జ్ఞానసంకేతములై వానిలో పూర్తిగా పరమాత్మను నింపుకున్నవి.స్వామి రూపమును అనుభవించుచున్నవి.నామమును కీర్తించుచున్నవి.గుణ వైభవమును అర్థము చేసుకొనుచున్నవి.పూర్తిగా తమకే సొంతము చేసుకొనుచున్నవి.
ఏవిధముగా అంటే,
2. ఈమె కన్నులు లేడి కన్నుల వంటివి.అతి శీఘ్రముగా చలించకలిగినవి.ఒకవేళ స్వామి తనను వీడి అటు-ఇటు కదలచూసినను నేత్రములు వేగముగా కదులుతూ సాగిపోనీయుట లేదు.
ఆ హరిణేక్షణ హరిని తన కన్నులలో బంధించి ఏమిచేయుచున్నదంటే,
3. ఆ గోపిక కన్నులు తుమ్మెదల వంటివి కనుక ఆమె తన నేత్రములతో శ్రీకృష్ణుని మధురామృతమును తనివి తీరా గ్రోలుతూ ( తానొక్కతియె గ్రోలుతూ) తమకమును వీడక తన్మయ స్థితులో నుండి,కన్నులను తెరువకున్నది.
కనుకనే తోటి చెలులు/గోపికలు ఇవి,
కుళ్లక్కుళిర క్కుడైందే నీరాడాదే-
చల్లని యమునా జలములలో మునిగి,స్నానమాచరించి,స్వామి అనుభవముతో మూకలు వేయుటకు మాతో రమ్మని పిలుచుచున్నను,
పళ్ళిక్ కిడత్తియో-పానుపును వీడలేకయున్నావు.నీవు నిజముగా నిద్రించుట లేదని మాకు తెలుసు.
కళ్ళం తవిరిందు-కావాలని నిద్రను నటిస్తున్నావు,
గోఇకలను వారించి,లోపలిగోపికను బహిర్ముఖముచేయుటకై
గోదమ్మ
రామాయణములోని " శబరి" ఔన్నత్యమును వివరించినదట.నిస్స్వార్థముగా ఎన్నో యుగములు శ్రీరామునికై వేచిన శబరి స్వామి తన దగ్గరకు వచ్చిన సమయమున పండ్లను ఆరగింపు చేసి తిరిగిపంపించివేసినది కాని తన దగ్గరనే ఉండిపొమ్మని కోరలేదు.జగత్కళ్యాణమూర్తిని జగములన్నీ పొందవలెను కాని మనము మాత్రమేకాదు అనిచెప్పి, మేల్కాంచిన గోపికతో పాటుగా,మన చేతిని పట్టుకుని నడిపించుచున్న
ఆండాళ్ దివ్య తిరువడియే శరణం.
Monday, December 26, 2022
AALO REMBAAVAAY-12
పాశురము-12
************
తాదాతంత్యతను వీడి జాగరూకము కమ్మా...
ఒక్కొక్క సారి భాషను అధిగమించి భావము భాసిస్తుందనుటకు, ఈ ఉపాధికి గోదమ్మ అనుగ్రహించిన
"తాదాతంత్యతను వీడి జాగరూకము కమ్మా:...దాసోహములు తల్లి.
అంత్యత -పరాకాష్ఠ దశలో నున్న
తాదాత్-మమేక భావము.
మనము మేల్కొలుపుచున్నది గోపికల రూపములో నున్న ఆళ్వారులను.వారు స్వామికి-చేతనులకు మధ్యనున్న నిచ్చెనలవంటివారు.
వారెందరెందరినో స్వామి సమక్షమునకు చేర్చు ప్రక్రియలో కిందమెట్టుమీదనున్న చేతనులకు సహాయపడుటయే స్వామిసేవగా భావించు స్వభావము కల సహృదయులు.వారి చేయూతకై నిచ్చెన కిందిమెట్టుపై వేచియున్న చేతనులెందరో.
వారు అంతర్ముఖమును వీడితేకాని అది సాధ్యపడదు.
కనుక గోదమ్మ బాహ్యమునకు దోషముగా కనిపించే ఉదాహరణములతో వారి గుణ వైభవమును మనకు అందిస్తుంది
.
మనము నిత్యానుష్ఠానమే ప్రధానము అనుకునే సమయములో దానిని సైతము వదిలివేసిన ,సంపన్నుని చెల్లెలా అని ప్రస్తుత గోపికను మేల్కాంచమంటున్నది.
ఓశై పడుత్త తైరరవం అని చల్లచిలుకు శబ్దమును,
ఎరుమై సిరువీడు
మేయాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైకళుం-పశువులు చిన్నమేతకు కదిలి వ్యాపించి మేస్తున్నాయి అని,
కట్రుక్కరవై కణంగళ్ పలకరందు-అనేక పాడి ఆవులను ఒక్కరే అవలీలగా పాలుపితుకు నేర్పు కలవారు అను
గోకులవాసుల నిత్యానుష్ఠానమును తెలియచేసిన గోదమ్మ ప్రస్తుత పాశురములో
నినైత్తు ములై వళియే నిన్రుపాల్ శోర
ననైతిల్లం శేరాక్కుం నర్చెల్వన్ తంగాయ్
పాలుపితుకు నిత్యానుష్టానమును విస్మరించిన " నర్చెల్వన్" ప్రస్తావనతో విశేషానుష్ఠానుము యొక్క ప్రాముఖ్యతను వివరించుచున్న గోదమ్మకు దాసోహములను సమర్పించుకుంటూ,ప్రస్తుత పాశురమును అనుసంధానమును చేసుకుందాము.
కనైత్తిళం కాట్రెరుమై కన్రు క్కిరంగి
నినైత్తు ములై వళియే నిన్రుపాల్ శోర
ననైతిల్లం శేరాక్కుం నర్చెల్వన్ తంగాయ్
పనిత్తళై వీళనిన్ వాశల్ కడైపట్రి
శినత్తినాల్ తెన్నిలంగై క్కోమానై శెట్ర
మనత్తుకు ఇనియానై ప్పాడవుం నీవాయ్ తిరవాయ్
ఇనిత్తాల్ ఎళుందిరాయ్! ఈ తెన్న పేరురక్కం
అనితిల్ల తారారుం అరుందేలో రెంబావాయ్.
1. ప్రస్తుత పాశురములో గోదమ్మ పాలునిండిన పొదుగులతో నున్న గేదెలను,
2.కట్టు విప్పక బంధించియున్న దూడలను
3.సమయమైనప్పటికిని పాలుపితుకక కృష్ణ సేవకు వెళ్ళిన గోపాలకుని
4.ఆదమరచి నిదురించుచున్న వాని చెల్లెలు యైన గోపికను
5.తమ దూడల ఆకలిని గ్రహించి తమకుతామే గేదెలు కుండలనిండా వర్షించిన పాలధారలచే చిత్తడి అయిన నేలను
6.హేమంత మగుటచే పైనుండి కురుస్తున్న
మంచును
7.దక్షిణ లంకాధిపతియైన దశకంఠునిపై కోపించి దండెత్తి సం హారము చేసిన మనోభిరాముని
8.గోకులములలోని చుట్టుపక్కలవారికి నీ నిద్రను గురించి తెలుస్తుందన్న గోపికల
పరిహాసమును
ప్రస్తావించినది.
కాట్రెరుమై-ప్రేమతో గేదెలు
ఇళంగు-దూడలపై
కంద్రుక్కు కిరంది-మాతృవాత్సల్యముతో
ములైవళై నిన్రపాల్ శోర-పాలునిండిన పొదుగులతో సిద్ధముగా నున్నాయి.ఇది వాచ్యార్థము.
