INDRA AS DIKPALAKA

ఇదం ద్ర ఇంద్ర అన్నారు పెద్దలు.ద్ర గమనిస్తుందో-ఏది మన కదలికలను గమనిస్తుందో అది ఇంద్రుడు.దానికి కల సాధనములు ఇంద్రియములు.ఉత్తర దిక్పాలకునిగా కీర్తింపబడుతున్న ఇంద్రుడు గోచరముకాని మనలకు గోచరించుచున్న కదలికలకు కారణమైన బ్రహ్మపదార్థము.నింగి నేలకు సామరస్యమును కూర్చు సాధనము. పురంధరునిగా ప్రస్తుతింపబడుచున్న నదీజలముల నడకకు కావలిసిన పరిస్థితులకు పర్వతములను నియంత్రిస్తూ,సూరెయకాంతిని అవరోధిస్తున్న ప్రతికూల పరిస్థితులను తొలగిస్తూ,స్థితికార్యమునకు సహాయపడుతున్న అద్భుత శక్తి కనుకనే 'వృత్రఘ్న" గా అడ్డంకులను అడ్డగించే ప్రజాపతి. పురాణకథనము ప్రకారము ఐరావత వాహనుడుగా సచీసమేతుడై వజ్రాయుధమును ధరించి లోకసంరక్షకునిగా కీర్తింపబడుతున్నాడు.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI