Wednesday, December 28, 2022

AALO REMBAAVAAY-14

 పాశురము-14

***********

 ప్రతి పదము-పరమ పథమే

 పతి పదము-పరమపదమే.

 నంగాయ్-నాణాదాయ్-నావుడయాయ్ అంటు గోపికను మేల్కొలుపుతున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,

 "నెగిళిందు-కూంబిణగాం" అను ముకుళితము-వికసనము "

 అను పరమార్థమైన పదములను ,పాశురమును అనుసంధానము చసుకునే ప్రయత్నమును చేద్దాము.


 ఉంగళ్ పుళక్కడై తోటత్తు  వావియుల్ 

 శెంగుళునీర్వాయ్  నెగిళిందు ఆంబల్వాయ్ కూంబిణగాం


 శెంగళ్పొడి కూరై వెణ్పల్ తవర్ తవర్

 తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోదందార్


 ఎంగళై మున్నమెళుప్పువాన్ వాయ్పేశుం

 నంగాయ్! ఎళుందిరాయ్! నాణాదాయ్! నావుడైయాయ్


 శంగొడు శక్కరం ఏందు తడక్కైయన్

 పంగయ కణ్ణానై  ప్పాడు ఏలోరెంబావాయ్.

   లక్ష్మీనారాయణులు లీలగా ఒకసారి దాగుడుమూతలాడుకొనుచున్నారట.స్వామికి కనిపించకుండా/స్వామిని పట్టుకోనీయకుండా మహాలక్ష్మి పద్మములున్న తోటలోనికి వచ్చి,వాటిని విప్పారకూడదని శాసించి తాను అందులో ఒక విశాలమైన అందమైన పదముములో కూర్చుండి దానిని ముకుళింపచేసినదట.స్వామి అమ్మను వెతుకువెతుకుతు తోటలోని పద్మములన్ని ముకుళించియుండుటను గమనించి ,వాటిని వికసింపచేయుటకై,తన కుడికన్ను మిక్కిలి ప్రకాశవంతము చేసినాడట.స్వామి నేత్రసౌందర్యాసక్తులైన పద్మములు అమ్మ మాటను సైతము నిర్లక్ష్యము చేసి విచ్చుకున్నాయట ఆ ఒక్క పద్మము తక్క.అప్పటివరకు వాటికి కాలనియమముననుసరించి వికసించు నియమము లేదని,స్వామి సూర్యుని ఉదయముతో పాటుగా తమ వికసనముతో ఉషోదయమును తెలియచేసే వరమును అనుగ్రహించాడట.

 ప్రస్తుత పాశురములో

 1.కమలముల వికసనము-కలువల ముకుళము

 2.ఇటుకపొడి రంగు గల వస్త్రములు-తెల్లని దంతములు

   వస్త్రములు విడువబడూవి-రజోగునము

  దంతములు స్వీకరింపబడునవి-సత్వగుణము

  అంటే

 సత్వగుణ వికసనము-రజోగుణ విసర్జనము

 3.విశాలమైన స్వామి భుజములు

  శంఖ చక్రములు-పద్మములవంటి కన్నులు 

     కీర్తించబడినాయి.

 మరికొందరు విజ్ఞులు సంఖమును సత్వగుణ ప్రకాశముతోను-చక్రమును పరాక్రమముతోను వాటికి ఉపమానములే పద్మములని-నల్ల కలువలని కూడా 


 భావిస్తారు.

 ఇప్పటివరకు గోపి పెరటి తోటలోని మణికైరవ బావిలోన


కమలములు విచ్చినవి-కలువలు ముడుచుకొనినవికాషాయాంబర ధారులు- ధవళ వర్ణ దంతులుశంఖనాదార్చకులు గుడికి చేరుచున్నారుఅని చెప్పి గోపిక స్వభావమును చెప్పుచున్నది గోదమ్మ.

గోదమ్మ ఈ పాశురములో వాచ్యార్థముగా మేల్కొలుపబడుచున్న గోపికకు మూడు గొప్ప లక్షణములు కలదని,తన సంబోధనల ద్వారా తెలియచేయుచున్నది.


ఏమిటా మూడు గొప్ప లక్షణములు అను సందేహము మనకు రావచ్చును.గోపికలు ఆమెను బధ్ధకస్తురాలా-సిగ్గులేనిదానా-కపటస్వభావము గలదానా అని,తమను లోపలికి ఆమె పిలువలేదని,తెల్లవారినదని తాము గురుతులు చెప్పినను వాటిని చమత్కరించి బదులు చెప్పుతున్నదని భావిస్తున్నారు.


కాని అంతరార్థము అదేనా? అదే అయితే గోదమ్మ వాటిని ప్రస్తావిస్తుందా?


 1.మొదటి సంబోధన " నంగాయ్" పరమాత్మ తత్త్వమునందు పరిపూర్ణ జ్ఞానము కలది.


 2.రెండవది-నాణాదాయ్ -సిగ్గులేనిది వాచ్యార్థము.రాబోవు పాశురములలో గోపికలు కృష్ణునితో'అబిమానబంగ వందోం' అను చర్యకు సూచకముగానిపిస్తున్నది.అభిమానమునకుభంగము వా టిల్లునని తెలిసినను అన్నిటిని వదిలి నీదగ్గరకు వచ్చాము స్వామి అంటారు.


