Tuesday, December 26, 2023

TIRUPPAAVAI-PAASURAM 11


   తిరుప్పావై -పాశురము 11

  ****************

 " మాతః సముత్థితివయీ మది విష్ణుచిత్తం

   విశ్వోపజీవ్యమమృతం వచసా దుహానాం

   తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం

   సంతః పయోధిదుహితః సహజాంవిదుస్తాం."


  పూర్వ పాశుర ప్రస్తావనము

  ******************

 కృతకృత్య యైన గోపిక తనను తాను మనోయజ్ఞ హవిస్సుగా మలచుకొని,స్వామిని భోక్తను చేసినది.తులసి సైతము తనను తాను పరిమళముగా మలచుకొని స్వామిచే అలంకరింపబడినది.

 కుంభకరణ పదము అగస్త్యమహర్షిని సంకేతిస్తున్నదని భాష్యకారులు వివరించారు.

 అసలు ఐదవ గోపికను అగస్త్యమహర్షి తో ఎందుకు పోల్చినది గోదమ్మ అన్న సందేహము తప్పక వస్తుంది.పరిహాసముగా 'కుంభకర్ణుని జయించి,నిద్దురను స్వాధీనము చేసికొనినది అన్నప్పటికిని ఆమెది సకలేంద్రియములను ఏకీకృతము చేసి స్వామి లీలాగుణవైభవములను అనుభవిస్తున్న ఉత్త అధికారిణి.

 సత్వగుణ శోభితమైన ఉపాధి కలది శ్రీరామావతారము.శ్రీరాముడు జన్మించినప్పటినుండి అవతార పరిసమాఒతి వరకు ఎటువంతి మానవాతీత లీలలను ప్రకటించలేదు.తన అవతార పరిసమాప్తి సమయమున తన ఆయుధములను-పరివారమును సంకేతములుగా/సూక్ష్మరూపములలో అగస్త్యమహాముని వద్దనుండి తదుపరి శుద్ధసత్వమూర్తియైన శ్రీకృష్ణావతారములో వాటిని అవతారవిశేషములకు తగినట్లుగా మలచి ఇమ్మన్నాడట.ఆ ఇద్దరు నీలమేఘశ్యాములను సేవిస్తూ శ్రీకృష్ణావతారములో వాటినే కొత్త రూపములలో అగస్త్యమహాముని అందించినాడట పరమాత్మకు.బహుశా గోపిక ఈ విషయమునందు తాదాత్మ్యతతో నుండియుందగా గోదమ్మ బహిర్ముఖిని చేసినదని జ్ఞానులు సంకేతిస్తారు.

 

   ప్రస్తుత పాశుర ప్రాభవము

   ************************


  ఇదం ధర్మం-ఇదంక్షాత్రం అంటూ గోకుల వైభవమును వివరిస్తున్న ప్రస్తుత పాశురములో గోదమ్మ,

 1. గోకులములోని గోవులను వేదములుగాను,వేదాంతములైన ఉపనిషత్తులను లేగదూడలుగాను చెబుతూ,మనగోపికను " కోవలర్" వేద సంరక్షిణి అని సంబోధిస్తున్నది.(ఓ బంగరు తీగ)

 2.యోగశాస్త్రాము వివరిస్తూ కుందలిని మూలాధారమునందున్న చుట్లపాము గా మన గోపికను పుట్టలోనున్న పాము అని,సహస్రారమును చేరిన సంకేతముగా పురివిప్పిన నెమలి అని సంకేతించింది.

 

 3.గోపాలురు సత్వశోభితులని,స్వధర్మానుష్ఠానపరులని,అయినప్పటికిని స్వధర్మమునకు గాని/స్వామి ధర్మమునకు గాని శత్రువులు ఏర్పడితే తమకు తామే వెళ్ళి వారిని సమూలముగా నిర్మూలించగల పరాక్రమవంతులని చెప్పింది.

 4.మన గోపికను/మహాజ్ఞానిని,

   "సిత్రాదే-పేశాదే" ఉలకవు-పలుకవు అని దెప్పుతున్న పదములతో ఆమె అహంకార-మమకార రాహిత్యముతో ఉత్తమ అధికారిణిగా నున్నదని సత్యము చెప్పుచున్నది

 5.సదాచారమనే పురివిప్పిన నెమలి విషయవాసనలనే విషపురుగులను దరిచేరనీయదని సూచి,చింది.

 6.వంశ అను పదమును కులమునకు కాని,ఉపాధి పుట్టుకకు కాని సంబంధించినది కాదని,పరమాత్మ-జీవాత్మల పటిష్ఠ సంబంధమే నని ,

 గోవిందుడు-గోకులము-గోపాలురు-గోపికలు అన్న జ్ఞాన సంబంధమును కలిగియున్న సూచించిన,

   అమ్మ ఆండాళ్ళుకు-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ ,పాశురములోనికి ప్రవేశిద్దాము.



  పాశురం
  ******
 కట్రుక్కరవై కణంగళ్ పలకరందు
 శెట్రార్తిరళలియం శెన్రు శెరుచ్చెయ్యుం
 కుట్రం ఒన్రిల్లాద "కోవలరం పొర్కిడియె"
 పుట్రుర వల్గున్ పునమయిలే పోదారాయ్
 శుట్రుత్తు తోళీమార్ ఎల్లారుం వందు నిన్
 మూట్రుం పుగుందు "ముగిల్వణ్ణన్ పేర్పాడ"

 'శిట్రాదే-పేశాదే" సెల్వన్ పెండాట్టి,నీ
 ఎట్రుక్కు ఉరంగుం పొరుళేలో రెంబావాయ్.

  మన గోపిక వ్యతిరకావస్థలో నున్నది.గొప్ప వంశ సంజాత.నీలమేఘశ్యాముదైనపరమాత్మను దర్శిస్తూ నాట్యమాడు వనమయూరి.మిగిలిన గోపికలు 'నిన్ మూట్రం పుగుందు" ,
 ఓం నమో నారాయణయా అను అష్టాక్షరి రెండు రెక్కలుగా నున్న నీ గుమ్మము ముందు నిలబడి గోవిందనామ స్మరణము చేస్తున్నాము.నీవు బహిర్ముఖివై మాచే నోమును జరిపించుటకు మాతో రావమ్మా అంటూ తనతో తీసుకుని వెళుతున్న గోదమ్మ చేతిని పట్టుకుని ,మనము అడుగులను కదుపుదాము.
 అండాల్ దివ్య తిరువడిగళే శరణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...