Friday, September 30, 2022
PAAHIMAAM SIVADUTI-
SAPTAMATRKAA SAMSTHITA-SAILAPUTRI NAMOSTUTE
పాహిమాం సప్తమాతృకా సంస్థిత-రమ్యకపర్దిని శైలసుతే
***************************************
"తాదృశం ఖడ్గమాప్నోతి యేనహస్త స్థితేనవై
అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్తా భవిష్యతి."
అని శ్రీదేవి స్తుతిమాలలో చెప్పబడినది.
శ్రీదేవిఖడ్గమాలగా ప్రసిద్ధికెక్కిన స్తోత్రములో వీరి ప్రస్తావన వస్తుంది.
"బ్రాహ్మీ-మాహేశ్వరీ-కౌమారీ-వైష్ణవీ-వారాహీ-మాహేంద్రీ-చాముండే-అనునవి పరోక్షముగా బ్రహ్మ-మహేశ్వరుడు-కుమారస్వామి-విష్ణుమూర్తి-వరాహస్వామి-మహేంద్రుడు మొదలగువారి శక్తుల యొక్క స్త్రీరూపములు.
సమరమున
చండ-ముండులు సమసిపోవుట తెలుసుకొని,రెట్టించిన క్రోధముతో శుంభుడు తనదగ్గరనున్న అనేకానేక దైతేయులను-ధౌమ్రులను-కాలకులను-కాలకేయులను దేవిపై దండెత్తుటకు రక్తబీజుని ఆజ్ఞాపించెను.
నిజమునకు ఇక్కడ జరుగుచున్న సమరము చంచల మానవస్వభావమునకు-అచంచల దైవత్వమునకు సంకేతముగా చెప్పబడుచున్నది.
అనేకానేక తామసగుణ అవిరామ స్వైరవిహారము ఒకవైపు-ఏకత్వం జగత్యత్ర ద్వితీయం కం? మరొకవైపు.
దానిని గుర్తించలేని తామసమే తల్లిని బంధించుటకు చేయుచున్న నిష్ఫల ప్రయత్నములు.
తన నైజమును మార్చుకొనలేని నిశాచరత్వము.
"సుఖస్యానంతరం దుఃఖం-దుఃఖస్యానంతరం సుఖం" అను
ద్వంద్వములను దాటలేక భవతారిణి యైన దేవిని-దేవి సింహమును చుట్టుముట్టిరి.
కుపితయై దేవి హుంకరించగనే,
"బ్రహ్మేశ గుహ విష్ణూనాం తదేంద్రస్యచ శక్తయః
శరీరేభ్యోః వినిష్క్రమ్య తద్రూపైః చండికాం యయుః"
బ్రహ్మ-శివ-స్కంద-విష్ణు-ఇంద్ర-యమ-మొదలగువారి శక్తులు అతివీర్య బలములతో స్త్రీమూర్తులుగా ప్రకటించబడినవి.
వీటి సంఖ్యలు విభిన్నములుగా చెప్పబడినప్పటికిని వీరవిహారము చేయుచు అసురసైన్యములను మట్టుపెట్టుచున్నవి
.
తమతమ ఆయుధములతో తామసమును తుడిచివేయుచుండినవి.
సమరాంగణమున మదసంహారముగా -బ్రాహ్మీ మాత
క్రోధ సంహారిణిగా -మాహేశ్వరి మాత
లోభసంహారిణిగా-వైష్ణవీ మాత
ఈర్ష్యా సంహారిణిగవారాహి మాత
మోహ సంహారిణిగా-కౌమారీ మాత
మత్సర సంహారిణిగా-ఐంద్రీ మాత
అజ్ఞాన సంహారిణిగా-చాముండా
వీరితో బాటుగా యామీ-కౌబేరి-వారుణి మొదలగు అనేకానేక శక్తులతో దేవి ప్రకాశించుచున్న సమయమున,
తమ సైన్యము క్షీణించుట గమనించిన రక్తబీజుడు తాను స్వయముగా రణమునకు సిద్ధమయినాడు.మాతృకలు వానిని తమ తమ ఆయుధములతో
ఖండించుటకు ప్రయత్నము చేయుచుండగా,వాని శరీరమునకు తగిలిన గాయములనుండి భూమిపై కారుచున్న ప్రతి రక్తపుబొట్టు నుండి ఒక్కొక్క రాక్షసుడు పుట్టుకొస్తున్నాడు.
అది గమనిస్తున్న వానికి బ్రహ్మవర ప్రభావము తనను పరాభవమును పొందనీయదను నమ్మికను కలిగించింది.
అసలే తన సోదరుని రంబుని చంపినది దేవతలే.తన స్నేహితుడైన మహిషుని చంపినది దేవత పక్షమున పోరాడిన ఈ స్త్రీయే.కనుక నేను నా రక్తధారలతో జనించుచున్న అనేకానేక రక్తబీజుల సహాయముతో దీనిని(దేవిని) తుదముట్టించెదను అని అనుకుంటు,సప్తమాతృకలకు సమీపముగా చేరుతూ,వారి ఆయుధములచే గాయపడుతూ,కారుతున్న తన రక్తపు బొట్లనుండి పుట్టుచున్న అనేకానేక బీజులను గమనిస్తూ,మనసులో ఉప్పొంగిపోవుచున్నాడు.
అమ్మ శక్తులకు అనివార్యముగా అనిపించుచున్న వాడి పతనము ఆశ్చర్యమును కలిగించుచున్నది.అర్థముగాక వారు అమ్మ వైపు ప్రశ్నార్థకముగా చూస్తున్నారు.
అది గమనిస్తున్న వాడి అహంకారము తారాస్థాయికి చేరింది.సప్తమాతృకల సమర ప్రావీణ్యము వాడిని సంహరించుటకు ....ఎందుకో వెనకాడుతున్నది.అదే విషయమును గమనించిన వాడు,వికటాట్టహాసము చేస్తూ,
దేవితో అవిశ్రాంతముగా పోరాడుచున్న అమ్మశక్తులను చూపిస్తూ,
వీరందిరి సమర సామర్థ్యము పై ఆధారపడియున్న నీవు,అసురసంహారము చేస్తున్నాను అపోహపడుతూ అహంకరిస్తున్నావు అంటూ అవహేళన చేశాడు.
