Tuesday, November 21, 2023

KADAA TVAAM PASYAEYAM-09


   కదా త్వాంపశ్యేయం-09 ********************** " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం." " యోగక్షేమధురంధరస్య సకల శ్రేయః ప్రదోయోగినో దృష్ట్వాదృష్ట మతోపదేశ కృతినో బాహ్యంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యమ్మయా శంభో! త్వంపరమాంతరంగ ఇతిమే చిత్తే స్మరామ్యహం." శంకరయ్యా నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి.మనము త్వరగాబయటకు వెళ్ళాలి.సిద్ధమైతే అన్నాడు శివయ్య ఆత్రుతగా. ఈ రోజే వెళ్ళాలా?ఇప్పుడే వెళ్ళాలా శివయ్యా అన్నాడు అయిష్టంగా శంకరయ్య. . ఎందుకో శంకరయ్యకు ఎక్కడికి వెళ్ళాలనిపించటంలేదు.ఎవ్వరిని చూడాలనిపించటంలేదు.రాత్రి వచ్చిన స్వప్నము నుండి బయటకు రావాలనిపించటము లేదు. మౌనముగా ఉన్న శంకరయ్యను చూస్తూ,ఏదో ఆలోచనలో పడ్డట్లున్నావు. నిమ్మకు నీరెత్తినట్లు నిదానముగా అన్నాడు నిష్టూరముగా. ఉలిక్కిపడ్డ శంకరయ్య ఏమిటి విశేషం శివయ్యా.చాలా హడావిడి పెట్టేస్తున్నావు ... అదా! నిన్న నీవు గురువుగారితో మాట్లాడుతున్నప్పుడు-కాసేపు అలా అలా వెళుతుంటే ఒక తుంటరి పిల్లవాడు శివుడు --లో ఉంటాడు..... తో,ఆడుకుంటుంటాడు.ఆయనను ఎందరో తమ దగ్గరకు పిలుస్తుంటారు రమ్మని అని వాళ్ళ తాతకు చెబుతున్నాడు.వాళ్ళను వివరాలు అడుగుదామని నడక వేగము పెంచినప్పటికిని చీకటి పడుతుండటముతో వారెటు వెళ్ళారో తెలియలేదు. వాళ్ళ చిరునామాను చెప్పి సహాయంచేస్తానన్నాడు నాతో పాటుగా నడుస్తున్న .ఒక యువకుడు,అక్కడే చెట్టుకింద కూర్చుంటాడట. పద పద మని బయలుదేర దీసాడు శంకరయ్యను-శివయ్య. నువ్వు త్వరగా బయలుదేరావంటే మన పని సులువు అవుతుంది. ఎక్కడుంటాడని చెబుతాడట ? అడిగాడు శంకరయ్య ? ఇక్కడంటాడో ? అక్కడంటాడో /ఎక్కడో ఒకక్కడంటాడో/ అన్నాడు దరదాగా.అంతలోనే చిన్నపిల్లవాడు కదా.వాడికి అన్నీ ఆటలే. కాని,శంకరయ్యా, నువ్వు మాత్రం అతను చెప్పేదాకా కాస్త మాట్లాడకుండా ఉండు బతిమిలాడాదు శివయ్య. చెట్టును సమీపిస్తున్న వారికి తుమ్మెదనాదం/ఝంకారం వినిపిస్తోంది. అదేమిటి?తుమ్మెదలున్నాయా అక్కడ.అంటే తీయని పదార్థాలు కూడా ఉన్నాయా.అదే పూలతేనె..అలాంటివి..అమాయకముగా అడిగాడు శంకరయ్య. శ్లోకమును మంద్రస్థాయిలో మననము చేసుకుంటున్నాడు చెట్టు కింద కళ్ళుమూసుకుని. " భృంగీఛ్చానటనోత్కటః కరిమదగ్రాహీ స్పురన్మాధవా హ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణా చాదృతః సత్పక్షః సుమనో వనేషు స పునః సాక్షాత్ మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం "శ్రీశైలవాసీ" విభుః." అలికిడి అయినట్లున్నదేమో మెల్లగా కళ్ళువిప్పి వీళ్ళను చూసాదు.దరహాసముతో వచ్చారా శివయ్యగారు మీ మిత్రుని తోడ్కొని అని , ఇక్కదకు కొంతదూరములోనే వాళ్ళూ ఉండేది.తాత-మనవడు.తాతగారు మనవడికి 'శివానందలహరి" శ్లోకాలను నేర్పిస్తూ,అర్థము వివరిస్తుంటారు.మనవడు వాడికి నచ్చినట్లుగా దానిని చెప్పుకుంటుంటాడు.