Sunday, November 26, 2023

KADAA TVAAM PASYAEYAM-13


.

(ఏక బిల్వం శివార్పణం)

 



  కదా  త్వాం పశ్యేయం-13

  ********************



 "జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం

  నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం."



 " నాలం వా పరమోపకారక మిదంత్యేకం పశూనాంపతే

  పశ్యన్ కుక్షి గతాంశ్చరాచర గణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం

  సర్వామర్త్య పలాయనౌషధం అతిజ్వాలాకరం భీకరం

  నిక్షిప్తం గరళం గళేన గిళితం నోద్గీర్ణ మేవ త్వయా! 
     అని తన కరుణకు దృష్టామతరముగా ప్రకాశించుచున్న గరలకంఠుని మన మనోఫలకముపై స్థిరముగానిలుపుకుని,ఈనాటి బిల్వార్చనమును  ప్రారంభిద్దాము.

 శంకరయ్య ,  తెలియని సందిగ్ధములో నున్న మనసు నుండి  తేరుకుని,ఆ బాలుని వంకచూస్తూ,సూటిగా నీ తుమ్మెద పరమకరుణాతరగమును నేను నమ్ముటకు,

 నాలం వా?-దృష్టాంతమున్నదా?

 అదియును నమ్మశక్యమైనది అని బాలుని ప్రశ్నించాడు.

   శంకరయ్యనోటినుండి ప్రశ్న వచ్చినదో లేదో తుమ్మెదలన్నీ ఏకకంఠముతో,

 "కంచిత్ కాలం ఉమామహేశ భవతః పాదారవిందార్చనైః

  కంచిత్ ధ్యాన  సమాధిభిశ్చ నతిభి కంచిత్ కథా కర్ణనైః

  కంచిత్ తవ ఈక్షణేశ్చ నుతిభిః కంచిద్ దశామీదృశీం

  యః ప్రాప్నోతి ముదా త్వత్ అర్చితమనా జీవన్ స ముక్తః ఖలుం ",
 అంటూఝంకారమును చేయసాగాయి.

 వినగానే శంకరయ్యా అంటే,అంతే అనుకుంటూ,అయోమయములో పడ్డాడు.

 అప్పుడు ఆబాలుడు మీరేమి కంగారుపడవద్దు శంకరయ్యగారు.

 మీ శంకకు సమాధానమేవాటిఝంకారము.

 అవి మహాదేవునితో,

 కొంచముసేపు పాదసేవనము,మరికొంచము సేపు ధ్యానము,ఇంకొంచము సేపు సమాధిస్థితి,కొంచము సేపు నతిః అంటే నమస్కారములు లెండి,మరికాసేపు  దర్శనము ఏదైనా సరే-ఎంతసేపైనా సరే-ఎన్నిసార్లైనా సరే లభిస్తే వచ్చే ముదమును మించినది ఏముంది.

  కథా శ్రవణము నీకు వినోదమైతే నీ ఆన మేము దానిని ప్రారంభిస్తాము.దానినే అర్చనముగా భావించి,జీవన్ముక్తులవుతాము అని అంటున్నాయండి ఈ తుమ్మెదలు.మహాదేవునితో.

 " గళంతీ శంభో త్వత్ చరిత సరితః" 

  వీటి మాయలో నేనసలు పడకూడదు   అనుకుంటూ  శంకరయ్య నేను మిమ్మల్ని అడిగినది  ఆయన గొప్పతనమునకు ఒక్క ఉదాహరణమును  మాత్రమే చరితలు వద్దు అన్నాడు.బాలుడు ఏదో చెప్పబోయే లోపల ఆ తుమ్మెదలు మేముచెబుతాము వివరముగా.ఒక్క అవకాశము మాకు కలిగించి అంటూ బాలుని చుట్టుముట్టాయి.సరేనని తప్పుకున్నాడు బాలుడు శంకరయ్యను సెలవు కోరుతూ.

  ఒక తుమ్మెద ముందుకు వచ్చి శంకరయ్య గారు మొన్న నీరు చూసిన నాటకములో "ఒకాయన వచ్చి"

 జ్వాలోగ్రం-భీకరముగా మండుచున్న-అతిభయంకరమైన క్షేళం-విషమును చూసి భయపడి పారిపోతున్న సమయమున,మహాదేవుడు తన కరుణతో దానిని అరచేతి యందు నేరేడుపండు వలె ( కిం 
 పక్వ జంబూఫలం) ప్రకాశింపచేసాడు.దానిని మింగలేదు..అనగానే ఎందుకు మింగలేదు మంటపుడుతుందనా...తికమకపెట్టాలని తెలివితక్కువ ప్రశ్నను వేశాడు శంకరయ్య.

  ఆ తుమ్మెద మాత్రం ఏ మాత్రమునొచ్చుకోకుండా,

 " కుక్షి గతాంశ్చ చరాచర గణాన్ రక్షతి" అని,

 అంటే అవాక్కయ్యాడు అర్థము కాక.

