Saturday, February 25, 2023

SIVATANDAVASTOTRAM(SRIYAI CHIRAAYA JAAYATAAM)-05

 సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర

ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః |
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః || 5 ||

  మొదటి శ్లోకములో శివమును విస్తరింపచేయవలెనన్న ఆకాంక్షను వ్యక్తపరచిన సాధకుడు ప్రస్తుత శ్లోకములను శ్రియమును /సంపదలను స్వామి తాండవము విస్తరింపచేయవలెనన్ను ఆకాంక్షను తెలుపుతున్నాడు.
  ఇప్పటివరకు మనతో స్వామి జటలను,గంగమ్మను,కరిచర్మమును,డమరుకశబ్దమును ఆహార్యములో చూపిస్తూ,అగ్నిసోమాత్మకుని అర్థనారీశ్వరునిగా ఆరాధిస్తూ ఆ పవిత్ర తాందవము సకల చరాచరములను ఏ విధముగా చైతన్యము చేస్తున్నదో వివరిస్తున్న సాధకుడు మనకు దేవతలను వారి వినయ నమస్కారములతో రాలిపడిన పుప్పొడులతో వింతరంగులో ప్రకాశించుచున్న స్వామి పాదపీఠమును సాక్షాత్కరింపచేయుచున్నాడు.

 

 సాథకుని ఆకాంక్ష స్వామి సంపదలను సకలజగములపై విస్తరింపచేయుట.
 ఆ విషయమును నాలుగు విశేషములద్వారా మనకు తెలియచేస్తున్నాడు.
 స్వామి సిగను కీర్తించునప్పుడు చంద్రుని చకోరబంధువుగా. వెన్నెలతాగి ప్రాణమును నిలుపుకొనునది చకోరపక్షి.దానిని అనుగ్రహించు శక్తిని పొందిన చంద్రుని సిగపూవుగా ధరించినవాడు స్వామి.శాపవశమైన చంద్రుని క్లేశనాశనునిగా అనుగ్రహించిన దయాళువు అదే దయను అనగా మానవాళి ఏ విధముగా స్వామి కరుణను గ్రహించగలరో ఆ విధముగా అనుగ్రహించు పరమాత్మ తన కదలికలచే కరుణించును గాక.

 స్వామి తన జటలకు ఆ భరణములుగా పాములను అలంకరించుకొనినాడట.మనము కిందటి శ్లోకములో గళమున అలంకరించుకొన్న పాములు జటలలో లోనికి చేరుట కాలగమనమునకు సంకేతముగా చెప్పుకొనినాము.ఇప్పుడు అవి గట్టిగా చుట్టబడియున్నవి.అనగా స్వామి కాలమును సైతము నియంత్రించగలవాడు.
  స్వామి పాదములు పుప్పొడితో నిండియుండి,బూడిద వర్ణముతో ప్రకాశించుచున్నది.
 బూడిద వైరాగ్య చిహ్నము.అదియును 
 లేఖ-దేవతయొక్క
 అశేషలేఖ-సమస్త దేవతలయొక్క
 సహస్రలోచన లేఖ-వేయి/అనంతకన్నులు కల ఇంద్రాది దేవతలయొక్క శిరముల నున్న పుష్పములనుండి వ్రాలిన ధూసరమట.
 అంటే విషయవాసనలను వీడిన పుష్పములు భక్తి-అర్పణము అనెడి దాని పుప్పొడితో స్వామి పాదపీఠమును అర్చించుచున్నది.


   

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...