Tuesday, September 27, 2022

PAAHIMAAM MAHISHAASURAMARDINI-RAMYAKAPARDINI-02

  "శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి

 చిదగ్నికుండ సంభూతా-దేవకార్య  సము సముద్యతా"

 అని శ్రీలలితాసహస్ర రహస్యనామము నుతించుచున్నది.

  అమ్మ చిత్ అగ్ని కుండమునుండి ఉదయిస్తున్న అసంఖ్యేయ సూర్య కాంతుల ప్రకాశముతో ఆవిర్భవించినది.శివుని త్రినయనమునుండి ప్రజ్వలింపచేసిన యజ్ఞకుండమునుండి అమ్మ అత్యంత ప్రకాశవంతముగా ఆవిర్భవించినది.సర్వదేవతా శక్తులకు  తన స్పర్శచే ,,సామర్థ్యమును ప్రసాదించినది.ముచ్చటగా తిరిగి వారిచ్చిన శక్తులను లాంఛనముగా తాను స్వీకరించినది.

 అంతా అమ్మ లీలా వైభవము

 ఇక్కడ అసురీశక్తులు-అద్వితీయముతో పోరాడుటకుసన్నిద్ధమగుచున్నవి.


 " నాదం తనుమనిశం శంకరం"-శుభప్రదమైన ఓంకారము ఒక పక్కన "ఓంకార పంజరశుకీ "గా దర్శనమిస్తుంటే,

 ప్రత్యర్థిగా

  "నాదం తమసనిశం భీకరం" అంటూ విచక్షణతను మరచిన హుంకారము,

   హుంకారము-ఓంకారముతో చేయు యుద్ధము,

   అంతేకాదు

 కన్నుపొడుచుకున్న కానరాని చీకటి-ఉదయిస్తున్న అనంత సూర్య బింబములతో చేయబోవుతున్న సమరము అమరమే కదా

   ." మహిషాసుర నిర్ణాశి  భక్తానాం సుఖదే నమః

 రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి." 


 సూర్య-ఇంద్ర-అగ్ని-వాయు-హంద్రుల యొక్కయు,యమ-వరుణల-యొక్క అధికారమును తానాక్రమించుటయే కాక,హవిస్సులను అందనీయక హింసాప్రవృత్తియే  లక్ష్యముగా కలవానిని సంస్కరించుటకు సింహవాహిని,

 " సమ్మానితా ననాదోచ్చైః సాట్టహాసం ముహుర్ముహుః

   తస్యా నాదేన ఘోరేణ కృత్స్నమాపూరితం నభః"

  నభము/-ఆకాశము-శబ్దము అవిభాజ్యములు.ఆ దేవి అట్టహాసము తో సముద్రములు కంపించెను.భూమి గడగడలాడెను.

 మహిషుని నయనములు-కర్ణములు కొంత సంస్కరించబడినవా అన్నట్లు తమవైపు పరుగెత్తి వచ్చుచున్న ధ్వని వానిని చేరినది.

 " దిశో భుజ సహస్రేణ సమంతాత్ వ్యాప్త సంస్థితాం "అనంతహస్తములతో ఆకాశమంతయును వ్యాపించుయున్న

 "దేవిని "వాడి నయనము చూడగలిగినది.

 "బుద్ధిః కర్మానుసారిణి" కనుక

 వాని మూర్ఖత్వము యుద్ధమునకు సిద్ధము కమ్మంది.

 శబ్దము వచ్చిన వైపుకు వాడు పరుగులు తీస్తూ,ఆ ఇదియే ఆ "ఆడుది" అంటూ తన సైన్యముతో పరుగులు ప్రారంభించాడు.

 ఆడుది-ఆడించునది అయిన 

అమ్మది కారుణ్యము-అసురుని కఠినత్వము.

" హయానాంచ వృతో యుద్ధే తత్రాభూన్మహిషాసుర తోమరై బిందిపాలైశ్చ శక్తిభిః ముసలై తథా" 

వాడు గుర్రములతో,ఏనుగులతో,రథములతో తన సైన్యమును సమీకరించుకుని అమ్మను గెలుచుటకు పరుగులు తీస్తున్నాడు.ప్రయాస పడుతున్నాడు.కాని, ఇక్కడ గుర్రములు మనసుతో కలిసి ఇంద్రియములు ఆడుచున్న ఆటలు.ఏనుగులు స్పర్శ అను ఇంద్రియ మోహమును వీడలేని తనువులు.చలనములేని,నిద్రించుచున్న వివేకము,జాగృతము కాలేని విచక్షణ,కర్తవ్య రహితము ఆ రథము.అవి అనేకానేకములు తన బలగమను నమ్మకముతో అసురుడు అమ్మపై దండెత్తుచున్నాడు. 