కట్టివేయబడిన దూడలు చేతనులు-అనుగ్రహించనున్న జ్ఞానులు ఆ గేదెలు.వారందించే
జ్ఞానసంపదయే క్షీరము.కాని చేతనులు సమీపించి-అర్థించలేని స్థితిలో సంసారబంధములతో కట్టివేయబడి యున్నారు.
కనుక జీవులను ఉద్ధరించాలనే వాత్సల్యముతో వారు అంతట తమ బిడ్డలుగా(దూడలుగా ) ఊహించుకొని జ్ఞానామృతమును వర్షించుచుండుటచే భూమి సైతము పునీతమైనది.
ఇక్కడ మన అనుభవములోనికి
వచ్చుచున్న విషయము మనము ఇన్నిరోజులు గోపబాలురు వచ్చి పాలుపితికితే గాని దూడల కడుపునిండదు అన్న భావనతో నున్నాము.
.అది నిత్యానుష్ఠానము.కాని అప్రయత్నముగనే ఆ గోవులు-గేదెలు వాత్సల్యముతో తమకు తామె అమృతమును వర్షించగలవు.ఇది విశేషానుగ్రహము .
మన గోపిక అన్న చేసిన పాలుపితుకక పోవుట అన్న పని బాహ్యమునకు దోషము.నిత్యకర్మానుష్ఠానమును చేయలేదు. .కాని దీనిని మించిన సంపదను పొందుటకై దీనిని విడిచివేసినాడు.అది గుణము.
గోదమ్మ పాశురములో శ్రీరామునికి కోపమువచ్చి దక్షిణలంకాసురుని సంహరించుట అంతే యోగరహస్యము.
దక్షిణము వైపునున్న దశకంఠుడు.కుండలిలో జాగరూకత మరచి,పది ఇంద్రియములను నిగ్రహించలేని స్థితిలో నున్నవాడు.వానిని జాగృతమొనరించుటయే పరమాత్మ చేసిన మనోభిరామత్వము.
ఓ చెలి! మీ ఇంటిచుట్టుముట్టువారు నీ అలసత్వమును గమనించకముందే మమ్ములకరుణించి,మేల్కాంచి మాతో నోమును జరింపించుటకు రమ్మని,ఆమెతో పాటుగా
" పనిత్తళై వీళనిన్ వాశల్ కడైపట్ర"
పైన మంచుకురుస్తున్న
నేల చిత్తడిగ నున్న,
అనుగ్రహమనే ఇంటి చూరుపట్టి నిలుచునియున్న,
మనలను సైతము నడిపించుచున్న
ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం.
Sunday, December 25, 2022
AALO REMBAAVAAY-11
పాశురము-11
*************
కుండలినిశక్తిలా చుట్టుకునియున్న జీవాత్మా నీవు అనేక గ్రంధులను ఛేదించుకొనుచు ముగిల్వణ్ణన్ అను సహస్రారమును చేరవలసిన పున్మయిల్ వనమయూరివి.తాదాతంత్యతను వీడి జాగరూకము కమ్మా అంటూ అన్యాపదేశముగా యోగరహస్యములనందించుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,అమ్మ అనుగ్రహించినంతమేరకు పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నము చేద్దాము.
కట్రుక్కరవై కణంగళ్ పలకరందు
శెట్రార్తిరళలియం శెన్రు శెరుచ్చెయ్యుం
కుట్రం ఒన్రిల్లాద కోవలరం పొర్కిడియె
పుట్రు రవల్గున్ పునమయిలే పోదారాయ్
శుట్రుత్తు తోళీమార్ ఎల్లారుం వందు నిన్
మూట్రం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్పాడ
శిట్రాదే-పేశాదే సెల్వన్ పెండాట్టి, నీ
ఎట్రుక్కు ఉరంగుం పొరుళేలో రెంబావాయ్.
నమో భగవతే శిఖి పింఛాయ నమః.
************************
ప్రస్తుత పాశురములో :కుట్రం ఒన్రిల్లాద" ఒక్క దోషమును,లేశమైనను కానరాని గోపిక నిదురలేపబడుచున్నది.
మరొక్క విషయము కణంగళ్ -సమూహములు " అను పదము ప్రాధాన్యతను కలిగియున్నది.
ప్రతి అంశము నిష్కళంకమే-పరమార్థ సమర్పణమే.
కట్రుంకరవై కణంగళ్-స్వామి అనంత కళ్యాణ గుణవైభవములు-అర్థించకనే అనుగ్రహిస్తుంటాయి.అదియును పుష్కలముగా .అవియే పాశుర ప్రారంభముగా చెప్పబడుచున్న పాడి ఆవుల సమూహములు.
1. మన గోకులములోని గోవులు కూడ గోవిందుని వీక్షిస్తూ,వేణుగానమును వింటూ,స్పర్శను అనుభవిస్తూ,గుంపులుగుంపులుగా పెరుగుతూ,అందమైన లేగదూడలను కలిగి,తమకు తామె పుష్కలముగా క్షీరమును అనుగ్రహిస్తున్నవి.పితుకకున్నను అధికముగా (అనుగ్రహమును) వర్షించుచున్నవి.
అంటే మనపూర్వపుణ్యభాగ్యముగా మనలను అనుగ్రహించుటకు ఆచార్యులు గోకులములో గోవులవలె తిరుగుతు,గోవిందుని వీక్షిస్తూ,వేణుగానమును వింటూ,స్వర్శను అనుభవిస్తూ,గుంపులుగుంపులుగా నడయాడుతూ,అందమైన శిష్యులను కలిగి తమకుతామె క్నానాబుగ్రహమును పుష్కలముగా తమకుతామె అనుగ్రహించుచున్నారు.
2.ఓ బంగారుతీగె! నీ అన్నలు
కుట్రం ఇన్రు ఇల్లాద శెట్రార్తిరళలియం శెన్రు,
అతిబలపరాక్రమవంతులు.తమకు తాము శత్రుస్థావరములను/బలమును గుర్తించి,వారిపై దండెత్తి మట్టుపెట్టువారు.అంతః శత్రువులకు సైతము అదేగతి.
వారి పరాక్రమ ప్రదర్శన కేవలము శత్రువులమీదనే.
శెట్రాల్-శత్రువుల
తిరళ్-బలపరాక్రమములను తెలిసికొని
వారిని విజృంభింపనీయక
శెరుచ్చెయ్యం-తామే వారిపై దండెత్తి,
అరళియం-మట్టుపెట్టి వచ్చువారు.
మిగతా సమయములలో వారు గో-పోషణమను స్వధర్మవృత్తిని/సత్వగుణను కలిగియున్నవారు.
గోకులమునకు శత్రువులు గోవిందుని భక్తుల శత్రువులు.వారు బాహ్యశత్రువులైన కంసాది అసురులైన కావచ్చును-అంతః శత్రువులైన ధర్మవిరుద్ధకార్యాచరులైన కావచ్చును.
అట్టి శత్రువులను విజృంభించనీయని పరాక్రమము కలవారు.
నీ
ఎట్రుక్కు ఉరంగుం? నీ ఈ నిద్రాస్థితి ఏమిటి?
నీవు నీలమేఘుని చూడగనే పురివిప్పి నాట్యమాడు వనమయూరివి.కాని ఇప్పుడు పుట్రు రవల్గున్,
పుట్టలో నిదురించుచున్న పామువలె చుట్టుచుట్టుకుని పడుకునియున్నావు.
నిన్ను నోమునకు తీసుకునివెళ్ళటకు,
శుట్రుత్తు తోళీమార్ ఎల్లారుం వందు -బంధువులు-మిత్రులు అందరము వచ్చాము.
ఎవరా బంధువులు?
పరమాత్మ సేవాబంధమున్నవారు.
ఏమిటా మిత్రత్వము?
స్వామిపాదసేవా మిత్రత్వము.