" మహా చతుషష్టి కోటియోగినీ గణసేవితా",
అమ్మ వాని వాచాలత్వమునకు ఏ విధముగా బదులిస్తుందో తెలుసుకొనే ప్రయత్నమును తరువాతి భాగములో చేద్దాము.
సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు.
Wednesday, September 28, 2022
PAHIMAAM CHAMUMDESVARI -RAMYAKAPARFINI SAILASUTE
Tuesday, September 27, 2022
paahimaam paramesvari kausiki-Sumbhanishudini sailasutae
PAAHIMAAM MAHISHAASURAMARDINI-RAMYAKAPARDINI-02
"శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి
చిదగ్నికుండ సంభూతా-దేవకార్య సము సముద్యతా"
అని శ్రీలలితాసహస్ర రహస్యనామము నుతించుచున్నది.
అమ్మ చిత్ అగ్ని కుండమునుండి ఉదయిస్తున్న అసంఖ్యేయ సూర్య కాంతుల ప్రకాశముతో ఆవిర్భవించినది.శివుని త్రినయనమునుండి ప్రజ్వలింపచేసిన యజ్ఞకుండమునుండి అమ్మ అత్యంత ప్రకాశవంతముగా ఆవిర్భవించినది.సర్వదేవతా శక్తులకు తన స్పర్శచే ,,సామర్థ్యమును ప్రసాదించినది.ముచ్చటగా తిరిగి వారిచ్చిన శక్తులను లాంఛనముగా తాను స్వీకరించినది.
అంతా అమ్మ లీలా వైభవము
ఇక్కడ అసురీశక్తులు-అద్వితీయముతో పోరాడుటకుసన్నిద్ధమగుచున్నవి.
" నాదం తనుమనిశం శంకరం"-శుభప్రదమైన ఓంకారము ఒక పక్కన "ఓంకార పంజరశుకీ "గా దర్శనమిస్తుంటే,
ప్రత్యర్థిగా
"నాదం తమసనిశం భీకరం" అంటూ విచక్షణతను మరచిన హుంకారము,
హుంకారము-ఓంకారముతో చేయు యుద్ధము,
అంతేకాదు
కన్నుపొడుచుకున్న కానరాని చీకటి-ఉదయిస్తున్న అనంత సూర్య బింబములతో చేయబోవుతున్న సమరము అమరమే కదా
." మహిషాసుర నిర్ణాశి భక్తానాం సుఖదే నమః
రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి."
సూర్య-ఇంద్ర-అగ్ని-వాయు-హంద్రుల యొక్కయు,యమ-వరుణల-యొక్క అధికారమును తానాక్రమించుటయే కాక,హవిస్సులను అందనీయక హింసాప్రవృత్తియే లక్ష్యముగా కలవానిని సంస్కరించుటకు సింహవాహిని,
" సమ్మానితా ననాదోచ్చైః సాట్టహాసం ముహుర్ముహుః
తస్యా నాదేన ఘోరేణ కృత్స్నమాపూరితం నభః"
నభము/-ఆకాశము-శబ్దము అవిభాజ్యములు.ఆ దేవి అట్టహాసము తో సముద్రములు కంపించెను.భూమి గడగడలాడెను.
మహిషుని నయనములు-కర్ణములు కొంత సంస్కరించబడినవా అన్నట్లు తమవైపు పరుగెత్తి వచ్చుచున్న ధ్వని వానిని చేరినది.
" దిశో భుజ సహస్రేణ సమంతాత్ వ్యాప్త సంస్థితాం "అనంతహస్తములతో ఆకాశమంతయును వ్యాపించుయున్న
"దేవిని "వాడి నయనము చూడగలిగినది.
"బుద్ధిః కర్మానుసారిణి" కనుక
వాని మూర్ఖత్వము యుద్ధమునకు సిద్ధము కమ్మంది.
శబ్దము వచ్చిన వైపుకు వాడు పరుగులు తీస్తూ,ఆ ఇదియే ఆ "ఆడుది" అంటూ తన సైన్యముతో పరుగులు ప్రారంభించాడు.
ఆడుది-ఆడించునది అయిన
అమ్మది కారుణ్యము-అసురుని కఠినత్వము.
" హయానాంచ వృతో యుద్ధే తత్రాభూన్మహిషాసుర తోమరై బిందిపాలైశ్చ శక్తిభిః ముసలై తథా"
వాడు గుర్రములతో,ఏనుగులతో,రథములతో తన సైన్యమును సమీకరించుకుని అమ్మను గెలుచుటకు పరుగులు తీస్తున్నాడు.ప్రయాస పడుతున్నాడు.కాని, ఇక్కడ గుర్రములు మనసుతో కలిసి ఇంద్రియములు ఆడుచున్న ఆటలు.ఏనుగులు స్పర్శ అను ఇంద్రియ మోహమును వీడలేని తనువులు.చలనములేని,నిద్రించుచున్న వివేకము,జాగృతము కాలేని విచక్షణ,కర్తవ్య రహితము ఆ రథము.అవి అనేకానేకములు తన బలగమను నమ్మకముతో అసురుడు అమ్మపై దండెత్తుచున్నాడు.
వాడి రథ-గజ-అశ్వ -పదాతి బలగమే కాదు,వాటితో బాటుగా ,వెంటనున్న,
చక్షురుడు
చామరుడు
మహా హనువు
బాహ్కలుడు
ఉగ్రదర్శనుడు సైతము తమోమోహితులే.మమకార పీడితులే.మదోన్మత్తులే.
రాక్ష సమూహమంతయు తోమరములు-భిందిపాలములు-శక్తులు ముసలములు-ఖడ్గములు-పట్టిసములుమొదలగు వివిధాయుధుములను దేవిపై ప్రయోగింప పూనుకొనగా,దేవి వాటిని ఖండించివేసెను.
" చచాసుర సైన్యేషు వనేష్వివ హుతాశనః
నిఃశ్వాసాన్ముముచే యాంశ్చ యుధ్యమానా రణేంబికా"
నిర్మదా-మదనాశనీ-నమోస్తుతే.
