Sunday, April 9, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(JAYAAYA-JAYABHADRAAYA)17

 జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః ।

నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ॥ 17 

 ప్రస్తుత శ్లోకములో నమఃనమో అంటూ నమః శబ్దముతో పరమాత్మ జయాయ అని జయభద్రాయ అని హర్యశ్వాయ అని సహస్రాంశ యని ఆదిత్యాయ అని అని ఐదు విశేష నామములతో నమస్కరింపబడుచున్నాడు.
 "జయంతి అనేన ఇతిభక్తా సంసారేతి" 
 సంసారమును దాటించి శుభములను కూర్చువాడు జయుడు.
 అందించిన జయమునకు భద్రతను చేకూర్చూఅడగుటచే జయభద్రుడు.
 భగవద్గీతలో చెప్పబడినట్లు,లేనిది కలుగుచేయుట జయము,వచ్చినదానిని స్థిరముగా నిలుపుట క్షేమము.
 ఆ యోగక్షేమములను సకలమానవాళికిని కలిగించు పరమాత్మయే జయ-జయభద్ర.
 ఐరిహాసిక కథనము ప్రకారము వైకుంఠ ద్వారపాలకులైన జయూని-విజయుని శాపముక్తులను చేయు శ్రీరాముడే వారిపాలిట జయుడు-జయభద్రుడు.
 ఉపాసన అను సద్బుద్ధిని సాధకులలో ప్రేరేపించి వారిని రక్షించు పరమాత్మయే జయ-జయభద్ర.
 సనాతన ధర్మము ప్రకారము ధర్మ-అర్థ-కామ-మోక్షములను చతుర్విధ పురుషార్థములే జయము.వానిని అనుగ్రహించువాడు జయభద్రుడు.
 

 భద్రం కర్ణోభి శృణుయాం దేవాం అంటూ వేదమంత్రము సైతము మా ఇంద్రియములను భద్రమును తెలిసికొనుటకై ఉపయోగపడునట్లు చేయమని వేడుకుంటుంది.
 జయమును కలిగించు వానికి-జయమును భద్రపరచువానికి నమస్కారములు.
 హర్యశ్వాయ నమోనమః.
 ఇక్కడ కూడా రెండు విషయములు ప్రస్తావించబడినవి.
 ఒకటి స్థిర శక్తియైన హరిత్-దిక్కు.రెండవది గమనశక్తియైన కిరణము.దిక్కునుండి ప్రసరించుచున్న కిరణములు/కరములు గల పరమాత్మకు నమస్కారములు.
 సప్త ఛందస్సులు-మన శరీరములోని సప్తధాతువులను కూడా స్వామి ఏడు అశ్వములతో సంకేతిస్తారు.
 శాపమునకు-దానిని పొందిన ఉపాధులను కూడా కొందరు అన్వయిస్తారు.
 భద్రతను కలిగించే స్వామియొక్క వైభవమే హరిదశ్వము.తన తేజస్సుతో పచ్చదనమును భూమికి అందచేయువాడు హరియశ్వుడు.నమస్కారములు.
  

అంశువులు-కిరణములు/కాంతులు.అవి సహస్రములు.అనగా అసంఖ్యాకములు.కిరణములు-వాని అపరిమిత నిర్మాణము-తేజము చెప్పబడినది.అనేకానేక కిరణములతో స్వామి ప్రకాశించు చున్నప్పటికిని ఏడు ముఖ్యమైన కిరనములను ప్రస్తావిస్తారు.అవే,
 " జయో జయశ్చ విజయో జితప్రాణోః జితశ్రమః
   మనోజవో జితక్రోధో వాజినః సప్తకీర్తితః."
 అవే అశ్వములుగా ప్రస్తుతింపబదుతున్నాయంటారు.వానినే ఏడు వారములుగాను,ఏడు రంగులుగాను పరిగణిస్తారు.
   అత్యంత ప్రాముఖ్యతనొందిన పరమాత్మ నామము ఆదిత్యాయ.ఇందులోను అదితి-ఆదిత్యుడు అను ఇద్దరి ప్రసక్తి వచ్చినది.
 అనంతమైన ఆకాశమే అదితి.అద్వైతమే అదితి.దైన్యములేనిది అదితి.అసమానమైనది-అద్వితీయమైనది అదితి.ఆమె చే ప్రకటింపబడినవాడు ఆదిత్యుడు.
 అద్వితీయుడు.అఖండుడు.అంతర్యామి.అన్నింటికన్న ముఖ్యముగా,
 ఆదాన-ప్రదానములు తన స్వభావముగా కలవాడు ఆదిత్యుడు.
 బ్రహ్మవిద్యచే తెలుసుకోదగినవాడు ఆదిత్యుడు.అంతర్-బహిర్ శత్రువులను తొలగించువాడు ఆదిత్యుడు.వామనుడు-ఉపేంద్రుడు-అచ్యుతుడు అన్నీ ఆయననే.

  తం సూర్యం ప్రణమామ్యహం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...