కీర్తిస్తు వచ్చి ప్రవేశించాము.ఎక్కడికి?
నిన్-ముట్రం-పుగుందు-నీ ఇంటి ముంగిటి లోనికి ప్రవేశించాము.మమ్ములను స్వామి అనుగ్రహించుతకై,మేము స్వామిని కీర్తించగలుగుటకై నీ అంతర్ముఖత్వమును వీడి,
సెల్వన్ పెండాట్టి-ఓ భాగ్యశాలిని,
నీ-నీయొక్క,
ఉరంగు-నిద్రకు/ధ్యానమునకు,
పొరుల్-ధ్యేయము,
ఎట్రుక్కు-కారణము
మాకు తెలియకున్నది.
నీవు మాతో
శిత్తాదే-పేశాదే-ఉలుకకున్నావు-పలుకకున్నావు.
కోవలరం పొర్కిడియె
గోకులములోని ఓ బంగారు తీగ ,మేల్కాంచి
,మాతో వ్రతమును జరిపించుటకు కదిలిరామ్మా, అంటూ,
ఆ గోపికను తమతో కలుపుకొని వెళ్ళుచున్న,
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
Saturday, December 24, 2022
AALO REMBAAVAA10
పాశురము-10
*************
మనకు రామావతార విశేషములను పరిచయముచేస్తున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పదవ పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.
***************************
పాదములలదుకున్నవి వేదగంధమును
పెదవులందించునుగద నాదగంధమును
నలువనందించిన నడుమున కమలగంధంబు
మెడమీడ నడయాడు తులసిగంధంబు
నిస్తులమైన నుదుటను కస్తురిగంధంబు
ఎన్నిగంధంబులు తన్ను బంధించుచున్నను
గోద పూమాలల గంధంబు మోదమందించుట
నిర్వివాదము ఆహా!.సర్వసుగంధునకు.
తులసిగంధముతో పరిమళించు ప్రస్తుత పాశురములో,
నోట్రుం చువర్కం పుగుగిన్ర అమ్మణాయ్
మాట్రావుం తారారో వాసల్ తిరవాదార్
నాట్రా తుళాయ్ ముడి నారాయణన్ నమ్మాళాల్
పోట్రా పరైతర్రుం పుణ్ణెయనాళ్ పండొరునాళ్
కూట్రత్తిన్ వాయ్ వీళ్దం కుంబకరణనుం
తోట్రుం ఉనక్కే పెరున్ తుయిల్ తాన్ తందానో
అట్ర అనందన్ ఉడయాయ్ అరుంగలమే
తేట్రమాయ్ వందు తిరవేలో రెంబోవాయ్.
ఐదవ గోపికను గోదమ్మ "అమ్మణాయ్"( స్వామిని) అంటు మేల్కొలుపుతోంది.బాహ్యమునకు ఈమె నివాసము శ్రీకృష్ణుని ఇంటి పక్క ఇల్లు.ఎప్పుడు స్వామి తనను చూడాలన్నా,తాను స్వామిని చూడాలన్న అడ్డుగోడను దూకి వెళ్ళి ఆనందించేవారట.
ఏవా ఇరుగిల్లు-పొరుగిల్లు? జీవాత్మ-పరమాత్మ.
జీవాత్మ ఉనికి పరమాత్మ పక్కనే.
పరమాత్మ ఉనికి జీవాత్మ పక్కననే
తూమణి మాడత్తు అని చెప్పుకొనినట్లు,
స్వామి గోపికను చూడాలన్న-గోపిక స్వామిని చూడాలన్న ప్రాపంచికమనే అడ్డుగోడను దూకి ఒకరింటికి మరొకరు వెళ్ళేవారట.గోపిక-స్వామి అను ఇద్దరు లేరు.అది కేవలము లీల.
అందుకే ఈ గోపిక సాక్షాత్తు స్వామియే.కనుకనే అమ్మ
స్వామిని -అమ్మణ్ణాయ్ అని గౌరవపూర్వకముగా సంబోధిస్తున్నది.
కాని ఇక్కడ మనకు ఒక చమత్కారమును సఖ్యభక్తి రూపముగా అమ్మ ఆ గోపిక యొక్క సఖులుగా ,
తాన్ తందానే-అమాయకముగా స్వీకరించినదట-దేనిని?
పెరున్ తుయిల్-మొద్దు నిద్రను-ఎవరి దగ్గరి నుండి?
కుంబకరణం-కుంభకర్ణుని దగ్గర నుండి-ఎప్పుడు?
వాడు-
కూట్రాత్తిన్ వాయ్ వీళ్ద-మృత్యువాత పడినప్పుడు.
వాడు చనిపోతు -అమ్మాయ్ నేను నీకు లోకములు నన్ను మెచ్చుకునే నా గాఢనిద్రను వరముగా ఇస్తాను అని అన్నగానే-సంతోషముతో స్వీకరించావా ఏమిటి/ మేమెంత పిలుస్తున్నా పలుకుట లేదు అని మేలమాడారు. అయినా లేవలేదు ఆ గోపిక.ఆమెకు కృష్ణతాదాత్మ్యమును మించినదిలేదు.
నిజమునకు ఇక్కడ ప్రస్తావించిన కుంభకర్ణుడు రావణుని సోదరుడ? లేక?
ఎవరీ కుంభకర్ణుడు? అతని నిద్ర పరమార్థమేమిటి? ద్రవిడ సంప్రదాయానుసారము-కుంభము/ కుండ నుండి పుట్టిన వాడు అగస్త్య మహర్షి.రూపము కురుచ-శక్తులు ఘనము.ఈయన మూడు కార్యములను జగత్కళ్యాణమునకు చేసినాడు.మొదటిది వింధ్య పర్వతమును నకు వినయమును నేర్పెను.రెండవది (జ్ఞాన) సముద్రమును అవపోసన పట్టెను.వాతాపిని (అసురత్వమును) అంతమొందించెను. అనవరతము భగవత్తత్త్వముతో రమించుటయే ఆయన పోవు నిద్ర.త్వమేవాహం అను పధ్ధతి మన గోపిక కూడ అనవరతము భగవతత్త్వములో మునిగియున్నదను సంకేతము గోపిక తో కుంభకర్ణుని ప్రసక్తి.
స్వామి పండొరునాళ్-పూర్వము ఒకానొకరోజు,
పుణ్ణియనాల్-మా పుణ్యఫలముగా,
పఱై తరుం-పరను అనుగ్రహిస్తానని మాట ఇచ్చాడు.
నోమును తలచినంతనే స్వర్గములో-స్వామిసన్నిధిలో నున్నానన్న నివృత్తి భక్తితో నున్న గోపికను
నోట్రుం- నోమును
చువర్కుం-సజ్జనులతో
పుగిగిన్రు-కలిసి నోచుకుందాము.
అందుకే ఈ గోపిక సాక్షాత్తు స్వామియే.కనుకనే అమ్మ
స్వామిని -అమ్మణ్ణాయ్ అని గౌరవపూర్వకముగా సంబోధిస్తున్నది.
కాని ఇక్కడ మనకు ఒక చమత్కారమును సఖ్యభక్తి రూపముగా అమ్మ ఆ గోపిక యొక్క సఖులుగా ,
తాన్ తందానే-అమాయకముగా స్వీకరించినదట-దేనిని?
పెరున్ తుయిల్-మొద్దు నిద్రను-ఎవరి దగ్గరి నుండి?
కుంబకరణం-కుంభకర్ణుని దగ్గర నుండి-ఎప్పుడు?
వాడు-
కూట్రాత్తిన్ వాయ్ వీళ్ద-మృత్యువాత పడినప్పుడు.
