Thursday, December 21, 2023

TIRUPPAAVAI---PASURAM06



 



   తిరుప్పావై-పాశురం06

   ***************** 

 " మాతః సముత్థితవతీ మదివిష్ణుచిత్తం

   విశ్వోప జీవ్యమమృతం వచసా దుహావాం

   తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం

   సంతః పయోధి దుహితః సహజాంవిదుస్త్వాం."



  పూర్వ పాశుర ప్రస్తావనము.

  ********************

 మొదటి ఐదు పాశురములలో గోదమ్మ శుద్ధివ్రతమును తెలియచేసినది.స్వామి పర-వ్యూహ-విభవ-అంతర్యామి-అర్చా మూర్తి తత్త్వమును వివరించినది.చ్గేతనులకు సులభసాధ్యతనూందించుటకై స్వామి శ్రీకృష్ణావతారమును అర్చావైభవమును వివరించి,దానిని ప్రత్యక్షముగా పొందుట               కేవలము ద్వాపర యుగమునందలివారికే పరిమితమైనందున శ్రీవిల్లిపుత్తూరును రేపల్లెగను,తననొక గోపికను భావించుకుని,తన తోటిగోపికలను వ్రతమునకు మేల్కొలిపే 10 పాశురములను ప్రారంభించుచున్నది.ఇది రెందవ భాగముగా వైష్ణవ సంప్రదాయము పరిగణిస్తుంది.

   ప్రస్తుత పాశురములో అమ్మ శృఅణ భక్తికి సంకేతముగా "శబ్దము-శ్రవనము" అను రెండు అంశములను ప్రస్తావిస్తోంది.

  "పది గోపికలు" తపోనిద్రలో నున్న వారు కాని తమోనిద్రలో నున్న వారు కాదు.కనుక వారిని పదిమంది ఆళ్వారులుగా భావిస్తారు.వారు ముందు మార్గదర్శంకముగా నడుస్తుంటే వారి వెనుక చేతనులు కదులుట కద సనాతనము.

 పది గోపికలను" పది ఇంద్రియములుగా కూడా అన్వయిస్తారు.పదీంద్రియములను పక్క త్రోవకు జరుగకుండా పదిమంది జ్ఞానులు తమతో పాటుగా తీసుకుని వెళ్ళి,పరమాత్మను పరిచయము చేస్తారన్న మాటి.

  అవతార లీలగా పూతన-శకటాసుర సంహారమును పాశురములో చెప్పినప్పటికిని,సూక్ష్మతత్త్వమును-పూతనను మనసుగాను-శకటమును శరీరముగాను అన్వయిస్తూ,సన్మార్గుల పాద స్పర్శచే వాటి దోషములు తొలగి,చేతనులు సంస్కరింపబడినట్లు సంకేతిస్తారు.

  ఇంకొక విషయము అసలు గోపికలు అంటే ఎవరు? గోకులములోని కన్నెపిల్లలు మాత్రమేనా? కాదంటారు గురువులు.

 పదిమంది సంతోషము తమదిగా భావించగల నిష్కపట శీలురు గోపికలు.శుద్ధ సత్వగుణ సంకాశులు.

   అమ్మ-ఆళ్వారులకు  నేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,పాశురములోనికి ప్రవేశిద్దాము.



ఆరవ పాశురం.



*************



పుళ్ళుం శిలంబినకాణ్ పుళ్ళరయన్ కోయిలిల్



వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో?



పిళ్ళాయ్! ఎళుందిరాయ్! పేయ్ ములై నంజుండు



కళ్ళచ్చగడం కలక్కళియ క్కాలోచ్చి



వెళ్ళత్తరవిల్ తుయిల్ అమంద విత్తినై



ఉళ్ళత్తు కొండు ముని వర్గళుం యోగి గళుం



మెళ్ళ ఎళుందు అరి ఎన్న పేరరవం



ఉళ్ళంపుగుందు కుళిరేలో రెంబావాయ్.



 "గోవింద గోవింద అని పాడరే

  గోవిందా అనికొలువరే " అంటూ మొదటి గోపికను మేలుకొలుపుటకు తక్కిన కన్నెపిల్లలను తీసుకుని మొదటి గోపికను ఇంటికి వెళ్ళీంది.

 రెందవ పాశురములో చెడు మాటలను చెవికి చేర్చవద్దు అని నియమమును తెలిపిన గోదమ్మ ప్రస్తుత పాశురములో ఆ శ్రవణేంద్రియము దేనిని వినుటకు సాధనముగా మారవలెనో వివరిస్తున్నది.