మహిషాసురిని మదమును నాశనము చేయుటకు,
రాక్షస సైన్యమునందు అడవిలో కారుచిచ్చువలె సంచరించుచు,
" త ఏవ సద్యః సంభూతా గణాః శత సహస్రః"
తన నిట్టూర్పులతో అప్పటికప్పుడు సృజించెను.
ఇరు పక్షముల సైనికులు ఇనుమడించిన శక్తులతో ఆయుధములను పట్టుకుని పోరాడసాగిరి.
తన సైన్యము క్షీణించుచుండుటచే తన్నుకొస్తున్న తామసము,తడబడనీయకుండా ,మహిషుని,
దున్నపోతు రూపమును ధరింపచేసి,
" కాంశ్చిత్తుండ ప్రహారేణ ఖురక్షేపైస్తథా పరాన్
లాంగూలతాడితాంశ్చాన్యాన్శృంగాభ్యాచవిదారితాన్"
కొందరిని ముట్టెతో కొట్టి,మరికొందరిని గిట్టలతో మెట్టి,తోకతో చుట్టి,కొమ్మకోరతో గ్రుమ్మి,విధ్వంసము చేస్తున్న వానిపై
'రాగ స్వరూప పాశాఢ్యా" పాశముతో,కట్టిపడవేయగా,వాడు వివిధరూపములను మార్చుకుంటూ,అమ్మ దాక్షిణ్యమును అర్థము చేసుకొనలేక,
వానికి కావలిసినది తల్లి "క్రోధాకారాంకుశోజ్జ్వల"
గా
వెకిలిగా నవ్వుతూ గిట్టలతో కొండలను చండిపై దొరలించెను.
వాడిచే అమ్మ దొరలింపచేసినది మామూలు కొండలను కాదు.అశేష పాపరాశులను అన్నట్లుగా
అనుగ్రహ సమయమాసన్నమయినదని,దేవి
" ఏవ ముక్త్వా సముత్పత్య సా..రూఢా తం మహాసురం
పాదేన క్రమ్య కంఠే చ శూలేనైన మతాడయత్"అంటూ,
చెంగున వానిపైకెగిరి,వానిని కాలికింద పడవైచి,తొక్కి శూలము గొంతులో గ్రుచ్చెను.
హిమవంతుడు ప్రేమతో కానుకగా నిచ్చిన సింహము వానిపైకురికి తనపని తాను చేసుకుపోతున్నది.
ఆ నిక్కిన సగము శరీరము తోడనే,
మహిషుడు దేవిపై యుద్ధమునకు పూనగా దేవి కత్తితో వాని శిరమును ఖండించి,ముక్తిని ప్రసాదించెను.
అయిమయి దీనదయాలు తయా కృపయైవ త్వయా భవితవ్యముమే
అయి జగతో జనని కృపయాసి యథాసి తథానుభితాసిరతే
యదుచితమత్ర భవత్యురరి కురుతాత్ ఉరుతాపం అపాకురుతే
జయజయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే
సర్వం శ్రీమాతాచరణారవిందార్పణమస్తు.
Monday, September 26, 2022
PAHIMAM MAHISHASURAMARDINI-RAMYAKAPARDINI SAILASUTE-01
పాహిమాం మహిషాసురమర్దిని-రమ్యకపర్దిని శైలసుతే
*********************** ॥ (సౌందర్యలహరి)
"భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం-
ఇతి స్తోతుం వాంఛన్ కథయతి" భవాని" త్వమితి యః ।
తదైవ త్వం తస్మై దిశసి నిజసాయుజ్యపదవీం
ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదా."
తల్లీ భవానీ!
ముకుంద-బ్రహ్మేంద్రాదులు వారి రత్నమయ కిరీటములతో శిరసు వంచి నీపాదపద్మములకు హారతులు పట్టుచున్నారు అని అమ్మను సంస్తుతిస్తున్నారు శ్రీ ఆదిశంకరులు.
క్షీణే పుణ్యం...పుణ్యము యొక్క హెచ్చు-తగ్గుల లెక్కలే కూడికల-తీసివేతలే జీవుల కర్మఫలితములు అని తెలియచేయు దివ్యచరితములే దేవికథలు-కథనములు.సూత్రధారియైన ఆ జగన్మాత ఎన్నో పాత్రలను/ఎందరో పాత్రధారులను కల్పించి కామితార్థములను అనుగ్రహిస్తుంది.
అందుకు ఉదాహరణమే బ్రహ్మ-విష్ణు-ఇంద్రాదులు,(మకుటనీరాజిత.)
భవాని త్వం దాసే అంటూ అమ్మను స్తుతించటము.
త్రిమూర్తులు మాత్రమే కాదు
శ్రీ లలితా సహస్ర రహస్యనామ స్తోత్రములో నుతింపబడినట్లు,తల్లి
"దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా"
ఆ పరాత్పరి అనిశము,
బ్రహ్మాదులను దేవతల చేతను,నారదాది దేవర్షుల చేతను,వశిష్టాది ఋషుల చేతను ఆదిత్యాది గణముల చేతను స్తుతింపబడు కొత్త అవతారమును ప్రకటించుకొనుటకు కారణము?
" ఆనందామృతాకర్షిణి-అమృత వర్షిణి
హరాది పూజితే శివే-భవాని." ముత్తుస్వామి దీక్షితారు.
ఆకర్షించుట-వర్షించుట అనగా ప్రకాశము-విమర్శ రెండును తానైన భవాని మహిషాసురమర్దినిగా అవతరించుటకు కారణమెవరు?
ఇంకెవరు? మహిషాసురుడు.
సంకేత పరముగా చూస్తే స్రక్/చర్మము/స్పర్శ అను ఇంద్రియములు
మందముగా కలవాడు.
మనము వింటూనే ఊంటాము.చురుకుదనములేని వానిని గురించి
చెప్పేటప్పుడు"దున్నపోతు మీద వాన పడ్డట్లు" అంటూ.
మామూలు వర్షమునకే చలించని చర్మముగల మహిషము అమృత వర్షమును ఆస్వాదించగలదా? అనునది ఒక సందేహము.
అంతేకాదు.తామసమునకు/చీకటికి మారురూపైన నల్లని ఛాయ.తామస ప్రవృత్తి.
అంతటితో ఆగలేదు.
