Saturday, April 22, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(ARGHYASEVITAAYA NAMAHA)

 


 సనాతన పూజావిధానములో జలమునకు ప్రాధాన్యత ఉంది.పూజా ప్రారంభమునందు చేయు ఆచమనీయము,షోదశపూజలో చేయు అర్ఘ్యము-పాద్యము-శుద్ధ ఆచమనీయము,శుద్ధోదక స్నానము,ఉదకశాంతి ఎంతో ముఖ్యమైనవి.


  బాహ్యమునకు సుచియై చతిలో జలమును గాయత్రీమంత్రపూర్కముచేస్ ఊర్ధ్వ దిశగా చేయు సంధ్యావందన ప్రకృఇయగా భావిస్తారు.కొందరు మూడు సంధ్యలయందును సూర్యునికి అర్ఘ్యమును సమర్పించే విధానమును పాటిస్తారు.

  దీనివలన వాతావరణ పారిశుభ్రమునకు ఆటంకము కలిగించే సూక్ష్మజీవులు నశించి పర్యావరణము పచ్చగా ఉంటుందని సమర్థిస్తారు.ఇది కాదనలేని అంసమే.

  ఆధ్యాత్మికముగా ఆలోచిస్తే గరుడ పురాణములో చెప్పబడినట్లు మనకు సూర్యునికి మధ్య అడ్డముగా మందేహులు అనే అసురులు ముసురుకుంటారని వారిని మంత్రపూరిత(గాయత్రీ) జలముతో-దోసిలి నింపుకుని పైకి విసిరిన అద్దకులు తొలగిపోవునని భావిస్తారు.అదియును కాదనలేని విషయమే.

  శ్రీ లలితారహస్య సహస్ర నామ స్తోత్రములో చెప్పబడినట్లు,

 కేవాలా-కైవలానర్ఘ్యా-కైవల్యపదదాయిని" అన్న శ్లోకమును విచారిస్తే అర్ఘ్య అన్న పదమును గడియగా భావించి,గడియలులేని కైవల్యమును కేవలానర్ఘ్యగా అమ్మను అనుగ్రహించేదానిగా కీర్తిస్తారు.


 మన-దేహులు పదమును కొంచము పరిశీలిస్తే దేహులు-మనమున కలుగుచున్న జాడ్యమే/చీకటే అసురత.దానిని తొలగించకలిగినవి సూర్యకిరణములు.


 మన శరీరావయములలో కొన్ని నల్ల రంగుతో-మరికొన్ని ఎర్ర రంగుతో-ఇంకొన్ని తెల్లరంగుతో,కొన్ని గోధుమ వర్ణముతో రంగు-రంగులతో చైత న్యరూపముగా ప్రకాశించుచున్నవి.ఏ విధముగా సూర్యకిరణములు తెలుపునుండి విస్తరింపబడి ఇంద్రధనుస్సుగా మారుచున్నవో మన దోసిలి యందలి నీరు సైతము సూర్యకిరణముల కాంతిని స్వీకరించి పలురంగులుగా మారి పంచేంద్రియములను చురుకుగా పనిచేయించుచున్నవి.

  మనలోని పరమాత్మయే అనేకానేక చేతనములని సంకేతించుటయే అర్ఘ్యప్రదానమని పెద్దలు దానిని ఆత్మనివేదనముగా భావించి ఆచరిస్తారు.

సప్తసప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీసహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర ||


   తం సూర్యం ప్రణమామ్యహం.

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(VISVAKARMA-TVASHTA NAMOSTUTE)

 


 ఋగ్వేద "హిరణ్యగర్భ సూక్తము" పరమాత్మ యొక్క త్వష్ట నామధేయమును సోదాహరణముగా వివరించుచున్నది.

 సామాన్యార్థములో మలచువాడు-తొలచువాడు గా వ్యవహరింబడు త్వష్ట.కాని సకలభువనభాండములను పద్ధతిగా ప్రకటించిన పరమాత్మ విశ్వకర్మ.అంతే కాదు పంచభూతములు ఏ విధముగా ఒకదానినొకటి సమన్వయపరచుకుంటూ ప్రపంచముగా ప్రకాశించాలో నిర్దేశిస్తూ,వాటికి అడ్దుగా ఉన్న వాటిని తీసివేస్తూ ,

 వేదెఒపాసనగా .

" కస్మైదేవాయ హవిః విధేయ? అన్న ప్రశ్నకు సమాధానముగా

 " ఏకస్మై దేవాయ-ప్రణతోస్మి" అని సమాధానమిచ్చినది

 హిరణ్యగర్భసూక్తము.

"తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్" తనచే సృష్టింపబడిన సకలచరాచరములందు ప్రవేశించు పరమాత్మకు ప్రణామములు.హిరణ్య శబ్దమునకు విజ్ఞానమును సమన్వయించుకుంటే,

 యస్యేమె హిమవంతొ,సముద్రో,దిక్పాలక ప్రస్తుతిస్తున్నారో వారే విశ్వకర్మ.వారే త్వష్ట.ప్రపంచ వనరులను ,నింగి-నేలలను నిర్దిష్ట పరచు నిత్యచైతన్యమా,నిన్ను

ఆపోహ యత్ బృహతి విశ్వం అయాన్ గర్భం

 దధానా జయంతి అగ్నిం-తతో దేవానాం...అని ప్రస్తుతిస్తున్నది వేదము.

  తం సూర్యం ప్రణమామ్యహం.



 

Friday, April 21, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(HIRAnYARETA NAMOSTUTE)

 " లోకంబులు లోకేశుడు

    లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం
    జీకటికవ్వలనెవ్వం
    డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్".
               -బమ్మెర పోతనామాత్యుడు.


  అది అజ్ఞాన- అజ్ఞేయ తత్త్వపూరితమైన స్థితి.సృష్టికి పూర్వదశ.లోక త్రయములు పాతాళమునందలి బురదలో పడినవో లేక చీకటిలో కలిసినవో ,అసలున్నవో-లేవో తెలిసికొనలేని అయోమయ పరిస్థితి.జ్ఞానము లుప్తమైన/గుప్తమైన వేళ అజ్ఞానము అధిష్టించి,సమస్తమును అజ్ఞేయమను నిస్సారపు పొరతో కప్పివేసిన స్థితి.కదలికలేక కనుమమరుగైనవో లేక కాలరాయబడినవో కనుగొనలేని దుస్థితి.

  సమస్తము అస్తవ్యస్తమై,మిక్కిలి చిక్కనిదై,అట్టడుగున చేరి,అచేతనమై,తననుతాను మరుగుపరచుకొనిన మర్మస్థితి.కర్మలకు దూరమైన దయనీయపరిస్థితి.

 అట్టిస్థితిలో మనోవాక్కాయ కర్మలను త్రిశక్తులు,సత్వరజో తమో గుణములను మూడు గుణములు,స్థూల-సూక్ష-కారణమను మూడు శరీరములు,ధర్మార్థకామమోక్షములను చతుర్విధ పురుషార్థములు,కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యములను ఆరు శత్రువులు అసలే కానరాని అయోమయస్థితి.

   మనము ఆధారములుగా-కారణములుగా వీటిని పరిగణిస్తే వీటికి ఆధేయములు-కార్యరూపములైన పక్షులు-పశువులు-పదార్థములు-ప్రాణులు,పంచభూతములు-పంచేంద్రియములు,అష్టదిక్కులు-భూగోళ-ఖగోళములు,నదీనదములు,సముద్రములు,అరణ్యములు,ఉద్యానవనములు తమ ఉనికిని కోల్పోయిన హృదయవిదారక స్థితి.

 బాహ్యము-అభ్యంతరము తమ స్వరూప- స్వభావములు సమసిపోయిన స్థితి.వృధ్ధి-క్షయములు,జనన-మరణములు,సుఖ-దుఃఖములు,సంకల్ప-వికల్పములు,చీకటి-వెలుగులు లేని చింతిత స్థితి.

  ఆకార-వికారములు లేవు.పొట్టి-పొడుగు,నలుపు-తెలుపు,ధనిక-పేద,లేదు.జాగ్రత్-నిద్ర-సుషుప్తి అవస్థలు లేవు.అంతా జగము జడముగా మారిన కూష్మాంద స్వరూపము.అంతా చీకటి.నిశ్శబ్దము.శూన్యమో/పరిపూర్ణమో పరిశీలించలేని ప్రమత్తస్థితి.పరవస్తు-స్వవస్తు విషయ పరిజ్ఞానములేని విషయములు విషమించిన ముద్ద,అది జగములు జడముగా మారిన ఒకేఒకటైన ఘనకూష్మాండము.

 కాని విచిత్రము.సంకల్పము-వికల్పము రెండును తానైన పరబ్రహ్మము ముద్దుగా తాను ఆ ముద్దలో ఇమిడిపోయినది.అవ్యాజ కరుణతో ఉధ్ధరించుటకు ఉపేక్షను వీడినది.వికల్పమునకు వీడ్కోలు పలికినది.సంకల్ప మాత్రముచే సహస్ర కిరణ తేజోపుంజముగా -శ్రావ్యమైన ప్రణవమును తోదుతెచ్చుకొని తనకు తాను ప్రచ్ఛన్నమును వీడి,స్వఛ్చందమై ప్రకటింపబడినది.

 ఏం మాయ చేసాడో చెప్పలేను కాని అయోమయము మాయమైనది.ప్రకృతి తన స్వస్వరూపమును పాంచభౌతిక రూపములతో బాటుగా ప్రస్ఫుటము చేసుకొనినది.కదలికలు మొదలైనవి.తోడుగా వచ్చిన శబ్ద సహకారముతో

 పక్షులు-పశువులు-ప్రాణులు పర-పశ్యంతి-మధ్యమ-వైఖరి శబ్దములకు ప్రాణప్రతిష్టను చేసినవి.మేఘములనుండి వచ్చు గర్జనలు.చెట్లు గాలి వీచునపుడు చేయు శబ్దములు పర-పశ్యంతిగా పరిగణిస్తే,పక్షుల కూతలు మధ్య అని,భావగర్భిత భాష వైఖరిగా తన విశిష్టతను వివరిస్తున్నది.చేతనత్వముతో నింగి నేల స్నేహ-బాంధవ్యాలను సమృధ్ధిచేసుకుంటున్నాయి.

 ఏకము అనేకమై మనతో మమేకము అవుతున్నది

తం సూర్యం ప్రణమామ్యహం.


ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM( SADAA RAAKSHASA SEVITAM)

 


  విశ్వసృష్టి విస్తరణకై బ్రహ్మ ఆదేశానుసారముగా కశ్యప మహర్షి తీవ్రతపమొనరించెను.దాని ఫలితముగా అనంత తేజము అతని నుండి బయల్వెడలెను.బ్రహ్మాదేశానుసారము దానిని సముద్రప్రవేశము చేయించి తదుపరి కార్యక్రమముగా అండజములను,స్వేదజములను,బుద్బుజములను,భూరుషములను,జలచరములను,భూచరములను,ఖేచరములను అనేకానేక ఉపాధులతో సృష్టిచేసెను.వీటిలో కొన్ని త్రిగుణములకు సంబంధించినవి.

 కశ్యప ప్రజాపతి-దితికి జన్మించిన సంతానమే దైత్యులుగా-రాక్షసులుగా వ్యవహరింపబడుచున్నారు.నిజమునకు వీరు తమోగుణ ప్రధానులు.

