Wednesday, January 5, 2022
TIRUPALLI ELUCHCHI-01
తిరుపళ్ళి ఎళుచ్చి-01
*********************
పోట్రియన్ వాళ్ముదల్ ఆగియ పొరుళె
పులందదు పూంకళత్తు ఇనైతునై మలర్కొండు
ఏట్రు ఇన్ తిరుముగత్తు ఎమక్ అరుళ్ మలరుం
ఎడిల్నడై కొండు ఇన్ తిరువడి తొళుకోం
శేట్రిదళ్ కమలంగళ్ మలరుంగన్ వయల్సోల్
తిరుపెరుత్తురైయురై శివపెరుమానే
ఏట్రియార్కొడి ఉడయాయ్ ఎన్నై ఉడయాయ్
ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందు అరుళాయె.
......
జన్మదుఃఖం జరా దుఃఖం జాయాత్ దుఃఖం పునః పునః
సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత.
*********
పోట్రి అను మంగళాశాసనముతో ప్రారంభింపబడిన మొదటి పద్యము మనలో సూక్ష్మముగా దాగిన పరంజ్యోతిని మేల్కొలిపి మన ఇంద్రియములను సన్మార్గమున నడిపించమని విన్నవించుటతో ప్రారంభమవుతున్నది.
ఆది శంకరుల హెచ్చరిక.
దీనిని అర్థము చేసుకోవాలంటే మనకు శివానుగ్రహముతో "తిరువాదిరై-ఆరుద్ర నక్షత్ర" దర్శనభాగ్యము కలుగవలసినదే.
మార్గళి పౌర్ణమి నాటి చిదాకాశములో జ్యోతి రూపములో కదులుచు మనలను చైతన్యవంతులను చేయు చిదంబర నటరాజ దర్శనము.
సాకార-నిరాకారములను మేళవించిన స్వామి సాక్షాత్కారము.అంబరమున అగుపడు అద్భుతలీల-అనుగ్రహ హేల.
జ్యోతి కదలికలు సామాన్యనేత్రము గ్రహించలేదు.స్వామి తన కదలికలతో సమస్త భువనభాండములను శక్తివంతము చేయుచున్న సర్వోత్కృష్ట సంయోగము.స్వామి అనుగ్రహించుచున్న అద్భుతశక్తుల సహాయముతో చేతనులు తమ ఉపాధిని సంస్కరించుకొని,సాకార-సామీప-సాంగత్య-సాయుజ్యములందించు చక్కని అవకాశము.
మన చెలులు శివనోమును భక్తిశ్రధ్ధలో పూర్తిచేసుకొని,ఆరుద్ర నక్షత్ర దర్శనమును ముగించుకొని,తిరుపళ్ళి ఎళుచ్చిని ప్రారంభిస్తున్నారు.
చెలులు తిరుపెరుంతురైలో కొలువైన ఆత్మనాథ స్వామిని మేల్కొలుపుటకు మందిరము వైపునకు తమ అడుగులను కదుపుచున్నారు.దారిలో వారి దృష్టి అప్పుడే లేలేత భానుకిరణములుసోకి మెల్లమెల్లగ విచ్చుకొనుచున్న కెందామరలపై పడినది.దానిని వారు సంకేతముగా తీసుకొని స్వామిని,
ఎం పెరుమానె-మా అందరి సంరక్షకుడా
పళ్ళి-నీయోగనిద్రను చాలించి
అరుళ్ -ఆశీర్వచనములనే కాంతులుకల
కళ్లను తెరిచి,
ఎళుందు-మేల్కాంచు.అని ప్రార్థిస్తున్నారు.
కోవెలలో కొలువైన పరమాత్మ తూర్పురేఖల కాంతులుకల భానుకిరణముల ప్రసరణముతో కెందామరలు విచ్చుకొనుచున్నవి.మమ్ములను ఆశీర్వదించుటకు నీ పుండరీకములను తెరచి/మేల్కాంచి మమ్ములను అనుగ్రహించు.
ఇది బాహ్యము-వాచ్యార్థము
కాని వారు వెంటనే తమలో కలిగిన కొత్త చైతన్యముతో ఒకరితో నొకరు
చెలి!
,ఈ తామరలు ఇంతకు ముందే స్వామి పాదపద్మములను సేవించి,వరముగా స్వామి తిరుముగ-ముఖమునుండి వెలువడుచున్న తొళుకోం-కాంతులను
తిరువడి-పాదపద్మముల కాంతులను తమతోపాటుగా తెచ్చుకొని ,సూర్యకిరణముల తాకిడిచే వికసించుచున్నవా అనునట్లు మనలను భ్రమింపచేయుచున్నవి.
అని స్వామి అనుగ్రహమును కొనియాడుతూ అదే సమయములో తమ హృదయములలో దాగిన పరమాత్మను నిదురలేపుచున్నారు.స్వామి నీవు మా పళ్ళి తమో నిద్రనుండి మమ్ములను జాగరూకులను చేసి, మా ఇంద్రియములను సన్మార్గమున నడిపించు అని ప్రార్థించుచున్నారు.ధర్మ మార్గమునకు అధిపతి కనుక వృషకేతనుడా అని/
ఏట్రియార్ కొడిఉడయార్-
కొడి-పతాకగా అనుగ్రహించిన
ఉడయార్-దైవమా నమస్కారములు.
ధర్మమునకు ప్రతిరూపమైన ఎద్దును నీ పతాకముగా/వాహనముగా ధరించి
న పరమేశా! పాహి పాహి యని ప్రార్థిస్తున్నారు.
ఆత్మనాథ తిరువడిగళియే పోట్రి
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment