Sunday, April 2, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(MAARTAANDAKAHA--12)

 హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ ।

తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకోంఽశుమాన్

 ఐతిహాసిక ప్రకారముగా సూర్యభగవానుడు అదితి గర్భమును జారి మృతమైన అండమునుండి ఉద్భవించినాడనుటకు నిదర్శనముగా చెబుతుంటే సనాతన కథనము ప్రకారము పరమాత్మ బ్రహ్మసైతము జలముగా మారిన మృతాందముగా నున్న సమస్త జగమును పునర్నిర్మించుటకై జలములో తన రేతస్సును ప్రవేశపెట్టి పునః సృష్టిని జరిపిస్తాడని కీర్తిస్తున్నది.
 ప్రస్తుత శ్లోకములోని ప్రతిపదము అనేకానేక సమన్వయములకు సంకేతముగా ఉంటున్నది.అవే,
 హరిదస్వః,సహస్రార్చి,సప్తసప్తి,మరీచిమాన్,తిమిర ఉన్మథనః,శంభు,త్వష్ట,మార్తాండ,అంశుమాన్ అని వర్ణిస్తున్నారు.


 హరిదశ్వః నమోనమః
..................
 హరి అను సబ్డమునకు పలు అర్థములను అందిస్తునారు వ్యాఖ్యాతలు.
 హరించు-తొలగించు అను అర్థమును అన్వయించుకుంటే చీకట్లను అతి త్వరగా హరించగలుగు /అతి వేగముగా పరుగెత్తు చైతన్యశక్తిని/గుర్రములుగా కలవాడు.
 హరిత్ అను శబ్దమును దిక్కుగా కనుక అన్వయించ్య్కుంటే దిక్కుల వైపునకు తన కాంతిని అతిత్వరగా వ్యాపిస్తూ చీకట్లను తొలగించువాడు.
 హరి శబ్దమును విష్ణు పరముగా అన్వయించుకుంటే మనసులోని అజ్ఞానమనే చీకట్లను హరించుటకు తన వాహనమైన గరుత్మంతునెక్కి తేజోమయమొనరించువాడు.
 "ఆప్నోతి-వ్యాప్నోతి" అన్న సూక్తిని గౌరవిస్తూ తన ప్రభలను ప్రకటింపచేసి,ప్రకాశింపచేసే మహత్తర శక్తి.


 అశ్వ శబ్దమును కిరనములుగా ప్రస్తుతించిన తరువాత,సప్తి శబ్దమును సైతము కిరనములుగనే అన్వయిస్తున్నారు.

 సప్తసప్తిః నమో నమః
 ...........
 ఐతిహాస కథనము ప్రకారముగా సప్త అనునది స్వామి యొక్క గుర్రము పేరు.ఒకేఒక గుర్రము మన కన్నులకు ఏడుగుర్రములుగా భావింపబడుచున్నది.ఒకేఒక బ్రహ్మాండము అనేకములుగా భాసించుచున్నది.
మరీచిమాన్ నమోనమః
...............

 మృయంతే శతృః ఇతి మరీచి
 తన యొక్క అసమానమైన కాంతివిశేషములచే శత్రువులను మరణింపచేయువాడు మరీచి.మరీచులలో అత్యుత్తముడు మరీచిమాన్.స్వామి యొక్క కాంతి పుంజముల మేళనమే సుదర్శనచక్రముగాను.త్రిశూలముగాను,వేలాతుధముగాను,తదిర కాంతివంతమైన ఆయుధములుగాను ప్రకటింపబడినట్లు విశ్వసిస్తారు.

  వైజ్ఞానిక పరముగా స్వీకరించాలనుకుంటే ఒకేఒక తెల్లని ప్రకాశమునుండి సప్తవర్ణముల ఇంద్రధనుస్సు ప్రకటింపబడినట్లు సూర్యకాంతి అనేక విధములుగా ఆస్వాదింపబడుతున్నది.
 మనలో ఉండే ముక్కు-కన్ను-చెవి-నోరు లోని ఏడు రంధ్రములను సైతము నియంత్రించువాడు సప్తసప్తి అని కీర్తిస్తారు.
 వారములోని ఏడు విభాగ నిర్దేశకుడిగాను అన్వయిస్తారు.

 పరమాత్మ శక్తి/తేజము ఎన్ని కిరనములుగా వ్యాపించుచున్నదో తెలియచేసిన తరువాత ఆ కిరనములు కలిగించుచున్న శుభములకు కారణభూతుడైన తేజోశక్తిని శంభుః/శుభంకరుడు అని కీర్తిస్తున్నది ప్రస్తుత శ్లోకము.
 ఇక్కడ స్వామి చేయుచున్న రెండు లోకకళ్యాణ గుణములు ప్రస్తుతింప బడుచున్నవి.
 ఒకటి ఉన్మథనము.తొలగింపబడుట.
 స్వామి తిమిరమును ఉన్మథింపచేయుచున్నాడు.భౌగోళికముగాను,వైజ్ఞానికముగాను స్వామి చీకటియందు తాను ప్రవేశించి దానిని తరిమివేయుచున్నాడు.వెలుగు ప్రవేశించగనే చీకటి కనుమరుగవుతుంది.అంటే వెలుతురు చీకటిని సైతము కప్పివేస్తుంది.
 ఇక్కడ ఉన్న చీకటి దేనికి సంకేతము? స్వామి యొక్క వెలుతురు ఆ చీకటిలోని ఏ విధముగా ప్రవేశించి,దానిని తొలగించినది అన్న సందేహమునకు సమాధానముగా బ్రహ్మండము బ్రహ్మముతో సహా అంతా జలమయమైనది.పంచభూతములు సైతము తమ ఉనికిని కోల్పోయ్తిన జడ స్థుతు.
 చాలామంది అనుకునేటత్లు జడస్థితి అంటే ప్రాణములేని స్థితికాదు.ప్రతిస్పందనను కోల్పోతిన స్థితి.అంటే జలము తనలోని అగ్నితత్త్వమును బహిర్గతముచేయలేని నైజముతో నున్నది.
 అట్టి సమయములో పరమాత్మ తన రేతస్సును/శక్తియొక్క చైతన్యబీజమును జలమునందు ప్రవేశింపచేసి పునః సృష్టిని ఆవిష్కరించిన వైనము.
 అదియే మాన్యవంతములైన అంశు/కిరణముల ప్రభావము.
  స్వామిని మార్తాండునిగా గ్రహించి గణుతించే సందర్భము.
  తం సూర్యం ప్రణమామ్యహం.



  








 
 

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...