రోజూ ఇదేవరస. వాళ్ళ ఇంటిచిరునామా నసిగాడు శంకరయ్య. వాళ్ళ ఇంటిచిరునామా నవ్వాడు శివయ్య. కుడివైపు పదినిమిషాలు నడిస్తే దారంతా చెట్లు-గట్లు.కదులుతూనే ఉండండి.అక్కడ రాళ్ళు-రప్పలు కొండలు-కోనలుగా అనిపిస్తుంటాయి.కాని మీరు నడవటానికి కాలిబాట ఉంటుంది.ఇంకొక ఐదు నిమిషాలు నడిస్తే అక్కడ ఒక పెద్దైల్లు.శ్రీశైలం అని దానికి వారు పేరుపెట్టారు లెండి.మీరు అక్కడికి వెళ్ళగానే,వారే ఎదురుపడి మిమ్మల్ని లోపలకు తీసుకెళ్ళి, సమాచారము అందిస్తారు అని చెప్పి,మళ్ళీ ధ్యానములోనికి వెళ్ళిపోయాడు ఆ యువకుడు. ఓం నమః శివాయ అని పళ్ళునూరుతూ శంకరయ్య, ఓం నమః అని పరవశిస్తూ శంకరయ్య శ్రీశైలమును సమీపించారు. వరండాలో పిల్లవాడు తుమ్మెదలతో ఆడుకుంటున్నాడు.తేనె తాగమంటూ పువ్వులు పెడుతున్నాడు.ఏనుగు మదజలమటూ గిన్నెలో ద్రవమును ఇస్తున్నాడు.ఒక విల్లును చూపుతూ తాడుగా అల్లుకోమంటున్నాడు.వాటి రెక్కలను చూసి మురిసిపోతున్నాడు.వసంతమాసం-వసంత మాసం అంటూ చప్పట్లు కొడుతున్నాడు. ఒకతుమ్మెద ఇంకొక తుమ్మెదవైపుచూస్తున్నది.అది దాని జతయైన ఆడతుమ్మెద ఏమో.తుమ్మెదను చూస్తూ సైగచేసింది.మొదటి తుమ్మెద ఆడుతోంది.మిగతా తుమ్మెదలు దగ్గరగా వచ్చి ఝంకారముగా నాదముచేస్తున్నాయి.పిల్లవాడు చప్పట్లు కొడుతూ.తుమ్మెదల ఆట బాగుందికదా అన్నాడు. గేటు దగ్గరకు పరిగెత్తాడు శంకరయ్య.శ్రీశైలము అని వ్రాసిఉంది అక్కడ.సరైన చిరునామాయే కదా శివయ్యా అన్నడు అయోమయంగా. దానికి ఆ పిల్లవాడు నిన్న నీవు మా వెనకాలే వచ్చావు కదా.ఇవ్వాళేమో మా ఇంటికే వచ్చావు. నాతో/అదే మాతో ఏమైనా పని ఉందా? అడిగాడు శివయ్యను. ఈ,ఈయనకు /శంకరయ్య ఎక్కడ ఉంటాడో-ఎలా ఉంటాడో నువ్వు చెబితే మాకు సహాయము చేసిన వాడవవుతావు అన్నాడు. ఓస్ ఇంతేనా.ఇక్కదే ఉంటాడు.ఇలా ఉంటాడు అని ఒకపెద్ద తుమ్మెదను చూపిస్తూ చెబుతున్నాడు.అంతేకాదు ఏనుగుమదజలం కావాలంటాడు.మన్మథుని విల్లు చూపమంటాడు.అదిగో ఆ పక్కనున్న తుమ్మెద అదగగానే గంతులు వేస్తుంటాడు.ఇదిగో ఈ తుమ్మెదను చూసి చాలా బాగున్నావంటాడు. మళ్ళీ ఆట మొదలు పెట్టాడు.ఆదమంటున్నాడు.పువ్వులలోని తేనెను వాటిపై వాలి తాగమంటున్నాడు.ఝంకారము చేయమంటున్నాడు.ఏనుగు బొమ్మను చూపిస్తూ మదజలమును సేవించమంటున్నాడు.కాసేపు దాగమంటున్నాడు.మళ్ళీ కనిపించమంటున్నాడు.ఏవేవో మాటలను వాటికిచెప్పి వాటి రెక్కలను తడుముతూ , అల్లరిగా అంటున్నాడు. భృంగీఛ్చానటనోత్కటా కరిమదగ్రాహీ మాధవాహ్లాదో నాదయుతో సుమనోవనేషు సత్పక్షా ......... . ఏమీ వినబడటంలేదు శంకరయ్యకు.విస్తుపోయి చూస్తున్నాడు . ఏమిటి ఈ నల్లని గండుతుమ్మెదనా నేను ఇన్నాళ్ళు వెతికినది అనుకుంటూ,శివయ్య వంక చూస్తున్నాడు చిత్రంగా శంకరయ్య. కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ. 'తన్మై మనః శివ సంకల్పమస్తు వాచే మమశివపంచాక్షరస్తు మనసే మమ శివభావాత్మ మస్తు". పాహిమాం పరమేశ్వరా. (ఏక బిల్వం శివార్పణం)      

 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...