Tuesday, March 7, 2023

ANIRVACHANEEYAMU-ADITYAHRDAYAMU(SARVAMAANGALYAM)-06

 సర్వమంగళ-మాంగళ్యం సర్వపాప-ప్రణాశనమ్ ।

చింతాశోక-ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ॥ 5 ॥

  ప్రస్తుత శ్లోకములో ప్రవృత్తి-నివృత్తి అను రండుచిషయములు చెప్పబడినవి.అంటే కొన్ని సుగుణములను అనుగ్రహిస్తాడు-మరి కొన్నింటిని తొలగిస్తాడు ఆదియ్త్య రూపములో స్తుతింపబడుచున్న పరమాత్మ.
 పాపము అనగా బుద్ధిని -విచక్షణను విస్మరించి ఇంద్రియలోలులమై ప్రవర్తించిన తీరుకు కలిగే ఫలితము.అవి మానసికము కావచ్చును-కాయకము కావచ్చును.వాటిని నాశనము చేసేది/పూర్తిగా తొలగించేది
ప్రణాసనం-పరిపూర్ణముగా నిర్మూలించునది స్వామి స్తుతి.
 అంతే కాదు చింత-ఆలోచనము-విచారము అను రెండు అర్థములలో చింత అను పదమును అన్వయించుకుంటే
" యద్భావం తద్భవతి" అన్నట్లుగా
 మన ఆలోచనాప్రవృత్తులను అనుసరించి వాటి ఫలితములు అనుసరిస్తాయి.
 కనుకనే ధూర్జటి మహాకవి,
 చింతాకంతయు చింత చేయరు కదా శ్రీకాళహస్తీశ్వరా అని స్వామి నిన్ను స్మరించరు మోహభ్రాంతితో అన్నాడు.
 అదియే కనుక
 సత్ చింతయ న శోక అని అన్వయించుకుంటే 
 సత్తు-చిత్తు యైన పరమాత్మను స్మరించిన-తత్త్వమును ఆలోచించినను శోకముండదు కదా అని కూడ భావింపవచ్చును.

 ప్రస్తుత శ్లోకము స్వామి యొక్క "మిత్ర" గౌణనామమునకు అద్దముపడుతున్నది.
 శ్రీలలితా రహస్య సహస్ర నామముల భాష్యములో చెప్పబడినట్లు అమ్మవారు మిత్రరూపిణి.ఆదిత్యుడు మిత్రరూపుడు.అనగా మైత్రు-కరుణ-ముదిత-ఉపేక్ష అను నాలుగు వాసనలను కలిగినవాడు.అందించువాడు.అవే,
1.నీ-నా అను భేదభావము లేనిది మైత్రి.త్రిగుణములచే ప్రభావితము కాని తురీయ స్థితి.
 2.దుఃఖపీడితుల పట్ల కలుగు కరుణకు ఆధారము మైత్రి.
 3.వారి దుఃఖములను తొలగించుటకు అవసరమైన పుణ్యపురుష సాంగత్యమును లభింపచేయునది ముదిత.
 4.మానవసహజముగా అరిషడ్వర్గములను అధీనములో నుంచుకోలేని జీవులు అసహాయులై పాపములు చేసినప్పటికిని ఆపేక్షతో వారిని మన్నించుటయే ఉపేక్ష.క్షమాగుణమే ఆ సూర్యభగవానునిది.
  స్వభావమును సరిచేసుకొనుటకు సహనముతో సదవకాశములను  -వాసనాచతుష్టయము ను శ్రీరాముడు రావణునికి అందిస్తున్నడు.కనుక "మిత్ర శబ్దము సూర్య పరముగాను-"శ్రీరాముని పరముగాను అన్వయించుకోవచ్చును. 


   

 మూడు విశేషపదములు స్వామి అనుగ్రహమునకు అద్దముపడుతున్నాయి.
 అవి
1.సర్వమంగలము
2.ఉత్తమము
3.ఆయుర్వర్ధనము.
 ఉత్తమ స్వభావము కలవాడు ఆదిత్యుడు.తల్లిగా భావింపబడు భూమండలమునకు-తండ్రిగా ఆరాధింపబడు ఆకాశమునకు తన కిరణములద్వారా వంతెనవేస్తూ,మధ్యలో పంచభూతములను విస్తరింపచేస్తూ,స్వలాభమును కోరుకోకుండా సర్వలాభమును అందించు స్వభావము కలవాడు పరమాత్మ.
 స్వామి నామములన్నియు గౌణ నామములే.గుణములకు సంకేతములే.

  అమంగళము ప్రతిహతమగుగాక అన్న మంగళాశాసనమును మనము వింటూనే ఉంటాము.
  పూర్తిగా నిరోధింపబడుట.
 మంగళములకు కలుగు అడ్దంకులే అమంగలములు.అవి సర్వజనులను బాధించునపుడు సర్వులకు అమంగళమే కదా .అది నివారింపబడినపుడు సర్వమంగలము.దానిని కలిగించు సూర్యుడు సర్వ మంగళుడు.
 ప్రకృతిని సమపాళ్ళలో సమన్వయపరచి సంపన్నముచేయుట చే వచ్చు మాంగళములను అందించువాడు.
 ఇదే విషయమును మనము పరమేశుడు హాలహల భక్షణమును చేసిన సందర్భములో,
 మింగమనె సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమినదో అన్నారు పోతన మహాకవి.
  స్వామి ఉత్తమస్వభావి.మంగళప్రదుడు.వాటిని పొందుటకు సర్వచరాచరములకు కావలిసినది పెంపొందించబడిన ఆయుర్దాయము.
 అదే ఆయుర్వర్ధనం అన్న మహా విశేషము.
 సకల చరాచరములకు "ఆరోగ్యం భాస్కరాదిత్యేత్" అన్నట్లుగా
 జలచరములకు-భూచరములకు-ఖేచేరములకు తగిన ఆహారమును-ఔష్ధులను-ఆరోగ్యమును అనుగ్రహించువాడు.
 ఇక్కడ ఔషధము అన్న పదమును ఒకసారి గ్రాసమునందించు సమసిపోవు వానిగా కూడా వరి,చెరకు (పంతలు) గా కూడా భావిస్తారు పెద్దలు.
 అనుగ్రహదాత-అనుగ్రహ గ్రహీతలకు శుభములు కలుగుగాక.
   తం సూర్యం ప్రణమామ్యహం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...