Friday, December 29, 2023

tTIRUPPAAVAI-PAASURAM-14


 


 తిరుప్పావై-పాశురం-14

  ******************


 మాతః సముత్థితవతీ మది విష్ణుచిత్తం

 విశ్వోపజీవ్య మమృతం మనసా దుహానాం

 తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం

 సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం.


   పూర్వపాశుర ప్రస్తావనము.

   *********************

 శ్రీ రామావతారము ఎటువంటి లీలను ప్రదర్శించక సామాన్య మానవధర్మములను చాటినది.శ్రెవ్కృష్ణావతారము తానొక ఉపాధిని ప్రకటించుకుని,గొల్లవారితో-గొల్లవానివలె ఆడుటు-పాడుతూ,అవసరమయిన వేళలో తనలీలావిభూతులను ప్రదర్శిస్తూ,ధర్మసంరక్షణమును చేసిన నారాయణుని అర్చామూర్తి యని,ఇరువురును ఒక్కటే అని తెలిపిన గోదమ్మ,

 

   ప్రస్తుత పాశుర ప్రాభవము

   ******************

 1.తంగల్ ఇల్-తిరుమంత్రమును-ఓం నమో నారాయణాయ

 2.తిరువిల్-ద్వయ మంత్రమును-హరి/కృష్ణ

 3.కోయిల్-భగవన్నివాసము అను 

    రహస్య త్రయమును అందించినది.

 2.ప్రత్యక్ష ప్రమాణం-అనుమాన ప్రమాణము-శబ్ద ప్రమాణము మనకు పరిచయము చేసినది

     ఉంగళ్ తొటత్తు-అంటూ,

 గోపికలు తాము వస్తున్న దారిలో వికసిస్తున్న ఎర్ర తామరలు-ముకుళిస్తున్న నల్లకలువలను చూసి,దానిని ప్రామాణీకము చేసుకొని,ప్రస్తుత గోపిక ఇంటి పెరడులోని పూలను చూసినట్లు ఉదహరించారు.ఇదీనుమాన ప్రమాణము.

  గోదమ్మ "వావియుళ్" అని దిగుడు బావిని ప్రస్తావించినది.మనకు స్వామి/ఆచార్యులు అతి సులభముగా జ్ఞానమును అందించుటకు సిద్ధముగా నున్నారు.బావి అయితే నీళ్ళు చేదుకోవాలి.అంత సులభము కాదు.పైగా దిగిడు బావికి మెట్లు దిగిటకు ఆచార్యులు తమ అమృత హసతమునందిస్తారు.అనుగ్రహిస్తారు.

 3.నంగాయ-న్నంగాయ-నాణాదాయ్-నా ఉడయైయ,

  అను మూడు పదములు పైకి నిష్ఠూరములుగా అనిపించినప్పటికిని అవి గోపిక పరిపూర్ణ జ్ఞానమునకు-వాక్షాతుర్యమునకు-అధికారిణి అనుటకు సాక్షయములు.

  4.శంఖ-చక్ర ధారి యైన పరమాత్మను చూపిస్తున్న ,

 అమ్మ ఆండాళ్ తల్లికి-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,పాశురములోనికి ప్రవేశిద్దాము.


పదునాలుగవ పాశురము.

***********************

ఉంగళ్ పుళక్కడై తోటత్తు వావియుళ్

శెంగళు నీర్వాయ్ నెగిందు ఆం పల్వాయ్ కూంబిణగాణ్

శెంగల్ ప్పొడికూరై వెణ్పల్ తవత్తవర్

తంగళ్ తిరుకోయిల్ శంగిడువాన్ పోదందార్

ఎంగళై మున్నం ఎళుప్పువాన్ వాయ్ పేశుం

నంగాయ్ ఎళుందిరాయ్ నాణాడాయ్ నా వుడైయాయ్

శంగొడు శక్కరం ఏందు తడై కయ్యన్

పంగయ కణ్ణానై పాడేలోరెంబావాయ్.

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

*******************************

ఓ! నా వుడైయాయ్-ఓ వాక్చాతురి,నీ మాటలు మాకు నమ్మశక్యముగా లేవు.బహిర్ముఖమగుటకు ఇష్టపడని

నువ్వు, మాతో మాయమాటలను చెప్పుచున్నావు అంటున్నారు ఊహించి దేనిని?

ఆమె ఇంటి పెరటి తోటలోని మణికైరవ(మణులు పొదిగియున్న) కొలను లోని విశేషములను.వారు ఉషోదయమునకు రెండు గుర్తులను తెలియచేస్తు గోపికను మేలుకొలుపుతున్నారు.ఆమె మేల్కాంచియున్నను వీరిమాటలకు లోపల నుండియే సమాధానములిచ్చుచున్నది.

ఇంతకు ఏమి జరిగినదంటే,

ఊంగళ్-నీ యొక్క,(నిష్ఠూరము)

పుళక్కదై-పెరటిలో నున్న,

తోటత్తు-తోటలోని,

వావియుల్-కొలనులో,(దిగుడు బావిలో) 

ఏమి మార్పులు వచ్చాయంటే,

శెంగళునీర్-కెందామరలు,

జ్ఞానమయములై,ఆరాధనకై విచ్చుకున్నవి.

అంతే కాదు,

ఆంపాన్-నీటి కలువలు,నల్ల కలువలు,

వాయ్ కూంబిణ-ముకుళించినవి,ముడుచుకు పోయినవి.

