Saturday, October 29, 2022

NARUDRO RUDRAMARCHAYAET-21(SIVAANAMDALAHARI)

 శ్లో :  ధృతి-స్తంభాధారం దృఢ-గుణ నిబద్ధాం సగమనాం

విచిత్రాం పద్మాఢ్యాం ప్రతి-దివస-సన్మార్గ-ఘటితామ్

స్మరారే మచ్చేతః-స్ఫుట-పట-కుటీం ప్రాప్య విశదాం

జయ స్వామిన్ శక్త్యా సహ శివ గణైః-సేవిత విభో     21


స్వామి దీనావస్థను తొలగించదలచినట్లున్నాడు కనుక ప్రస్తుత శ్లోకములో ఆది శంకరులు మాతాపితరులు ప్రమథగణములు సేవించుచుండగా వచ్చి తన హృదయనివాసము చేస్తూ ఆశీర్వదించమని అభ్యర్థిస్తున్నాడు. హే శివా! సన్మార్గ ఘటితా-సగమనా ఈ దీనుడు సన్మార్గములో నున్న స్థలము వైపునకు సాగిపోవాలనుకుంటున్నాడు.అది జరగాలంటే, హే విభో! గణసేవిత-ప్రమథగణములు నిన్ను నిశ్చలభక్తితో సేవించుచుందగా, శక్త్యాయచ సహ-అమ్మను కూడి వచ్చి, జయ-విరాజిలుము. అందుకు అనుకూలముగా నా మనసును నీ అనుగ్రహము మార్చుచున్నది. నా మనసు ప్రస్తుతము ఎలా ఉన్నదంటే ధైర్యము అనే స్తంభమునునకు సద్గుణములను తాటితో బంధించబడి యున్నది. పద్మాకారములో విస్తరించియున్నది. అంతే కాదు-తెల్లని వస్త్రము.శుధ్ధ సత్వ మను పరిశుభ్రతతో ప్రకాశించుచున్నది. విచిత్రమ్మ్-వివిధ ఉపచారములతో నిన్ను సేవించాలనుకుంటున్నది. స్వామి నీ అనుగ్రహమును గుర్తించలేనివారికి , కరిగిపోవు/పుచ్చిపోవు స్తంభముపై విషయభోగములను తాళ్ళతో కట్టబడి,ఇంద్రియసౌఖ్యములను చిత్ర విచిత్రములచే ఆకరింపబడుతూ,తళుకుబెళుకు వస్త్రమును కప్పుకొని అందమైన గుడారము వలె అనిపించవచ్చును. కాని నా మనసునకు-ఈ గుడారమునకు ఒక పోలిక కలదు.అది ఏమిటంటే దానిని ఆ ప్రదేశము నుండి తొలగించి,సముచిత ప్రదేశములకు తీసుకుని వెళ్ళవచ్చును. కనుక శివా పశ్చాత్తముతో నున్న మరింత అనుగ్రహించి,నా హృదయ పద్మమునందు తల్లి ప్రమధగణములతో సహా నివసిస్తూ,ధన్యతనొందనిమ్ము. పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు.




No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...