వాడు చనిపోతు -అమ్మాయ్ నేను నీకు లోకములు నన్ను మెచ్చుకునే నా గాఢనిద్రను వరముగా ఇస్తాను అని అన్నగానే-సంతోషముతో స్వీకరించావా ఏమిటి/ మేమెంత పిలుస్తున్నా పలుకుట లేదు అని మేలమాడారు. అయినా లేవలేదు ఆ గోపిక.ఆమెకు కృష్ణతాదాత్మ్యమును మించినదిలేదు.
నిజమునకు ఇక్కడ ప్రస్తావించిన కుంభకర్ణుడు రావణుని సోదరుడ? లేక?
ఎవరీ కుంభకర్ణుడు? అతని నిద్ర పరమార్థమేమిటి? ద్రవిడ సంప్రదాయానుసారము-కుంభము/ కుండ నుండి పుట్టిన వాడు అగస్త్య మహర్షి.రూపము కురుచ-శక్తులు ఘనము.ఈయన మూడు కార్యములను జగత్కళ్యాణమునకు చేసినాడు.మొదటిది వింధ్య పర్వతమును నకు వినయమును నేర్పెను.రెండవది (జ్ఞాన) సముద్రమును అవపోసన పట్టెను.వాతాపిని (అసురత్వమును) అంతమొందించెను. అనవరతము భగవత్తత్త్వముతో రమించుటయే ఆయన పోవు నిద్ర.త్వమేవాహం అను పధ్ధతి మన గోపిక కూడ అనవరతము భగవతత్త్వములో మునిగియున్నదను సంకేతము గోపిక తో కుంభకర్ణుని ప్రసక్తి.
స్వామి ఒండొరునాళ్-ఒకానొకరోజు,
పుణ్ణియనాల్-మా పుణ్యఫలముగా,
పఱై తరుం-పరను అనుగ్రహిస్తానని మాట ఇచ్చాడు.
నోట్రుం- నోమును
చువర్కుం-సజ్జనులతో
పుగిగిన్రు-కలిసి నోచుకుందాము.
అట్ర అనందన్-అతి సోమరితనమును వదిలి
ఉడయాయ్-మేల్కొని
తేట్రమాయ్-తొట్రుపడ్
అక
వందు-వచ్చి
అరుంగలమే-మా గోకులమునకు ఆభరణమా
తిరవాయ్-గడియను తెరిచి,నోమునకు మాతో కదిలిరావమ్మా అని,గోపికలతో పాటు మనచేతిని వీడక కదులుచున్న,
ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం.
Thursday, December 22, 2022
AALO REMBAAVAAY-08
పాశురము-08
************
గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,అనుగ్రహించినంతమేరకు పాశురమును అనుసంధానము చేసుకుందాము.
కీళ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు
మేయాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైకళుం
పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు
కూవువాన్ వందునిన్రోం కోగులం ఉడయ
పావాయ ఎళుందిరాయ్ పాడి పరై కొండు
మావాయ్ పిళందనై మల్లనె మాట్రినాయ్
దేవాదిదేవనై శెన్రునాం సేవిత్తాల్
అవావెన్రు ఆరాయంద్రు అరుళేలో రెంబావాయ్.
ఓం నమో నారాయణాయ
********************
తెల్లవారుచున్నది.తూరుపున వెలుగురేఖలు కనబడుచున్నవి.పశువులు చిరుమేతకు తరలినవి.
దేవాదిదేవుని నోమునకు వెళ్లుచున్నవారిని/వెళ్లుటకు సిద్ధమగుచున్నావరిని,కొంతసమయము నిలువమని మేము నిన్ను మేల్కొలుపుటకు వచ్చి,నీ గుమ్మము ముందర నిలబడి నిన్ను పిలుస్తున్నాము.అన్నది వాచ్యార్థము.
కోగులం ఉడయ-కుతూహలము కొత్తచిగురులు తొడుగుచుందగా
1.తూరుపుదిక్కు చీకట్లను పారద్రోలుచు వెలుగు రేఖలను ప్రసరించుటకు కుతూహల పడుచున్నది.
2.పశువులు (ఎరుమై) కొంచముసేపు బంధములను విదనాడి పచ్చికను మేసి వచ్చుటకు కుతూహలపడుతున్నాయి.
3.పడుచులు నోముస్థలికి చేరుటకు కుతూహలపడుచున్నారు.మిక్కుళ్ళ-మిక్కిలి కుతూహలముతో నున్నారు.
4.మావాయై-గుఱ్ఱముతో పోల్చబడి పరుగులుతీయు మా మనస్సులు-మల్లయుద్ధవీరులతో పోల్చబడు మా ఉపాధి అహంకార-మమకారములు నీ చే పరిహరింపబడుటకు కుతూహలముగా నున్నాయి.
వాటి కుతూహలమునకు కారణము "సిరువీడు" చిన్నమేత.
.
బాహ్యమునకు గోదమ్మ సనాతనమును తెలిసినదైనప్పటికిని సఖులను మేలుకొలుపు విషయములో గొల్లెతలకు చిరపరిచితమయిన సంకేతములనే చెప్పుచున్నది.
ఏడవ పాశురములో ఏ విధముగా చల్లచిలుకు పడతుల నిత్యానుష్ఠానమును గుర్తుగా చెప్పినదో,అదేవిధముగా ప్రస్తుత పాశురములో "సిరువీడు" అన్న ప్రక్రియను ఉదాహరణముగా చెప్పినది.
స్వల్పకాలిక విడుదల.భవబంధములనుండి/భవసాగర్మునుండి.
గోకులములో తెల్లవారగనే గోవుల బంధములను తొలగించి చిన్నమేతకు కొంచముసేపు పచ్చికవైపునకు తరలిస్తారట.అక్కడ అవి పరందన-అంతటా వ్యాపించి మేతను మేస్తాయట.తిరిగి వచ్చి పాలను సమృద్ధిగా వర్షిస్తాయట.
గోదమ్మ-గోపిక సంభాషణములో తూరుపు రేఖలు చూడు అనగానే అవి స్వామినిదర్శించబోవు మీ ముఖబింబములనుండి ప్రసరించు సంతోషము అని చెప్పబడినది.
గోకులములోని పశువులు నల్లని ఆవులు-గేదెలు పచ్చికపై వ్యాపించి మేయుచున్నప్పుడు చీకటి తరిమివేయబడినట్లున్నదనగానే,
లోపల నున్న గోపిక దానిని ఖండిస్తూ,అది ఇంకా తెల్లవారలేదన్న దిగులుతో మీ ముఖమునుండి వచ్చున్న విచారము అని చెప్పినది.
నర్మగర్భసంభాషనముతో గోదమ్మ ధర్మబోధ చేసినది.
కీణ్వానం-తూరుదిక్కు
వెళ్లెండ్రు-తెల్లబడినది.
ఎండ్రు-ఎక్కడ చూసిన ఉషోదయమే.ఇది స్థూలము.
ప్రతి మనస్సు తమో-రజో గుణములను వీడి శుద్ధ సత్వముతో నిండినది.
దానికిసమర్థనమే
మావాయ్ పిళందనై మల్లనె మాట్రినాయ్
మనస్సు-శరీరము నిష్కల్మషమై నోమునకు సిద్ధముగా నున్నది.
లోపలి నున్న గోపిక మరింత స్పష్టతను కోరుకుంటున్నదో/మదనమోహనుని వీడి రాలేకయున్నదో,బయటకు రాలేదు.
మనమీది అనుగ్రహముతో గోదమ్మ గోపికలతోపాటుగా మనలకు కూడా చిరువీడు గురించి చెప్పుచున్నది.
చిరువీడు-పెరువీడు కేవలము పశువులకు మాత్రమేనా?చేతనలనుద్దేశించినదా అంటే అందరికి అన్వయించుకోవలసినది.