 వెంటనే మరో తుమ్మెద ముందుకు వచ్చి అప్పుడు నేను మా అమ్మ గర్భస్థ శిశువుని అనగానే ,మరొక తుమ్మెద వచ్చి నేను  ఒక పక్షి గుడ్డుని,ఇంతలో మూడవ తుమ్మెద వచ్చి నేను గోమాత గర్భములో నున్నదూడను,నాల్గవ తుమ్మెద నేనొక ఐదవ తుమ్మెద నేనొక పాము గుడ్డుని,ఇలా,ఇలా వాటి వృత్తాంతములను  చెప్పుకుపోతున్నాయి.

  మళ్ళీ ఒకసారి వాటివంక చూస్తుంటే,మేమే కాదు మమ్మల్ని ధరించిన వారుకూడా మహాదేవుని కుక్షిలోనే ఉంటారుగా ఎప్పుడు, అంటూ 

 శంకరయ్య గారు మీరు అర్థము చేసుకుంటున్నారనుకుంటున్నాము.

  కొంచము-కొంచము.అంతేనా 

 అంతే కాదండి.అందుకే మహాదేవుడు ఆ విషమును చేతిలో నేరేడు పండుగా చేసి,కంఠములో మణి లాగా నిలిపివేశాడన్నమాట. 

  చాలా తెలివిగా వీటిని నమ్మించవచ్చని భావిస్తూ,ఓ తుమ్మెదలారా మీరు పూజించే ఆ మహాదేవుడు ఆ కాలకూట విషమును ఉమ్మివేయవచ్చునుకదా.కాని ,

 న గిళితం-న ఉద్గీర్ణం-నిక్షిప్తం గరలం అంటున్నారు ఎందుకని?

  అయ్యా శంకరయ్య గారు మీరు ఎప్పుడైనా ఈ పాటను విన్నారా?

 ఏ పాట? అదే,

"పాందవులు పాండవులు తుమ్మెద

 పంచపాండవులోయమ్మ తుమ్మెద" అని,

 అదా,చదువురాని పల్లెవాళ్ళు పాడుతుంటే విన్నానులే.ఏముంది అందులో?


 ఆ తుమ్మెదే పరమాత్మ.

 ఆ పంచ పాందవులే పంచభూతములు

    పంచేంద్రియములు-పంచకోశములు

    పంచతన్మాత్రలు-పంచాంగములు

     అంతెందుకు ఈ ప్రపంచము.

  మహాదేవుడు గరలమును బయటకు ఉమిసాడనుకోండి ప్రపంచమేమయిపోతుంది.?

   తాను మనలోపలనుండి మనలను శక్తివంతులుగా చేస్తున్నాడుకదా అందుకే బయటకు వదలలేదు.

   కుక్షిలోపలకు మింగలేదు.

   కంఠములోనేనిక్షిప్త పరచుకున్నాడు.

  న-అలం వా-ఇంతకంటే దృష్టాంతరము కావాలా మీకు?

  అని అడుగగానే ఒద్దు-ఒద్దు.మిమ్మల్ని కావాలి అంటే ఒక్కొక్క తుమ్మెద నా ముందుకు వచ్చి,నేను అప్పుడు చెట్టుని,గట్టునని ,గుట్టనని,కడలినని, చీమనని,దోమనని .....  కథలు చెబుతారు.

  నిజమే సుమా. ఆ క్షీరసాగర మథన సమయములో మేము ...

   బాగా అర్థమయ్యిందికాని అసలు ఆ మంటలు ఎందుకు వచ్చాయి? ఎవరి నుండివచ్చాయి?

   ఇతర దేవతలు చావులేకుండుటకై క్షీరసాగర మథనము చేస్తున్నప్పుడు వాసుకి (తట్టుకోలేక) నోటి నుండి వచ్చాయి.భయపడి దేవతలు పారిపోబోయారట.అప్పుడు వారుపిరికితనమనే రోగముతో బాధపడుతున్నారట.దానిని తొలగించుటకై మహాదేవుడు (వైద్యుడై)గరళకంఠుడైనాడండి అంటూ ,

 " శివాభ్యాం హృది పునర్భవాభ్యాం స్ఫురత్ అనుభవాభ్యాం నతిరియం" అని నమస్కరిస్తున్న తుమ్మెదల సమూహమునకు వాటిఝంకారముతో బాటుగా మరొక కొత్త గొంతుక జత కలిపినదేమో,

 గమ్మత్తుగావినిపిస్తుంటే,ఆశ్చర్యముగా తమ ప్రభువువైపు  చూస్తున్నాయి.

 ఆనందముగావారందరిని ఆశీర్వదిస్తున్నారు ఆది దంపతులు.



   కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ.

    'తన్మై మనః శివ సంకల్పమస్తు
     వాచే మమశివపంచాక్షరస్తు
     మనసే మమ శివభావాత్మ మస్తు".
     పాహిమాం పరమేశ్వరా.
    (ఏక బిల్వం  శివార్పణం)
 


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...