AGNI AS DIKPALAKA

దక్షిణము-తూర్పు మధ్యభాగమైన ఆగ్నేయమూలాధిపతి మూడు చోట్ల మూడు రకములుగా వ్యాపించియుంటాడని ఇతిహాసము నమ్ముతుంది. 1భూమి మీద అగ్నిరూపముగాను 2పర్యావరనములో కాంతిరూపముగాను 3.ఆకాశములో సూర్య రూపముగాను విధులను నిర్వహిస్తుంటాడు అని వేదోక్తము. అంతేకాకుండా ఒకచోట నున్న శక్తిని వేరొకచోటికి అనుకూలముగా మారుస్తూ అందచేసే నిపుణుడు అగ్ని.ఉపనిషద్ విజ్ఞాన రహస్యమును కూడా అగ్నిగానే గౌరవిస్తారు. ఆద్యంతరహితుడైన జాతవేదుడు ఎన్నో తరములను దర్శించియున్నాడు.వారికి కావలిసిన శక్తిని తాను ముందు వహ్నిగా గాలితో పాటు సంచరిస్తూ,యజ్ఞయాగాదులందు దేవతలకు తనద్వారా హవిస్సులను అందచేస్తూ,తత్ఫలితములకు సహాయపడుతు ,వ్యర్థములను హుతముచేస్తూ జగత్ సంరక్షణమును చేస్తుంటాడు.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.