Monday, December 18, 2023

TIRUPAAVAI-03




 తిరుప్పావై-మూడవ  పాశురము


 *********************


 "మాతః సముత్థితవతీ మది విష్ణుచిత్తం


  విశ్వోపజీవ్యమమృతం వచసా దుహానాం


  తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం


  సంతఃపయోధి దుహితః సహజాం విదుస్త్వాం."




   పూర్వ పాశుర ప్రస్తావనము


    ********************


        రెండవ పాశురములో కృత్యాకృత్య  వివేకమును 

 బోధించిన గోదమ్మ ప్రస్తుత పాశురములో పరమాత్మ 

          "లీలావతారమైన " 

  వామన మూర్తి (మత్స్య-కూర్మ-వరాహ-నారసింహ-వామన- 

  ధర్మసంరక్షనము ఒక్కపర్యాయము అవతరించి-సమస్యను 

  పరిష్కరించి అవతార సమాప్తిని గావించుట) అనుగ్రహమును 

  సోదాహరణముగా చెబుతూ ,కృత్య విభూతిని స్మరిస్తూ ,ఏ 

  విధముగా వామనమూర్తి మూడు అడుగులతో ధర్మమును 

  రక్షించినాడో-అదేవిధముగా మన బాలకృష్ణుడు సైతము మనలను 

     ఉద్ధరించగలడు కనుక సందేహమును వీడి నోమునకు 

     ఉద్యుక్తులమగుదామని ,సత్ఫలితములు కలుగుతాయని 

     చెబుతున్నది.


    అమ్మకు-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను 

   సమర్పించుకుంటూ మూడవ పాశురము లోనికి ప్రవేశిద్దాము.


     మూడవ పాశురం


      ***************


    ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్పాడి


    నాంగళ్ నంబావైక్కుచ్చాత్తి నీరాడినాల్


    తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయిదు


    ఓంగు పెరుం శెన్నల్ ఊడు కయల్ ఉగళ్


    పూంగువళై ప్పోదిల్ పొరివండు కణ్పడుప్ప


     తేంగాదే పుక్కిరుందు శీర్తములై పత్తి


    వాంగక్కుడం నిరైక్కుం వళ్ళల్ పెరుం పశుక్కళ్


    నీంగాద శెల్వం నిరైందు ఏలో రెంబావాయ్.


         పూర్వ పాశురములలో స్వామి వ్యూహ వైభవమును 

 ప్రస్తావించిన గోదమ్మ ప్రస్తుత పాశురములో అవతార


 వైశిష్ట్యాన్ని వివరిస్తున్నది.


 

    అంతేకాక రాక్షస గురువైన శుక్రాచార్యుని మృతసంజీవని 

  బలముతో యుద్ధములో అసురులను జయించుట దేవతలకు 

  అసాధ్యము.ఉపాయము-ఉపేయము తానే అయిన పరమాత్మ 

  జగత్కళ్యాణమునకై త్రివిక్రమునిగా అవతరించి,        ద్గర్మ 

  సంరక్షణమును గావించినాడు.


   ఓంగి ఉలగం అలంది అని పాశుర ప్రారంభము.


   ఓంగి-పెరిగి/విస్తరించి భూమిని-ఆకాశమును కొలిచినాడు అని 

 ఒక అర్థము.


   ఓం-గి అను పదము లోని ఓం ప్రణవము. .ప్రణవస్వరూపుడు 

 తన పాదస్పర్శచే భూమ్యాకాశములను పునీతముచేసినాడు.


 అలంద-కొలిచి,లెక్కించి


 ఉలగం-భూమిని,లోకాలను


   బాలునిగా వచ్చి,మూడు అడుగులు యాచించిన స్వామి


 ఓంగి-పెరిగి కొలిచినాడట.


 సూక్ష్మము-స్థూలము తానైన స్వామి స్పర్శను అనుగ్రహించి 


 ఆశీర్వదించినాడు.


 భక్తులు స్వామిని కొలుచుట లోక రివాజు.స్వామి భూమిని కొలుచుట భోగవిభూతి.


 నం పావైక్కు-మనకు స్వామి అనుగ్రహించిన నోము


 నాంగళ్-స్వార్థరహితము/సకల శ్రేయోదాయకము.


