Thursday, September 1, 2022

SARVARAKSHAAKARACHAKRAMU-06

శ్రీచక్ర షష్టావరణదేవతాః
సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ,శ్రీచక్ర షష్టావరణదేవతాః
సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకరచక్రస్వామినీ, నిగర్భయోగినీ,

   సర్వరోగహరచక్రము
   **********************
" సర్వజ్ఞా సాంద్రకరుణా" తల్లి అనుగ్రహముతో కులోత్తీర్ణ యోగినులు సాధకుని కుండలిని శక్తిని జాగృతమొనర్చీ,చక్రేశ్వరికి కృతజ్ఞతావిష్కారము చేసి,సాధకుడు,శివశక్తి సామీప్యమునకై,తదుపరి ఆవరనమైన "సర్వరక్షాకర చక్రము"లోనికినిగర్భయోగినుల సహృదయతతో ప్రవేశించుచున్నాడు.
  ఈ ఆవరనము పదిత్రికోణముల సంకేతముగా రక్షింపబడుచున్న అంతర్దశారచక్రముగాను కీర్తిస్తారు.
   సగుణ-నిర్గుణ సమాహారమే 10 సంఖ్యగా కనుక మనము అన్వయించుకోగలితే అంతా బ్రహ్మానందమే.తమస్సనకు చోటులేదు.అంతా ప్రకాశమయమే.

 సర్వసౌభాగ్యప్రదములోని పది శక్తులను పదివాయువులుగాను,సర్వరోగహరచక్రములోని పదిశక్తులను పది అగ్నులుగాను పరిగణించి దేహి జీర్ణక్రియకు అనుకూలశక్తులుగాను నిర్వచిస్తారు.
 సాధకునికి వ్యాధి-పాపము అను రెండు అడ్దంకులు ఇంకను  వీడలేదు కనుక తాను అపరిమితము లోని కొంతభాగమును మాత్రమే నని అర్థముకాకున్నది. సాధకునకు వ్యాధి-పాపము ఇంకను పూర్తిగా తొలగిపోలేదు.వానిచే బాధింపబడుతున్నాడు.రెండును ఒకదానితో మరియొకటి ముడిపడి భవబంధకములగుచున్నవి.సంసారభ్రమణమనే భవరోగములో పడవేయుచున్నవి.ఆ విషయమును మనకు తెలియచేసే శక్తి సర్వజ్ఞ.
"భావజ్ఞ భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తినీ" అనుగ్రహము మాత్రమే సాధకునికి వాని సంకెలను తొలగించకలదు.
    ఈ ఆవరణము ఈప్సితఫలప్రదము.ఉపాధి స్వరూప-స్వభావములు బహుముఖములుగా చర్మచక్షువులకు గోచరించవచ్చును కాని వానిలో అంతర్లీనముగా దాగిన చైతన్యశక్తి మాత్రము లోకాతీత-గుణాతీత-కాలాతీత "చిత్శక్తి".సర్వజ్ఞ-సమస్తము తానుగానున్నది.జీవులను ఉద్ధరించగలిగే సర్వశక్తి స్వరూపిణి.మోహసాగరమును ఈదిరాగల-బంధపర్వతములను తెంచుకోగల ఈశిత్వమును ప్రసాదించగల సర్వైశ్వర్యప్రదాయిని.
 వహ్నికలలుగా కీర్తింపబడు ప్రకాశక శక్తులు సాధకుని మోహాంధకారమును పూర్తిగా తొలగించివేసి వెలుగురేఖలను మార్గమును చూపగలుగు ఆనందప్రదాతలు.అంతే కాదు సాధకుని ఆనందమును ఎల్లవేళల చేజారిపోకుండా పరిరక్షించే సర్వరక్షాస్వరూపిణులు.
  సమస్త బ్రహ్మాండములకు ఆధారమై (సూత్రాత్మకముగా తానుండి) పరిభ్రమింపచేయుచున్న జగదీశ్వరికి ప్రతిరూపమైన త్రిపురమాలిని దేవికి కృతజ్ఞతావిష్కారముగా నమస్కారము చేస్తూ,ఏడవ  ఆవరణములోనికి సాధకుడు సర్వరోగహర చక్రము దిశగా తన అడుగులను కదుపుతున్నాడు.
   శ్రీమాత్రే నమః.

    

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...