Wednesday, September 21, 2022

DEVAKAARYASAMUDBHAVA-SUMBHA NISUMBHA-maata KAUSIKI


 శుంభస్యైచ నిశుంభస్య ధూమ్రాక్షస్య చ మర్దిని
 రూపందేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి

  శుంభ/నిశుంభులను ధూమ్రాక్షుని సంహరించి ధర్మమును కాపాడుచున్నతల్లి నా ఇంద్రియములను సైతము నిన్ను ఆరాధించుటకు సుముఖము చేసి నా అంతర్/బహిర్ శత్రువులనుండి నన్ను రక్షింపుము.

   పరాశక్తి మధు/కైటభులను,మహిషాసురునికి సంబంధించిన అసురులను,వానిని,ధూమ్రాక్షుని,చండ/ముండులను ,రక్తబీజుని సంకేతనామములుగా నున్న ఇంద్రియముల బలహీనతలను నిర్మూలించినది.ఇక మిగిలిన వారు శుంభ/నిశుంభులు.నేను అను అహంకారము-నాది అను మమకారము.
 వీటి గురించి వీటిచే ప్రభావితమైన ఇద్దరి గురించి మనము ఒకసారి మాట్లాడుకుందాము.
   మార్కండేయ పురాణములో మహర్షి సురథుడు అను రాజు రాచరికమును కోల్పోయి వేట నెపముతో ఒంటరిగా గుఋఋఅము నెక్కి అడవులకు పోయెను.
 పేరు సురథుడు.దశరథుడు మనకు దుర్తుకు వస్తాడు కద.మంచి ఇంద్రియములు కల శరీరము కలవాడు.గుర్రమునెక్కి ,మనసు మాట విని అడవులకు పోయెను.ఒక విధముగా బుద్ధిని పనిచేయనీయనిచోటు.
 కనుకనే పరహస్తగతమైన తన రాజ్యముపై భ్రాంతిని వీడలేని పరిస్థిలో నున్నాడు.
   వేరొక వ్యక్తి సమాధి.వైశ్యుడు.ధనము కొరకు భార్యాపుత్రులచే పరిత్యజింపబడి,అదవికి చేరినప్పటికిని,ప్రదేశము మారినప్పటికిని,ప్రశాంతతతో లేకయున్నవాడు.
  

 


  ముక్త కంఠముతో సకలదేవతలు పరాత్పరి ఆర్త్రత్రాణ పరాయణత్వము పదేపదే తలచుకుంటూ,వారి ఇక్కట్లను తొలగించగల తల్లిని

"సరోజదళనేత్రి -హిమగిరి పుత్రి


 నీ పదాంబుజములే సదా నమ్మినామమ్మా"

   అసలే మంచుకొండ కూతురు.కదిలివస్తూనే ఉంది.

 కోరివచ్చిన వారికెల్లను కోర్కెలొసగె బిరుదుకదా

 అతి భారమా-మమ్ము బ్రోవ అని వేడుకుంటుంటే,

   అని నేనెప్పుడన్నానురా మీతో అన్నట్లుగా,

  అటువైపుగా గంగానదిలో స్నానముచేయుటకు వెళ్ళుచున్నట్లుగా లీలను ప్రదర్శిస్తూ,

   వారిని చూసి,ఆశ్రయరక్షిణి,

  ఎవరిని ప్రార్థిస్తున్నారు?

  ఎందుకు ప్రార్థిస్తున్నారు అంటూ ప్రశ్నించగానే,

   వారు ఆర్తితో 

" నమః ప్రకృతైః భద్రాయై నియతాః ప్రణతాస్మతాం

  నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః"

   మా దురవస్థను తొలగించగలదానవు నీవే తల్లీ.