   సంకేతముగా 


        గోదమ్మ వ్రత నైమిత్తికఫలమును-నిత్యఫలమును 

  స్పష్టముగాచెబుతున్నది.


   వారు దేనికై/నిమిత్తమునకై వ్రతముచేయ బూనినారో ఫలితములతో సహా చెబుతున్నది.అవి,


 1.తీంగళ్ ముమ్మారి పెయిదు- నెలకు మూడు వానలు కురియాలి.


 2.చెరువులు నీటితో నిండాలి.


 3.ఓంగు పెరు సెన్నల్-కొలనులలో పెద్ద తామరలు వికసించాలి.(జనులు జ్ఞానవంతులుకావాలి)


 4 ఊడు కయల్ ఉగల్-కొలనులలో కేరింతలతో చేపలు ఎగరాలి(ధర్మము)


 5.పెరుం పశుక్కళ్-పశువులు పాడిని సమృద్ధిగా నీయాలి(న్యాయము)


 మా రేపల్లెతో పాటు-సకలము సుభిక్షముగా నుండి జ్ఞానము-ధర్మము-న్యాయము నాలుగు పాదములతో నుండుట మా యొక్క నైమిత్తిక అభిమతమిది.. 


   కాని, మాకుఇంకొక కామితము కలదు.నీవు మా రేపల్లెకు మాత్రమే కాదు/మమ్ములను సైతము నీ నిత్యవిభూతితో/నిత్యసేవాసౌభాగ్యమనే సంపదతో అనుగ్రహించాలి.నీవే మా పెన్నిధివి-సన్నిధివి.. 


    గోదమ్మ పరమాత్మను "ఉత్తమన్" అని సంబోధించినది.

   బలి చక్రవర్తి దానములు చేసినప్పటికిని,అహముతో దేవతలను సైతము తరిమివేశాడు.కాని పరమాత్మ తన పాదస్పర్శ తో అనుగ్రహించాడు. 



 దోషములలోని గుణములను స్వీకరించగలుగుటయే ఉత్తమలక్షణము కనుక స్వామి మా  దోషములలోని గుణములను స్వీకరించి,మమ్ములను అనుగ్రహింపుము.అట్టి నీ కరుణకు సాక్ష్యములుగా,


 


అవిగో,


     పూంగువళై పోదిల్-వికసించిన నల్లని కలువలు


     వానిలో చేరి మధువును గ్రోలుచు 


      కణ్పడప్ప-మత్తుగా నున్న


       పొరివందు-తుమ్మెదలు.




        ఆచార్యులనెడి తుమ్మెదలు నీ అమృతకథలను 


   ఆస్వాదిస్తూ ఆదమరచిపోతున్నారు.ఆ అనుగ్రహము 


  నీంగాద/నువ్వేకదా.


    ఊడు కయల్ ఉగళ-చేపలు ఆనందముతో కేరింతలు 


   కొడుతున్నవి.వాటి ఆనందమునకు కారణము నీంగాద 


    కన్నా.


   వల్లాల్-ఉదారతగల


  -పెరుం పశుక్కళ్-పెద్దపెద్ద గోవులు


    సిత్రమునై-పాలునిండిన పొదుగులతో


    తెంగడి-ఒక్క నిమిషమైనను సందేహించకుండా


     పాలను కురిపించుచున్నవి.క్షిప్రప్రసాదత్వము.  


   పూర్ణ జ్ఞానులైన ఆచార్యులు క్షణకాలమైనను వ్యర్థము 


   చేయకుండా ఆధ్యాత్మికామృతము వర్షిస్తున్నారు.


 అది నీంగాద సెల్వ అది నువ్వేకదా/నీ కరుణయే కదా


 స్వామి అదియంతయును నీ పాదస్పర్శ సౌభాగ్యమే కదా.


  కృత్య విభూతితో పాటుగా మనలకు 


  నిత్యవిభూతులనందించు స్వామి  వ్రతము అను మిషతో 


   నిత్యకైంకర్య భాగ్యమును ప్రసాదించుము అనుచున్నగోదమ్మ చేతిని పట్టుకుని మన అడుగులను కదుపుదాము.




        ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.







No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...