Saturday, December 31, 2022

AALO REMBAAVAAY-17

 


 పాశురము-17

 *********

 "శయ్య శయనిస్తున్నది అతిశయము మీర

 శ్యామసుందరు లీల కనుడు కనులార."


 ఆధ్యాత్మిక మయమైన నందగోప పాలకుని శయనమందిరమునకు అత్యంత భక్తిశ్రధ్ధలతో, ప్రవేశించిన వారలై,అపురూప భావనము-ఆరాధ్య సేవనముతో,వారు ఎన్ పెరుమాన్-ఎన్ పెరుమాట్టి-త్రివిక్రమ-బలరామ అని వారి మహోన్నతత్త్వమును కీర్తిస్తూ,వారిని నలుగురిని తాము నోముచేయుచున్న ప్రదేశమునకు విచ్చేసి,నోమును సుసంపన్నము చేయమని ప్రార్థిస్తున్న వారితో పాటుగా మనలను అనుగ్రహిస్తున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.

 అంబరమే తణ్ణీరే శోరే అరం శెయ్యం

 ఎంబెరుమాన్ నందగోపాల! ఎళుందిరాయ్


 కొంబనార్కెల్లాం కొళుందే! కులవిళక్కే

 ఎంబెరుమాట్టి! యశోదాయ్! అరివురాయ్


 అంబరం ఊడరత్త ఓంగి ఉలగలంద

 ఉంబర్కోమానే ఊరంగాదు ఎళుందిరాయ్


 శెంపోర్ కళలడి శెల్వా బలదేవా

 ఊంబియున్ నీయుం ఉరంగేలే రెంబావాయ్.

అంబరమే-తన్నీరే-శోరే ను ,అన్నము పరబ్రహ్మ స్వరూపము.అటువంటి అన్నమును-నీటిని-వస్త్రములను ధర్మముగా దానము చేయువాడు.


"వైకుంఠము-విరజానది- ఉపనిషత్తులను అంబరమే-తన్నీరే-శోరే గా ప్రస్తావించినది ఆండాళ్ తల్లి.


ఓం-నమో-నారాయణాయ అను అష్టాక్షరిని కూడ అంబరమే-తన్నీరే-శోరే లుగా ఆరాధిస్తారు."

అంబరము-వస్త్రము-తన్నీరు-మంచినీరు-శోరే-ఆహారమును ప్రసాదించుటకు
నందుని-యశోదను-కృష్ణుని-బలరాముని నిదుర మేల్కొన మని,నోమునకు రమ్మని అర్థమగుచున్నది.కాని ఇది కేవలము వాచ్యార్థము. నిగమార్థసార నిథులను నిక్షిప్తపరచినది,నిరంతరానుగ్రహమును ప్రసాదించునది ప్రస్తుత పాశురము..

 1.గోదమ్మ సుప్రభాతమును  నందునితో ప్రారంభించినది.ఆచార్యునిగా అగ్రస్థానమునిచ్చినది.
ఆచార్యుడు నందుడు. మంత్ర సంపదను-తద్వారా లభించిన జ్ఞానమును ఆకళింపు చేసుకొనుచు ఆత్మానందములో మునిగితేలు వేదస్వరూపము వంటి  వాడు.మనందరికి తండ్రి వంటివాడు నందగోపన్ సుప్రభాతము.
 2.రెండవ వారు"కొంబనారక్క్" నదీతీరములలో మొలచు,అతి సుకుమారమైన ప్రబ్బలి తీగ.విజ్ఞాన సర్వస్వమునకు నాజూకు రూపమైన మంత్రస్వరూపము. యశోద.ద అంటే ఇచ్చునది-పుట్టినది అను అర్థమును మనము అన్వయించుకుంతే ఆచార్య జ్ఞానమును మంత్రముగా మలచి-దాని అర్థమును తెలియచేయు భాగ్యశాలి.మంత్రము-దాని అర్థము-పరమార్థము తానైన యశో విభూషిత యశోద సుప్రభాతమమ్మా.అరిఉరాయ్ అన్నది.ఎళుందిరాయ్ అనలేదు.అది సంప్రదాయము. మంత్రము ఎప్పుడు శక్తితగ్గి ఉండదు.అందులకే అరివురాయ్ అని జాగరూకవు కమ్మంటున్నారు.

 3.మూడవ వారు " అంబరం ఊడు అరుత్తు ఓంగి" చెలగి వసుధను,గగనమును కొలిచిన త్రివిక్రమ స్వరూపుడు.. మన స్వామి.తల్లి-తండ్రులకు విధేయుడు.వారిని దాటి బయటకు రాలేని వాడు.ఆచార్య అధీనములో నున్న మంత్రమునకు అధీనుడు.యశోప్రద-ఆనందుల కుమారుడు.కనుక వారి ప్రకాశమునకు ప్రతీకయై ప్రకాశించు పరమాత్మా సుప్రభాతము..
 4.నాల్గవ స్థానములో నున్న వారు"శెంబొర్ కళలదిచ్చెల్వా" వీరత్వ ప్రతీకగా ఎర్రగా బంగరు కాంతులతో ప్రకాశించు కాలికడియము కలవాడా ఓ బలదేవా!.కన్ననికి అన్న.మంత్రమును సదారక్షించు బలవంతుడు.అదే మన భాగవతుడు.
  లౌకికముగా బలరాముడు శ్రీకృష్ణునకు అన్న.అయినప్పటికిని స్వామిని మేల్కొలిపిన తరువాత మేల్కొలుపబడుచున్నాడు.అనంతుడు స్వామికి అన్నగా జనించి ఆదమరచి నిదురించుచున్నాడట.ఎక్కడైన శయ్యయే శయనించుట కలదా అని కవి చమత్కారము



.


ఈ నలుగురు మహనీయుల స్వభావములను గుర్తించుటకు నందనాయకుని వస్త్రములు-చల్లని నీరు-అన్నమును ప్రసాదించు వానిగా స్తుతించినది.అదియును ఏదో కొద్ది సేపు-కొంచము కొంచముకాదు.నిరంతర పుష్కల ప్రసాదము. ఇదే వారసత్వము కారణ-కార్య సంబంధముగా శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి వస్త్రములు -అక్షయ పాత్ర-అన్ని వేళల తోడునీడ అను చల్లని నీరు  ఇచ్చి ఋజువు చేసికొనినాడు. 
 వైకుంఠ ప్రాప్తి-విరజానది స్నానము-విడివడని కృష్ణభక్తియే వారుకోరుకొనునవి.



.

యశోదమ్మ సుకుమారతను నదీతీరములలో పెరుగు ప్రబ్బలితో పోలిచినది"కొంబనారుక్కు" సులభసాధ్యతను "కులవిళక్కే" అని మంత్ర తేజముగా తెలిపినది. కన్నని తో పాటుగా నందుని,బలరాముని,యశోదను నోముస్థలికి తీసుకునిరమ్మని చెప్పి,నీళాదేవిని మేల్కొలుపుటకు గోపికలతో పాటుగా కదులుచున్న,


 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...