సంసారమనే బంధముతో కట్టివేయబడి ఉన్న చేతనులారా! జాగరూకులు కండి.అజ్ఞానమును తరిమివేసే జ్ఞానమనే తూరుదిక్కును చూడండి.
చిన్న అవకాశమును కల్పించుకోండి మీ ఉపాధిని ఉద్ధరించుకొనుటకు.కొంచముసేపు,
పరంద-వ్యాపింపచేచి-విస్తరింపచేసి
వేనిని?
మీ దశేంద్రియములను దాసులను చేసి భగవదనుభవమును భాగ్యమును ఆస్వాదించండి.అందరికి పంచండి.
అర్చనయో,ఆలాపనయో,భోగమో,నామమో,పురాణ్ అమో,హరికథయో,, భజనమో,అలంకారమో చేయండి.
అదియును స్వధర్మమును విడనాడక .తెలిసినవారు
కనుక గొపికలు నోమునకు కుతూహలముతో,
పోవాన్-ఇప్పటికే చేరారు.
మరికొందరు
పోగిన్రారై-వెళ్ళుచున్నారు
పోగామల్-వెళ్ళుటకు సిధ్ధమగుచున్నారు.
ఆ విధముగా నున్న మిక్కుళ్ళ పిళ్ళైగళుం
మిక్కుటముగా నున్న గోపికలను
కాత్తు-కొంచముసేపు నిలువమని చెప్పి,నిన్ను
కూవువాన్ వందు-పిలుచుటకు వచ్చి
నీ ఇంటిముందర
నిన్రోం-నిలబడియున్నాము.
నోముస్థలికి చేరిన-చేరబోవుచున్న-చేరుటకు సిద్ధమగుచున్న పిల్లలు,అనగా
మన మనస్సులో చెలరేగు వివిధ అనుకూల-ప్రతికూల భావముల సంఘర్షణలే మిక్కుళ్ళ పిళ్ళైగళుం..కొన్ని సత్వము వైపునకు పరుగులు తీయిస్తుంటే మరికొన్ని తమోగుణమును తరలి రామంటుంటాయి.వాటిని సవరించుకుని,వ్రతమునకు సంసిద్ధము చేసుకొని,
వందోం-వచ్చి
నీ ఇంటిముందు
నిన్రోం నిలబడి
కూవువాన్-నిన్ను పిలుస్తున్నాము.నిదురలేచి కదలివచ్చుచున్న గోపికలతో
పాటుగా స్వామిని సంకీర్తించి పరను పొందుటకు మనలను సైతము నోము ,
సిరువీడు-చిన్న విడుదల కు తీసుకుని వెళుతున్న,
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
.
Wednesday, December 21, 2022
AALO REMBAAVAAY-07
పాశురము-07
**********
గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు.అనుగ్రహించినంత మేరకు అనుసంధానమును చేసుకుందాము.
కీశు కీశెన్రెంగుం ఆనైచ్చాత్తు కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో? పేయ్ పెణ్ణే
కాశుం పిరప్పుం కలగల ప్పక్కై ప్పేర్తు
వాశ నరుం కుళల్ ఆయిచ్చియర్ మత్తినాల్
ఓశై పడుత్త తైరరవం కేట్టిలైయో?
నాయగ పెణ్ పిళ్ళాయ్ నారాయణన్ మూర్తి
కేశవనై పాడవుం నీకేట్టే కిడత్తియో
దేశం ఉడయేయాయ్ తిరనేలో రెంబావోయ్.
నారాయామంత్రం-శ్రీమన్నారాయణ భజనం.
******************************
ఓ కర్ణేంద్రియమా జాగృతము అయ్యి శ్రవణభక్తిని ఆచరించి ఆస్వాదించు పరమాత్మ ప్రసన్నతను అంటూ ఆరవ పాశురములో చెప్పినట్టుగానే,
కేట్టిలియో?-వినలేదా అని లోపలనున్న గోపికను ప్రశ్నించుచున్నది.
ప్రస్తుత పాశురములో నాసికను సైతము జాగృతముకమ్మని
ఆయిచ్చ్నర్ వాసనరుం కుళల్
గొల్లపడుచుల సుగంధకేశపాశముల పరిమళములను ఆస్వాదించుము అని మరొక ఇంద్రియ ప్రస్తావన తెచ్చినది.
నారాయణమూర్తి కేసవనై-పాదవుం
అంటూ వాక్కును సైతము హెచ్చరించినది.
నిదురించుచున్న వారికి నిద్రాభంగము చేయుట సంప్రదాయమేనా అన్న సందేహము మనలో కలుగవచ్చును.కాని గోదమ్మ మేల్కొలుచున్న గోపికలు,
తమోనిద్రను వీడి తాదాత్మ్యములో నున్నవారు కొందరు,తన మదిలోని స్వామిని సేవించువారు మరికొందరు,తన్మయములో నున్న కొందరు,తలపు మార్చుకొనుటకు ఇష్టపడనివారు కొందరు,తలుపుతీయుటకు ఇష్టపడని వారు ఇంకొందరు,తనవాడేనని తనతోనే ఉండాలనే వారు కొందరు,తనివితీరని తాదాత్మ్యముతో పరిసరములను పట్టించుకోని వారు ఇలా వివిధ భావములతో,భంగిమలతో,అనుభవములతో .....
వీరిలో ఎవరు ఎక్కవభక్తికలవారో-ఎంతటి భాగ్యశాలురో చెప్పుట సాధ్యము కానిది.
నిద్రిస్తున్న వారిది పారవశ్యము.
మేల్కొలుపు వారిది ప్రాప్తి త్వరిత్వము.
వారందరును భగవదనుగ్రహమును పొందినవారే.
ప్రస్తుత పాశురములో గోదమ్మ గోపికను
పేయ్ పిణ్ణే అని సంబోధించినది.ఈమె పిళ్ళాయ్ కాదు.సామాన్య ఉపమానములను సమన్వయించుకోదు.అంతే కాదు
నాయగన్ పెంపెణ్ణే నాయకత్వ లక్షనములు గల పరమభక్తురాలు.
కనుకనే గోదమ్మ భారద్వాజ పక్షుల పేరరవమును ఉదహరించింది.
ఏమిటా పేరరవము?
ఓం నమో భగవతే వాశుదేవాయ/పెద్ద పేరు.
" అధ్యయనము ఎంత ముఖ్యమో దానిని ఆచరించుట అంతకన్నా ముఖ్యము" అన్న విషయమును నిగూఢముగా భారద్వాజపక్షుల ఉపమానముతో చెప్పినది.
ఒక చిన్ని ఉదాహరణమును పెద్దలు చెబుతారు.ఒకసారి భారద్వాజ మహాముని బ్రహ్మవరముగా తన ఆయుర్దాయమును పొడిగించుకుంటూ వేదాధ్యయనమును కొనసాగించాడట.తనకు ప్రాప్తించిన శక్తులతో శ్రీరామ రాజోలగమును సృష్టించి భరతుని వచ్చి ఆసీనుని కమ్మన్నాడట.ఏమాత్రము చలించక భరతుడు వచ్చి మంత్రికి ఏర్పరచిన సింహానముపై కూర్చున్నాదట.తాను చేయవలసిన కర్తవ్యమును గ్రహించి ఆచరణ వైభవమును చాటాదట భరద్వాజ మహాముని.అదియే పేరరవం.
లోపలి గోపిక అంతర్ముఖమును వీడక మీరుచేయుచున్న కృష్ణ కృష్ణ అను శబ్దము మీకు కీశు కీశుగా వినిపిస్తున్నదంతే అని బదులిచ్చినది.