 మూడు శబ్దములను వినికూడా నిదురపోవుటమును ఖండిస్తున్నది.

1పక్షులకూతలు-పుళ్ళుం శిలంబినకాణ్

2తెల్లని శంఖనాదము-విళి శంగన్ పేరరరవం

3మునులు-యోగులు కళ్లు తెరుస్తున్నప్పుడు మెల్లగాను,తెరిచిన తరువాత బిగ్గరగా చేస్తున్న "హరి హరి" అను శబ్దములు వినలేదా? 

 ఇంకా మేల్కొనలేదా అని మొదటి గోపికతో అంటున్నది.

4.వారు స్వామిపూతన-శకటాసుర భంజనమును కీర్తిస్తున్నారు నీవు వినలేదా ,ఇన్ని శబ్దములను వింటూ  ఇంకా ,

 పిళ్ళాయ ఎళుందిరాయ్" ఇంక మేలుకో.

  ఇక్కడ గోదమ్మ మునిసమూహములు-యోగి సమూహములు 

 ముని వర్గళుం-యోగిగళుం అని రెందు వర్గములను చెప్పటములో ఆంతర్యమేమిటి?

  1.మునులు-మానసికము-తమలో తాము మమేకమై స్వామి నామమును మననము చేసుకొనువారు మునులు.కాని,

 2.కాయకముగా  తమను తాము ఉద్ధరించుకొనుటయే కాక తమతో పాటుగా మరికొందరిని/వీలైతే అందరిని పరమాత్మ దగ్గరకు తీసుకునే వారు యోగులు.

 ఒక విధముగా తపోనిద్రలో నున్న గోపికలు మునులు-వారిని పరోపకార కార్యాచరనమునకు ఉద్యమింపచేస్తున్న గోదమ్మ యోగిని.కనుకనే వారిని తమతో పాటుగా నోము స్థలికి తీసుకుని వెళుతున్నది.

 పాశురము పుళ్ళుం -పక్షుల ప్రస్తావనముతో ప్రారంభమైనది.పక్షుల (స్మరన-శ్రవణ) భక్తిని సంకేతిస్తున్నాయి.

 పక్షులు,

1.భక్తి-విశ్వాసము

2.అనుష్ఠానము-అనుగ్రహము

3.కర్తవ్యము-కైంకర్యము, తమరెక్కలుగా కలిగియున్నవి.

 అవి ఉదయము తమ గూటిని వీడి-తిరిగి సాయంత్రమునకు గూటికి తిరిగి చేరుతాయి.అప్పటివరకు సత్సంగమును చేయుటకు వీలుకాదు.కనుక సుప్రభాత సమయములో అవి,

 శిళాంబి-కిచకిచమనుచు తోటి పక్షులతో,

 "వినరో భాగ్యము విష్ణుకథ

  వెన్నుబలమిదియే -విష్ణుకథ" అని స్వామి వైభవమును చెబుతున్నాయి.కొన్ని స్మరణమును చేస్తుంటే-మరికొన్ని శ్రవణ సౌభాగ్యమును అనుభవిస్తున్నాయి.

 నిదురలేచి చూడు అని నయనేంద్రియమును సైతము జాగరూకపరుస్తున్నది.

 అంతే కాదు మన

 పక్షిరాజునెక్కి-పుళ్ళరయన్

 గరుత్మంతుని ఎక్కి వస్తున్న స్వామిని పరిచయము చేస్తున్నది.





 అమ్మాయి మేము ఇన్ని సంకేతములు చెప్పినను నీవు నిదురలేవకుండుటకు  కారణము నీవు అంతర్ముఖివై,

 పాలకడలిలో-

 శేషసయ్యపై-

 యోగనిద్రలో- నున్న,స్వామి దర్శనమును అనుభవిస్తున్నావేమో.

 నీవొక్కతే పొందుట స్వార్థము.అది మనకు తగదు.పదిమందికి దానిని అందించుటకు మేల్కొని నోమునకు తరలుము,అని విషయవాసనలను విషమును హరించిన,అహంకారమను శకతమును నిర్మూలించిన స్వామినికీర్తిస్తూ,మొదటి గోపికను తనతో పాటుగా తీసుకువెళుతున్న గోదమ్మ చేతిని పట్టుకుని మనము మన అడుగులను కదుపుదాము.



   ఆండాళ్ దివ్య తిరు వడిగళే శరణం. 


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...