    శుంభ-నిశుంభులు బ్రహ్మ వరగర్వితులై పాతాళమున శుక్రాచార్యునిచే మూర్ధాభిషిక్తులై,సకల సామ్రాజ్యములను స్వాధీనము చేసుకొని,సంతృప్తి పడక మమ్ములను సైతము పదవీచ్యుతులను చేసి మా హవిస్సులు మాకు చేరకుండా అడ్డగించుచుండిరి.మేమును మా విధులను నిర్వర్తించలేకపోవుచున్నది.అధర్మము అగ్రతాంబూలమునందుకొనుచున్న సమయమున కార్యోన్ముఖతకు కదలిరావమ్మా ,అని ప్రార్థించసాగిరి.

 వారి ప్రార్థనను మహామాయకు ఆమె నుండి బయలువెడలుచున్న ఒక శివశక్తి విశదపరచినది.

   అపారకరుణ అడిగినదే తడవుగా తన  శరీరకోశము నుండి ఒక అద్భుతసౌందర్య రాశిని ఆవిర్భవింపచేసినది.

" బహూనియస్యా రూపాణి స్థిరాణిచ చరాణిచ

  దేవ మానుష్య తిర్యంచో బహురూపా తతఃశివాః"

  

  "పరాస్యశక్తిః వివిధైవ శ్రూయతే'"

 పరాశక్తి అనంతములగు రూపములతో భాసించుచున్నది అనవరత కరుణతో.

"  శరీరకోశాద్యత్యస్యాః పార్వత్యానిః సృతాంబికా 

   కౌశికీతి నమస్తేషు తతో లోకేషు గీయతే."


  పార్వతీదేవి నా శరీరమునుండి(కోసమునుండి) ఆవిర్భించిన నీవు కౌశికీ నామముతో కీర్తింపబడతావు అని దీవించి,నల్లని కాళిగా తాను మారి తిరిగి కైలాసమునమునకు వెళ్ళిపోయెను.



 యాదేవి సర్వభూతేషు చేతనేత్యభి ధీయతే

    అటువైపుగా వస్తున్న చండ-ముండులు అతిలోకసౌందర్యమును చూశారు.

   

  విలాసముగా కాగలకార్యమునకై అక్కడ నున్న ఒక సుకుమార లతాపుష్పములతో ఆడుకొనుచు, చండ-ముండుల ఆటలను ముగించుటకు అక్కడ హొయలుమీర తిరుగుతు


అతిమనోహరముగా అడుగులను కదుపుతున్నది. 

   అసలే చండుడు/అత్యుత్సాహమునకు సంకేతము.వానితో నున్నవాడు ముండుడు.నిలువెత్తు నిర్లిప్తత.

  అమ్మను చూడగానే వారు తమ ఏలికకు తెలియచేసి వాని పాపము మరింతపండుటకు పరికరములైనారు.

 కట్టలు తెంచుకొనిన కామము కానిపనికి కార్యోన్ముఖులను చేసినది.

   తక్షణమే వారు కౌశికి కడకు సుగ్రీవుని దూతగా కౌశికి దగ్గరకు పంపుటకు నిర్ణయించారు.

   కన్ను అనే ఇంద్రియము త్రిలోకమోహన సౌందర్యమును గాంచినది కాని మర్మమును కనుగొనలేకపోయినది.ఇంద్రియవశమైనది.అంతటితో ఆగక మరొక ఇంద్రియలౌల్యమును ప్రోత్సహించినదా అన్నట్లు ఒక వదరుబోతు వాగింద్రియమును సద్వినియోగపరచుకోలేని పరిస్థితిని కల్పించింది.


 తట్టిలేపుతున్న తామసము శుంభుని మోహమును మరింత ఎక్కువ చేస్తూ,తదుపరి సేవకు ధూమ్రలోచనుని కౌసికి వద్దకు పంపింది .వాడసలే పొగబారిన కన్నులు కలవాడు.స్పష్టముగా చూదలేని అసక్తతో నున్న వానికి దర్శనభాగ్యము/దర్ప విమోచనమో కాని అరువదివేలతో ఆదిశక్తిని బంధించుటకు బయలుదేరినాడు.భస్మము కావింపబడినాడు.తల్లివాహనమైన శిమ్హము వానిసైన్యము ఆసాంతముగా నమిలివేసినది.