గోపికను బహిర్ముఖిని చేయుటకై గోదమ్మ "మత్తినాల్ తైరరవం" అంటూ పెరుగుచిలుకు గొల్లెతల కవ్వముతో పెరుగుచిలుకు చప్పుడును సంకేతించినది.ఇది తనదగ్గర-తన ఇంట్లో -తన నిత్యానుష్ఠానముగా జరుగుచున్న ప్రక్రియ.
రేపల్లె లోని గోపికలకు చల్లచిలుకుట నిత్యానుష్ఠానము.
వారికి కడవ-కడవ లోని పెరుగు-దానిని చిలుకుటకు పట్తుకున్న కవ్వము-కవ్వమునకు కట్టిన తాడు-దానిని పట్టుకుని చిలుకుతున్న వారి చేతులు,అప్పుడు వారు చేయు కీర్తనలు/జానపదములు అంతా హరిరూపమే/హరి నామమే/హరిమయమే.త్రికరనములలో హరినిండి,వారి కంకణములద్వారా కాయకముగా-కాసుల గులుసుద్వారా మానసికముగాను-పెదవులద్వారా మానసికముగా నర్తిస్తున్నాదట.అంతే కాదు
గోదమ్మ కాసుం పిరప్పు అని హారములను గుంద్రముగా నుండి తిరుగుచున్నవి అని ప్రత్యేకించి చెప్పినది.అనగా హరినామస్మరనముతో తనివితీరక గోపికలు పదేపదే పరవశిస్తూ చేస్తున్నారు.
ఇది వాచ్యార్థము.
కావాలంటే కన్నులు తెరిచి చూడు.
వారు కృష్ణతత్త్వమనే పెరుగును వారి హృదయములనే కడవలలో నింపుకున్నారు.సాక్షాత్ పరమాత్మనే కవ్వముగా పట్టుకున్నారు.వారి భక్తియనే తాడును దానికి కట్టారు.అది వారికి స్వామి నర్తనము.
కవ్వము తానైన కన్నడు తన చేతులను చాచి రండి బృందావనమునకు రాసలీలలో మునుగుదాము అనికవ్విస్తున్నాడట.వారి మనసు మురిసి ఆనందమును దాచుకోలేక ఎదపైకెగిసి,అక్కడ అలంకరింపబడియున్న మంగళ సూత్రములు,కాసుల పేరులు కృష్ణా కృష్ణా అను
సంకీర్తనముతో చేస్తున్నాయట.మనో పూజ.
కవ్వమై కవ్వించిన కొంటె కృష్ణుడు
ఎక్కడ మాయచేసి మాయమగుతాడో కనుక గట్టిగా పట్టుకోవాలని
,వారు పెరుగుకుండను గట్టిగా పట్టుకొన్నప్పుడు వారి చేతుల కంకణములు కృష్ణా-కృష్ణా అంటు తమ వంతు సేవగా కీర్తిస్తున్నయట-కాయక పూజ.
వాచక పూజ సరే సరి.వారి పెదవులను వీడలేనిది.
మనో-వాక్కాయ-కర్మల తననారాధించు చున్న గోపవనితలతో కలిసి ఓయ్ నేనిక్కడనే ఉన్నాను అని అంటున్నటుందిట గోపాలుని సమాధానముగా ఆ కవ్వపు సడి.
మేల్కాంచిన గోపికను తమతో కలుపుకొని, కేశవనై-అశ్వరూపములో వచ్చిన కేశి అను అసురుని సంహరించి,కేశవునిగా కీర్తింపబడిన స్వామిని సేవించుటకు మనచేతిని పట్టుకుని నడిపించుచున్న ,
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
.
Tuesday, December 20, 2022
AALO REMBAAVAAY-06
ఆరవ పాశురం.
*************
ఆండాళ్ తల్లికి అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ, అనుగ్రహించినంత మేరకు మేల్కొలుపుల ప్రారంభ పాశురమైన ఆరవ పాశురమును అనుసంధానము చేసే ప్రయత్నమును చేసుకుందాము.
పుళ్ళుం శిలంబినకాణ్ పుళ్ళరయన్ కోయిలిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో?
పిళ్ళాయ్! ఎళుందిరాయ్! పేయ్ ములై నంజుండు
కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమంద విత్తినై
ఉళ్ళత్తు కొండు ముని వర్గళుం యోగి గళుం
మెళ్ళ ఎళుందు అరి ఎన్న పేరరవం
ఉళ్ళంపుగుందు కుళిరేలో రెంబావాయ్.
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమంద విత్తినై
***********************
పాలకడలిపై శేష తల్పమున పవళించేవా దేవా.
మూలవిరాట్టు దర్శనమునకు ముందు ఆలయ ప్రాకార ప్రదక్షిణము వలె భాగవత గృహ ప్రదక్షిణమును మనతో గోదమ్మ చేయిస్తున్నది.
ఇంద్రియములు ప్రకృతిని అనుసంధానముచేసుకుంటే ప్రపంచము.అవే ఇంద్రియములు పరాత్పరుని అనుసంధానము చేసుకోగలిగితే పారమార్థికము.
ఆ విషయమును మనము సులభముగా గ్రహించుతకై గోదమ్మ "పుళ్ళుం"శబ్దమును ప్రయోగించినది.
పుళ్ళుం అంటే తెలుగుభాషలో పక్షులు.అనగా పక్షములు/ఱెక్కలు కలవి.
ఈ పక్షులు చెట్టుమీదగాని/గూటిలోన కాని ఉన్నప్పుడు తమ ఱెక్కలను ముడుచుకొనే ఉంటాయి.అప్పుడు వాటి ఇంద్రియములు తమ జంట-తమ సంతతి,వాటి పోషణము,తమ ఉపాధిని అనుసరించియుంటాయి.అప్పుడు వాటి ఆలోచనా పరిధి పరిమితము.
కాని విచిత్రము-అవే పక్షులు
ఆ పక్షులే చెట్టుమీదనుండి ఆహారమునకై ఎగురుట ప్రారంభించగనే వాటి రెండు ఱెక్కలను విస్తరింపచేస్తాయి.వాటితో పాటుగా మరెన్నింటినో కలుపుకొని జట్టుగా
ఎగురుతుంటాయి.అరుస్తుంటాయి.మురుస్తుంటాయి.
ఆ సమయములో వాటి ఇంద్రియములు పరమాత్మను అనుసంధానము చేసుకుంటుంటాయి.పదిమందిని కలుపుకుంటుంటాయి.పరస్పర్పము తమ అనుష్టానమును ప్రతిచర్యతో అనుసంధానము చేసుకుంటుంటాయి.అప్పుడు వాటి పరిధి అపరిమితము.
నిజమునకు రెండుమూడు గింజలను ముక్కున కరచుకొను గ్రక్కున వెనుదిరుగ వచ్చును.కాని దానికి విరుద్ధముగా/విశేషముగా" అవి చెట్టుమీద ఉన్నప్పడు ఉపాధిధర్మముతో-చెట్టుదాటి ఎగురుతున్నప్పుడు ఉపాయ ధర్మములో" స్థిరచిత్తముతో పరమాత్మను
సేవించుకుంటాయి.స్వధర్మమును-స్వామి సంసేవనమును నిర్వహించుకుంటాయి.
ఓ పిళ్ళాయ్-ఓ బాలా!
పుళ్ళుం శిలంబినకాణ్-తెల్లవారినది పక్షులు కూస్తున్నాయి .లేచి,నోమునకు మాతో రావమ్మా అని పిలుస్తున్నారు.
లోపలి గోపిక భగవత్ ప్రాశస్త్యమునకు వెలుపలి గోపికలు భాగవత ప్రాశస్త్యమునకు సంకేతములుగా శోభిల్లుచున్నారు.