కణ్-చూడు

అనగా తమోగుణము నిష్క్రమించి-ఉషోదయమైనది అనగానే మన గోపిక,తలుపు లోపలి నుండియే,

విచ్చుకున్నవి కెందామరలు కాదు.

నా దగ్గరకు వచ్చుచున్నామన్న సంతోషముతో నిండిన మీ ముఖకమలములు.

అంతే కాదు ముకుళించినవి కూడ మీ ముఖములే.ఇప్పుడు నేను తలుపు తీయలేదని,వ్రతమునకు మీతో వచ్చుటకు సిధ్ధముగా లేనని తెలిసికొని చిన్నబోయినవి అని బదులిచ్చి,

అసలింకా తెల్లవారనే లేదు.తెల్లవారినదన్న భ్రమలో మీరున్నారని బదులిచ్చినది.

మేము వస్తున్న దారిలో కూడ కెందామరలు విచ్చుకున్నవి. మాకు తెలుసులే నీ గడుసరి తనము అన్నారు.(అనుభవ ప్రమాణము)

మన గోపిక తలపులను విడుచుట లేదు.తలుపు తెరుచుట లేదు.ఎంతైన వారి చెలిమి తిరిగి ఆమెను పలుకరించుచున్నది.

చెలి! మన మధ్యన వాదులెందులకు?

"అన్యథా శరణం నాస్తి-త్వమేవ శరణం మమ" అని, నారాయణుని శరణుఘోషలను పలుకుతున్న తాళపుచెవుల గుత్తుల నాదము నీకు వినబడుట లేదా?(శబ్ద ప్రమాణము)


తాళపుచెవుల గుత్తుల ఆ అవకాసమును ఇచ్చినవారెవరు? వారెందులకు వాటిని ధరించి యున్నారు.సంసార మనే బంధించిన తాళమును తీయగల శక్తి స్వామి శరణుఘోషయే అని మనకు సంకేతమునిచ్చుచున్నదా ఆ నాదము.అంటే కాదనలేము కద.


తిరు-పవిత్రమైన,

కోయిలిల్-కోవెలలకు,

పోదుందార్-పోవుచున్నారు. ఎవరు? వారెలా దేనికి సంకేతములిస్తున్నారు?

వెణ్పన్-తెల్లని భస్మమును ధరించి/భస్మధారులై/సత్వగుణ ప్రకాశముతో,

శెంగల్ పొడిక్కురై-కాషాయ/ఎర్రని వస్త్రములను ధరించి,(ఉపాధి వైరాగ్యముతో)

నడుమునకు తాళపుచెవి గుత్తిని ధరించి,( మోక్షమార్గమును అర్థముచేసుకొనినవారు) వారు,

కోయిలిల్-కోవెలలకు,

పోందుదార్-పోవుచున్నారు. ఎందుకు?

(మొదటి ఉపమానములో కెందామరలు ఆరాధనకు సిధ్ధమగుచున్నవి.రెండవ ఉపమానములో కాషాయాంబర ధారులు ఆరాధనకు సిధ్ధమగుచున్నారు.

వీరు,

శెంగిడవాన్-శంఖనాదముతో స్వామిని సేవించుటకు వెళ్ళుచున్నారు.

నాదార్చనకు- నారాయణార్చనకు భేదము లేదు కనుక,

ఓ గోపిక! నీవు తలుపు తెరిచి బయటకు వస్తే మనము స్వామి నోమునకు తరలుదాము అని అంటున్నారు.

అప్పటికిని తలుపు తెరువని గోపికపై కినుకతో వారు,

ఓ నాణాడాయ్-మాటను నిలబెట్టుకొనలేని,అభిమానములేని దానా,

అన్నారు.

మన గోపిక ఎవరికి? ఏమని మాట ఇచ్చినది? ఎందుకు దానిని నిలుపుకోలేక పోయినది?

వాయ్పేశుం-ముందు రోజు గోపికలు మాటను ఇచ్చినది.

ఎంగక్కళై-నేను ( మీ అందరికన్న ముందరే)

మున్ను-ముందరే-పూర్వమే,

ఎళుప్పువాన్-మేల్కాంచి,నోమునకు సిధ్ధముగా ఉంటాను అని,మాట ఇచ్చి,

స్వామి తాదాత్మ్యతతో

నిండి తాను ఇచ్చిన మాటను నిలుపుకొనలేనిదైనది.ఇది బాహ్యార్థము.

దేహాభిమానములేనిది/త్యజించినది/పరమ యోగిని మన గోపిక.ఇది అంతరార్థము.ధన్యురాలు.

చెలి! నీ సంగతి మాకు తెలియదా.

నీవు మా స్వామినివి.పరిపూర్ణురాలివి.సమర్థవంతురాలివి.

ఓ నంగాయ్-నీవు కనుక బయటకు వస్తే,

మనమందరము కలిసి,

తడ్-విశాల,కయ్యన్-భుజములు కలవానిని, వాటియందు,

శెంగత్తు-శెక్కరం-శంఖ-చక్రములను ధరించినవానిని,

పంగయ-పద్మముల వంటి-కణ్ణాణై-కన్నులు కలవానిని-పుండరీకాక్షుని,


పాడి-కీర్తిస్తూ,

ఏలోరెంబావాయ్-నోమును నోచుకొనుటకు వెళుదాము, అని ఆ గోపికను తమతో కలుపుకుని వెళుతున్న గోదమ్మ చేతిని పట్టుకుని,మనము మన అడుగులను కదుపుదాము.

ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం..

.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...