Monday, October 10, 2022

NA RUDRO RUDRAMARCHAYAET-03 (sIVAANAMDALAHARI)

 త్రయీ-వేద్యం హృద్యం త్రి-పుర-హరం ఆద్యం త్రి-నయనం

జటా-భారోదారం చలత్-ఉరగ-హారం మృగ ధరమ్

మహా-దేవం దేవం మయి సదయ-భావం పశు-పతిం

చిత్-ఆలంబం సాంబం శివమ్-అతి-విడంబం హృది భజే 3


 మూడవ శ్లోకములో ఆదిశంకరులు వారి నివాసము మన హృదయస్థానము అని తెలియచేసి,దానిని గుర్తించుటకు కావలిసిన త్రినేత్రము/జ్ఞాన నేత్రము కేవలము త్రయీవేద్యం అని సులభమార్గమును అందిస్తున్నారు.నీ చర్మచక్షువులు కానిలేని ఆ,

1.చిత్-ఆలంబం-తేజో స్తంభము-అరుణాచలేశ్వరుడు

2.త్రిపురహరం-త్రిగుణములను అసురులను మట్టుబెట్టి తురీయస్థితికి చేర్చగలవానిని

3.జటభార ఉదారం-ఉదారతతో తన జటాభారములో గంగను బంధించి లోకహితము చేసినవానిని

4.చలత్ ఉరగహారం-భయకంపితమైన(వాసుకిని) తన మెడలో ధరించినవానిని,

 సంసారవిషసర్పములను చూచినను నిశ్చలత్వమును కలిగియుండు ధైర్యమును ప్రసాదించువానిని

5.మృగధరం-అని క్షణము/అశాశ్వతమైన ప్రాణరక్షణకు/ఉపాధిని రక్షించుకొనుటకు పరుగులు తీయు జీవులకు నిశ్చలత్వమును తన రక్షణలో అనుగ్రహించువానికి

 ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీటిని అలంకారముగా భావించి మోసపోకుసుమా.ఇవన్నియు మన చంచలస్వభావాలే సుమా.

 మనకు కనువిప్పు కలిగించుటకు మాత్రమే కనువిందుగా కనిపించుచున్న ఆ మహాదేవుడు/ఆదిదేవుడు

 అతివిడంబం-ఆనవాలు లేని అనంతశక్తి అని తెలియచేయుచున్నారు.


 వేదములలో రెండవదైన యజుర్వేదములోనిరుద్రాధ్యాయము వారి ప్రాభవమునకు పట్టముకట్టుచున్నది.విశ్వాధికావేదవేద్య గా తల్లి వేదములచే పొగడబడుచున్నది.త్రయీవేద్యముగాను ప్రస్తుతింపబడుచున్న

 అట్టి హృద్యమైన శివానందము మన మనస్సులందు అనవరతము విహరిస్తు,మనలను అనుగ్రహించునుగాక.


  ప్రస్తుత శ్లోకములో ఆదిసంకరులు స్వామి యొక్క నిరాకార తత్త్వమును-సాకార తత్త్వమును ప్రస్తుతించుచున్నారు.

 సాకారతత్త్వమును ప్రస్తుతించునపుడు అవన్నియును స్వభావమునకు సంకేతములు తక్క అన్యము కాదు.

 స్వామి-ఆద్యుడు.వేదములకన్న ముందు ఉన్నవాడు.వేదములచే ప్రస్తుతింపబడు వాడు.వేదము అను పదమునకు నిజము అను అర్థము కూడా కలదు.అందులో త్రయీ వేద్యము ముమ్మాటికి స్వామి ఆద్యుడు అని చెప్పకనే చెప్పుచున్నాడు.

 ఒకేఒక మహత్తు సృష్టిరచనకు తన నుండి మరొక శక్తిని కల్పించి,అనగా అద్వైతము ద్వైతముగా మారి,తాను నిశ్చలనముగానుండి తన శక్తిని చైతన్యశక్తిగా మలచి పంచకృత్యములను లీలగా జరుపుచున్నాదను సత్యమును సాంబం అని ఒక్క మాటలో తెలియచేసారు.

 ముఖ్యమైన విషయము.పదము ఆదిశంకరులు ప్రస్తావించినది-అతివిడంబం.

 అదే నిరాకార-నిర్గుణ-నిర్మల తేజోరూపము.దానికి మద్దతుగా 'చిత్-ఆలంబం" ప్రకాసమునిండిన ఆలంబనముగా "అరుణాచలేశుని"సంకేతించారు.

 అంతే కాదు స్వామిని పశుపతిం అని,ప్రత్యేకంగా చెప్పారు.

 పశ్యతీతి ఇతి పశుః-చూడగలుగునది పశువు.దానిని రక్షించేవాడు పశుపతి.పాశముతో కట్టబడినది పశువు మరికొందరి అభిప్రాయము.

 చూడగలవు కాని దానిన్ని మనసుకు చేర్చి భావమును అర్థము చేసికొనలేనిది.అంతే,జ్ఞానము లోపించిన దర్శనశక్తి గలది.

 కనుకనే నిరాకారమైన శివము మనకు సాకారముగా అదియును,

ఉరసి గచ్ఛతి ఉరగః-పొట్టతో పాకునది పాము.తనకాళ్ళపై నిలబడలేనిది.అనగా స్థిరత్వములేనిది.అదియే సంసారసర్పము.దానిని మెడలో అలంకారముగా ధరించినవాడు.

 మృగధరం-భయపడు స్వభావము కలది.ప్రాణమును రక్షించుకొనుటకు పరుగులు తీయునది.దారుకావన సంఘటనము పురాణకథనము ప్రకారము.

 స్వామి కేశములు మంత్రమయములు.హరికేశాయ.పచ్చదనమునకు ప్రతీకలు.పరిపాలన దక్షములు.వాటిమధ్య గంగమ్మను బంధించి పరమపునీతను చేసినాడు.చలించు నాగులను,చంచలముగా పరుగులు తీయు అరిషడ్వర్గములను తన స్పర్శచే నిశ్చింతగా నుంచగలిగినవాడు అయిన శుభంకరుని,

 హృదిభజేం-మరొక పూజావిశేషమును 

 వివరిస్తూ ,చిత్తశుద్ధిలేని శివపూజను విస్మరించి,స్వామి లీలాగునవిసేషములను ఏ విధముగా అపౌరుషేయములైన వేదములు ప్రస్తుతించుచున్నవో గ్రహించి ధన్యతనొందగలరని,అన్యాపదేశముగా /తాను అర్థిస్తున్నట్లుగా మనలకు అందచేసారు.

 సర్వం పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పనమస్తు.

 తప్పులుంటే సవరించండి మాస్టారు.నమస్తే. 

 సర్వం పార్వతీ-పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...