Monday, September 11, 2023

kURYAAT KATAAKSHAM KAKYANI-INTRODUCTION


 

   శ్రీ  మాత్రే నమః
   ************

    ప్రియ మిత్రులారా!
  దేవీ శరన్నవరాత్రోత్సవ  శుభకామనలు

   " వాగర్థావివ సంవృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
    జగతః పితరౌ వందే పార్వతీ  పరమేశ్వరౌః" 
    ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు శబ్దము-అర్థము వలె,శాశ్వత అవిభాజ్య సంబంధము కలవారు
 శబ్దార్థ సంభావితమైన సులక్షణ వాగ్ఝరికై మహాకవి/కవికుల తిలకుడు,తన నిజనామమును కనుమరుగు చేసి ఆ కాళికాదేవి దాసునిగా జగద్విఖ్యాతిని గాంచిన కాళిదాస ప్రణీతమైన మరొక అద్భుత-అసమాన స్తోత్ర రాజము "దేవీ దశ శ్లోకిగా" పేరుగాంచిన,13 శ్లోకముల,
 అశ్వధాటీ స్తోత్రరాజము.


   ఈ స్తోత్రము లోని ప్రతి శ్లోకము రసరమ్య గుళికయే.శబ్ద సౌరభ లతికయే.పరమార్థ ప్రకాశ కరదీపికయే.
   స్తోత్రమును పరిచయము చేసికొనిన తదుపరి దాని విశేష వైభవమును ఆకళింపు చేసుకునే ప్రయత్నమును చేద్దాము..
 జగద్గురువులు ఆదిశంకరులు తన సౌందర్యలహరి  స్తోత్రములో స్తుతించినట్లు(38 వ శ్లోకం)
   సమున్మీలిత్ సంవిత్ కమలముగా మన హృదయమును కల్మషరహితమైన బంగరుకమలముగా మన మనసును కనుక మలచగలిగితే,హంసద్వంద్వముగా వచ్చి వారు ,భక్తి అనే మకరందమును గ్రోలుతూ,సకలవిద్యా తత్త్వములను ముచ్చటించుకొనుచు,మనము సమర్పించే స్తోత్రము లోని,
 యదాదత్తే దోషాత్-దోషములను క్షమించి,గుణములను మాత్రమే స్వీకరించి అనుగ్రహిస్తారు.
  కాని "శివ మహిమ్నా స్తోత్రములో"పుష్ప దంతుడు విన్నవించుకొనినట్లు ఆ శంకరుని/శాంకరిని కీర్తించుట
 'అసితగిరి సమస్యాత్ కజ్జలం సింధుపాత్రే
  సురవరుతరు శాఖా లేఖినీ పత్రముర్వీ
  లిఖిత యది గృహీత్వా శారదా సర్వకాలం....
   సముద్రమును పాత్రచేసుకొని,నల్లనికొండను సిరాగా ద్రవింపచేసి,కల్పవృక్షమును కలముగా మలచుకొని,భూమి యను పలకపై సరస్వతీ దేవి  వ్రాయుటకు ఉపక్రమించినను సాధ్యముకాని,
   జగన్మాత వైభవమును పరిచయము చేసుకొనుటకు సాహసించుట తల్లి నాపక్కనే నిలబడి,తన వైభవమును తానే తెలియచేస్తూ,మనలను మంత్రముగ్ధులను చేస్తుందనే నా  ఆశ.

   "యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
   నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః." 

   సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు.

 (అమ్మదయతో  అర్చనకొనసాగుతుంది.)




  

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...