Thursday, May 12, 2022

sattamuni

"ఈశనే  శివగామి నీశనే"
'కుంభముని-మచ్చముని-సత్తముని-బ్రహ్మర్షి అంటూ "నటరాజపత్తు "సత్తముని యొక్క విశిష్టతను వివరిస్తుంది.స్వామి నాట్యమును ప్రత్యక్షముగా దర్శించే మహానుభావుడు.
సుందర మహాలింగముగా ప్రసిధ్ధి చెందినది తమిలనాడులోని చతురగిరి.వేదనిలయముగా వేదవిదుల నిలయముగా ప్రసిధ్ధికెక్కినది.ఎన్ కురైగళ్-నా ఆపదలను పారద్రోలే తారకము.
  లోకాసమస్తాత్ సుఖినోభవంతు అనే ఆశీర్వచనమునకు నిలువెత్తు మూలస్తంభములైన మహనీయులలో ద్రవిడ సంప్రదాయమునకు చెందిన సాక్షాత్ శివస్వరూపులు.సకల్సిధ్ధిలను తమ అధీనములో నుంచుకొనగలవారగుటచే ద్రవిడ సంప్రదాయము వీరిని సిధ్ధార్ అన్న గౌరవ నామముతో కీర్తిస్తుంది.
 అన్నివిద్యలను ప్రప్రథమముగా అవపోసన పట్టుటయే కాదు దాని సత్ఫలితములను సమస్త ప్రజలదగ్గరికి చేర్చే సత్ హృదయులు.అనేకానేక మంది ఉన్నప్పటికిని సత్తముని తన లక్ష్యసాధనకై ఎన్నో త్యాగములను చేసిన మహనీయుడు.

 "చదివించిరి ననుగురువులు
 చదివితిని సర్వశాస్త్రమర్మములెల్లన్ "
 అని ప్రహ్లాదుడు భాగవతములో నుడివినట్లుగా,
 సిధ్ధార్ కరువురార్,సిధ్ధార్ భోగార్ సకలశాస్త్ర సూక్ష్మములను అందించినారు.ఉత్తరభారత గురువును అనుసరించి ఎన్నో ఉత్తమ విద్యాప్రయోజనములను అభ్యసించాడు. 
 తన అధ్యయనమునకు మెరుగులు అద్దుతు పరుసవేది విద్యను సైతము ప్రదర్శించారు.
 ఉందుగలడందు లేడని సందేహము వలదు,సత్తమునిగారికి
రాని విద్యలేదు.తీరని సందేహమసలు లేదు.తన విజ్ఞానమును తరగని సంపదగా తరలించాలన్నదే ఆయన అభిమతము.కాని తోటివారైన తిరుమూలర్ సిధ్ధి అతి పవిత్రమైన విద్యకనుక దానిని బహిరంగపరచకూడదనె నియమమును అనుసరించేవాడు.

 "కొండ అద్దమందు కొంచమై యుండదా"
 సత్తముని విధానము ప్రకారము మానవుని-మహత్తుని ఆవరించి యున్నదే కాని వ్యత్యాసము కేవలము పరిమాణములలో మాత్రమే.స్థూలముగా సర్వము-సూక్ష్మముగా జీవుని నిండియున్న పరమాద్భుత శక్తి.ఏ విద్యభ్యాసమైనను ఈ నిర్వివాద సూత్రము మీదనే ఆధారపడి జరుగుతుంటుంది.

 

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...