Saturday, March 4, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM-INTRO

 


       ఆదిత్యహృదయము 

       *************

 "ఏకం సత్ విప్రా బహుధా వదాతి"


   వాల్మీకి విరచితమైన "శ్రీమద్రామాయణము" లోని యుద్ధకాండమునందు "ఆదిత్యహృదయస్తోత్రము"  అగస్త్యమహాముని చే అనుగ్రహింపబడినదని ఆర్యోక్తి.

 కథాకథన ప్రకారముగా,

 దక్షప్రజాపతి కుమార్తె అదితి.కశ్యప ప్రజాపతి ధర్మపత్ని.వీవివి సంకేత నామములు.వానినే గౌణ/గుణమును తెలియచేయు నామములని చెబుతారు.అదితి అనగా అఖండము.కష్య అనగా ప్రకాడము.అకహండ ప్రకాశమే వారి దాంపత్యము.

  మాతృస్వరూపిణి అయిన అదితీదేవి ధర్మసంరక్షణమునకై "అదిత్యోపాసనమును" ఉపాయముగా భావించి,తన భర్త అనుమతిని స్వీకరించి,పరమాత్మను ప్రార్థించుటకు పూనుకొనెను.

  పరమాత్మ(సూర్యభగవానుడు) తల్లికి ప్రత్యకముగా కనబడి,సుష్మ్న అనే కిరణము ద్వారా ఆమె గర్భవాసము చేసే వరమును ప్రసాదించెను.

 తరువాత జరిగిన కథను మనము ముందు సంచికలలో తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.


   అదితి అనగా అఖండముగా మనము భావించుకుంటే అఖండమునకు లభించిన అనుగ్రహమే "ఆదిత్య హృదయము".

 పరంజ్యోతిని అదితిగా భావించుకుంటే పరమాత్మ ప్రకాశమే ఆదిత్య హృదయము.

 కిరతి-వ్యాపకము-కిరణము.వ్యాపకత్వమే హృదయమైతే దానిని వ్యాపింపచేసేది అదితి.అంటే వ్యాపకశక్తి-వ్యాపకత్వమే ఆదిత్యహృదయము.

  విత్-తెలుపునది వేదముగా భావిస్తే,వాటిని 

 త్రయీ వేద్యము గా భావిస్తే మూడువేదములుగా,

 మూలశక్తి-ఋఇగ్వేదముగా

 చైతన్యశక్తి-యజుర్వేదముగా

 వ్యాపకశక్తి-సామవేదముగా అన్వయించుకుంటే

 వేద సారమే ఆదిత్యహృదయము.

  నాదమయముగా నమ్మితే,గాయత్రీమంత్ర రహస్యమే ఆదిత్యహృదయము.

 "నేలనీరు నింగిచేరు ఆ సూర్యుని సాక్షిగా

  నింగినీరు నేల జారు ఆ వర్షము సాక్షిగా"

 అన్న వాక్యములను గ్రహిస్తే

 అగ్ని-సోమాత్మక తత్తము ఆదిత్యహృదయము.

  మన ప్రయత్నముగా ప్రతి శ్లోకమును అర్థమును గమనించి-గ్రహించుటకు స్వామి కరుణను అర్థిస్తూ

ముందుకు సాగుదాము.

 తం సూర్యం ప్రణమామ్యహం.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...