 రాక్షసులు సూర్యరథమును ముందుకు జరుపుచుందురు అని సనాతనము చెప్పుచున్నది.

 తిమిరహరుడు,దినకరుడు-దివాకరుడు-భాస్కరుడు చీకట్లను పారద్రోలుటకు సంసిద్ధమగుచున్నాడనుటయే రాక్షసులు సూర్య రథమును వెనుక నుండి ముందుకు జరుపుచున్నారన్న మాటలోని రహస్యము.

 1.మధుమాసములో-హేతి అను రాక్షసుడు

 2.మాధవ మాసములో-ప్రహేతి అను రాక్షసుడు

 3.శుక్ర మాసమునందు-పౌరసేయుడను రాక్షసుడు

 4.శుచి మాసములో-సహజన్యుడు

 5.నభ మాసములో-వార్య రాక్షడును

 6.నభస్య మాసములో-వ్యాఘ్ర రాక్షుడును

 7.ఇష మాసములో-బ్రహ్మపేత రాక్షసుడును

 8.ఊర్జ్య మాసములో-మఖపేత రాక్షసుడును

 9.సహ మాసములో-విద్యుత్చాత్రి రాక్షసుడును

 10.సహస్య మాసములో-స్పూర్జ రాక్షసుడును

 11.తప మాసములో-వాల రాక్షసుడును

 12.తపస్య మాసములో-వర్స రాక్షసుడును

    సూర్య రథమును ముందుకు జరుపుతూ స్వామిని సేవించుకుందురు.

 తం సూర్యం ప్రణమామ్యహం.


ANIVERCHANEEYAM-ADITYAHRDAYAM(ANISAM-MUNISEVITAM)

 


 'అంతః బహిః యత్ సర్వం వ్యాప్త నారయణస్థితః" అన్నది మంత్రపుష్పము.

 లోపల-బయట సర్వత్రా నామ-రూపములుగా వ్యాపించియున్న పరమాత్మను గుర్తించగలగటమే ఈ మునులు ప్రతిదినము సూర్యరథ గమన ప్రారంభమునకు ముందుగా చేయు వేదపారాయణమను సంప్రదాయము.మనము ముందు చెప్పుకున్నట్లు వాలిఖ్యాది మునులు సైతము ప్రకాశించబోతున్న పవిత్రము చేయబోతున్న సూర్కిరనములకు సంకేతములే.

 ఋఇగ్వేద సంప్రదాయములో ప్రతి మంత్రమును రుచము అని వ్యవహరిస్తారు.సూర్యకాంతి సర్వలోకముల బయటనే కాకుండా అంతరంగములందును ప్రసరించి అజ్ఞానమనే చీకటిని నశింపచేస్తుంది.

 ప్రతి నాదము ప్రసరించే కిరణము ద్వారా ధర్మాచరణమును సంకేతిస్తుంది.నిజమునకు వేదమంత్రములే వేదబేద్యుని కిరణములు.ఈష ఉపనిషత్తు వేదపారాయణమే పరమాత్మ సాన్నిధ్య సహాయకారిగా సూచిస్తుంది.

 నాదాత్మకమైన సూర్యశక్తిని గుర్తించి పఠించుతయే గాయత్రీమంత్ర పరమార్థము.

 ఛాందగ్యోపనిషత్ ప్రకారము కదులుచున్న సూర్య పరమాత్మనుండి జనించుచున్న నాదమే ప్రణవము.

 అసలు ఈ మునులు/ఋషులు స్వామి రథమునకు ముందుగా నిలబడి వేదోచ్చారనముతో స్వామి గమనమును సంకేతిస్తారట.

 ఐతిహాసిక కథనము ప్రకారము వీరిని బ్రహ్మ మానస పుత్రులుగా కీర్తిస్తారు.

 ఆదిత్యహృదయ స్తోత్రమును శ్రీరామునకు ఉపదేశించినది కూడా అగస్త్య ఋషియేకదా.లోక కళ్యాణమునకై వీరు చేయవలసిన పనులను సూచిస్తూ శోభిస్తుంటారు.

 మౌనముగా ఉండేవాడు ముని అని కొందరు భావిస్తారు.అంటే మాటాడకుండా ఉండటము అని అనుకోరాదు.ఏదైనా దీక్షను పూని సాధన చేస్తున్నప్పుడు వచ్చే అడ్దంకులకు చలించకుండా కొనసాగించే ఆత్మస్థైర్యము కలవారని గుర్తించాలి.వీరు ఆత్మ పరిశీలనా తత్పరులు.బ్రహ్మము గురించిన అవగాహన గలవారు.

 మరికొందరు మననాత్ త్రాయతే మంత్ర అన్న సూక్తి ప్రకారము వీరిని మననశీలురుగాను భావిస్తారు.అంతరము పరబ్రహ్మములో రమించే ఆసక్తిగలవారు.వారి వేద పఠన సారాంశమును సూర్యకిరణములద్వారా సర్వజగత్తుకు అందచేస్తున్నారు.

 వీరు ,

 మధుమాసములో-పులస్త్య మునిగా

 మాధవమాసములో-పుల మునిగా

 శుక్రమాసములో-అత్రి మునిగా

 శుచి మాసములో-వశిష్టునిగా

 నభ మాసములో-అంగీరసునిగా

 నభస్య మాసములో-భృగు మునిగా

 ఇష మాసములో-జమదగ్నిగా

 ఊర్జ్య మాసములో-విశ్వామిత్రునిగా

 సహ మాసములో-కశ్యపునిగా

 సహస్యమాసములో-ఆయుర్మునిగా

 తపః మాసములో-గౌతమునిగా

 తపస్యమాసములో-భరద్వాజునిగా

 స్వామికి మార్గమును లాంఛనప్రాయముగా వేదపారాయణముతో చూపిస్తుంటారు.

 తం సూర్యం ప్రణమామ్యహం.


ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(ANISAM NAGA SEVITAM)

  పరమాత్మ పన్నెండు రూపములతో-పన్నెండు విధములుగా ప్రపంచపాలనకు ఉద్యమిస్తున్న సమయములో నాగులు/సర్పములు సైతము స్వామి రథ పగ్గములను పరిశీలించి,పయనమును సుగమము చేస్తాయట.ఒక విధముగా ఇవి సాంకేత విభాగమని అనుకోవచ్చును.

 ఐతిహాసిక కథనము ప్రకారము కద్రువ-కశ్యప ప్రజాపతి సంతానముగా వీరిని పరిగణిస్తారు.వీరిలో ముఖ్యమైన ఎనిమిదిమందిని అష్టాంగము అని కూడా వ్యవహరిస్తారు.వారే,

1.అనంత

2.వాసుకి

3.తక్షక

4.కర్కోటక

5.శంఖ

6.పద్మ

7.మహాపద్మ

8.గుళిక గా భావిస్తారు.వీరిలో

కొందరు శివపురానములో స్వామి కంఠాభరణముగాను,స్వామి వాహనముగాను,స్వామి అనుచరునిగాను కీర్తింపబడినారు.వివిధ వర్ణములతో-రూపములతో భాసిల్లే వీరు తక్షకుని పాలనలో ఉన్నట్లు చెబుతారు.చారిత్రక పరముగా కూడా నాగజాతి ఉనికి మనకు కనిపిస్తుంది.

 వేదాంత వాదులు అనిత్యమైన శరీర సృష్టిలో దేహమును త్యజించు విధముగా నాగులు సైతము తన కుబుసమును విడిచి జీవిస్తుంటాయి అని భావిస్తారు.


  ఆదిత్య భగవానుడు,

 మధుమాసములో-వాసుకి అను సర్పముతోను

 మాధవమాసములో-కచ్ఛనీరుడు అనే సర్పముతోను

 శుక్రమాసములో-తక్షకుడు అనే సర్పముతోను

 శుచి మాసములో-శుక్ర అనే సర్పముతోను

 నభ మాసములో-ఎలపాత అనే సర్పముతోను

 నభస్య మాసములో-శంఖపాల అనే సర్పముతోను

 ఇష మాసములో-కంబలాశ్వ అనే సర్పముతోను

 ఊర్జ్య మాసములో-అశ్వత అనే సర్పముతోను

 సహస్ మాసములో-మహాశంఖ అనే సర్పముతోను

 సహస్య మాసములో-కర్కోటక అనే సర్పముతోను

 తపస్ మాసములో-ధనంజయ అనే సర్పముతోను

 తపస్య మాసములో-ఐరావత అనే సర్పముతోను రథ పగ్గ సేవలను అందుకుంటాడట.

 తం సూర్యం ప్రణమామ్యహం.


ANIRVACHANEEYAM-ADITYAHRDAYAMU(NITYAM APARASA SEVITAM.)

 


 ఋషులు-గంధర్వులు-నాగులు-అపసరసలు-యక్షులు-రాక్షసులు-దేవతలు అను సప్తగణములతో స్వామి సేవింపబడుతున్నాడు.యక్షుల గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.

 వీరిని ఉపదేవతలు అని కూడా అంటారు.దివ్యశరీరులు.దయార్ద్రహృదయులు.

 వీరు ఒక్కొక్క మాసములో ఒక్కొక్కరు సుర్య రథ గమనమునకు ముందు అశ్వములను అనుసంధానము చేస్తారని ఐతిహాసికము చెబుతున్నది.

 వైజ్ఞానిక పరముగా ఆలోచిస్తే వీరు భూగర్భ సంపదలను-వృక్షమూల సంపదలను పరిరక్షించుతకు అనుకూలముగా సూర్యకిరణ సముదాయమును నిర్దేశిస్తారట.

 యక్షుల తెగకు అధిపతిగా కుబేరుని ప్రస్తుతిస్తారు.

  సనాతనము సూర్యభగవానుని

 1.జన్మదాత

 2.అన్నదాత

 3.స్థితిదాత

 4.జ్ఞానదాత

 5.భయత్రాత గా కీర్తిస్తుంది.దీనికి ఉదాహరణముగా,

 పరమాత్మ,

 1.మధుమాసములో-రథకృత్ అను యక్షుడు

 2.మాధవ మాసములో-అతౌజుడు అను యక్షుడు

 3.శుక్ర మాసములో-రథస్వనుడు అను యక్షుడు

 4.శుచి మాసములో-చిత్రస్వనుడు అను యక్షుడు

 5.నభః మాసములో-శ్రోతస్వామి అను యక్షుడు

 6.నభస్య మాసములో-అశరణుడు అను యక్షుడు

 7.ఇష మాసములో-శతాజిత్ అను యక్షుడు

 8.ఊర్జ్య మాసములో-సత్యజిత్ అను యక్షుడు

 9.సహస్ మాసములో-తర్క్య అను యక్షుడు

 10.సహస్య మాసములో-ఊమ అనే యక్షుడు

 11.తపస్ మాసములో-సురుచి అను యక్షుడు

 12.తపస్య మాసములో-రీతు అను యక్షుడు 

    స్వామిని సేవించుకుంటారు.

  తం సూర్యం  ప్రణమామ్యహం.


Thursday, April 20, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM-NITYAM YAKSHA SEVITAM

 


 ఋషులు-గంధర్వులు-నాగులు-అపసరసలు-యక్షులు-రాక్షసులు-దేవతలు అను సప్తగణములతో స్వామి సేవింపబడుతున్నాడు.యక్షుల గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.

