Saturday, December 16, 2023

TIRUPPAAVAI-01


 


పాశురం-01

*********


 ఆండాళ్  తల్లికి, ఆచార్యులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,అమ్మ అనుగ్రహించినంత మేర, మొదటి పాశురమును అనుసంధానము చేసుకుందాము

.అమ్మ చెప్పినట్లు నారాయణనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు "నమక్కే మనకే" తప్పక పరతరువాయ్-"పరను" అనుగ్రహిస్తాడు అన్న  అమ్మ మాటకు భక్తి యే అర్హతగా స్వామిని అడిగే అధికారముగా భావిస్తూ,


 మార్గళి తింగళ్ మదినిరైంద నన్నాళాల్

 నీరాడప్పోదువీర్ పోదుమినో నేరిళైఈర్

 శీర్మల్గుం అయిప్పాడి చ్చెల్వ చ్చిరుమీర్గాళ్

 కూర్వేల్ కొడున్ తొళిలన్ నందగోపకుమరన్

 ఏరారందకణ్ణి యశోదై ఇళంసింగం

 కార్మేని చెంకణ్ కదిర్మదియుంపోల్ ముగత్తాన్

 నారాయణనే నమక్కే పరై దరువాన్

 పారోర్ పుగళ్ పడిందు ఏలో రెంబావాయ్.

   ఓం నమో భగవతే వాసుదేవాయ.

     ********************** 

   మొదటి పాశురములో యశోదనందుల పుత్రునిగా స్వామి బాలకృష్ణుని అర్చారూపముతో పాటు ,నారాయణుని పర స్వరూపమును తెలియచేస్తూ, శుభసమయమునందు సామూహికముగా గోపికలందరు నోమును నోచుకొనుటకు సంకల్పము-సంసిద్ధము-సానుకూలతను తెలుపుతున్నది.గోదమ్మ.వ్రతఫలితముగా స్వామి" పర" అను వాయిద్యమును మనకు అనుగ్రహిస్తాడు కనుక సుగుణాభరణ భూషితులమై వ్రతమునకు "త్రికరణ శుద్ధులుగా" రండి అని పిలుస్తున్నది.గోదమ్మ.

  త్రికరణములలో సైతము మనస్సు ప్రధానమైనది అది చెప్పినట్లే వాక్కు-కర్మలు పనిచేస్తాయి.మనస్సును నియంత్రించిన గోదమ్మ భావనలో  విల్లిపుత్తూరే రేపల్లె, రంగనాథస్వామియే కృష్ణపరమాత్మ.

   ప్రతి పదము ప్రణవమే.

   ప్రతి వాక్యము పరమాత్మయే.

   ప్రతి పిలుపు స్వామి తలపే

   ప్రతి మాట రాచబాటయే

   ప్రతి హేల రాస లీలయే.

  గోదమ్మ ఆచార్యసంప్రదాయముగా యశోదా-నందుల కుమారునిగా బాలకృష్ణుని స్వరూప-స్వభావములను కీర్తించిన తరువాత,

 ఆయిపాడి-రేపల్లెలో నున్న

 శిరుమీర్గాళ్-కల్లాకపటములేని గోపికలారా

 నీరాడపోదువీర్-స్వామి మ0గళగుణములలో జలకములాడుటకు,వైభవమును అనుభవించుటకు రండి

 నన్నానాల్-మంగళప్రదమైన మార్గళిలో ,

 నీరాడపోదువీర్-స్నానమునకు కలిసిరండి. అని గోపికలను నోమునకు పిలుస్తున్నది. 

ఎం పావై నీరాడపోదువీర్-వ్రతములో  ప్రథమముగా,

మంగళ    స్నానమును ఆచరిద్దాము రండి అని స్నాన ప్రాశస్త్యమును తెలియచేస్తున్నది.

 అంతః బహిః యత్ సర్వం వ్యాప్త నారాయణ స్థితః 

    అని ఆర్తోక్తి. 

,


 కరుణనిండిన-నీలమేఘమువంటి మేనిఛాయ,శెంకణ్-అంటూ అందమైన కన్నులని, కదిర్మదియంపోల్-       చంద్రబింబము వంటి ముఖమును ఆశ్రిత వాత్సల్యమును వివరిస్తూ,స్వామికి నవవిధభక్తుల మిళితమైన నవోన్మేష మధురభక్తితో మా(మన) ధవుని గోష్ఠికి తీసుకొని వెళ్ళుచున్న ,

సమయములో మీరు సైతము  

 పారోర్ పుగళ్పదిదు-వ్రతముచేయు పూనికతో తరలిరండి

 పరై తరువాన్-పర అను వాయిద్యమును పొందుదాము.

 యశోదా-నందులు వారి పూర్వజన్మ సంస్కారముగా 

 గోకులములో జన్మించుట అను శాపరూపమునయశోదా-నందులు,-స్వామిని పుత్రునిగా వరమును పొందిన ధన్యులు.


  సామర్థ్యమునకు ప్రతీకయైన నందుడు తన పరాక్రమవంతమైన భుజములపై  కార్వేల్-పదునైన ఆయుధముతో గోకులమును రక్షిస్తున్నాడు.లేడికన్నులవంటి యశోదాదేవి కృష్ణుని-గోకులమును లాలిస్తున్నది. 

   గోదమ్మ మనకు

 1.ప్రాప్య స్వరూపము

 2.ప్రాపక స్వరూపము

 3.అధికారి స్వరూపము

 4.ఆనంద స్వరూపము అను నాలుగు విశేషములను తెలియచేస్తూ,కార్యోన్ముఖులను చేస్తున్నది.

 అనగా చేతనుల ప్రాప్య ఉపాధి,దానిని సద్వినియోగపరచుకొను విధానము,స్వామి అనుభవమునకు కావలిసిన అర్హతను తెలుసుకొనుట, ఆనందాంబుధిలో మునకలు వేయుటకు,

  కారణము-కరణము-కామితము-కారుణ్యము అయిన పరమాత్మ ఏ మిషను కల్పించనున్నాడో,ఏ విషయములను వివరించనున్నాడో రెండవ పాశురములో అనుసంధానము చేసే ప్రయత్నమును చేద్దాము.అంతవరకు మన చేతిని పట్టుకుని నడిపించుచున్న,


 ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.




No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...