అహంకారమునకు ప్రతీక రెండు వాడి కొమ్ములు.
రూపమును వివరిస్తుంటే ముట్టెతో/గిట్టలతో తన్నే స్వభావము మరచిపోకూడదనిపిస్తుంది.
ఇష్టమొచ్చినట్లు మాట్లాడటము ముట్టెతో తన్నటము. బలముతో అణిచివేయాలనే తత్త్వము కాలిగిట్టలతో తన్నడము.
ఇన్ని అవలక్షణములను ఒకేచోట పోగుచేసుకుని ఉన్న అసురీశక్తులను మర్దించవలెనన్న
అమ్మ కొత్త రూపమును-స్వభావమును అనుగుణముగా ప్రకటించవలసినదే.వానిని/మనలను వాటి నుండి విముక్తులను చేయవలసినదే.మనము ప్రస్తుతించవలసినదే.
అప్పుడే కదా మనమా ఆనందామృతవర్షధారలలో ఆడిపాడగలము.
వరగర్వమొతో అహంకరించుచుహవిస్సులను అందనీయక, ఇంద్రునిపై దండెత్తిన మహిషుని ధాటికి తట్టుకోలేని దేవతలు స్వర్గమును వీడి,అధికారమును కోల్పోయి భూలోకమున సామాన్యులవలె సంచరించసాగిరి.
"బుద్ధిః కర్మానుసారిణి" రాబోయే పరిణామములకు సూచనగా మహిషుని పాపకృత్యములు పరాకాష్ఠకు చేరుచున్న సమయమున వానిదగ్గర సద్దుమణిగిన సత్వము దేవతలను చేరినదా అన్నట్లు వారందరు తమను ఈ ఆపదనుండి రక్షింగలిగినది ఆ పరాశక్తియే అని అర్థముచేసుకొనగలిగిరి.రాజ్యముతో పాటుగా రజోగుణము కనుమరగైనదేమో వారు ముకుళిత హస్తములతో ,
" ఓం జయంతీ మనగళా కాళీ భద్రకాళీ కపాలినీ
దుర్గా క్షమా శివాధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే
జయత్వం దేవి చాముండే జయభూతార్తి హారిణి
జయసర్వగతే దేవి కాళరాత్రి నమోస్తుతే."
అని ప్రార్థించిరి.
వారిని అనుగ్రహించదలచిన ఆ తల్లి,
" ఏకస్థం తదభూన్నారీ వ్యాప్తలోకత్రయం త్విషా
యదభూచ్ఛాంభవన్ కేశా బాహవో విష్ణుతేజసా"
సకలదేవతల శరీరములనుండి పుట్టి ఒకటిగానై ముల్లోకములలో వ్యాపించిన ఆ మహాతేజస్సు స్త్రీ రూపమును దాల్చెను.
సకలదేవతల శక్తులనుండి తానొక్కొక్క అవయమును ఏర్పరచుకొని అసమాన సౌందర్యముతో అబ్బురకొలుపుచుండెను.
" అయి శరణాగత-వైరివధూ-వరవీరవరాభయ-దాయికరే
త్రిభువనమస్తక-శూల-విరోధి-శిరోధి-కృతాఽమల-శూలకరే "
సమస్త తేజములతో నేర్పడిన దేవిని దర్శించి దేవతలు, వారి భక్తి సమర్పణ భావముతో తలొక అలంకారమును,ఆయుధమును సమర్పించిరి.
పురాణ కథనము ప్రకారము,
కశ్యప ప్రజాపతికి దనదేవి యందు జన్మించిన దానవులలో రంబుడు-కరంబుడు అను ఇద్దరు అన్నదమ్ములు అత్యంత శక్తివంతమైన సంతానము కొరకు పరమేశ్వరుని ఈ క్రిందివిధముగా ధ్యానించసాగిరి.
రంబుడు దక్షిణాగ్ని,ఉత్తరాగ్ని,పశ్చిమాగ్ని,ప్రాగగ్ని ఉపరితలమున కల ప్రచండ సూర్యాగ్ని మధ్యమున నిలిచి ఘోరతపమును ఆచరించసాగెను
అతని తమ్ముడైన కరంబుడు జలదిగ్బంధనములో కఠోర తపమాచరించు చుండగా,దాని వలన కలుగు దుష్పరిణామ నివారణకై,ఇంద్రుడు మొసలిరూపమున దాగి,వానిని సంహరించెను.
విషయమును తెలిసికొనిన రంబుడు పగతో రగిలిపోతూ,శత్రువులను జయించాలంటే బలాఢ్యుడైన పుత్రుని సహాయము ఎంతో కలదని గ్రహించి,అగ్ని దేవుని ప్రార్థించ సాగెను.ఫలితము కానరాకున్న,తపమును మరింత ఉదృతమును కావించెను.అయినను అగ్నిదేవుడు కరుణించలేదని,తన తలను అగ్నికి సమర్పించుటకు ఉద్యుక్తుడాయెను రంబుని నిష్ఠకు సంతసించి అగ్ని వరమును కోరుకోమనెను.
రంబుడు బాగుగా ఆలోచించి కామరూపి ,అజేయుడు,ముల్లోకములను జయించగల కుమారుని కోరుకొనెను.అందులకు అగ్ని రంబుడు వెనుదిరిగి వెళ్ళునప్పుడు దేనిని చూసి/లేదా ఎవరిని చూసి మోహవివశుడగునో వారికి జనించిన కుమారుడు రంబుని కోర్కెను తీర్చగలడని పలికి అంతర్ధానమయ్యెను.
వెనుదిరిగి చనునపుడు ఎందరో సౌందర్యవతులు,అప్సరసాంగనలు తారసపడినా రంబుడు ఎటువంటి మన్మధ వికారమును పొందలేదు.ప్రయాణమును కొనసాగించుచుండగా అక్కడ
మరీచి మహాముని శాపవశియై మహిషి రూపములో సంచరించుచున్న ఒక మహిష్మతి అను గంధర్వ కన్యను చూచినంతనే మోహితుడాయెను.