 తల్లి నడిపిస్తున్న ఈ మహాయజ్ఞములో సమిథలుగా మారబోతున్న చండ-ముండుల 


మర్దనమునకై కాళి ఆవిర్భావము -చాముండి నామ ధారణము గురించి తెలుసుకుందాము.




   

 సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు,






 


   


  ముక్త కంఠముతో సకలదేవతలు పరాత్పరి అర్తత్రాణపరాయణత్వమును పదేపదే తలచుకుంటూ,వారి ఇట్టలను తొలగించగల తల్లిని
"సరోజదళనేత్రి -హిమగిరి పుత్రి
 నీ పదాంబుజములే సదా నమ్మినామమ్మా"
   అసలే మంచుకొండ కూతురు.కదిలివస్తూనే ఉంది.
 కోరివచ్చిన వారికెల్లను కోర్కెలొసగె బిరుదుకదా
 అతి భారమా-మమ్ము బ్రోవ అని వేడుకుంటుంటే,
   అని నేనెప్పుడన్నానురా మీతో అన్నట్లుగా,
  అటువైపుగా గంగానదిలో స్నానముచేయుటకు వెళ్ళుచున్నట్లుగా లీలను ప్రదర్శిస్తూ,
   వారిని చూసి,ఆశ్రయరక్షిణి,
  ఎవరిని ప్రార్థిస్తున్నారు?
  ఎందుకు ప్రార్థిస్తున్నారు అంటూ ప్రశ్నించగానే,
   వారు ఆర్తితో 
" నమః ప్రకృతైః భద్రాయై నియతాః ప్రణతాస్మతాం
  నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః"
   మా దురవస్థను తొలగించగలదానవు నీవే తల్లీ.
    శుంభ-నిశుంభులు బ్రహ్మ వరగర్వితులై పాతాళమున శుక్రాచార్యునిచే మూర్ధాభిషిక్తులై,సకల సామ్రాజ్యములను స్వాధీనము చేసుకొని,సంతృప్తి పడక మమ్ములను సైతము పదవీచ్యుతులను చేసి మా హవిస్సులు మాకు చేరకుండా అడ్డగించుచుండిరి.మేమును మా విధులను నిర్వర్తించలేకపోవుచున్నది.అధర్మము అగ్రతాంబూలమునందుకొనుచున్న సమయమున కార్యోన్ముఖతకు కదలిరావమ్మా అని వేడుచున వారి ప్రార్థనను మహామాయాకు ఆమె నుండి బయలువెడలుచున్న ఒక శివశక్తి విశదపరచినది.
   అపారకరుణ అడిగినదే తడవుగా తన శరీరకోసము నుండి ఒక అద్భుతసౌందర్య రాశిని ఆవిర్భవింపచేసినది.
" బహూనియస్యా రూపాణి స్థిరాణిచ చరాణిచ
  దేవ మానుష్య తిర్యంచో బహురూపా తతఃశివాః"
  
   పరాస్యశక్తిః వివిధైవ శ్రూయతే'
 పరాశక్తి అనంతములగు రూపములతో భాసించుచున్నది అనవరత కరుణతో.
"  శరీరకోశాద్యత్యస్యాః పార్వత్యానిః సృతాంబికా 
   కౌశికీతి నమస్తేషు తతో లోకేషు గీయతే."

  పార్వతీదేవి నా శరీరమునుండి(కోసమునుండి) ఆవిర్భించిన నీవు కౌశికీ నామముతో కీర్తింపబడతావు అని దీవించి,నల్లని కాళిగా తాను మారి తిరిగి కైలాసమునమునకు వెళ్ళిపోయెను.


 యాదేవి సర్వభూతేషు చేతనేత్యభి ధీయతే
    అటువైపుగా వసున్న చండ-ముండులు అతిలోకసౌందర్యమును చూశారు.
   