 వీరిని ఉపదేవతలు అని కూడా అంటారు.దివ్యశరీరులు.దయార్ద్రహృదయులు.

 వీరు ఒక్కొక్క మాసములో ఒక్కొక్కరు సుర్య రథ గమనమునకు ముందు అశ్వములను అనుసంధానము చేస్తారని ఐతిహాసికము చెబుతున్నది.

 వైజ్ఞానిక పరముగా ఆలోచిస్తే వీరు భూగర్భ సంపదలను-వృక్షమూల సంపదలను పరిరక్షించుతకు అనుకూలముగా సూర్యకిరణ సముదాయమును నిర్దేశిస్తారట.

 యక్షుల తెగకు అధిపతిగా కుబేరుని ప్రస్తుతిస్తారు.

  సనాతనము సూర్యభగవానుని

 1.జన్మదాత

 2.అన్నదాత

 3.స్థితిదాత

 4.జ్ఞానదాత

 5.భయత్రాత గా కీర్తిస్తుంది.దీనికి ఉదాహరణముగా,

 పరమాత్మ,

 1.మధుమాసములో-రథకృత్ అను యక్షుడు

 2.మాధవ మాసములో-అతౌజుడు అను యక్షుడు

 3.శుక్ర మాసములో-రథస్వనుడు అను యక్షుడు

 4.శుచి మాసములో-చిత్రస్వనుడు అను యక్షుడు

 5.నభః మాసములో-శ్రోతస్వామి అను యక్షుడు

 6.నభస్య మాసములో-అశరణుడు అను యక్షుడు

 7.ఇష మాసములో-శతాజిత్ అను యక్షుడు

 8.ఊర్జ్య మాసములో-సత్యజిత్ అను యక్షుడు

 9.సహస్ మాసములో-తర్క్య అను యక్షుడు

 10.సహస్య మాసములో-ఊమ అనే యక్షుడు

 11.తపస్ మాసములో-సురుచి అను యక్షుడు

 12.తపస్య మాసములో-రీతు అను యక్షుడు 

    స్వామిని సేవించుకుంటారు.

  తం సూర్యం  ప్రణమామ్యహం.


ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM-NITYA GAMDHARVA SEVITAM.

  చాంద్రమాన ప్రకారము చైత్రము నుండి ఫాల్గుణము వరకు ప్రస్తావింపబడిన పన్నెండు తెలుగు నెలలు,సౌరమాన ప్రకారముగా,


 1.మధుమాసము,
 2.మాధవ మాసము,
3.శుక్ర మాసము,
 4.శుచి మాసము,
 5.నభస్ మాసము,
 6.నభస్య మాసము,
 7.ఈశ మాసము,
 8.ఊర్జ్య మాసము,
 9.సహస్ మాసము,
10.సహస్య మాసము,
11.తపస్ మాసము
12.తపస్య మాసముగా  కీర్తింపబడుతున్నవి.

 గానధరులు కావున వీరిని గంధర్వులు అని పిలుస్తారు.వీరు సౌందర్యమతులు.సౌగంధభరితులు.చాలా వరకు వీరి శరీరములో సగభాగము మానవాకృతి-మిగిలిన సగము గుర్రమో-పక్షియో-జంతువో కలగలిసియుంటుందట.వీరి సంఖ్యను 6333 కంటె ఎక్కువగా ఉంటారని చెబుతారు.వీరు సూర్యభగవానునికి అతి సమీపములో గానము చేస్తూ రథగమనమునకు సహాయపడుతుంటారు.ఇది ఐతుహాసికము.వైజ్ఞానిక పరముగా ఆలోచిస్తే వీరు కిరణములతో పాటుగా తామును కిందికి దిగుతూ,భూమికి పోషకత్వమునకు హాని కలిగించు కణములను నిర్మూలిస్తూ ఓజోను పొరను దృఢపరుస్తారట.
 వాతావరణమునకు అనుకూలమగు నాదమును సృజిస్తూ ఒక్కొక్క నెల ఒక్కొక్క గంధర్వుడు సూర్యనారాయణుని సేవిస్తాడని సూర్యపురాణము చెబుతున్నది.
 సనాతన సంప్రదాయ ప్రకారము 

 1.మధుమాసములో-తుంబురుడు
 2.మాధవమాసములో-నారదుడు
 3.శుక్రమాసములో-హా-హా
 4.శుచి మాసములో-హూ-హూ
 5.నభ మాసములో-విశ్వవసు
 6.నభస్య మాసములో-ఉగ్రసేనుడు
 7.ఉష మాసములో-ధృతరాష్ట్రుడు
 8.ఊర్జ మాసములో-సూర్యవర్చ
 9.సహస్ మాసములో-ఋతసేన
 10-సహస్య మాసములో-అరిష్టనేమి
 11.తపస్ మాసములో-సుసేన
 12.తపస్య మాసములో-విశ్వ అనే గంధర్వులు స్వామిని సేవించుకుంటారట.

ANIVERCHANEEYAM-ADITYAHRDAYAM-VAALAKHILYA PRASTUTAM ANIsAM.

  మండలాంతర్గత పరమాత్మ రధగమనమునకు శుభారంభముగా వాలిఖ్యాది మహా మునులు వేదపఠనమును చేస్తుంటారట.

 అసలు సూర్యునికి వీరికి కల అవినాబావ సంబంధమేమిటి? అన్న సందేహము కలుగవచ్చును.

  సనాతన సంప్రదాయ ప్రకారము వీరు అంగుష్టమాత్ర పరిమాణములో కనిపించు మహా తపసంపన్నులని నిర్ధారించినప్పటికిని వారి ఆవిర్భావ కథనములు అనేకానేకములుగా చెప్పుకుంటారు.

 వీరు అసంఖ్యాకులనియు,60,000 మించి యున్నారనియు నమ్ముతారు.

 ప్రకృతి అవిచ్ఛిన స్వరూపమే వాలిఖ్యాదిములని (వాలహిల్యమని)కొందరు,ఋగ్వేద మంత్రములను  వాలిఖ్యములంటారని కొందరు భావిస్తారు.ప్రజా పతి రేతశ్సు సీఘ్ర స్కలనము నొంది అనేకానేక మహాసక్తులని సృష్టించిందని నమ్ముతారు.

 శివ పురాణ కథనము ప్రకారము శివ-పార్వతుల కళ్యాన మహోత్సవ సమయమున పార్వతిని చూసిన బ్రహ్మకు మనసు చెదిరి జారిపడిన వీర్యమును కాలితో కప్పచూడగా పరమేశ్వరుడు దానిని అగ్నికి హవిస్సుగా సమర్పించమనెనట.అప్పుడు అగ్నిలో నుండి సూర్యతేజముతో-తపోనిధులైన అంగుష్టమాత్ర పరిమాణముతో అనేకానేక దివ్య పురుషులు ఆవిర్భవించారట.వారు అనునిత్యము సూర్యోదయము నుండి-సూర్యాస్తమయము వరకు స్వామిని ప్రస్తుతిస్తూనే ఉంటారట.సూర్య రథగమనమునకు నాందిగా వారు ఆశీర్వచనములతో ఆదిత్యుని అర్చిస్తుంటారట.

   తం సూర్యం ప్రణమామ్యహం.


Tuesday, April 18, 2023

ANIVARCHANEEYAM-ADITYAHRDAYAM(RAUDRAAYA VAPUSHAENAMAHA)

 


 "రుజం ద్రావయతీ రుద్రః"  ఆర్యోక్తి.జన్మ జర మృత్యు దుఃఖములను నశింపచేసేవాడు రుద్రుడు.పంచకృత్యములలో మూడవదైన సంహార కార్యమును జరిపే రుద్రుడు పరమాత్మ యొక్క శక్తియే తక్క అన్యము కాదు.

 వపుషో-అని పరమాత్మను ప్రస్తుతిస్తున్నది ఆదిత్యహృదయ స్తోత్రము.మన భాషలో చెప్పలంటే నిరాకార-నిర్గుణ-నిరంజన పరమాత్మ మనము పరమాత్మ శక్తిని అర్థము చేసుకొనుటకు తనకు తానుగా సాకారమును ధరించి తన స్వరూప-స్వభావములను మరింత స్పష్టము చేయుట.

 నాల్గవ కృత్యమైన తిరోధానము గురించి ఒక్క సారి పరిశీలిస్తే ఇదే విషయమును మనము గ్రహించనీయకుండే మాయచే మనలను కప్పుచున్నది పరమాత్మయే-తిరిగి దానిని తొలగించి అనుగ్రహిస్తున్నదీ పరమాత్మయే.

 వపు శబ్దమును విష్ణుసహస్రనామ స్తోత్రము మరింత స్పష్టపరుస్తున్నది.

 విశ్వం-విష్ణుః అంటూ మనము కనులారా చూచుచున్న విశ్వములో ఉన్న విశ్వాత్మకుడే పరమాత్మ.తాను విశ్వ వపునిగా మనకు కనబడుతున్నాడు.


 శ్రీ లలితా రహస్య సహస్రనామము సైతము పరాశక్తిని,

 సంహారిణీ రుద్ర రూపా గా ప్రస్తుతించినది.

 

 సంహారము తమోగుణ ప్రధాన కృత్యము.దానిని జరుపువాడు రుద్రుడు.ఇంకను తల్లి,

 విధాత్రీ-విశ్వజననిగాను,

 శ్రీకంఠార్థశరీరిణిగాను

 విశ్వతోముఖిగాను

 లీలా విగ్రహధారిణిగాను కీర్తింపబడుచున్నది.

 ఆదిత్య మండలాంతః స్పురత్ అరుణ వపుః-అంటుంది అప్పయ్యదీక్షితుని ఆదిత్యస్తోత్ర రత్నము.

 మందలమునుండి స్వామి తన అరుణకాంతులతో దర్శనమిస్తూ మన ఆలనా-పాలన చేస్తున్నాడు.



ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(CHIMTASOKAM -MUDAAVAHAM)

Monday, April 17, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(TIMIRO UNMATHANAHA)


  ఆదిత్యహృదయ స్తోత్ర పరమార్థమే "నిశిచరపరపతి సంక్షయం" నిశి చీకటి యందు సంచరించువారికి మూలమైన వానిని సంపూర్తిగా నాశనము చేయుట.

 ఐతిహాసిక కథనము ప్రకారము రావణాసుని ఇంద్రియ వ్యామోహమనెడి అజ్ఞానమును నిర్మూలించుట.

 రాత్రులందు సంచరించువారిని నిశాచరులుగా భావిస్తే నిశి అంటే చీకటి.కనుకనే అహర్నిశి అనే వాడుక పదమును మనము వింటూంటాము.

 స్వామి నిర్మూలించదలచిన చీకటి కేవలము ప్రతి దినము మనము అనుభవించుచున్న సూర్యోదయమేనా లేక మరేదైన నిగూఢార్థము దాగి యున్నదా అన్న సందేహము రావచ్చును.

  చీకటులు అనేకానేకములు కావచ్చును.అవి బాహ్యములుగా భావించే భౌగోళిగములు కావచ్చును.అంతరంగికములు లైన అరిధడ్వర్గములు కావచ్చును.దానికి కారణమైన ఇంద్రియ ప్రవృత్తులు కావచ్చును.