తత్ఫలితముగా మహిషము గర్భమును ధరించినది.రంబుడు ఆ మహిషమును తన నగరమునకు తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా చూసుకొనసాగెను.ఒక ముహూర్తమున ఆ మహిషము దున్నపోతు తల-మానవ శరీరము గల ఒక దూడను ప్రసవించి ,శాప విమోచినియై తన గంధర్వ లోకమునకు పోయెను.
దైవ నిర్ణయ ప్రకారము మహిషుడు బ్రహ్మగురించి ఘోరతపమును చేయగా,సంతసించిన బ్రహ్మ ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను.మహిషుడు తనకు మరణములేని వరమును ప్రసాదించమనెను.అందులకు తనకా శక్తి లేదని,కల్పాంత సమయమున తానును నిష్క్రమించువాడనని,మరేదైనా వరమును అనుగ్రహించెదననెను.మహిషుడు అహంకారముతో "అబలలను అరికాలితో అణచివేయగలను" అని తలచి స్త్రీలు తప్ప ఎవరు తనను సంహరించని వరమును పొందెను.
అమ్మవారి లీలావైభవములే ఈ అసురుల విజృంభణలు
కథను ముందుకు నడిపిస్తూ,కారుణ్యము తోసివేస్తూ,కాఠిన్యమును స్వాగతిస్తూ,మహిషుడు
తాను ఆదమరచినవేళ దేవతలు సుఖసంతోషములతో నుంటున్నారని గమనించి , తన తామస ప్రవృత్తికి మరింత రాజసమును తోడుచేస్తూ సత్వమును సాంతముగా తొలగించివేశాడు.
త్రిగుణములు ఆడుతున్న ఆటకు మరింత ఉత్కంఠతను కలిగిస్తూ,మేమున్నామంటూ అరిషడ్వర్గములు వానిని చేరి గంతులు వేయిస్తున్నాయి గమ్యము తెలియని వైపుకు.
స్వర్గము మీది కామము,మోహముగా మారి దానిని వీడకయున్న వారిపై క్రోధముగా రూపుదిద్దుకున్నది.లోభము అసలు కొంచము కూడా సర్దుకోవలసిన పనిలేదంటూ వారిపై యుద్ధానికి పురిగొల్పింది.మదము-మాత్సర్యము మరింత కొత్త పుంతలు తొక్కి దేవతలను స్వర్గము నుండి పోరాడలేక వీడి పోవునట్లు చేసినవి.
వికృత సైన్యము ఒకవైపు-వినయపు స్థైర్యము మరొకవైపు దోబూచులాతున్నాయి.
అసురుని వీడిన సత్వము సురలను చేరినదా అన్నట్లు వారి తమ అశక్తతను గ్రహించి,నిశ్చలభక్తితో "అయిరణ దుర్మద శత్రువధోదిత దుర్ధర నిర్జర శక్తిభ్రుతే"
ఓ జగజ్జననీ!పోరాటములయందు పొగరుబోతు శత్రువులైన అసురులను వధించుటకు సర్వదేవతా శక్తులను సమిష్టీకరించిన శరణాగత రక్షిణి'
అంటూ అమ్మ చరణములను శరణుగోరుచున్నారు.
" మామవ సదాజనని" కథను ఏ విధముగా నడిపిస్తుందో తానుగా రంగ ప్రవేశము చేస్తుందో/లేక తాను పరోక్షముగా ఉండి మరెవరినైన ప్రత్యక్ష పరుస్తుందో అమ్మ దయతో రేపు తెలుసుకుందాము.
సర్వం శ్రీమాత చరణార విందార్పణమస్తు.
Sunday, September 25, 2022
PAHIMAAM sREERAJARAJESVARI-02
పాహిమాం మధుకైటభనాశిని-మంజులభాషిణి శైలసుతే
***************************************
" ఓం ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ శూలం భుశుండీం శిరః
శంఖం సందధీతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం
నీలాస్మద్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాళికాం
యామస్తౌత్స్వపితే హరౌ కమలజో హంతం మధుకైటభం."
ఖడ్గము-చక్రము-గద-బాణములు-విల్లు-పరిఘ-శూలము-ఆయుధములుగా ధరించి,చేతిలో అగ్నిపాత్రతో,శంఖముతో,మూడుకన్నులతో,భూషణములతో,నీలమణి కాంతులతో ప్రకాశించుచు ,
ఎవరు
కలవరపడుచున్న కమలము నుండి ఉద్భవించిన బ్రహ్మను,యోగనిద్రలో నున్న అనంత నాభుని మధుకైటభుల బారి నుండి రక్షించినదో,
ఆ జగన్మాత నిర్హేతుక కృప,నా కరమున కలముగా మారి,కళ్యాణప్రదమైన తన అనుగ్రహమును వివరించుచున్నవేళ,నన్ను గమనించనీయకుండా నా అహము దానిలో తప్పులను కుప్పలుగా కుప్పిస్తూ తనపని తాను చేసుకుని పోతూనే ఉంటుంది.
" యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం".....తత్సర్వం క్షమ్యతాం దేవి"
ఆ తల్లి నా దోషములను సవరించి,నన్ను మన్నించును గాక.
ఎవరీ మధు-కైటభులు? వారికి బ్రహ్మ-నారాయణుల దగ్గరకు వెళ్ళి-విజృంభించగల ధైర్యము ఎలా వచ్చింది?
అను విషయమును చర్చించుటకు ముందుగా ఆ సమయము/సందర్భము గురించి ఒక్క సారి పరిశీలిద్దాము.
అది పంచకృత్యములలోని తిరోధానము ముగిసి -అనుగ్రహమునకు ముందటి స్థితి.అంతా జలమయము.అనంత శయనుడు యోగనిద్రలో నున్నాడు.బ్రహ్మకు తన జననము గురించిగాని,జనకుని గురించి గాని తెలియని స్థితి.
అట్లు అంతర్ముఖుడైన నారాయణుని చెవి మలమునుండి ఇద్దరు అసురులు ఆవిర్భవించారు.వారు అజేయులు.స్వఛ్చంద మరణ వరమును అమ్మచే పొందబడినవారు.పట్టపగ్గాలెక్కడుంటాయి ఫలితములు ఆలోచించలేని అహంకారమునకు.
నాభినుండి వెలువడిన,కమలనాభునిపై వారి కన్నుపడింది.కయ్యమునకు కాలుదువ్వారు
.