వాడి రథ-గజ-అశ్వ -పదాతి బలగమే కాదు,వాటితో బాటుగా ,వెంటనున్న,

 చక్షురుడు

 చామరుడు

 మహా హనువు

 బాహ్కలుడు

 ఉగ్రదర్శనుడు సైతము తమోమోహితులే.మమకార పీడితులే.మదోన్మత్తులే.

  


 రాక్ష సమూహమంతయు తోమరములు-భిందిపాలములు-శక్తులు ముసలములు-ఖడ్గములు-పట్టిసములుమొదలగు వివిధాయుధుములను దేవిపై ప్రయోగింప పూనుకొనగా,దేవి వాటిని ఖండించివేసెను.

" చచాసుర సైన్యేషు వనేష్వివ హుతాశనః

  నిఃశ్వాసాన్ముముచే యాంశ్చ యుధ్యమానా రణేంబికా"

   నిర్మదా-మదనాశనీ-నమోస్తుతే.

 మహిషాసురిని మదమును నాశనము చేయుటకు, 

 


    రాక్షస సైన్యమునందు అడవిలో కారుచిచ్చువలె సంచరించుచు,

 " త ఏవ సద్యః సంభూతా గణాః శత సహస్రః"

   తన నిట్టూర్పులతో అప్పటికప్పుడు సృజించెను.

  ఇరు పక్షముల సైనికులు ఇనుమడించిన శక్తులతో ఆయుధములను పట్టుకుని పోరాడసాగిరి.

   తన సైన్యము క్షీణించుచుండుటచే తన్నుకొస్తున్న తామసము,తడబడనీయకుండా ,మహిషుని,

 దున్నపోతు రూపమును ధరింపచేసి,

 " కాంశ్చిత్తుండ ప్రహారేణ ఖురక్షేపైస్తథా పరాన్

  లాంగూలతాడితాంశ్చాన్యాన్శృంగాభ్యాచవిదారితాన్"


   కొందరిని ముట్టెతో కొట్టి,మరికొందరిని గిట్టలతో మెట్టి,తోకతో చుట్టి,కొమ్మకోరతో గ్రుమ్మి,విధ్వంసము చేస్తున్న వానిపై 

 'రాగ స్వరూప పాశాఢ్యా" పాశముతో,కట్టిపడవేయగా,వాడు వివిధరూపములను మార్చుకుంటూ,అమ్మ దాక్షిణ్యమును అర్థము చేసుకొనలేక, 

వానికి కావలిసినది తల్లి "క్రోధాకారాంకుశోజ్జ్వల"

గా 

 వెకిలిగా నవ్వుతూ  గిట్టలతో కొండలను చండిపై దొరలించెను.

వాడిచే అమ్మ దొరలింపచేసినది మామూలు కొండలను కాదు.అశేష పాపరాశులను అన్నట్లుగా

 


 అనుగ్రహ సమయమాసన్నమయినదని,దేవి 

 " ఏవ ముక్త్వా సముత్పత్య సా..రూఢా తం మహాసురం 

   పాదేన క్రమ్య కంఠే చ శూలేనైన మతాడయత్"అంటూ,


   చెంగున వానిపైకెగిరి,వానిని కాలికింద పడవైచి,తొక్కి శూలము గొంతులో గ్రుచ్చెను.

   హిమవంతుడు ప్రేమతో కానుకగా నిచ్చిన  సింహము వానిపైకురికి తనపని తాను చేసుకుపోతున్నది.

  ఆ నిక్కిన సగము శరీరము తోడనే,

మహిషుడు దేవిపై యుద్ధమునకు పూనగా దేవి కత్తితో వాని శిరమును ఖండించి,ముక్తిని ప్రసాదించెను.

అయిమయి దీనదయాలు తయా కృపయైవ త్వయా భవితవ్యముమే

 అయి జగతో జనని కృపయాసి యథాసి తథానుభితాసిరతే

 యదుచితమత్ర భవత్యురరి కురుతాత్ ఉరుతాపం అపాకురుతే

 జయజయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే

   సర్వం శ్రీమాతాచరణారవిందార్పణమస్తు.



  

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...