TIRUPALLI ELUCHCHI-05

తిరుపళ్ళి ఎళుచ్చి-05 ***************** పూదంగ తోరున్ నిన్రాన్ ఎనిన్ ఆళ్ళాళ్ పొక్కిలన్ వరవిలన్ ఎననినై పులవోర్ గీదంగళ్ పాడుదళ్ ఆడుదల్ ఆళ్ళాళ్ కేట్టరియోం ఉనై కణ్దరి వారై శీదంకోళ్ వయల్తిరు పెరుంతురై మన్నన్ శిందనైక్కుం అరియా ఎంగన్మున్వందు ఏదంగళ్ అరుదెమ్మై ఆండరుళుం పురియుం ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె తిరువడి తొళుకో పోట్ర్ స్వామిపాదకాంతులకు మంగళం *********** ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు సుక్షేత్రములుగా మారిన అంతరంగము కలిగిన చెలుల సంభాషణమును వర్ణిస్తున్నారు. తిరుపెరుంతురు మన్నన్, తిరుపెరుతురునకు ప్రభువైన మా స్వామి, శీదంగళ్ వయల్-మా మనోక్షేత్రములు భక్తి అను విత్తును నాటిన పుష్కలముగా పంటను అందించు సుక్షేత్రములుగా మారినవని మాకు నీ పంచభూత తత్త్వమును ఆళ్ళాళ్-విజ్ఞులు మాకు తెలియచేస్తున్నారు. వారేమో ఆడుతున్నారు-పాడుతున్నారు. గీదంగళ్ పాడుదల్-ఆడుదల్ అల్లాల్ వారి సంతోషమునకు కారణమును తెలిసికోవాలని మేము వారిని ప్రశ్నిస్తే పూదంగల్ తోరున్ నిండ్రాయ్ అని పంచభూత నిండి యున్న నీ విభవమును గురించి కీర్తిస్తున్నారు. ఆనందాశ్రువులు నిండిన నయనములతో నర్తిస్తున్నారు-కీర్తిస్తున్నారు. వారు తన్మయత్వమును అనుభవిస్తున్నారు.అర్చిస్తున్నారు.ముందు తరములకు స్వామి తత్త్వమును అందిస్తున్నారు.అని చెప్పగానే చెలి! నాదొక సందేహము.నిజముగా వారు స్వామిని దర్శించితిరా స్వామిని? స్వామి అర్చామూర్తి నామ-రూప-గుణ వైభవములగురించి మరిన్ని విశేషములను తెలుసుకుందామని వారిని సమీపించి,ప్రశ్నించగా, వారు బహిర్ముఖులై,వారికి ఎందరో స్వామి వారికి అందించిన అనుభవములను-అనుభూతులను వివరించినారే కాని ప్రత్యక్షముగా వారును దర్శించలేదట. అయినప్పటికిని వారికి/ఇంద్రియములకు ప్రతి పరమాణువు స్వామిశక్తిగా కనపడుతున్నదట. వారు నిశ్చలమనస్కులై ఇది స్వామిరూపము-ఇది స్వామి విభవము--ఇది స్వామి నివాసము అని స్వామి ఉనికిని పరిమితము చేయలేమని సర్వాంతర్యామితత్త్వమును వివరిస్తుంటే, సెన్నియ అంజలి కుప్పినరొరుపాల్ -అందరును త్రికరశుధ్ధిగా నమస్కరించి,ఇవన్నీ మనలకు పరిచయము చేయుచున్న పరమాత్మ ఎంతటి దయార్ద్ర హృదయుడో అని తలుస్తూ, శివనోమునకు తరలి వెళుతున్నారు. ఈ రోజు మణిక్యవాచగరును ఆకర్షించిన సుందర ఉద్యానవనములో జరిగిన విశేషముల గురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. ఇమైపొడుం ఎన్నెంజిల్ నీంగాదాన్ వాళ్గా పరమేశా! నా హృత్పుండరీకమునందు కొలువై క్షణమైనను ననువీడని నీ పాదములకు శాశ్వత మంగళమగుగాక. పరమేశుని లీలలు పరిపరివిధములు. ఎంతటి అద్భుత దర్శనము.ఒక మహావృక్ష నీడలో అనంతతేజోరాశిగా అవతరించిన ఆదిదేవుడు. క్రింద స్థిమిత చిత్తములతో స్వామి బోధనమును శ్రవనము చేస్తున్న సకలసురలు. సత్-చిత్-ఆనందము పర-వ్యూహ-విభవ దశలను అధిగమించి,అర్చామూర్తిగా ఆటను ప్రారంభించిన సన్నివేశము. ఓం నమః శివాయ ఐహికము తొలగుతూ ఆధ్యాత్మికమునకు మార్గము వేయుచున్నదా అన్నట్లుగా అడుగులను కదిలిస్తున్నాడు అటువైపునకు హర్షాతిరేకముతో మాణిక్యవాచగర్. అర్ద్రత నిండిన /వాలిన భక్తి స్వామి పాదపద్మములను ఆశ్రయించినది.అవ్యాజ వాత్సల్యము అనుగ్రహముతో ఆశీర్వదించినది. కోవెల నిర్మాణమునకు బీజమువేసి కనుమరుగైనది కరుణామృతమును వర్షిస్తూ. అంబే శివే తిరువడిగళే శరణం.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)