Thursday, February 23, 2023

SIVATANDAVASTOTRAMU-(ETU VASTUNI-MANOVINODAM)-03

 3.ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర

స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే |

కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది

క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || 3 ||


  శివములను సర్వత్ర విస్తరింపచేయు శివతాండవమును సదా నా మనసులో చూడాలనే ఆకాంక్షను వ్యక్తము చేసిన సాధకుని పురాకృతపుణ్యమా అనునట్లుగా అగ్నిసోమాత్మకమిన శివస్వరూపము అర్థనారీశ్వరముగాను సాక్షాత్కరించుచున్నది.తనకోరికను తీర్చుటకు ఆలంబనములైన సంఘటనలను సైతము వ్యక్తము చేయుచున్నది.అవి స్వామి అమ్మతో కలిసి జతగా చేయు తాండవము ద్వారా కరుణావీక్షనములను ప్రసరింపచేయుచు దుర్భరమైన ఆపదలను దూరముచేయుచున్నాడట.అంతే కాదు తనకున్న వైరాగ్యమునకు-వ్యాపకత్వమునకు గుర్తుగా దిగంబరుడిగా ప్రకాశించుచున్నాడు.అన్నీ తానే-అంతా తానైన చైతన్యము సమస్త జగములను జాగృతపరచుచున్నవేళ సమస్త సంతతి ప్రమోదముతో నిండియుండునుకదా.దానికి కారణమైన శివశక్త్యాత్మకమైన చైతన్యము నన్ను వీదకుండుగాక.


 స్వామి స్వరూపమునకు సంకేతము దిగంబరములను అనగా దిక్కులనే వస్త్రములుగా ధరించినవానిని-అఖండుని దర్శిస్తూ,దుర్లభమైన ఆపదలను సైతము దగ్గరికి చేరనీయని దయావీక్షణము నన్ను ఆశీర్వదించుగాక.

   ఏక బిల్వం శివార్పణం. 


 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...