ఇంద్రియపరముగా అన్వయించుకుంటే ప్రస్తుత పాశురము శబ్దమును సంగ్రహించలేని,సంకేతించలేని కర్ణేంద్రియమా మేలుకో.స్వామి సంకీర్తనమును ప్రారంభించు అంటున్నారు.ఎటువంటి సమాధానము లభించలేదు వారికి.పైగా మీరు ఉత్సాహముతో చేయుచున్న హరినామసంకీర్తనమునకు పక్షులు నిదురపోలేక లేచినట్లున్నవని లోపలి గోపిక భావించినదేమో అనుకొని వారు మరొక సంకేతమును చెప్పదలిచారు.
పిళ్ళాయ్-ఓ చిన్నపిల్లా
పుళ్-అరయన్-పక్షిరాజు స్వామిసేవకై తరలుచున్నాడు.
అంతే కాదు
విళిసంగన్ పేరరవం కేట్టిలియో-తెల్లనైన శంఖము చేయున్న ప్రణవనాదము /పేరరవం/ఓంకారమును నీవు వినుటలేదా
తెల్లవారుచున్నదనుటకు ఇంతకు మించి నీకు కావలిసిన నిదర్శనమేముంది?
అయినను వారికిసమాధానము లభించలేదు.
మూడవ సంకేతముగా మునివర్గగళుం-యోగిగళుం అంటూ
మౌనముగా మనము చేయుటయే కాదు-స్వామి కైంకర్యములను సైతము సమర్పించుటకు సిద్ధమగుచున్నారు అన్నారు.ఆ సంకేతము సైతము లోపలనున్న గోపిక అంతర్ముఖత్వమును వీడుటకు సహకరించలేదు.
పరిస్థితిని గ్రహించిన గోదమ్మ,గోదమ్మతో పాటునున్న గోపికలు స్వామి అద్భుతలీలా విశేషములుగా పూతన సంహారము-శకటాసుర భంజనములను కీర్తించసాగినారు.
స్వామి పేయ్ములై నంజుండు-అహంకార-మమకారములను స్తనములనుండి స్రవించుచున్న విషయవాసనలను పాలను పూర్తిగా తొలగించి,పూతనను అనుగ్రహించినాడు.అంతే కాదు
కళ్ళచ్చగడం కాలోచ్చి-
సంసారమనే చక్రములో నిరంతరము పరిభ్రమించు శకటాసురుని,కాలోచ్చి-కాలితో తన్నివేసి కనికరించినాడు.
స్వామి గుణవైభవమును-రూప వైశిష్ట్యమును వినినంతనే తాను మెల్లగలేచివచ్చి వారితో పాటుగా మరొక గోపికను మేల్కొలుపుటకు కదులుచున్నది.
బాల అంటే గ్రహణ-ధారణ-పోషక శక్తివంతురాలు.
ఆళ్వారుల అన్వయములో వ్రతమునకు తమను తీసుకొనివెళ్ళి,నిర్వర్తింపచేయు మార్గదర్శకులిగా వారు,
అంతర్ముఖములోని నిశ్శబ్దము-బహిర్ముఖములో శబ్దము రెండును స్వామి వైభవముగా అన్వయించుకుంటూ కదులుతున్నారు.
ఇప్పుడు అంతా అద్భుతమే-అమృతత్వమే.
గోపిక చేతితో పాటుగా మన చేతిని సైతము విడువక పట్టుకుని రెండవగోపికను మేల్కొలుపటకు వెళ్ళుచున్న,
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
Monday, December 19, 2022
AALO REMBAAVAAY-05
ఐదవ పాశురం
***************
మాయనై మన్ను వడమదురై మైందనై
తుయపెరునీర్ యమునై యరైవరై
ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణివిళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తుమలర్ తూవి త్తుళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదరువా నిన్రనవుం
తీయనిల్ తూశాగుం శెప్పు ఏలోరెంబావాయ్.
ఓం నమో భగవతే వాసుదేవాయ.
మోహనరూపా గోపాలా-ఊహాతీతము నీ లీల
********************
" పూర్ణమదం-పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణమిదుచ్యతే"
అన్నది వేదవాక్యము.దానిని విశదముగా ఈ ఐదు పాశురములలో సమన్వయపరచినది గోదమ్మ.మరింత స్పష్టము చేయుచు,నారాయణుడని వైకుంఠ ప్రస్తావనచేసినది పూర్ణస్వరూపమునే.దాని పొందుట బహుదుర్లభము.సుదీర్ఘ ప్రయాసతో కూడుకొనిన ప్రయత్నము.ఘోర తపశ్శక్తి సంపన్నులకు మాత్రమే సాధ్యము.దానికంటె కొంచము సులభమైనది క్షీరాబ్ధిశయనుని శయనునిది పూర్ణస్వరూపమే( పొందగలుగుట).బ్రహ్మాది దేవతలకు తమ వినతులను మాత్రమే సమర్పించుకొను సదవకాశమును కల్పించునది.అందరికి దుర్లభము.దానికంటె కొంచము సులభతరమైనది అవతారమును పూర్ణస్వరూపమే. వైభవము.కాని అది కాలపరిమితిని-కారణ పరిమితిని అనుసరించు నియమము కలిగినది.దానికంటె సులభ తమము అంతర్యామి తత్త్వము.అదియును పూర్ణస్వరూపమేదాని గమనించుట-గ్రహించుట సులభతమమే అయినప్పటికి భాగవత గోష్టులు-నిత్యానుష్ఠానములపై ఆధారపడక తప్పదు.దానిని అని పలుకుట నిర్వచించలేని మహోన్నతత్త్వము .నా అశక్తతత ను గోదమ్మ మన్నించును గాక.
మన గోపికలు గోవులవెంట తిరుగుచు,పాలు-పెరుగు నమ్ముకొనుచు జీవించువారు.తపములెక్కడ?జపములెక్కడ?యజ్ఞములెక్కడ?యాగములెక్కడ? పురాణములెక్కడ?
?
? ప్రవచనములెక్కడ?మడి యెక్కడ? సడి ఎక్కడ?దడి ఎక్కడ?
కాని వారు కోరుకొనునది నిరంతర స్వామి సంశ్లేషణము.అదియును వారిలో ఒకరిగా.వారితో ఒకటిగా.
.అదే పరిపూర్ణత్వము తనకు తానుగా అందరిని అనుక్షణము అలరించుటకు వారితో ఆడిపాడుటకు,తోడుగా నుండుటకు,చేరదీయుటకు,చేరువైన లీలావైభవము.
అదియే పాశుర ప్రారంభ పదమైన
మాయనై- మైందనై
వాత్సల్యమునందించుచున్న వాసుదేవుని పూర్ణత్వము.
కనుకనే
ఆ మాయనై అనుగ్రహమే
గోపకాంతలను త్రికరణశుద్ధులను చేసినది.వారిచే,
తూయోమాయ్ వందు-పరిశుద్ధులమై వచ్చాము అని చెప్పించినది.
మనత్తినాల్ సిందిక్క-మనస్సును సైతము పునీతము చేసినది.
ఆ మాయనై-అనుగ్రహమే
వాయినాల్ పాడి -నోరారా కీర్తించుదాము అనిపించినది.
వారు నిష్కళంకమనస్కులై స్వామిని
తూవిళిత్తుదు-పవిత్రముగా భావించిపూజించుటకు వచ్చినారు.వారి చేతిలో
తూమలర్-పవిత్రమైన పుష్పములున్నాయట.
రెండవ పాశురములో మలరిట్టు నా ముళిదోం అన్నారు.కాని స్వామికి పుష్పార్చనను సమర్పించటానికి వచ్చామంటు,
సత్యము-ఇంద్రియనిగ్రహము-శాంతము-దయ-మొదలగు పుష్పార్చనకు సిద్ధము చేసినది
స్వామి అనుగ్రహమును మనస్పూర్తిగా అనుభవిస్తూ,నోరార కీర్తిస్తున్నది.