 క్రమశిక్షణారాహిత్యముతో కలుగు అనారోగ్యమే కావచ్చును.అహంకారమే కావచ్చును.అజ్ఞానమే కావచ్చును.ఆత్మ తత్త్వమును కనుగొనలేని ద్వైత భావమే కావచ్చును.వాటన్నింటిని తెలియచేసేది విమర్శ ద్వారా ప్రకాశమునందించు స్వామి తేజము.అదియే,

 సప్తసప్తి మరీచిమాన్-అంటూ ఏడు విధములైన కిరణములతో వ్యాపించే పరమాత్మ ప్రసన్నతా గుణము.

 రశ్మిమంతము-సముద్యంతం గా ఆవిష్కరింపబడు అవ్యాజకరుణ.

 వ్యోమనాథః తమోభేదః గా స్వామి అంతర్యామిత్వమును అందించు అద్వితీయ భావము.

 నమస్తమోభినిఘ్నాయ అని వినిపించు వినుతులు.

 జ్యోతిషాంపతి-జ్యోతిర్గణానాం పతిగా కీర్తించు కృతజ్ఞతాభావము.


Sunday, April 16, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRADAYAM(RGYAJUSAMAPARAGA)

  అగస్త్యమహాముని ఆదిత్యహృదయ స్తోత్రము ద్వారా సూర్యభగవానుని వేదమూర్తిగా ప్రస్తుతిస్తున్నాడు.

  పరము-పారము అనగా -ఒడ్డు లేక తీరము.

 సూర్యనారాయణమూర్తి ఋఇగ్-యజ్-సామ వేదములను సాధనములద్వార పరమును అందించువాడు అని చెప్పబడుతున్నది.

 అసలు వేదములు అంటే ఏమిటి? అనే ప్రశ్నను సమాధానమును పొందాలంటే

 " విద్" అను ధాతువు నుండి పుట్టినది వేదము.అనగా తెలియచేయునది/తెలుసుకొనుటకు ఆధారమైనది.పరబ్రహ్మమును తెలుసుకొనుటకు జీవునికి ఆధారమైనది వేదము.దీనినే ఋతము అనగా మార్పులు చెందనిది అని కూడా చెబుతారు.

 పరమాత్మ నాదముగా ఋషులకు వినబడినది కావున శృతము అని కూడా అంటారు.

 పరమాత్మ అనుగ్రహరూపము కనుక అపౌరుషేయములు అని కూడా పిలుస్తారు.

 "అనంతావై వేదాః" అన్నది ఆర్యోక్తి.

 పరమాత్మ నిశ్వాసములుగా భావించబడే/భాసిస్తున్న వేదములు మొదట మూడుగాను-కాలక్రమమున నాలుగు గాను ప్రసిద్ధిచెందినాయి.అవే,

1.ఋఇగ్వేదము-దీనిలోని ఛందోబద్ధ స్తోత్రములను ఋక్కులు అని వ్యవహరిస్తారు.కొమదరు ధన్యాత్ములు శబ్దముతో పాటుగా ఆవిర్భవించిన రూపమును (సంకేతములను)సైతము దర్శించి వేదపురుషునిగా ప్రస్తుతించారంటోంది సనాతనము.

2.యజుర్వేదము-

  యజ్ అనే ధాతువునకు పూజించుట అనే అర్థమును సమన్వయించుకుంటే పూజా విధానమును తెలియబరచునది.వీనినే యజస్సులు అని కూడా అంటారు.

  శాత్రనియమములను సూచించినది ఋఇగ్వేదమైతే-దానిని ఆచరించవలసిన విధానమును తెలియచేయునది యజుర్వేదము.

 కనుకనే యజ్ఞములు అంతర్-బహిర్ రూపములుగా ఆచరణములో ఉంటాయి.

 అంతే కాక సుక్ల-కృఇష్ణ అను రెండు విభాగములుగా యజుర్వేదము విభజింపబడినది.

3.సామవేదము.

 పాపశమనమునకు అనుకూలము చేయు సంగీత ప్రధాన/శాంతిపూర్వక అర్చప్రకృఇయను తెలియచేయునది.

 ఋఇఘ్వేదమును మరింత సాధురూపమనుకోవచ్చును.

 సూర్య భగవానుడు తాను ఉదయిస్తున్నడు శాస్త్రములను తెలియచేస్తూ-మధ్యాహ్న సమయమున-శాస్త్రాచరణమును వివరిస్తూ-సాయంత్ర సమయమున శాస్త్రాచరణ ఫలితములను అందిస్తూ మనకు పరబ్రహ్మము యొక్క ప్రసన్నతను తెలియచేస్తున్నాడు.

 ఆయనయే అందులో అధర్వుణిగా దాగిన ఆచార్యుడును.


 ఇదే విషయమును శ్రీలలితారహస్య సహస్ర నామస్తోత్రమునందు 

 "విధాత్రీ-వేదజననీ'గా ప్రస్తుతింపబడినది.

   

"శృతి సంస్థుత వైభవ" గా కొనియాడబడినది. 

 వేదములలోని జ్ఞానకాంద-కర్మకాంద రెండును పరమాత్మయే.

   ఋగ్వేదములోని సూర్యారాధనను-మహాసౌరమంత్రముగాను,

   కృష్ణ యజుర్వేదము-అరుణముగాను,

   పురాణములో చెప్పబడినప్పటికిని-సూర్యపురాణముగా ప్రత్యేకించి చెప్పబడినది.అదే విధముగా సూర్యోపనిష్త్తు,సూర్య శతకము-సూర్య మండల స్తోత్రము-సూర్య కవచము,సూర్య అష్టకము ఎన్నో విధములుగా సూర్యభవానుని ఆరాధన అందించబడినది.



Friday, April 14, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(SRUNU GUHYAM-SANATANAM-MEANING)


  అగస్త్యమహాముని శ్రీరామచంద్రునికి "ఆదిత్యస్తోత్ర ప్రాభవమును" వివరిస్తూ మహాబాహో-శృణు -ఇతి గుహ్యం.ఇతి సనాతనం అని అంటారు.ఆ శబ్దములలో దాగిన విశేషములను తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.

 "యద్భాసా భాస్యతే సూర్యో-యద్భాసా భాస్యతే జగత్".

 దేని కాంటి వలన సూర్యుడు ప్రకాశిస్తున్నాడో-జగములు ప్రకాశిస్తున్నాయో దానికి మూలమే గుహ్యము అయిన పరమాత్మ.

 అదే విషయమును శ్రీ లలితా రహస్య సహస్రనామము 

1." భక్తహార్ద్ర తమోభేద భానుమత్ భాను సంతతిః" అని,

2. హృదయస్థా-రవిప్రఖ్యా త్రికోణాంతర దీపికా" అని మరొక్కసారి పరమాత్మను ప్రస్తుతిస్తున్నది.

3.పరమేశ్వరి యొక్క సూక్ష్మరూపము "గుహ్యముగా" భావింపబడుచున్నది.భజింపబడుచున్నది.

4. స్థూలమునకు వస్తే

 " పరేన నాకం నిహితం గుహాయాం" అని హృదయగుహ యందలి చైతన్య రూపముగాను ప్రణతులనందుకుంటున్నది.

5."పంచకోశానాం గుహా సబ్దేన గీయతే" అంటూ రహస్యోపనిషత్తులచే ఉద్ఘటింపబడుచున్నది.

 గుహ్యము అంటే రహస్యము గా అనిపించే రహస్యము కానిది.అందుకే అది సనాతనమైనది.

 ఎప్పటినుంచో ఉన్నప్పటికిని నిత్యనూతనముగా భావింపచేయునది.అది అప్రమేయమైనది.

 ప్రమేయము అను శబ్దమునకు కారణము/పరిమాణము అను అర్థములను గ్రహిస్తే దాని ఉనికి కారణము అంటూ ఏదీ లేనిది.దాని ఉపాధి ఇది అని విస్తీర్ణతను నిర్ణైంచలేనిది.

కనుక అది గుహ్యం మరియును సనాతనము.

 

Thursday, April 13, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM( RASMIMAMTAM-SAMUDYAMTAM-MEANING)G)

 రశ్మిమంతం-సముద్యంతం
 ************************
 అగస్త్యమహామునిచే శ్రీరాముని యుద్ధోన్ముఖునిగా  మలచుటకు మనకు అనుగ్రహించిన "ఆదిత్యహృదయ స్తోత్రము" లోని కొన్ని పదముల వివరణను తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
  అంతర్యామిగా నున్న పరమాత్మ సూర్యనారాయణునిగా  ప్రత్యక్షమగువేళ 'రశ్మిమంతం-సముద్యంతం" అన్న శబ్దములు ప్రయోగింపబడినవి.
 మయమగుటయే మంతం-రశ్ములమయమైనాడు పరమాత్మ.ఉదయించుటకు సిద్ధమగుచున్నాడు తన కిరణములను కరములతో.అందుకే భాస్కరునిగాను.దివాకరునిగాను,అహస్కరునిగాను-దినకరునిగాను కిరణములనే కరములతో ప్రకాశించుతకు సంపూర్తిగా సిద్ధపడుచున్నాడట.సమ్యక్ ఉదయతీతి-సంపూర్ణముగా తేజస్సును ప్రసరించుటకు సిద్ధపడుచున్నాడు కర్తగా పరమాత్మ.
 కర్త-కార్యము-కారణము మూడును తానే యైన పరమాత్మ స్థూల-సూక్ష్మ-కారణ దేహములతో ప్రస్తుతింపబడుతున్నాడు.
 రశ్ములు అన్న శబ్దమునకు మనము కాంతులు-కిరణములు-వేదములు-ఇంద్రియములు-భూతములు అని అన్వయించుకుంటే వాటిని  జాగృతపరచదలచిన అనుగ్రహము పరమాత్మది
 .కాదనలేనిది.
 కనుకనే శ్రీలలితా రహస్య సహస్ర నామ స్తోత్రములో 
 ఆదిపరాశక్తిని "ఉద్యత్భాను సహస్రాభా-చతుర్బాహు సమన్వితా" అని ప్రస్తుతిస్తుంది.
 అసలు స్థూల-సూక్ష్మ-కారణ రూపములలో నున్న తేడాఏమిటి?
 సనాతన ధర్మప్రకారము 
1. ఉత్తమాధికారులచే ఉపాసింపబడునది సూక్ష్మ రూపము.దీనినే మంత్ర స్వరూపముగా ధ్యానిస్తారు.స్మరిస్తారు.అర్చిస్తారు.
2. ఉత్తమోత్తమాధికారులచే ఉపాసింపబడునది కారణరూపము.దీనినే యంత్ర రూపముగా భావిస్తారు.ధ్యానిస్తారు.
 ఈ విధమైన అర్చనావిధానము సులభసాధ్యముకాదు.అందుకే అఖిలభువనములపై అవ్యాజకరుణతో అంతర్యామి తన తేజస్సును అనేకానేకములుగా విస్తరింపచేస్తూ-తాను వ్యాపిస్తూ సకలములను జాగృతం చేస్తాడు.
 చర్మ చక్షువులకు తన తేజస్సుతో దర్శింపచేస్తాడు.
 లేకుంటే జీవకోటి తన సహజలక్షణమిన నిద్రావస్థనుండి /రాత్రి యను
  రాతి స్థితి నుండి జాగృతము కాలేదు.
 రశ్మిమంతం-సముద్యంతమే -మంగళముగాను-సూర్యనారాయణమూర్తిని "సుమంగళునిగాను"కీర్తిస్తారు.అది చింతాశోక ప్రశమనం అని పెద్దలు చెబుతారు.
 చింత-అనుపదము గురించి పరిశీలిస్తే,
 చిత్తవృత్తులను కార్యోన్ముఖముచేయునది కనుక చింత అనబడుతోంది.అంతరంగ శత్రువులను ప్రోత్సహించు స్వభావముకల్ది.
 శోకమునకు కార్య-కారన సంబంధము తెలుపబడుతుంది.కారణము తొలగగానే కార్యము సమసిపోతుంది.శోకము వీడుతుంది.చింత అనిశములో చిత్తములో దాగి గుర్తుచేస్తూనే ఉంటుంది.
 చింత-చింతనము-విచారము-ఆలోచనము అను నాలుగు మనో వికారములను దాటింపచేయుటయే,పంచేంద్రియములను పరమార్త్మ వైపునకు పయనింపచేయుటయే 
 "రశ్మిమంతం-సముద్యంతం." చిత్తవృత్తి ఫలితములు ఆనందదాయకములు కావచ్చును-కాకపోవచ్చును కాని చిత్ప్రకాశుని దర్శనము/స్పర్శనము తేజోమయమై 
 విశ్వామిత్రునిచే చెప్పబడినట్లు
 కర్తవ్యమును-దైవమాహ్నికమనే నిత్య దేవతార్చనమును హెచ్చరిస్తుంది.
 "లోకాన్ క్రియా సు ప్రవర్తం-సముద్యంతం గా నిర్వచిస్తారు పెద్దలు. 
  పరమాత్మ వైభవమును విష్ణుసహస్రనామ స్తోత్రము సైతము,
 " ఓజః తేజః ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః
   ఋద్ధః స్పష్టాక్షరః మంత్రః చంద్రాంశుః భాస్కరః ద్యుతిః' స్వామి నీవే పునర్నిర్మాణమునకు కావలిసిన ఓజస్సువు-నడింపించుటకు కావలిసిన ప్రకాశ-ప్రతాపరూపమైన తేజస్సువు-కాంతిని ధరించినవాడవు-కాంతికి అనుకూలముగా నీ కిరణములలోని అమృతత్త్వమును చంద్రునికి ప్రసాదించినవాడివి,స్పష్టముగా క్షరములేని రూపునిగా దర్శనమిచ్చు పరమాత్మవు-మననముచేసినంతనే రక్షించు మంత్రమును నీవే అని ప్రస్తుతించినది.
 అమృతాంశువులను బీజముచేసి 
 పరమం యో మహత్తేజః పరమం  యో మహత్తపః
 పరమం యో మహత్ బ్రహమం పరమం యః పరాయణ్ అం' అని సర్వముతానైన పరమాత్మను ప్రస్తుతిస్తున్నది.
 పారము చేయగలిగినది పరము.అదే తీరము/ఒడ్డు.
 యన్మండలం సమస్తదివ్యతేజోమయ రూపముగా కీర్తిస్తున్నది.మూర్తిని తనలో అంతర్భాగముచేసుకొనిన మూర్తిమండలము మనలను రక్షించును గాక.
  తం సూర్యం ప్రణమామ్యహం.