తామరతూడు చివర వికసించిన పద్మములో నున్న బ్రహ్మకు ఒక్కసారి,యోగనిద్రలో నున్న నారాయణుడు కనిపించాడు.
అసహాయుడైన బ్రహ్మ మధుకైటాభుల నుండి తనను తాను రక్షించుకొనుటకు,
"తథా సంహృతి రూపాంతే జగతోస్య జగన్మయే
మహావిద్యా మహామాయా మహామేథా మహాస్మృతాం"
తల్లీ నీవు మహావిద్యవు.మహామాయవు.మహా బుద్ధివి.మహాస్మరణశక్తివి.మహా భ్రాంతివి.
తల్లీ నన్ను సమీపిస్తున్న ఈ అసురశక్తులబారిన పడకుండా నన్ను రక్షింపుము అని వేడుకున్నాడు.
మధుసూదనుడు మేల్కొని మధుకైట సంహారము చేయుటకు యోగమాత శ్రీహరిని వీడి,చైతన్యవంతుని చేసినది.
" నిర్గమ్య దర్శనే తస్థౌ బ్రహ్మణోవ్యక్త జన్మనః
ఉత్తస్థౌచ జగన్నాథస్తయా ముక్తో జనార్దనః"
శ్రీహరి బహిర్ముఖుడైనాడు.
ఇదొక లీల.తాను వారిని నిర్మూలించగలిగినప్పటికిని,వారికి తానిచ్చిన మాట ప్రకారము,ముచ్చట తీర్చి,ముక్తిని ప్రసాదించాలనుకొంది ఆ మాతృమూర్తి.
వేదములను అపహరించిన మూర్ఖత్వమునకు మోదకారణమగు పరాశక్తి అనుగ్రహమును గుర్తించుట దుర్లభమే.
మేల్కాంచిన నారాయణుడు తన ఎదురుగానున్న అసురులను చూసి,కోపితుడై,తనపైకి యుద్ధమునకు వచ్చుచున్న వారితో ఐదువేల సంవత్సరములు వివిధ ఆయుధములతో,ముష్టిఘాతములతో తలపడి పోరి,పోరి,అలసి కొంతసేపు యుద్ధమునకు విశ్రాంతిని కోరెను.( తల్లిని శరణు కోరెను)
ఒక కథనము ప్రకారము ఆకాశమున సాక్షాత్కరించిన మోహనరూపమును చూసి,మాయామోహితులై వారు తిరిగి యుద్ధముచేయుటకు వస్తున్న శ్రీహరితో హేళనగా,
తన్నుకొస్తున్న తామసము విచక్షణను తప్పించివేస్తుంది.వింతగాను ప్రవర్తిస్తుంది.వారు విజయోత్సాహముతో ,మాయామోహితులై శ్రీహరికి ఏదైనా వరమును అనుగ్రహిస్తామన్నారు.
అవకాశమును చేజారనీయక,నారాయణుడు వెంటనే,
'భవేతా మద్యమే తుష్టా మమ వద్యావు భావసి"
మీరు నాచే వధింపబడు వరమును ఇవ్వమని కోరెను.
అందులకు వారు చుట్టుచూసి "సర్వం జలమయం జగం" లో తామున్నారని గ్రహించి,జలము లేనిచోట వారు విష్ణువుచే వధింపబడెదమని చెప్పిరి.
" విశ్వం-విష్ణుం-వషట్కారం"
విశ్వమే తానైన విష్ణువు తన ఉరువులను (తొడలపై)
విస్తృతపరచి వారిద్దరిని సంహరించెను.
"విధాత్రి-వేదజనని-విష్ణు మాయా విలాసిని"
అని శ్రీ లలితారహస్య సహస్రనామము కీర్తిస్తున్నది.
మధువు-తేనె-తియ్యదనము.ప్రాపంచిక విషయములు.వాని చుట్టు స్వీకరించుటకు రొదచేస్తు తిరుగునది కైటభము.
మిథ్య అని తెలుసుకుంటున్నప్పటికిని,విస్మరించి పదే పదే విషయాసక్తులమగుట మధుకైటభ స్వభావము.
దానిని వదిలించుకొనగలగటమే మధుకైటభ సంహారము.
" మధుకైటభ విద్రావి విధాతృ వరదే నమః
రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి."
తల్లీ సంస్కారవంతమైన ఉపాధిని,సాధనచేయగలుగు మనసును ప్రసాదించి,సన్మార్గములో మమ్ము పయనింపచేయుము.
అనుగ్రహము/ఆగ్రహము రెండును తానైన ఆ పరాశక్తి మనలనందరిని మహిషాసుర వృత్తాంతముతో అనుగ్రహించుగాక.
సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు.
పాహిమాం మధుకైటభనాశిని-మంజులభాషిణి శైలసుతే
***************************************
" ఓం ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ శూలం భుశుండీం శిరః
శంఖం సందధీతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం
నీలాస్మద్యుతిమాస్యపాదదశకాం సేవే మహాకాళికాం
యామస్తౌత్స్వపితే హరౌ కమలజో హంతం మధుకైటభం."
ఖడ్గము-చక్రము-గద-బాణములు-విల్లు-పరిఘ-శూలము-ఆయుధములుగా ధరించి,చేతిలో అగ్నిపాత్రతో,శంఖముతో,మూడుకన్నులతో,సర్వాంగభూషనములతో,నీలమణి కాంతులతో ప్రకాశించుచు ,
కలవరపడుచున్న కమలము నుండి ఉద్భవించిన బ్రహ్మను,యోగనిద్రలో నున్న అనంత నాభుని మధుకైటభుల బారి నుండి రక్షించినదో,
ఆ జగన్మాత నిర్హేతుక కృప,నా కరమున కలముగా మారి,కళ్యాణప్రదమైన తన అనుగ్రహమును వివరించుచున్నవేళ,నన్ను గమనించనీయకుండా నా అహము దానిలో తప్పులను కుప్పలుగా కుప్పిస్తూ తనపని తాను చేసుకుని పోతూనే ఉంటుంది.
" యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం".....తత్సర్వం క్షమ్యతాం దేవి"
ఆ తల్లి నా దోషములను సవరించి,నన్ను మన్నించును గాక.
