Friday, October 7, 2022

NARUDRO RUDRAMARCHAYAET-01(SIVAANAMDALAHARI)1

కలాభ్యాం చూడాలంకృత-శశి కలాభ్యాం నిజ తపః-

ఫలాభ్యాం భక్తేశు ప్రకటిత-ఫలాభ్యాం భవతు మే |

శివాభ్యాం-అస్తోక-త్రిభువన శివాభ్యాం హృది పునర్-

భవాభ్యాం ఆనంద స్ఫుర-దనుభవాభ్యాం నతిరియమ్ ‖

******


 ఇయం-ఏ అద్భుతశక్తి,బహుముఖములుగా ప్రకటిత మగుచు,ప్రకాశించుచున్నదో దానికి నేను నమస్కరించుచున్నాను అంటున్నారు శ్రీ జగద్గురువులు.

 ఆ శక్తియే,

1.శివాభ్యాం-శివము/శుభములను-సంతోషము అనుగ్రహించుటకు,తద్వారా

2.స్పురత్-తలచినంత మాత్రముననే

3.ఆనంద అనుభవాభ్యాం-మనకు ఆనందానుభూతిని కలుగచేయుటకు,

  ఇక్కడ మనమొక విషయమును గమనించాలి.

ఆనందము అన్న పదము సంతోషమునకన్న భిన్నమా లేక సమానమా?

 సంతోషము లౌకికము.అది మనలో జనించిన కోరిక తీరునపుడు జనిస్తుంది.క్రమముగా ఆ వస్తువుపైగాని.కోరికపై గాని మోజు తీరన వెంటనే అది తెచ్చిన సంతోషము కూడా మసకబారి /కనుమరుగైపోతుంది.తాత్కాలికమైన సంతోషముకన్న ఆనందము విభిన్నముగా మనము భావిస్తే కాలాతీత,గుణాతీత,దేశాతీత మనలోని మనను తెలుసుకొనినప్పుడు కలిగే నిర్వికార నిశ్చల నిర్గుణ నిస్తులతత్త్వము ఆనందము.

 ఏ మహద్శక్తి అనిర్వచనీయానందమును అనుగ్రహించకలదో దాని,

స్వరూపము-శివాభ్యాం

స్వభావము-శివాభ్యాం

సాక్షాత్కారము-శివాభ్యాం

సామీప్యము-శివాభ్యాం

సాయుజ్యం-శివాభ్యాం

 అని నేనుచెప్పుచున్న మాటలు కాదు,సాక్షాత్తు,

కలాభ్యాం-వేదములచే ప్రస్తుతింపబడుచున్న కాదనలేని సత్యము.

 ఒకేఒక మహాసక్తి మనపై కరుణించి రెండుగా,

శివగా/శివాగా వెరసి

 శివాభ్యాం గా ,

అ గా/ క్ గా వెరసి క గా/వాగర్థములుగా నెలకొన్నది.

 ఆ చిత్శక్తి మనలను అనుగ్రహించుటకు ఒకరికొరకు మరొకరు తపించి పరస్పరము అనుగ్రహించుకొనినారునారు.

 పరస్పరనుగ్రహాభ్యాం.ఒకరు అయ్య-మరొకరు అమ్మ.


 జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం"

  మనలను అనుగ్రహించుటకు రెండు రూపములుగా        మనలను తీర్చిదిద్దు దయాసముద్రులు వారు.

 దానికి సంకేతమే,

 వారు చూడాలంకృత శశికలాభ్యాం గా కీర్తింపబడుట.

  వారు శిరమున చంద్రకలను అలంకరించుచున్నారు.

  దక్షునిచే శాపగ్రస్తుని శిరోధారణముతో పునీతుని చేశారు.

అది దోషములెన్ని చేసియున్నను,పశ్చాపముతో తమను శరణువేడిన 

చంద్రునివృద్ధి/క్షయరహితునిగా సభాగమును మలచి,వృద్ధిక్షయములను జగములకు అనుగ్రహించి(స్థితికార్యమునకై)

  రక్షించినారు 

 మూఢులైన మా అజ్ఞానము మాలోనే ఉన్న మీ చైతన్యమును గుర్తించలేక ఎపుడో ఒకసారి మీ కరుణచే తలచుకొనిన సైతము,అనుగ్రహిస్తున్నారు.

 ఒక ప్రదేశమని కాదు,ఒక ఉపాధి అనికాదు,ఒక విధానమని కాదు.అపారకరుణాజలధి నుండి జనించుచున్న లహరులు

 అస్తోకాం-సమస్తమును,


 త్రిభువనములను సైతము పునీతము చేస్తున్నవి.అందులో ఒక చిన్న పిపీలికము వంటి నన్ను సంస్కరించుట మీకు ఏమంత కష్టమైన పనికాదు.

 ఓ పరమేశా నా విన్నపమును స్వీకరించి,నన్ను అనుగ్రహింపుము.

 సర్వం పార్వతీపరమేశ్వర చరణారవిందార్పణమస్తు.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...