Wednesday, April 5, 2023

ANIVERCHANEEYAM-ADITYAHRDAYAM(PLAVAMGAMA-13)

 వ్యోమనాథ-స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః ।

ఘనావృష్టిరపాం మిత్రః వింధ్యవీథీ ప్లవంగమః ॥ 13 ॥

  తన హిరణ్యగర్భమునుండి వెలువరచు శక్తి కిరణములద్వారా జగములకు తాపమును కలిగించుచు-తాపమును తొలగించుచున్న శంఖుడు-ఇంద్రియములనుండి-ద్వారా ఆనందమును కలిగించుచున్న పరమాత్మ
 ఖం-అపరిమిత తత్త్వముతో/ప్రకాశముతో ఆనందమును అందించు శంఖ నాముడైన సూర్యుడు ప్రస్తుత శ్లోకములో ప్లవంగముగా మారి సర్వులను తరింపచేయుచున్నాడు.
 ప్లవంగము అన్న పదమునకు "పడవ" అను అర్థమును సమన్వయించుకుంటే "వింధ్యవీధి"  కఠినతరమైన కనుమల మార్గములో సూక్ష్మముగా తానుండి మనలను దాటించువాడు.
 అపరిమితమైన వీధి ఆకాశమార్గముననుండి తన కిరణముల ద్వారా మనకు కావలిసినవి సృష్టించి-పెంచి-మనకు అనుగ్రహించువాడు.
 అలలతో నిండిన సంసారసాగర్మును దాటించుటకు పదవ అయినవాడు ఆ పరమాత్ముడు.
 వ్యోమనాథునిగా కీర్తింపబడు పరమాత్మయే సూర్యభగవానుడు.
 "విశ్వం వ్యయతి సంహృతోతి వ్యోమః" అన్నది ఆర్యోక్తి.
 ఈ విషయమునే శిశిరనాసనః అంటూ కిందటి శ్లోకము ప్రస్తావించినది.
 శిశిరము తొలగుట వసంతము చిగురించుటకు సంకేతము.మోడు ఆకులు రాలితే కాని కొత్త చిగురు కనిపించదు.దానినే తమోభేది అన్న పదము ప్రస్తుత శ్లోకములో సూచిస్తున్నది.
 
 ఇక్కడ తమము అన్న పదము చీకటి అన్న ప్రకృతి స్వభావమునకు,అజ్ఞానము అన్న మానవ స్వభావ సంకేతమునకు,రాహువు అన్న గ్రహ సంబంధ గ్రహణమునకు సూచనగా చెప్పబడినది.
 వీటిని మూడింటిని తొలగించేవాడే వ్యోమనాథుడు.
 గ్రహన సమయములో రాహువు మింగచూసిననౌ మింగుడుపడనివాడు.అజ్ఞానమును తొలగించి ఆత్మస్థైర్యమును కలిగించువాడు వ్యోమనాథుడు.
 వ్యోమము అనగా ఆకాశము అను అర్థమును అన్వయించుకుంటే కాశము వెలుగు-ఆకాశము  
 ఆ-సమస్తాత్-అన్న సూక్తిని ఆధారము చేసుకొని అంతట వెలుగైన వాడు వ్యోమనాథుడు.అనగా
 తమోగుణమును పారద్రోలి జ్ఞానమును అనుగ్రహించువాడు.ఉదారహరణముగా హనుమంతుడు స్వామి దగ్గర జ్ఞానసముపార్జనను చేసెనన్న కథనము మనము వినియున్నాము.
 చీకట్లను తొలగించు స్వామి సూర్యోదయమును మనము ప్రతిరోజు ప్రత్యక్షముగా అనుభవిస్తున్నాము.
 రాహువు మింగుటకు ప్రయత్నించినను (గ్రహణ సమయములో) సాధ్యము కాక పోవుటయు గమనించుచునే ఉన్నాము.ఇది ఐతిహాసిక కథనము.
 వైజ్ఞానిక కథనమును అందించినవాడును సూర్యభగవానుడే వ్యోమగామియై తమోభేదిగా నుతింపబడుచున్నాడు.


 స్వామి సుప్రభాత సమయమున ఋఇగ్వేదస్వరూపముగాను-మధ్యాహ్న సమయమున యజుర్వేద స్వరూపముగాను-సాయంత్రసమయమున సామవేద స్వరూపముగాను-త్రయీమయీవేద్యం మూడు వేదముల సంకేతముగా ఆరాధింపబడుచున్నాడు.వీనినే పెద్దలు-శ్రవణ రూపముగను-అధ్యన రూపముగను-సంకీర్తన రూపముగను పారయః గా కీర్తిస్తున్నారు.
 పారయ దిశ పశ్యంతీ పరాయణ అన్నది ఆర్యోక్తి.
 సూర్యనారాయణుడు అపమునకు/జలమునకు మిత్రుడు.సహకరించువాడు.తన తపన కిరనములచే సముద్రజలములను గ్రహించి-స్వచ్చముచేసి వానికి చంద్రుని ఔషధగుణములను జోడించి,మేఘముగా మారి భూమి మీదకు వర్షరూపమున అందించువాడు.
 ఇక్కడ ఘన శబ్దమును మనము రెండు విధములుగా చెప్పుకోవచ్చును.
 ఒకటి గొప్పదైన వర్ష సంపద.
 రెండవది మేఘము అందించు జలసంపద.
 ఇది భౌగోళికము.స్థూలదృష్టికి గోచరించునది.
  ఇంకొకటి సూక్షములో దాగిన గొప్పచైతన్యము.సాత్విక స్వభావము.దోషములను హరించి సత్వసంపన్నునిగా జీవుని చేయకల చమత్కారము. సర్వకర్మల ఫలములను/ఫలితములను పూర్తిగా అనుభవింపచేయువాడు సూర్యభగవానుడు.
 నీటిని రకరకములుగా సముద్రమునకు చేర్చి,ఆ జలములను స్వీకరించి,సంస్కరించి తిరిగి అందించువాడు అపాంపతి.అదేవిధములుగా సకలజీవుల కర్మలఫలితములను స్వీకరించి అనుకూలముగా మలచి తిరిగి అందించువాడు అపాంపతిగా నున్న పరమాత్మ.

 అపాం మిత్ర అను పదమును మనము జలములను ఉత్పత్తిచేయువానినిగానే కాకుండా జలమునందు వసించు నారాయణునిగాను చెప్పుకోవచ్చును.అదియే
 మున్నీట పవళించు నాగశయన అన్న స్తుతివాక్యము.
 అతినిభేదమైన నాడీవ్యవస్థయందు సుషుమ్న గా ప్రవేశించి-ప్రకాశించు ఈశ్వరచైతన్యమే ప్లవంగమ.
   తం సూర్యం ప్రణమామ్యహం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...