ఎవరీ మధు-కైటభులు? వారికి సాక్షాతు బ్రహ్మ-నారాయణుల దగ్గరకు వెళ్ళి-విజృంభించగల ధైర్యము ఎలా వచ్చింది?
అను విషయమును చర్చించుటకు ముందుగా ఆ సమయము/సందర్భము గురించి ఒక్క సారి పరిశీలిద్దాము.
అది పంచకృత్యములలోని తిరోధానము ముగిసి -అనుగ్రహమునకు ముందటి స్థితి.అంతా జలమయము.అనంత శయనుడు యోగనిద్రలో నున్నాడు.బ్రహ్మకు తన జననము గురించిగాని,జనకుని గురించి గాని తెలియని స్థితి.
అంట్లు అంతర్ముఖుడైన నారాయణుని చెవి మలమునుండి ఇద్దరు అసురులు ఆవిర్భవించారు.వారు అజేయులు.స్వఛ్చంద మరణ వరమును అమ్మచే పొందబడినవారు.పట్టపగ్గాలెక్కడుంటాయి ఫలితములు ఆలోచించలేని అహంకారమునకు.నాభినుండి వెలువడిన,కమలనాభునిపై వారి కన్నుపడింది.కయ్యమునకు కాలుదువ్వారు.
జరుపవలసిన పనికి ప్రారంభముగా పురుషోత్తముడు యోగనిద్రను చాలించాడు.
తామరతూడు చివర వికసించిన పద్మములో నున్న బ్రహ్మకు ఒక్కసారి,యోగనిద్రలో నున్న నారాయణుడు కనిపించాడు.
అసహాయుడైన బ్రహ్మ మధుకైటాభుల నుండి తనను తాను రక్షించుకొనుటకు,
"తథా సంహృతి రూపాంతే జగతోస్య జగన్మయే
మహావిద్యా మహామాయా మహామేథా మహాస్మృతాం"
తల్లీ నీవు మహావిద్యవు.మహామాయవు.మహా బుద్ధివి.మహాస్మరణశక్తివి.మహా భ్రాంతివి.
తల్లీ నన్ను సమీపిస్తున్న ఈ అసురశక్తులబారిన పడకుండా నన్ను రక్షింపుము అని వేడుకున్నాడు.
మధుసూదనుడు మేల్కొని మధుకైట సంహారము చేయుటకు యోగమాత శ్రీహరిని వీడి,చైతన్యవంతుని చేసినది.
" నిర్గమ్య దర్శనే తస్థౌ బ్రహ్మణో
వ్యక్త జన్మనః
ఉత్తస్థౌచ జగన్నాథస్తయా ముక్తో జనార్దనః"
శ్రీహరి బహిర్ముఖుడైనాడు.
ఇదొక లీల.తాను వారిని నిర్మూలించగలిగినప్పటికిని,వారికి తానిచ్చిన మాట ప్రకారము,ముచ్చట తీర్చి,ముక్తిని ప్రసాదించాలనుకొంది ఆ మాతృమూర్తి.
వేదములను అపహరించిన మూర్ఖత్వమునకు మోదకారణమగు పరాశక్తి అనుగ్రహమును గుర్తించుట దుర్లభమే.
మేల్కాంచిన నారాయణుడు తన ఎదురుగానున్న అసురులను చూసి,కోపితుడై,తనపైకి యుద్ధమునకు వచ్చుచున్న వారితో ఐదువేల సంవత్సరములు వివిధ ఆయుధములతో,ముష్టిఘాతములతో తలపడి పోరి,పోరి,అలసి కొంతసేపు యుద్ధమునకు విశ్రాంతిని కోరెను.( తల్లిని శరణు కోరెను)
ఒక కథనము ప్రకారము ఆకాశమున సాక్షాత్కరించిన మోహనరూపమును చూసి,మాయామోహితులై వారు తిరిగి యుద్ధముచేయుటకు వస్తున్న శ్రీహరితో హేళనగా,
తన్నుకొస్తున్న తామసము విచక్షణను తప్పించివేస్తుంది.వింతగాను ప్రవర్తిస్తుంది.వారు విజయోత్సాహముతో ,మాయామోహితులై శ్రీహరికి ఏదైనా వరమును అనుగ్రహిస్తామన్నారు.
అవకాశమును చేజారనీయక,నారాయణుడు వెంటనే,
'భవేతా మద్యమే తుష్టా మమ వద్యావు భావసి"
మీరు నాచే వధింపబడు వరమును ఇవ్వమని కోరెను.
అందులకు వారు చుట్టుచూసి "సర్వం జలమయం జగం" లో తామున్నారని గ్రహించి,జలము లేనిచోట వారు విష్ణువుచే వధింపబడెదమని చెప్పిరి.
" విశ్వం-విష్ణుం-వహత్కారము"
విశ్వమే తానైన విష్ణువు తన ఉరువులను (తొడలపై)
విస్తృతపరచి వారిద్దరిని సంహరించెను.
"విధాత్రి-వేదజనని-విష్ణు మాయా విలాసిని"
అని శ్రీ లలితారహస్య సహస్రనామము కీర్తిస్తున్నది.
మధువు-తేనె-తియ్యదనము.ప్రాపంచిక విషయములు.వాని చుట్టు స్వీకరించుటకు రొదచేస్తు తిరుగునది కైటభము.
మిథ్య అని తెలుసుకుంటున్నప్పటికిని,విస్మరించి పదే పదే విషయాసక్తులమగుట మధుకైటభ స్వభావము.
దానిని వదిలించుకొనగలగటమే మధుకైటభ సంహారము.
" మధుకైటభ విద్రావి విధాతృ వరదే నమః
రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి."
తల్లీ సంస్కారవంతమైన ఉపాధిని,సాధనచేయగలుగు మనసును ప్రసాదించి,సన్మార్గములో మమ్ము పయనింపచేయుము.
అనుగ్రహము/ఆగ్రహము రెండును తానైన ఆ పరాశక్తి మనలనందరిని మహిషాసుర వృత్తాంతముతో అనుగ్రహించుగాక.
సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు.
