Thursday, April 13, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(TADEVASRJATI PRABHU-22)

 నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః ।

పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ॥ 22 ॥


  ప్రస్తుత శ్లోకము నిరాకార-నిర్గుణ-నిరంజనుని ఏష-ఏవ అను శబ్దముతో ప్రస్తుతిస్తున్నది.యద్భావం తద్భవతి అన్న సూక్తిని అనుసరించి ఆరు సంప్రదాయములలో విష్ణు-శివ-స్కంద-శక్తి-గణపతి-సూర్య /షట్ మత విధానములలో చెప్పబడినట్లు ఒకేఒక పరమాత్మ అనేకానేక నామరూపములతో భాసించుచు,ఆరాధింపబడుతున్నప్పటికిని,
 పంచకేత్య పరాయణమునందు మాత్రము ఒకేఒకాభిప్రాయమును వ్యక్తపరుస్తున్నారు.
  సృష్టి-స్థితి-సమ్హార-తిరోధాన-అనుగ్రహములను పరమాత్మ లీలగా చేస్తూ ప్రకాశిస్తున్నాడు.
 ఒకరి భావనలో వీక్షణమాత్రము-మరొకరి భావనలో జీవోద్ధరణ-ఇంకొకరి భావనలో వైజ్ఞానికము-ఇలా ఐతిహాసికములు ఒక విధముగాను-వేదములు మరొక విధముగాను-ఉపనిషత్తులు ఉదాహరణములతోను వైవిధ్యముగా చెప్పినప్పటికిని సారాంశము మాత్రము ఒక్కటే.
  ఏష అన్న శబ్దమును అగస్త్యుడు ఆదిత్యహృదయ స్తొత్రములో ఇదివరకే,
 ఏష దేవాత్మకో-హి-ఏష తేజస్వీ-ఏష దేవాసురగణాన్ అని స్వామి


 పరమాత్మ ప్రాభవమును విష్ణుసహస్రనామ స్తోత్రము సైతము,
 " నమః సమస్త భూతానాం ఆది భూతాయ భూభృతే
   అనేకరూప రూపాయ విష్ణవే ప్రభవిష్ణవే' అని ప్రస్తుతిస్తోంది.అంతేకాదు పరమాత్మను
 " భూతభవ్య భవత్ ప్రభుః
   భూతకృత్ భూత ఉద్భవఓ భూతాత్మా భూతభావనః" అంటూ భూత శబ్దము యొక్క ప్రాముఖ్యతను మరింత వివరిస్తున్నది. 
 
" ఏత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే
  యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే"

  ఆయననె "అనాది నిధనము" గా భావింపబడుతున్న పరమాత్మ.
   ఇదే విషయమును సూర్యమండల స్తోత్రము సైతము
 " యన్మండలం విశ్వ సృజం ప్రసిద్ధం
   ఉత్పత్తి రక్ష ప్రలయం ప్రగల్బం
   యశ్మిన్ జగత్ సంహారతే అఖిలం
   పునాతుమాం అంటూ వేడుకుంటున్నది.
  ఘనవృష్టి-అపామ్మిత్రుడు తన కృపవర్షముతో,
 లోకనాథం-మహత్ భూతం-సర్వభూత భవ ఉద్భవునిగా జ్ఞానులచే స్తుతింపబడుతున్నాడు.
   తం సూర్యం ప్రణమామ్యహం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...