కీర్తనములో వడమదుర అంటు ఉత్తరమధుర-దక్షిణమధుర అంటు విభజించినది.యమునజలమును పెరు-తుయిర్ అంటు పునీతముచేసినది.బృందావనమును తెప్పించినది.నందకుమారునిమెప్పించినది.యశోదను అనుగ్రహించినది.భువనములను చూపించినది.చిన్ని చీకి పోయిన తాటికి స్వామి ఉదరస్పర్శను అందించినది.
పాశురములోని మరొక విశిష్ట పదము "సెప్పు ఏలో రెంబావాయ్" స్వామి పరముగా-గొల్లెత పరముగా అన్వయించుకుంటే,
మొదటి అర్థము స్వామి ఆశ్రిత వాత్సల్యమును వ్రతములో కీర్తిద్దాము.
స్వామిని మనపాపకర్మల ఫలితములను నిశ్శేషము చేశానని చెప్పు అని స్వామి నుండి వరమును తీసుకుందామని అత్యంత మనోహరముగా చెప్పింది గోదమ్మ..
స్వామి వాటిని అనుగ్రహింప దలచుటయే వాటి అర్హత అని చెప్పుచున్నారు.
స్వామి ప్రకాశిస్తున్న పరంజ్యోతి.
తల్లి యశోదకు మాత్రమే కాదు.
గోకులమునంతటి ప్రకాశింపచేస్తున్న దీపము.
కనుక మనము స్వామిని
పోయ పిళైయుం-గతములో చేసిన పాపములను
పుగుదరువా నిన్రనవుం-తెలియక చేసిన తప్పులను
తీయనిల్ తూశాగుం-పూర్తిగా తొలగించివేసాను అన్న
మాటను స్వామి వద్ద నుండి తీసుకొనుటకు రండి అని పిలుస్తున్నది గోదమ్మ.పర నుండి ప్రాప్తి కి కదిలినది వారి అభ్యర్థనము స్వామిని కనులారా కాంచినంతనే.
చెలులారా రండి మనము కూడా స్వామిని చేరి-కీర్తించి,మన యొక్క ఆగామి-సంచిత కర్మలను అంతేకాదు తెలియక చేసిన పాపములను తొలగించమని,తొలగిస్తానని "చెప్పు "అని మాటను తీసుకుందాము అని పిలుస్తూ,రేపటినుండి మనలను గోపికలను మేల్కొలుపు రెండవ విభాగములోనికి తనతో పాటుగా తీసుకుని వెళుతున్న,
"ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం."
Sunday, December 18, 2022
AALO REMBAVAY-04
నాల్గవ పాశురము
*************
ఆళిమళై కణ్ణా! ఒన్రు నీ కై కరవేల్
ఆళియుల్ పుక్కు ముగందు కొడార్ త్తేరి
ఊళి ముదల్వన్ ఉరువం పోల్ మెయికరుత్తు
పాళియన్ తోళుడై ప్పర్బనాబన్ కైయిల్
ఆళిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్రదిందు
తాళాదే శార్ఙ్ ముదైత్త శరమళై పోల్
వాళ ఉలగనిల్ పెయిదిడాయ్ నాంగళుం
మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావై.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
*********************
గోకులములోని వారందరు తాము వింటున్నది-కంటున్నది-అంటున్నది కృష్ణునినే తక్క అన్యము కాదని భావించు భాగ్యశాలురు.వారి సమయము-సంభాషణము-సమస్తము శ్రీకృష్ణుడే.వారెవరిని తలచుకొనినా-కలుసుకొనినా-పిలుచుకొనినా వారి సంబోధనము మాత్రము ఒక్కటే.అదే,
కణ్ణా!
గోదమ్మ ప్రస్తుత పాశురములో పరమాత్మ పంచాయుధములను-పంచభూతములను-పంచేంద్రియములను సమన్వయపరుస్తూ,ప్రళయానంతరమున ప్రకటింపబడిన,
పద్మనాభస్వామిని వరుణదేవునిగా ప్రార్థిస్తున్నది.
భావములోన-బాహ్యమునందున గోవింద గోవింద అన్నది వారి జీవనము.
నిత్యకర్మానుష్ఠానమునకు/మార్గళి స్నానమునకు కావలిసిన జలములను పుష్కలము నిమ్మని వారు స్వామిని వేడుకుంటున్నారు.
మగిళిందు మార్గళి నీరాడ
మనస్పూర్తిగా-మహదానందముగా-మంగళగుణములను అనుభవించు మంగళస్నానము కోరుకుంటున్నారు.
ప్రస్తుత పాశురములో ప్రతిపదము విశేషముతో కూడి అశేషానందమును అందిస్తుంది.
వారు చూడగలుగుతున్నది ,
సముద్రములోనికి,
ఆళియళ్ పుక్కు-పూర్తిగా ప్రవేశించి,
ముగంద కుడు-నీటిని దప్పిక పూర్తిగా తీరు వరకు త్రాగి,
ఎరి-(నీవు) సముద్రమునుండి పైకిలేచునపుడు,
పాళియన్ తోళ్ ఉడై -నీ అతి బలపరాక్రములలైన భుజములను దర్శింపనిమ్ము.
మెయికరుత్తు-నీలమేఘశ్యామునిగా ప్రకాశింపుము.
ఆళిపోల్ మిన్ని-నీ కుడిచేతిలోని సుదర్శనమును కననిమ్ము
వలంపురిపోల్-నీ ఎడమచేతిలోని పాంచజన్యమును సైతము కననిమ్ము-విననిమ్ము.
ఏ విధముగా నంటే
ఊళి ముదల్వన్ పర్పనాబన్-ప్రళయానంతరము ప్రకటింబడిన ,పద్మనాభస్వామివలె.
కణ్ణా! మాకృష్ణా,
మమ్ముల అనుగ్రహించునప్పుడు
నీ ఒండ్రుం కైకరవేల్-నీ చేతిని కొంచము కూడా బిగించవద్దు.
తాళాదె పెయిదిడాయ్-ఆలస్యముచేక వర్షించు.
ఆ వర్షము ఎంత మనోహరముగా మేము ఆస్వాదించాలంటే,మెరుపులలో స్వామి సుదర్శనకాంతులు కనువిందుచేయాలి.ఉరుములలో పాంచజన్య శంఖనాదము విని తరించాలి..నీవు నింగికి-నేలకు వారధిగా వర్షపుచినుకులను శరములను సంధించునపుడు శారంగ సామర్థ్యమును సంకీర్తించగలగాలి.ఆ శరములు క్షామమను రక్కసిని పారద్రోలి,వ్రతమును చేయగలుగుటయే వ్రతఫలముగా అనుభవించునట్లు వర్షింపుము అను ,
ఆళిమళై-బృహత్ జలరూపమైన కృష్ణుని అర్థించుచున్నది.
ఆళ్వారులు (ఆచార్యులు) వరుణదేవుని వంటివారు.వారు భగవత్ గుణములనెడి జ్ఞాన సముద్రములో పూర్తిగా మునిగి,భగవత్తత్త్వను నీటిని నిశ్శేషముగా త్రాగి,నిరంతరము నీలమేఘశ్యామునితో రమించుట వలన నల్లగా స్వామి మేనిఛాయను పొందుతారట.ఎంతటి భాగ్యశాలురో కద.మేఘము గగనమునకు వెడలునట్లు వీరును ఆ-అంతట-కాశము-ప్రకాశవంతమైన మూలతత్త్వమున ప్రవేశించి,మనలను సంస్కరించుటకు జ్ఞానామృతధారలను వర్షించెదరు
రేపటిపాశురములో స్వామి అర్చావిభూతులనందచేయు ,
ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.
Friday, December 16, 2022
AALO REMBAAVAAY-02
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...