  విలాసముగా కాగలకార్యమునకై అక్కడ నున్న ఒక సుకుమార లతాపుష్పములతో ఆడుకొనుచు, చండ-ముండుల ఆటలను ముగించుటకు అక్కడ తిరుగు అతిమనోహరముగా అడుగులను కదుపుతున్నది. 
   అసలే చండుడు/అత్యుత్సాహమునకు సంకేతము.వానితో నున్నవాడు ముండుడు.నిలువెత్తు నిర్లిప్తత.
  అమ్మను చూడగానే వారు తమ ఏలికకు తెలియచేసి వాని పాపము మరింతపండుటకు పరికరములైనారు.
 కట్టలు తెంచుకొనిన కామము కానిపనికి కార్యోన్ముఖులను చేసినది.
   తక్షణమే వారు కౌశికి కడకు సుగ్రీవుని దూతగా కౌశికి దగ్గరకు పంపుటకు నిర్ణయించారు.
   కన్ను అనే ఇంద్రియము త్రిలోకమోహన సౌందర్యమును గాంచినది కాని మర్మమును కనుగొనలేకపోయినది.ఇంద్రియవశమైనది.అంతటితో ఆగక మరొక ఇంద్రియలౌల్యమును ప్రోత్సహించినదా అన్నట్లు ఒక వదరుబోతు వాగింద్రియమును సద్వినియోగపరచుకోలేని పరిస్థితిని కల్పించింది.

  శబ్దముచేయున్న పరమాద్భుతములకు ప్రణామములు.
" యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా"

  సుగ్రీవుడు దూతగా దేవి సమీపించినాడు.వాని వాచాలత్వమే ,వాని అవివేకమే,వానికి ముక్తినిచ్చినదేమో.తామస రాజస గుణములు ఒకవైపు-మూర్తీభవించిన శాంతము మరొకవైపు.
 ఆడుకొనుచున్నది తల్లి వాడి మాటలతో ఆదుకోవాలనే నేమో.
 వాడు శుంభుని మాటగా కౌశికితో,
" త్రైలోక్యవరరత్నాని మమ వశ్యాన్యసేషతః
  తదైవగజరత్నం చ హృత్వా దేవేంద్రవాహనం'
  మూడులోకములలోని ఉత్తమ వస్తువులన్నియును నా వశమై యున్నవి.కనుక
 " పరమైశ్వర్యమతులం ప్రాప్స్యసే మత్పరిగ్రహాత్
   ఏతద్బుద్ధ్యా సమాలోచ్య మత్పరిగ్రహతాం ప్రజ"

   ఐరావతమును,తెల్లనిగుర్రమును సమస్త రత్నములను వశపరచుకొనిన మేము నిన్ను పరిగ్రహించుట వలన నీవు పరమైశ్వర్యమునందగలవు.అని నిర్దేశించెను.
 అందులకా పరమేశ్వరి మనసులో నవ్వుకొని,దూతతో
 ప్రశాంతముగా తాను చేసికొనిన బాస గురించి,

 " యో మాం జయతి సంగ్రామే యో మే దర్పం వ్యపోహతి
 యో మే ప్రతిబలో లోకే స మే భర్తా భవిష్యతి"

    ప్రతిన వినిన దూత తన కర్తవ్యముగా ఆ మాటను తన ఏలికలకు చేరవేయుటకు కదలకుండా మరింత తామసముతో,
  అవలిప్తాని మైవం త్వం దేవీబ్రూహి మమాగ్రతః
  త్రైలోక్యే  కః పుమాంసి తిష్టేత్ అగ్రే శుంభఃనిశుంభయోః"
  ఎంతపొగరుబోతు తనముతో నా ఎదుట ఇట్లు మాటలాడుచున్నావు.దేవీ! మూడులోకములందు చూసినను మా శుభ-నిశుంభల సరిగల పరాక్రమవంతుడు కానరాడు అని మరొక హెచ్చరిక చేసెను.ఇంద్రాదులకు సైతము జయించలేని శక్తివంతులైన మా ఏలికను ఆడుదానివి జయంచలననుకొనుట ఎంతటి అవివేకము? అని హెచ్చరించెను వెనుదిరిగెను.

   
 సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు,





 

   

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...