 














ANIRVACHANEETAM-ADITYAHRDAYAM(SARVA ESHA RAVI PRABHU-24)

 వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ ।

యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ॥ 24 ॥


  అగ్నిస్వరూపముగా నున్నవాడు-అగ్నికార్య ఫలముగా లభించువాడు అంతర్యామి యైన సూర్యభగవానుడ అని తెలియచేసిన తరువాత అగ్నికార్యమైన క్రతువు-కృతకము-చేయబడుదానీ-చేయువానిని-ఫలితమును తెలియచేయుచున్నాడు.
 సర్వజ్ఞ సర్వమును తెలిసినవాడు.యజ్ఞ యజ్ పరమాత్మ జ్ఞ తెలిసికొనినవాడు.యజ్ఞుడు.తెలిసికొనుటకు అవలంబించు సనాతన సంప్రదాయము యజ్ఞము.నిర్వహించువాడు యజమాని.దానికి సహాయపడు ఇంద్రుయములు తేజస్సులు.సమర్పణము నేను-నాది అన్న స్వార్థభావము.తెలిసికొనినది న మమ నేను అనుకునే ఉపాధి నేనుకాదు.నాలో దాగున నీ చైతన్యమే.దానిని తెలిసికొనుటయే వేదము.వేదముచే తెలుసుకొనువాడు విజ్ఞుడు.ప్రాభవమును తెలిసికొనిన వాడు ప్రాజ్ఞుడు.
 " 

 "అహం క్రతుః అహం యజ్ఞః" ఆర్యోక్తి.పరమాత్మ స్వయముగా తానే యజ్ఞమునని-యజ్ఞఫలితమునని చెప్పుకొనిన మాట.ఇంద్రియములద్వారా అనుభవించు గంధాదులచే వానిని అనుగ్రహించిన స్వామికి త్రికరణముల సాక్షిగా సమర్పించుటయే "యజ్ఞము." సమర్పించువాడు యజమాని.గ్రహించువాడు ప్రభువు.ప్రాభవమును అనుగ్రహించినవాడు.జ్ఞాత-జ్ఞేయము-జ్ఞానము ఒక్కటిగా ప్రకాశించుటయే యజ్ఞము.దానినే 
 " అహం హి సర్వ ఊజ్ఞాం భోక్తాచ-ప్రభురేవచ" అన్న గీతామకరందము.
 దివ్ అనగా తనను గురించిన ఎరుక.అదికలవాడి దేవుడు/దివ్యుడు.దానిని కకితాసహస్రనామము
 " యజ్ఞరూపా-యజ్ఞకర్తా-యహమాన స్వరూపా అంటూ మూర్తామూర్తభేదరాహిత్యమును తెలిపినది.
 అంతేకాకుండా పంచయజ్ఞప్రియా అంటు,
 1.బ్రహ్మౌఅజ్ఞము-
 2.దేవయజ్ఞము
 3,పితౄఅజ్ఞము
 4.భూయ యజ్ఞము
 5.మనుష్యయజ్ఞము ప్రాశస్త్యమును ప్రకటించినది.
 రుద్ర చమక 8వ అనువాకము సైతము యజ్ఞ ప్రాశస్త్యమును-పరికరములను-ఫలితములను ప్రస్తుతించినది.
 యజ్ఞాత్ భవతి పర్జన్య 
 యజ్ఞ కర్మ సముద్భవ అన్న సత్యమును వివరించినది.
 యజ్ఞము అగ్నికార్యము-ఫలితము జలసమృద్ధి.రెండును పరమాత్మయే.
 లోకం అనగా చూచుట-శాస్త్ర గ్రహణము.అన్నింటికి ఆధారము అంతర్యామి యైన పరమాత్మ అని తెలిసికొని,నిష్కళంక మనస్కుడై సేవించిన సర్వము తానై సర్వులకు పరమును అనుగ్రహించువాడు ఆ సూర్యభగవానుడు.
  తం సూర్యం ప్రణమామ్యహం.

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM( ESHA PARINISHTITA-ESHAFALAM-23)


 ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ।

ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్ ॥ 23 ॥
ఆదిత్యహృదయ స్రోత్ర ప్రారంభములో అగస్త్యుడు రామునితో"శృణు గుహ్యం" అన్నారు.ఆ రహస్యమునే వివరిస్తున్నది ప్రస్తుత శ్లోకము.
  సనాతన వైష్ణవ సంప్రదాయానుసారముగా పరమాత్మ 
 పర-వ్యూహ-అర్చ-అంతర్యామి తత్త్వములతో జగత్రక్షణమును కొనసాగిస్తుంటాడు.
 ఆ అ,తర్యామిగా పరమాత్మ సర్వజీచులలో నిద్రావస్థలో-జాగృదావస్థలో పరివేష్ఠించి యుండి ఫలములను అందించుచున్నాడో వివరించుచున్నది.
 
    ఉదే విషయమును విష్ణుసహస్రనామ స్తోత్రము 
 గోవిందో-గోవిదాం పతి అని
 సిద్ధర్థ-సిద్ధసంకల్ప అని
 కామః-కామప్రద అని
 చతురాత్మా-చతుర్వ్యూహ అని
 అప్రమత్త ప్రతిష్టిత అని
 కరనం-కారనం-కర్త-వికర్తా అని పలువిధములుగా ప్రశంసించుచున్నది.కాదనలేని సత్యము.
 ఏషః ఈ పరమాత్మయే 
 భూతేషు -జీవులలో/ఉపాధులలో/ప్రానులలో
 పరివిష్టితః-అంతర్యామిగా దాగియున్న పరమాత్మ.
 సుప్తేషు భూతాని ఏషః-సుషుప్తిదశలోనున్న ప్రాణులలోని అంతర్యామి ఇతనే.అంతేకాదు
 ఏషః జాగర్తి భూతేషు- మెలకువతో నున్న ఉపాధులలో అంతర్యామిగా దాగి ఫలములనందించు పరమాత్మ.
 అంతర్యామిగా ఉన్నా పరమాత్మను అగ్నిహోత్రము ఇతడే-అగ్నికార్య ఫలమును ఇతడే అని కార్య-కారనములత్యొక్క అవినాభావ సంబంధమును మరింత స్పష్టపరచుచున్నది.
 "శ్రియమిచ్చేతు హుతాసనా" అన్న ది ఆర్యోక్తి.
 జీవులలో శ్వాస అను చైతబ్యాగ్నిగా ఉన్నది-చైతన్యరూప ఫలితముగా నున్నది పరమాత్మయే సుమా.
 ఇదే విషయమును "శ్రియమిచ్చ్చేతు విభావయేత్ భవాని" అని లలితా సహస్రనామము స్తుతిస్తున్నది.
ఆదిత్యహృదయ స్రోత్ర ప్రారంభములో అగస్త్యుడు రామునితో"శృణు గుహ్యం" అన్నారు.ఆ రహస్యమునే వివరిస్తున్నది ప్రస్తుత శ్లోకము.
  సనాతన వైష్ణవ సంప్రదాయానుసారముగా పరమాత్మ 
 పర-వ్యూహ-అర్చ-అంతర్యామి తత్త్వములతో జగత్రక్షణమును కొనసాగిస్తుంటాడు.
 ఆ అ,తర్యామిగా పరమాత్మ సర్వజీచులలో నిద్రావస్థలో-జాగృదావస్థలో పరివేష్ఠించి యుండి ఫలములను అందించుచున్నాడో వివరించుచున్నది.
 