ఇక్కడ వారికి జరిగిన అభిమానమునకు భంగము దేహమునకా-ఆత్మకా? అని ఆలోచించినపుడు వారు దహర విద్యా నిష్ణాతులు.మన అంతరంగమే దహరము.దానిలోని కాశమే వెలుగు.తమ లోపల నున్న స్వామిని గుర్తించిన వారికి దేహాభిమానము ఎక్కడ ఉంటుంది? నేను అన్న మాటకు దేహము కాదని-దానిలోని పరమాత్మ అను విశేషమును తెలిసికొనిన వారు.ద్రౌపది-గజేంద్రుని వలె ఆత్మజ్ఞాన ప్రకాశకులు.


మూడవది-నావుడైయాయ్-కపటస్వభావము కలిగినది అనునది వాచ్యార్థము.లోపల స్వామిని దాచుకొనినది.స్వామితో సరస సంభాషణమును సలుపుతున్నది.స్వామి గోపిక కళ్ళను సరసముగా మూసినాడు తన చేతులతో.సంతోష పారవశ్యముతో నున్నాడు.దాని ఫలితమే కదా గోపిక కన్నులు నల్లకలువలై ముడుచు కొన్నాయి.స్వామి కన్నులు కెందామరలై కాంతితో పూర్తిగా విచ్చుకున్నాయి.(శెంగళ్ నీర్వాయ్ నెగిళిందు) (ఆంపల్వాయ్ కూంబిణగాం)


ఉంగళ్ నీయోక్క అను పదముతో ప్రారంభించినారు గోపికలు.వారు లోపలి గోపిక భగవద్గుణవైభవమును తానొక్క వారిని లోపలికి రానీయకుండా అనుభవిస్తున్నదన్న కినుకతో నున్నవారు.


ఈ విషయమును గ్రహించలేనికారు వారు బయటనున్న గోపికలు.కనుకనే గోపిక వారి ముఖములనే పద్మములుగా-కలువలుగా చమత్కరించినప్పటికి సంభాషణను కొనసాగిస్తున్నారు.వారు సంబంధ విషయజ్ఞానము కలవారు.


1. వారు దృశ్యము-వ్యూహము-శబ్దము (ఆప్త వాక్యము) అను మూడు ప్రమాణములను స్వీకరించి,మొదటిదైన దృశ్యమును గ్రహించి,నీ ఇంటి లోపలి దిగుడు బావిలోనే కాదు,మేము మీ ఇంటికి వచ్చు దారిలోను పద్మములు విచ్చుకొన్నవి-కలువలు ముడుచుకొనినవి అన్నారు.భువన భాండములే ఆ దిగుడుబావి.

రెండవది.

2.వ్యూహము అను జ్ఞానము వీరు ఊహించి నిర్ధారించగలరు.కనుకనే వారు గోపికతో నీ ఇంటి పెరటిలోని దిగుడు బావిలో కొన్ని పూవులు వికసించినవి.మరి కొన్ని ముడుచుకొని ఉన్నవి.అవి రజో తమో గుణములు కావచ్చును.అంతర్ముఖులు-బహిర్ముఖులైన ఆచార్యులును కావచ్చును.



ఇక్కఒక చిన్న ఉదాహరణమును మాట్లాడుకున్నాము.అంతర్ముఖులు దధికుంభుని వంటి వారు.తాను కూర్చున్న కుండయందు కృష్ణుని దాచుకొని,యశోదమ్మతో ఇంగన్ ఇళ్ళె స్వామి ఇక్కడ లేడు అని ముక్తిని పొందినవాడు.ప్రహ్లాదుడు స్వామి ఇందుకలడందులేడని సందేహము వలదనిన వాడు.దధి కుంభుడు తానొక్కదడే ముక్తిని పొందితే, ప్రహ్లాదుడు సకల జగములకు ముక్తి మార్గమును చూపించిన వాడు.


మూడవది నాదము



 సంబంధ జ్ఞాన విషయమును శంఖనాదార్చుకులు కోవెలకు శంఖనాదమును చేయుటకు పోవు చున్నారని నాదమును తెలిపినారు.


శంఖనాదార్చకులు కాషాయ వస్త్రధారులుగా-తెల్లని పలువరుస కలిగిన వారై తాళపుచెవుల గుత్తిని ములుకోలకు తగిలించుకొని వెళ్ళుచున్నారట కాచుపొడి అద్దిన వస్త్రములట.అవి అనురాగ చిహ్నములు.దేహములోని దేవునిపై గల అనురాగమునకు గుర్తు.తెల్లని దంతములు వారి సత్వగుణమునకు ప్రతీక .నల్లని తమోగుణము వారిని చేరలేదు .వారి కదలికకు శబ్దమును చేయుచున్న తాళపుచెవులు "అనేన శరణం నాస్తి -త్వమేవ శరణం మమ" అని అంటున్నాయట.ఎంత చక్కటి భావనో కదా!.


మూడు ప్రమాణములను సోదాహరణముగా వివరించిన తరువాత మేల్కాంచిన గోపికతో పాటుగా మనలను సైతము చేయిపట్టి నడిపిస్తున్న,

 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...