Thursday, January 13, 2022

TIRUPALLI ELUCHCHI-07

తిరుపళ్ళి ఎళుచ్చి-07 ****************** అదుపళచువ ఎన అముదెన అరిదర్కు అళిదెన ఎళిదెన అమరరుం అరియార్ ఇదు అవన్ తిరువురు ఇవన్ అవన్ ఎనవే ఎంగళై ఆ ండుకొండు ఇంగెళుందు అరుళం మధువళిర్ పొళి తిరు ఉత్తరకోశ మంగై ఉళ్ళాయ్ తిరుపెరుంతురై మన్నా ఎదు ఎమ్మై పనికొళ్ళుం ఆరందు కేట్పోం ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె ....... ఉత్తర కోశ మంగళనాథర్ పోట్రి ************************** అరుణగిరినాథర్ తో పాఉగా మాణిక్యవాచగరు చే ప్రస్తుతింపబడిన, మంగళాంబ సహిత మంగళనాథుని కోవెల తమిళనాడులోని పరమక్కడి సమీపములో పాండ్యరాజులచే నిర్మింపబడినది.ఈ దివ్య క్షత్రము ఉత్తరకోశ గా ప్రసిధ్ధిచెందుటక ఒక ఇతిహాసమును చెబుతారు. ఉత్తిరం అనగా ఉపదేశము.ఇక్కడ పరమేశుడు పార్వతీదేవికి ఉపదేశమును చేసినాడట. దేనిని ఉపదేశించెను అనగా కోశై-రహస్యమును/వేద రహస్యములను ఉత్తర కోశై మంగళనాథుడు/నటరాజు,తిరుపెరుంతూరు లోని ఆత్మనాథుడు ఒకరే అన్న రూపమును దాటిన తత్త్వమును మనకు పరిచయము చేయుచున్నారు. కనుకనే ఇదు అవన్-ఇది నీవే, ఇవన్-అవన్ ఎనవే-ఇది-అది-నీవే అదియేకాదు, అళుదెన-ఎళుదెన -కుడి-ఎడమ రెండును నీవే/అయ్య/అమ్మ అన్ని నీవే అనుచు స్వామి నీ దివ్యలీలానుభూతులను నేను వేటితో పోల్చగలను? అదు చువ-తేనెమాధుర్యముతోనా లేక పళ చువ-పండ్ల అద్భుతరుచితోనా కాదుకాదు అముదెన చువ-అమృతపు ఆస్వాదనతోనా అనుచున్న మాణిక్యవాచగరు మాటలను వినిన చెలులు అంతలోనే ఆ సంభాషణమునకు ప్రభావితులైన చెలులలో ఒకరు క్షనములో తనను తాను రామదాసుగా ఊహించుకొనుచు, పాలు-తేనియలకన్నా పంచదార-చిలుకలకన్న అనగానే తేనె భవహరణ తారకమే కాని,నాకెందుకో స్వామి దివ్యలీలా అనుభూతులు, కదలీ ఖర్జూరాది ఫలములకధికమౌ కమ్మన అనగానే తలనూపుతు మరొకచెలి, పనస-జంబు-ద్రాక్ష ఫలరసములకంటె అనగానే ఆనందముతో మరొకచెలి తనను తాను ప్రహ్లాదునిగా భావించుకొనుచు,తేనె-పండ్లతో స్వామి అనుగ్రహము పోల్చుట సరియే కాని, అంబుజోదరు దివ్య పాదార్వింద చింతనామృత మత్త.. అంటూ అంతర్ముఖమవబోతున్న సమయములో చెలులందరు భానురేఖలందించుచున్న భక్తిభావమును తమతో పాటుగా శివనోమునకు తీసుకుని వెళ్ళుచున్నారు. ...... ఈ రోజు మాణిక్యవాచగరు తిరుగురాకకై ఎదురుచూచిన పాండ్యరాజు ఆగ్రహించి ఆగ్రహించి తన చారులను మానిక్యవాచగరు జాడ తెలుసుకొనుటకై పంపించారు.స్వామిభక్తి పరాయణులైనవారు ప్రధానమంత్రి అశ్వములను ఖరీదు చేయలేదని రాజనగదును ఆలయనిర్మాణమునకు వెచ్చించినాడని రాకునకు విన్నవించారు.కట్టలు తెంచుకున్న క్రోధముగా పాండ్యరాజు గుర్రములను తీసుకుని తన దగ్గరకు రమ్మని చారులతో కబురుచేశాడు.ఐహికమువైపు మళ్ళని మనసుతో ఆత్మనాథుని పాదములను పట్టుకుని యున్నాడు మాణిక్యవాచగర్. రానున్న సంఘటనలను ఎంతటి రసపట్టుతో నడిపిస్తాడో ఆ ఘటనాఘటన సమర్థుడు రేపటి పాశురములో తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. అంబే శివే తిరువడిగళే శరణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...