    ఉదే విషయమును విష్ణుసహస్రనామ స్తోత్రము 
 గోవిందో-గోవిదాం పతి అని
 సిద్ధర్థ-సిద్ధసంకల్ప అని
 కామః-కామప్రద అని
 చతురాత్మా-చతుర్వ్యూహ అని
 అప్రమత్త ప్రతిష్టిత అని
 కరనం-కారనం-కర్త-వికర్తా అని పలువిధములుగా ప్రశంసించుచున్నది.కాదనలేని సత్యము.
 ఏషః ఈ పరమాత్మయే 
 భూతేషు -జీవులలో/ఉపాధులలో/ప్రానులలో
 పరివిష్టితః-అంతర్యామిగా దాగియున్న పరమాత్మ.
 సుప్తేషు భూతాని ఏషః-సుషుప్తిదశలోనున్న ప్రాణులలోని అంతర్యామి ఇతనే.అంతేకాదు
 ఏషః జాగర్తి భూతేషు- మెలకువతో నున్న ఉపాధులలో అంతర్యామిగా దాగి ఫలములనందించు పరమాత్మ.
 అంతర్యామిగా ఉన్నా పరమాత్మను అగ్నిహోత్రము ఇతడే-అగ్నికార్య ఫలమును ఇతడే అని కార్య-కారనములత్యొక్క అవినాభావ సంబంధమును మరింత స్పష్టపరచుచున్నది.
 "శ్రియమిచ్చేతు హుతాసనా" అన్న ది ఆర్యోక్తి.
 జీవులలో శ్వాస అను చైతబ్యాగ్నిగా ఉన్నది-చైతన్యరూప ఫలితముగా నున్నది పరమాత్మయే సుమా.
 ఇదే విషయమును "శ్రియమిచ్చ్చేతు విభావయేత్ భవాని" అని లలితా సహస్రనామము స్తుతిస్తున్నది.
 అమ్మవారు చిదగ్నికుండ సంభూతాగా సనాతనము సంస్తుతిస్తున్నది.ఆమెయే
 "విశ్వరూపా జాగరిణీ స్వపంక్తీ తైజసాత్మికా"
 అంతే కాదు విష్ణుసహస్రనామ పూర్వపీఠికలో వచించినట్లు,ముఖమపి దహనో"
 విరాత్పురుషుని ముఖమే అగ్ని.దానిద్వారా అందించిన హవిస్సులే విశ్వశ్రేయస్సుకు సంభవము.ఏ విధముగా మన దేహములోని సర్వ అవయములు తమ శక్తిని నోటిద్వారా గ్రహించిన ఆహారము అందించు శక్తిచే పొందగలవో అదే విధముగా విశ్వశ్రేయస్సును కలిగించే అగ్నికార్యము మాత్రమే.
 అందుకే పరమాత్మ సూర్యనారాయణునిగా భావించి-పూజించునపుడు
 ఏషయే అగ్నిహోత్రము మరియును ఏష ఇతడే అగ్నిహోత్ర ఫలము.

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(TADEVASRJATI PRABHU-22)

 నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః ।

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ॥ 22 ॥


  ప్రస్తుత శ్లోకము నిరాకార-నిర్గుణ-నిరంజనుని ఏష-ఏవ అను శబ్దముతో ప్రస్తుతిస్తున్నది.యద్భావం తద్భవతి అన్న సూక్తిని అనుసరించి ఆరు సంప్రదాయములలో విష్ణు-శివ-స్కంద-శక్తి-గణపతి-సూర్య /షట్ మత విధానములలో చెప్పబడినట్లు ఒకేఒక పరమాత్మ అనేకానేక నామరూపములతో భాసించుచు,ఆరాధింపబడుతున్నప్పటికిని,
 పంచకేత్య పరాయణమునందు మాత్రము ఒకేఒకాభిప్రాయమును వ్యక్తపరుస్తున్నారు.
  సృష్టి-స్థితి-సమ్హార-తిరోధాన-అనుగ్రహములను పరమాత్మ లీలగా చేస్తూ ప్రకాశిస్తున్నాడు.
 ఒకరి భావనలో వీక్షణమాత్రము-మరొకరి భావనలో జీవోద్ధరణ-ఇంకొకరి భావనలో వైజ్ఞానికము-ఇలా ఐతిహాసికములు ఒక విధముగాను-వేదములు మరొక విధముగాను-ఉపనిషత్తులు ఉదాహరణములతోను వైవిధ్యముగా చెప్పినప్పటికిని సారాంశము మాత్రము ఒక్కటే.
  ఏష అన్న శబ్దమును అగస్త్యుడు ఆదిత్యహృదయ స్తొత్రములో ఇదివరకే,
 ఏష దేవాత్మకో-హి-ఏష తేజస్వీ-ఏష దేవాసురగణాన్ అని స్వామి


 పరమాత్మ ప్రాభవమును విష్ణుసహస్రనామ స్తోత్రము సైతము,
 " నమః సమస్త భూతానాం ఆది భూతాయ భూభృతే
   అనేకరూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే' అని ప్రస్తుతిస్తోంది.అంతేకాదు పరమాత్మను
 " భూతభవ్య భవత్ ప్రభుః
   భూతకృత్ భూత ఉద్భవఓ భూతాత్మా భూతభావనః" అంటూ భూత శబ్దము యొక్క ప్రాముఖ్యతను మరింత వివరిస్తున్నది. 
 
" ఏత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే
  యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే"

  ఆయననె "అనాది నిధనము" గా భావింపబడుతున్న పరమాత్మ.
   ఇదే విషయమును సూర్యమండల స్తోత్రము సైతము
 " యన్మండలం విశ్వ సృజం ప్రసిద్ధం
   ఉత్పత్తి రక్ష ప్రలయం ప్రగల్బం
   యశ్మిన్ జగత్ సంహారతే అఖిలం
   పునాతుమాం అంటూ వేడుకుంటున్నది.
  ఘనవృష్టి-అపామ్మిత్రుడు తన కృపవర్షముతో,
 లోకనాథం-మహత్ భూతం-సర్వభూత భవ ఉద్భవునిగా జ్ఞానులచే స్తుతింపబడుతున్నాడు.
   తం సూర్యం ప్రణమామ్యహం.

Wednesday, April 12, 2023

ANIRVACHANEEYA-ADITYAHRDAYAM(RUCHAYE-LOKASAKSHINE-21)

 తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే ।

నమస్తమోఽభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ॥ 21 ॥


 ప్రస్తుత శ్లోకము కిరణ ప్రాశస్త్యముతో స్వామి విభవమును మరింత స్పష్టపరుస్తున్నది. ఇప్పటివరకు అగస్త్యునిచే చెప్పబడిన ఆదిత్యహ్ర్దయ శ్లోకములలో కరోతి ఇతి కిరణ అన్న సూక్తి ప్రకారము స్వామి దినకరుడు-దివాకరుడు-ప్రభాకరుడు-భాస్కరుడు-అహస్కరుడు-అను కారక శబ్దముచే కీర్తింపబడినాడు.
 అంతే కాదు గభస్తిమాన్-అంశుమాన్-తేస్వన్-రశ్మిమాన్-సముద్యమాన్-వివస్వాన్-తిమిర ఉన్మథనాన్,జ్యోతిషాన్ అంటూ స్వామి యొక్క ప్రకాశము ప్రస్తుతింపబడినది.
 అదే విధముగా తప శబ్దము కూడా 
 శిశిర తపనో,ఆతపీమండలీ,భాస్వర సర్వతాపనఃపాయత్యేషి-తపయేషి    అంటూ తాపమును కలింగునది-తొలగించినదియును తానే అయిన పరమాత్మను గుర్తించి-గౌరవించినది.
 పెద్దలు తప  అన్న శబ్దమునకు ఐశ్వర్య సంకేతముగా కూడా అన్వయిస్తారు.దాని సంకేతమేమో వహ్నయే శబ్ద ప్రాముఖ్యము.
 స్వామి తప్త-కాల్చబడిన-పరిశుద్ధము చేయబడిన 
 చామీకరములు కలవాడు.
 చామీకరము అనగా బంగారు కిరణములు కలవాడు.అనగా ఆ హిరణ్యగర్భుడు-సువర్ణతేజశుడు అగ్నిలో పుటమువేశిన రుచులతో/కాంతులతో నున్న కిరణములతో అగ్నిస్వరూపుడై/సర్వభక్షకుడై పంచకృత్యములనే విశ్వకర్మను లోకసాక్షిగా నుండి జరిపిస్తున్నాడు.అప్పుడు ఎటువంటి చీకటి ప్రవేశించలేని నిర్వికారస్థితి.ఇది బాహ్యము పరిస్థితి.
 కర్మసాక్షి-లోకసాక్షి,స అక్షి కన్నులతో లోక-ఆలోక చూడగలుగువాడు/చూచుచున్నవాడు అయిన హిరణ్యగర్భుడు తమమను అజ్ఞానమును హృదయమునందు అభినిఘ్నాయా-ప్రవేశింప వీలుకానిదిగా చేయుచున్నాడు.దీనినే ఆదిత్యమండల స్తోత్రము,
 "యన్మండలం దీప్తికరం విశాలం
  రత్మప్రభం తీవ్రమనాది రూపం" అనియును
 సమస్త తేజోమయరూపముగాను ప్రస్రుతిస్తూ
 తత్-సత్-వితుర్-వరేణ్య -పునాతుమానన్ను సైతము పునీతుని చేయి అని ప్రార్థించుచున్నది.
 ఇక్కడ ఒకసారి మనము హిరణ్యగర్భ మూలమంత్రమును గుర్తుచేసుకుందాము.
 ఏక ఏవహి లోకానాం సూర్య ఆత్మాదికృత్ హరిః.
   తం సూర్యం ప్రణమామ్యహం.
  

Tuesday, April 11, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(SATRUGHNAAYAAMITAATMANAE-20)

 తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే ।

కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ॥ 20


 ప్రస్తుత శ్లోకములో అమేయాత్మనే స్వామి నిరాకార-నిరంజనత్వమును ప్రస్తుతించుచు విష్ణుసహస్రనామములో చెప్పినట్లుగా " అవ్యయః-పురుషః-సాక్షి" అని పరతత్త్వము యొక్క పరమార్థమే సూర్యనారాయణమూర్తిగా ప్రత్యక్షమగుచున్నట్లు చెప్పకనే చెప్పుచున్నారు.
  అంతే కాదు స్వామిని "దేవాయ" అను మరొక విశేష పదముతోను ప్రస్తుతిస్తునారు అగస్త్యమహర్షి.
 ఇదే విషయమును లలితా రహస్య సహస్రనామము"చిదేకరసరూపిణి" అని కీర్తిస్తున్నది.
 ఒకేఒక ప్రకాసముగా ప్రకటింపబడుతున్న శక్తి.
 ఓజస్తేజో ద్యుతిధర అని సంకీర్తించుచున్నది.
 అదే విషయమును దేవాయ-జ్యోతిషాం పతయే నీకు నమస్కారము అంటున్నది ప్రస్తుత శ్లోకము.
 ఇదే అర్థమును ఇంతకు ముందు హిరణ్యగర్భ-సువర్ణరేతా గా ప్రస్తుతింపబడినది.
 తేజాసమపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుస్తే అని కూడా గుర్తించారు వేదవిదులు.వారిని సైతము జ్యోతులుగా/ముక్తపురుషులుగా భావిస్తే వారిని అనుగ్రహించిన/పాలించిన పరమాత్మ జ్యోతిషాంపతి.
 జ్యోతి అను పదములని కిరణసముదాయముగా సమన్వయించుకుంటే "హరికేశ" కిరణముల సమూహము నక్షత్రములకు-గ్రహములకు-తారలకు అవసరమైన శక్తిని ప్రసాదించి-ప్రకాశింపచేస్తున్నాడు.కనుకనే మనము నక్షత్రములను స్వయం ప్రకాశములు గానే కాకుండా గ్రహములకు-ఉపగ్రహములకు సైతము శక్తిని అందించుచున్నవను వైజ్ఞానిక వాదమునకు సైతము బలపరచుచున్నది.
 మనుము ముందు చర్చించునట్లు వెలుతురుతో పాటుగా వేడిని సైతము అందించే వాడు జ్యోతిషాంపతి.
 ఇక్కడ మనకు కావలిసినది తమోగ్నాయ-చీకట్లను నశింపచేయు వెలుగు-హిమగ్నాయ-మంచును తొలగింపచేయు వేడిని అపరిమితముగా ప్రసాదించు పరమాత్మ.ఇది భౌగోళికము.
 మనలోపల చీకటితో పాటుగా-చైతన్యమును కప్పువేయు జడత్వమను -కృతఘ్నత అను వాని దోషమునకు శత్రువుగా మారి వానిని తొలగించు దివ్యగుణమునకు నమస్కారములు.
  పగటికి అధిపతి కనుక జ్యోతిషాంపతి.జ్ఞానప్రతీక.చైతన్యస్పూర్తి అయిన పరమాత్మ తన దివ్యత్వముతో నా చుట్టు ఉన్న బాహ్య శత్రువులను-నాలోదాగిన అంతః శత్రువులను 
 ఘ్న-నాశనము-ఘ్నాయ-నశింపచేయును గాక.
  తం సూర్యం ప్రణమామ్యహం.