Saturday, September 24, 2022
PAAHIMAAM SREE RAAJARAAJESVARI-INTRO
Friday, September 23, 2022
DEVAKARYA SAMUDBHAVA-RAKTESVARI/KALI
DEVAKAARYA SAMUDBHAVAA-CHAMUMDAA
Wednesday, September 21, 2022
DEVAKAARYASAMUDBHAVA-SUMBHA NISUMBHA-maata KAUSIKI
ముక్త కంఠముతో సకలదేవతలు పరాత్పరి ఆర్త్రత్రాణ పరాయణత్వము పదేపదే తలచుకుంటూ,వారి ఇక్కట్లను తొలగించగల తల్లిని
"సరోజదళనేత్రి -హిమగిరి పుత్రి
నీ పదాంబుజములే సదా నమ్మినామమ్మా"
అసలే మంచుకొండ కూతురు.కదిలివస్తూనే ఉంది.
కోరివచ్చిన వారికెల్లను కోర్కెలొసగె బిరుదుకదా
అతి భారమా-మమ్ము బ్రోవ అని వేడుకుంటుంటే,
అని నేనెప్పుడన్నానురా మీతో అన్నట్లుగా,
అటువైపుగా గంగానదిలో స్నానముచేయుటకు వెళ్ళుచున్నట్లుగా లీలను ప్రదర్శిస్తూ,
వారిని చూసి,ఆశ్రయరక్షిణి,
ఎవరిని ప్రార్థిస్తున్నారు?
ఎందుకు ప్రార్థిస్తున్నారు అంటూ ప్రశ్నించగానే,
వారు ఆర్తితో
" నమః ప్రకృతైః భద్రాయై నియతాః ప్రణతాస్మతాం
నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః"
మా దురవస్థను తొలగించగలదానవు నీవే తల్లీ.
శుంభ-నిశుంభులు బ్రహ్మ వరగర్వితులై పాతాళమున శుక్రాచార్యునిచే మూర్ధాభిషిక్తులై,సకల సామ్రాజ్యములను స్వాధీనము చేసుకొని,సంతృప్తి పడక మమ్ములను సైతము పదవీచ్యుతులను చేసి మా హవిస్సులు మాకు చేరకుండా అడ్డగించుచుండిరి.మేమును మా విధులను నిర్వర్తించలేకపోవుచున్నది.అధర్మము అగ్రతాంబూలమునందుకొనుచున్న సమయమున కార్యోన్ముఖతకు కదలిరావమ్మా ,అని ప్రార్థించసాగిరి.
వారి ప్రార్థనను మహామాయకు ఆమె నుండి బయలువెడలుచున్న ఒక శివశక్తి విశదపరచినది.
అపారకరుణ అడిగినదే తడవుగా తన శరీరకోశము నుండి ఒక అద్భుతసౌందర్య రాశిని ఆవిర్భవింపచేసినది.
" బహూనియస్యా రూపాణి స్థిరాణిచ చరాణిచ
దేవ మానుష్య తిర్యంచో బహురూపా తతఃశివాః"
"పరాస్యశక్తిః వివిధైవ శ్రూయతే'"
పరాశక్తి అనంతములగు రూపములతో భాసించుచున్నది అనవరత కరుణతో.
" శరీరకోశాద్యత్యస్యాః పార్వత్యానిః సృతాంబికా
కౌశికీతి నమస్తేషు తతో లోకేషు గీయతే."
పార్వతీదేవి నా శరీరమునుండి(కోసమునుండి) ఆవిర్భించిన నీవు కౌశికీ నామముతో కీర్తింపబడతావు అని దీవించి,నల్లని కాళిగా తాను మారి తిరిగి కైలాసమునమునకు వెళ్ళిపోయెను.
యాదేవి సర్వభూతేషు చేతనేత్యభి ధీయతే
అటువైపుగా వస్తున్న చండ-ముండులు అతిలోకసౌందర్యమును చూశారు.
విలాసముగా కాగలకార్యమునకై అక్కడ నున్న ఒక సుకుమార లతాపుష్పములతో ఆడుకొనుచు, చండ-ముండుల ఆటలను ముగించుటకు అక్కడ హొయలుమీర తిరుగుతు
అతిమనోహరముగా అడుగులను కదుపుతున్నది.
అసలే చండుడు/అత్యుత్సాహమునకు సంకేతము.వానితో నున్నవాడు ముండుడు.నిలువెత్తు నిర్లిప్తత.
అమ్మను చూడగానే వారు తమ ఏలికకు తెలియచేసి వాని పాపము మరింతపండుటకు పరికరములైనారు.
కట్టలు తెంచుకొనిన కామము కానిపనికి కార్యోన్ముఖులను చేసినది.
తక్షణమే వారు కౌశికి కడకు సుగ్రీవుని దూతగా కౌశికి దగ్గరకు పంపుటకు నిర్ణయించారు.
కన్ను అనే ఇంద్రియము త్రిలోకమోహన సౌందర్యమును గాంచినది కాని మర్మమును కనుగొనలేకపోయినది.ఇంద్రియవశమైనది.అంతటితో ఆగక మరొక ఇంద్రియలౌల్యమును ప్రోత్సహించినదా అన్నట్లు ఒక వదరుబోతు వాగింద్రియమును సద్వినియోగపరచుకోలేని పరిస్థితిని కల్పించింది.
తట్టిలేపుతున్న తామసము శుంభుని మోహమును మరింత ఎక్కువ చేస్తూ,తదుపరి సేవకు ధూమ్రలోచనుని కౌసికి వద్దకు పంపింది .వాడసలే పొగబారిన కన్నులు కలవాడు.స్పష్టముగా చూదలేని అసక్తతో నున్న వానికి దర్శనభాగ్యము/దర్ప విమోచనమో కాని అరువదివేలతో ఆదిశక్తిని బంధించుటకు బయలుదేరినాడు.భస్మము కావింపబడినాడు.తల్లివాహనమైన శిమ్హము వానిసైన్యము ఆసాంతముగా నమిలివేసినది.
తల్లి నడిపిస్తున్న ఈ మహాయజ్ఞములో సమిథలుగా మారబోతున్న చండ-ముండుల
మర్దనమునకై కాళి ఆవిర్భావము -చాముండి నామ ధారణము గురించి తెలుసుకుందాము.
సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు,
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...