Monday, April 10, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(SURYAAYADITYAVARCHASE-19)

 బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే ।

భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ॥ 19 ॥

 ఒకే పరమాత్మ అనేక విధములుగా పాలనను నిర్వహిస్తూ అనేకానేక గౌణనామములో ప్రస్తుతింపబడుతున్నాడు.
 బృహతి-బృమ్హణతి విశృతమైనది -చైతన్యవంతమైనది యైన పరబ్రహ్మము తనను తాను సృష్టి-స్థితి-లయ అను మూడు ప్రధాన లక్షణములను చేయుచు బ్రహ్మ-ఈశాన-అచ్యుత నామములతో ప్రకాశిస్రున్నది.దీనినే లక్షంఇ అష్టోత్తరము,
 బ్రహ్మ-విష్ణు-శివాత్మికగా ప్రస్తుతించింది.
 మండలాకారములో నున్న పరమాత్మయే సూర్యునిగా కూడా కీర్తిస్తున్నాడు.
 సురతి-ప్రేరయతి సూర్యః అన్నది ఆర్యోక్తి.
 సు-రయతి-జనములను/జగములను కర్మలయందు ప్రేరేపించువాడు సూర్యుడు.
 సుష్టు-ఇరయతి సూర్యః అనునది మరొక సమర్థనము.
 సకలమును వ్యాపించి-పాలించువాడు సూర్యుడు.
 అంతరో యమయతి సూర్యః-అంతర్యామిగా దాగి అన్ని నామరూపములలో చైతన్య ప్రసరణమును చేయువాడు సూర్యుడు.
 అంతరాత్మయే సూర్యునిగా భావిస్తారు.భాసిస్తాడని అంటారు.
 భావనలో సైతము భాసించబడుటయే వపు-శరీరముగా/రూపముగా/ఉపాధిగా భావనలోను-బాహ్యములోను ప్రకాశించు లక్షణమే వర్చస్సు.
  ఒక సూర్యుండు సమస్తజీవులకు తానొక్కక్కదై తోచు అన్న విధముగా పరమాత్మ పంచకృత్యములను నిర్వర్తించు ప్రధాన శక్తిగా నిర్వచిస్తున్నది ఈ శ్లోకము.
 మొదటి భాగములో సూర్య పరమాత్మయే సృష్టి-స్థితి-లయ అను మూడు కార్యములను నిర్వహిస్తాడని చెప్పుతున్నది.
 తేజసామపై తేజస్వి-జ్యోతిషా పతి యైన సూర్యుడు బ్రహ్మ అను నామముతో-ఈశానుడు అను నామముతో-అచ్యుతుడు అను నామముతో,పర రూపముగా నున్న పరమాత్మ-ఈశవ్రునిగా వైభవ రూపమును ధరించి-సూర్యునిగా అర్చామూర్తిగాను దర్శమిస్తున్నాడు.
 అంతేకాదు అదే పరమాత్మ తాను ప్రళస్వరూపముగా అంతటను తిరోధానపరచి-సర్వ భక్షకుడిగాను మారి భాసించుచున్నాడు.
 ఇదే విషయమును లలితా సహస్రనామము మహాగ్రాసా-మహా అసనా అని స్తుతిస్తున్నది.బ్రహ్మాందము సైతము పరమాత్మకు(మృత్యువుతో సహా) పరమాత్మకు ఆహారముగా మారి భక్షింపబడుతుంది.బ్రహ్మాండముతో పాటుగా బ్రహ్మ సైతము పరబ్రహ్మములో కలిసిపోతాడు.
 సర్భ భక్షకుడైన పరమాత్మ జలమయమైన /అంధకారమైన ప్రళయములో సైతము సర్వ భక్షకుడై యుండియు భాసిస్తుంటాడు.
 సర్వ రోదనములను హరించివేసి రౌద్ర శరీరుడై ప్రకాశిస్రుంటాడు.కనుకనే "ఆదిత్యానాం -మహావిష్ణుః అని స్తుతిస్తారు.

 రుజాన్  ద్రావయతి ఇతి రుద్రః.దుఃఖమును-దుఃఖ కారణమును నిర్మూలించువాడు రుద్రుడు.ఆదిత్యుని వర్చస్సు సర్వభక్యాయ అన్న సంకేతముతో అగ్నిహోత్రునిగాను ప్రస్తుతింపబడుతున్నది.ఆ పరంజ్యోతియే"అర్కం జ్యోతి అహం శివః' అన్న సూక్తి ప్రకారము బ్రహ్మమే బ్రహ్మగా-శివునిగా-విష్ణువుగా అగ్నిగా-అత్తి-భాతి స్వభావముగా కలవాడుగా,ఆదాన-ప్రదానునిగా ,విష్ణుసహస్రనామములో చెప్పినట్లు
 "అనిర్దేశ వపుః శ్రీమాన్ అమేయాత్మ" ఇది రూపము-ఇది స్వభావము అని చెప్పలేని విధముగా ఆత్మ స్వరూపముగా నున్న
 తం సూర్యం ప్రణమామ్యహం.

 

Sunday, April 9, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(SARAMGAAYA NAMONAMAHA-18

 నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః ।

నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ॥ 18


 ప్రస్తుత శ్లోకమును గురించి అర్థముచేసుకునేందుకు ముందుగా నమస్కారమహిమ గురించి ఒక్కసారి ముచ్చటించుకుందాము.
 పంచప్రణవములలో అందరికి అందుబాటులో నున్న ప్రక్రియయే నమస్కారము.
 1.ఓంకారము
 2.స్వాహాకర్ము
 3.స్వధాకారము
 4,వహట్కారము
 5.నమస్కారము అను
 ఐదు ప్రక్రియలను పంచ ప్రణవములుగా చెబుతారు.
 ప్రణవము మాటను మహిమోపేత మంత్రముగా మలుస్తుంది.నం మమ అను నేను అన్నది లేదు-నేనుగా భావింపబడుతున్న ఉపాధిలో నున్నది నీవే పరమాత్మ అన్న సందర్శమునిచ్చునదే నమస్కారము.
 పరమాత్మ సూర్యునిగా అనేకానేక గౌణనామములతో నమస్కరింపబడుతున్నాడు.

  ప్రస్తుత శ్లోకములో స్వామి ఉగ్రాయ-వీరాయ-సారంగాయ-పద్మప్రబోధాయ-ప్రచండాయ -మార్తాండాయ అను వివిధ సంకేతములతో ప్రస్తుతింపబడుతున్నాడు.
 ఉర్గుడు-వీరుడు-సారంగుడు అను మూడు నామములు పరమాత్మ అవ్యాజ అనుగ్రహమును మరింత సుస్పష్టము చేయుచున్నవి.
  స్వామి సారంగుడు అని స్తుతింపబడునప్పుడు అతి తక్కువ సమయములో తన కిరనములచే అతి విస్తీర్ణమును వ్యాప్తి చెందువాడు అని స్వామి కిరణ వ్యాపకత్వమును తెలియచేస్తున్నారు.
 ఇదే విషయమును కిందటి శ్లోకము ఏ ప్రదేశమునుండి కిరనములు ప్రకటింపబడి ప్రకాశిస్తున్నాయో ఆ దిక్కునే పూర్వ-తూరుపుగాను,ఎక్కడ కనుమరుగగుచున్నవో ఆ ప్రదేశమును పశ్చిమ దిక్కుగాను వ్యవహరిస్తున్నారు.దిక్కులకే దిక్కు ఆ పరమాత్మ.
 "ఉగ్రాయ"....
  శబ్దమును అర్థముచేసుకునే ప్రయత్నమును చేద్దాము.
 ఆదిశంకరులు మనకు అందించిన "లక్ష్మీనృసిమ్హ మమదేహి కరావలంబం" అన్న సూక్తిని ఆధారముచేసుకుని ఉగ్రాయ అంటే ఘోరస్వరూపమైన భయంకరునిగా చెప్పుకోలేము.
 రుద్రనమకము సైతము,
 నమ ఉగ్రాయ-భీమాయ అని ఉగ్ర శబ్దమును ప్రస్తావించినది.
 ఉగ్రము-అనగా ఉత్కృష్ట స్థితి.
 ఉత్-గ్రసతి-ఉగ్ర అనగా అన్నింటికిని మించిన ఆనందస్థితి.
 ఉత్కృష్టస్థితియే తానైన వాడు ఆశ్రితులకు అనుగ్రహించువాడు ఉగ్రుడు.వానికి నమస్కారము అనుటయే
 నమః ఉగ్రాయ. 
  నమః వీరాయ
............
 వివిధ ఈరయతి -వీరాయ.
 వివిధ గతులలో సంచరించువాడు-వివిధగతులను అనుగ్రహించువాడు వీరుడు.
 తన శక్తిచే వివిధ ఉపాధులలో సంచరించుచు వివిధ ప్రవృత్తులుగా ప్రకటనమయే వాడు వీరుడు.
 జలచరములకు ఈత-ఖగచరములకు గగన విహారము-నెమలికి కులుకు-కోయిలకు పలుకు-ఇలా అనేకానేక ప్రాభవ ప్రకటనమును చేయువాడు వీరుడు.వానికి నమస్కారములు.
 నమః సారంగాయ
 ..............
 తన ఔదార్యముతో చేతిని అందించీందుకోగల ప్రావీణ్యమును ప్రసాదించిపరంధామమునకు చేర్చు పరమాత్మయే 
 ఉగ్రుడు-వీరుడు-సారంగుడు.
 చేతనులకు కావలిసిన వికసన శక్తిని తన కిరనముల తాకిడిచే అనుగ్రహించువాడు పద్మప్రబోధనుడు.
 పద్మము బాహ్యమునకు సూర్యోదయముచే వికసించును.మంత్రపుష్పములో చెప్పబడినట్లు హృత్పద్మము స్వాము కృపాకిరణముల స్పర్శచే వికసనమగును.అట్టి వికసనమును జరిగిన తరువాతనే జీవుడు పరమాత్మ తన చేతిని అందుకుని ఉత్కృష్టస్థితిని అందించమని వేడుకోగలుగును.స్వామి ప్రచండత్వమును తన అజ్ఞానమును-అపరాధములను ఖండించగల పరమాత్మ తత్త్వమును అర్థముచేసుకోగలుగును.ప్రార్థనచేయగలుగును.పరమార్థమును పొందగలుగును.
  తం సూర్యం ప్రణమామ్యహం.


ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(JAYAAYA-JAYABHADRAAYA)17

 జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః ।

నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ॥ 17 

 ప్రస్తుత శ్లోకములో నమఃనమో అంటూ నమః శబ్దముతో పరమాత్మ జయాయ అని జయభద్రాయ అని హర్యశ్వాయ అని సహస్రాంశ యని ఆదిత్యాయ అని అని ఐదు విశేష నామములతో నమస్కరింపబడుచున్నాడు.
 "జయంతి అనేన ఇతిభక్తా సంసారేతి" 
 సంసారమును దాటించి శుభములను కూర్చువాడు జయుడు.
 అందించిన జయమునకు భద్రతను చేకూర్చూఅడగుటచే జయభద్రుడు.
 భగవద్గీతలో చెప్పబడినట్లు,లేనిది కలుగుచేయుట జయము,వచ్చినదానిని స్థిరముగా నిలుపుట క్షేమము.
 ఆ యోగక్షేమములను సకలమానవాళికిని కలిగించు పరమాత్మయే జయ-జయభద్ర.
 ఐరిహాసిక కథనము ప్రకారము వైకుంఠ ద్వారపాలకులైన జయూని-విజయుని శాపముక్తులను చేయు శ్రీరాముడే వారిపాలిట జయుడు-జయభద్రుడు.
 ఉపాసన అను సద్బుద్ధిని సాధకులలో ప్రేరేపించి వారిని రక్షించు పరమాత్మయే జయ-జయభద్ర.
 సనాతన ధర్మము ప్రకారము ధర్మ-అర్థ-కామ-మోక్షములను చతుర్విధ పురుషార్థములే జయము.వానిని అనుగ్రహించువాడు జయభద్రుడు.
 

 భద్రం కర్ణోభి శృణుయాం దేవాం అంటూ వేదమంత్రము సైతము మా ఇంద్రియములను భద్రమును తెలిసికొనుటకై ఉపయోగపడునట్లు చేయమని వేడుకుంటుంది.
 జయమును కలిగించు వానికి-జయమును భద్రపరచువానికి నమస్కారములు.
 హర్యశ్వాయ నమోనమః.
 ఇక్కడ కూడా రెండు విషయములు ప్రస్తావించబడినవి.
 ఒకటి స్థిర శక్తియైన హరిత్-దిక్కు.రెండవది గమనశక్తియైన కిరణము.దిక్కునుండి ప్రసరించుచున్న కిరణములు/కరములు గల పరమాత్మకు నమస్కారములు.
 సప్త ఛందస్సులు-మన శరీరములోని సప్తధాతువులను కూడా స్వామి ఏడు అశ్వములతో సంకేతిస్తారు.
 శాపమునకు-దానిని పొందిన ఉపాధులను కూడా కొందరు అన్వయిస్తారు.
 భద్రతను కలిగించే స్వామియొక్క వైభవమే హరిదశ్వము.తన తేజస్సుతో పచ్చదనమును భూమికి అందచేయువాడు హరియశ్వుడు.నమస్కారములు.
  

అంశువులు-కిరణములు/కాంతులు.అవి సహస్రములు.అనగా అసంఖ్యాకములు.కిరణములు-వాని అపరిమిత నిర్మాణము-తేజము చెప్పబడినది.అనేకానేక కిరణములతో స్వామి ప్రకాశించు చున్నప్పటికిని ఏడు ముఖ్యమైన కిరనములను ప్రస్తావిస్తారు.అవే,
 " జయో జయశ్చ విజయో జితప్రాణోః జితశ్రమః
   మనోజవో జితక్రోధో వాజినః సప్తకీర్తితః."
 అవే అశ్వములుగా ప్రస్తుతింపబదుతున్నాయంటారు.వానినే ఏడు వారములుగాను,ఏడు రంగులుగాను పరిగణిస్తారు.
   అత్యంత ప్రాముఖ్యతనొందిన పరమాత్మ నామము ఆదిత్యాయ.ఇందులోను అదితి-ఆదిత్యుడు అను ఇద్దరి ప్రసక్తి వచ్చినది.
 అనంతమైన ఆకాశమే అదితి.అద్వైతమే అదితి.దైన్యములేనిది అదితి.అసమానమైనది-అద్వితీయమైనది అదితి.ఆమె చే ప్రకటింపబడినవాడు ఆదిత్యుడు.
 అద్వితీయుడు.అఖండుడు.అంతర్యామి.అన్నింటికన్న ముఖ్యముగా,
 ఆదాన-ప్రదానములు తన స్వభావముగా కలవాడు ఆదిత్యుడు.
 బ్రహ్మవిద్యచే తెలుసుకోదగినవాడు ఆదిత్యుడు.అంతర్-బహిర్ శత్రువులను తొలగించువాడు ఆదిత్యుడు.వామనుడు-ఉపేంద్రుడు-అచ్యుతుడు అన్నీ ఆయననే.

  తం సూర్యం ప్రణమామ్యహం.

Friday, April 7, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(SINADHIPATAYE-16)

 నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః ।

జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ॥ 16 ॥

 ప్రస్తుత శ్లోకములో స్వామిని ఉదయస్తమాన కరునిగను,జ్యోతిర్గనములైన నక్షత్ర-గ్రహ-తరలకు అధిపతిగను-దినామునకు అధిపతిగాను సంభావిస్తూ నమస్కరిస్తున్నారు.
 ద్వాదశ మాసములకు అధిపతిగాను-దశేంద్రియములకు తోడుగా బుద్ధి-మనసును నడిపించువానిగను ప్రస్తుతింపబడిన పరమాత్మ ప్రస్తుత శ్లోకములో వేదమయునిగా ప్రస్తుతింపబడుతున్నాడు.
 నమః పూర్వాయ గిరయే-పూర్దిక్కున ఉదయరూపముగా ప్రకటింపబడు పరమాత్మ నమస్కారము.అనునది ఒక భావము.
 గిరులు అను శబ్దమునకు వాక్కులు అని అన్వయించుకుంటే వేదరూపముగా /యజ్ఞమూర్తిగా కర్మలను మానవులచే ప్రారంభింపచేయు పరమాత్మ నమస్కారములు.
 చైతన్యమును కలిగించు చిద్రూపమా నమస్కారములు.
   తూరుపు దిక్కు అనగానే మెలకువ కార్యాచరణము సంకేతముగా సమన్వయపరచుకుంటే వాటి వలన లభించు ఫలితములే పశ్చిమాద్రి.కర్మల వలన లభించే స్థిరమైన జ్ఞానమే పశ్చిమ అద్రి .స్వామి కార్యాచరనమును తెలియచేసి-మనచే నిర్వర్తింపచేసి-దాని ఫలితమునందించుటయే పశ్చిమాద్రిని చేరుకొనుట.
  దాని పర్యవసానమే యోగులు-సాధకులు-ముక్తపురుషులు పరమాత్మను పొందగలుగుట ఇది పౌరాణిక స్పందనము.
 వైజ్ఞానిక స్పందనము ప్రకారము స్వామి తన ఉదయాస్తమానములను మనచే భ్రమింపచేస్తూ,తన తేజస్సును అనేకానేక నక్షత్రములయందు-తారల యందు-గ్రహములయందు -ఉల్కల యందు ప్రవేశింపచేసి అనేకానేక ఖగోళ వాసములకు అధిపతి యైనాడు.
 అంతేకాదు వేదములచే తూర్పుదిక్కున ఉదయించుచున్నట్లు-జరుగుతు జరుగుతు ఉపనిషత్తులచే బ్రహ్మజ్ఞానమునందించుచు సాఫల్యతను అందించినట్లు,పురాణములు,శాస్త్రములు,వేదాంగములు,ఇతిహాసములు అను అనేక సంప్రదాయ సాహిత్యములను అందించి,వారిలోని మేథకు-వాక్కుకు తానే కారనమయి జ్యోతుర్గనములకు అధిపతియే ,అజ్ఞానపు చీకట్లను పారద్రోలి  జ్ఞానభాస్కరునిగా ప్రకాశించు పరమాత్మకు నమస్కారములు.

    తం సూర్యం ప్రణమామ్యహం.

Thursday, April 6, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(DVAADAsAATMAN NAMOSTUSTUTE-15)

 నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః ।

తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మ-న్నమోఽస్తు తే ॥ 15 ॥

 ప్రస్తుత శ్లోకములో నమస్కార ప్రక్రియ ప్రవేశింపబడినది.అంతేకాదు ఖగోళ వాసులైన నక్షత్రములు-తారలు-గ్రహములు-ఉపగ్రహములలో అంతర్యామిగా దాగి విశ్వరచన చేసిన పరమాత్మ 
 పర-వ్యూహ-అర్చా-అంతర్యామి తత్త్వములు పన్నెండు విధములుగా /ద్వాదశాత్మన్ గా ప్రస్తుతింపబడుతున్నాడు.
 సామాన్య వ్యవహారములో నక్షత్రము-తారలు ఒక్కటిగానే భావింపబడుతున్నప్పటికిని,వైజ్ఞానికముగా సందర్శించిన వారు నక్షత్రములలో అశ్వనీ మొదలైన 27 వాటికి  ప్రాముఖ్యతనిచ్చి వాటిని స్వయంప్రకాశములుగా/పగటిపూటను సైతము మనకు గోచరించువానిగాను భావిస్తారు.
 తారలు అసంఖ్యాకములైనప్పటికిని వాటిని స్వయంప్రకాశములుగా కాక రాత్రియందు మాత్రమే ఆకాశమున కనిపించువానిగా సూర్యశక్తికి కనుమరుగు స్వభావము కలవానిగా భావిస్తారు.
 అదేవిధముగా సూర్యుడు నక్షత్రమని వైజ్ఞానికులు-నవగ్రహములో ఒక గ్రహముగా ఐతిహాసికులు భావిస్తారు.అదే విధముగా చంద్రుని ఉపగ్రహముగానే అంగీకరిస్తారు వైజ్ఞానికులు.సూర్య కిరనములనుండి తమ చల్లదనమును-చక్కదనమును కల వెన్నెలనందించుచునాడని భావిస్తారు.
 రాహు-కేతులను చాయా /నీడలుగా గ్రహములుగా గణిస్తారు.
 అప్పుడు మిగిలినవి ఐదు గ్రహములే.పంచభూతములను-పంచేంద్రియములతో మేళవించి ప్రపంచమును నడిపించుటకు
 పరమాత్మ అంతర్యామిగా వీనిలోనికి ప్రవేశించి,పన్నెండు విధలుగా పన్నెండు నెలలలో ప్రకాశిస్తూ-పరిపాలిస్తుంటాడు.
 "బృహత్వాత్-బృమ్హణత్వాత్ ఇతి బ్రహ్మ."అన్నింటికంటె ఏదిఉత్కృష్టమైనదో అది,బృహతి.బృమ్హణము అంటే వ్యాపకత్వము.ఏది అన్నిటికంటె మహోత్కృష్టమైనదో,ఏది అన్నింటియందు వ్యాపించి యుందో అదియే "బ్రహ్మము." వేదము ఆదిత్యుని బ్రహ్మముగా కీర్తిస్తుంది.సర్వజీవుల యందలి ఆత్మయే బ్రహ్మము.అది జగతఃస్థుషః -తాను కదలకుండ ఉంటూ అన్నింటిని కదిలించే శక్తి గల స్థావర-జంగమాత్మకము.



TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...