Wednesday, March 6, 2024

ADITYAHRDAYAM-SLOKAM-25




   

 



  ఆదిత్యహృదయము-శ్లోకము-25

  *********************

 ప్రార్థన

 ****

 " జయతు జయతు సూర్యం సప్త లోకైక దీపం

   తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం

   అరుణకిరణ గమ్యం ఆదిం  ఆదిత్యమూర్తిం

   సకలభువన వంద్యం భాస్కరం  తం నమామి."



 పూర్వరంగము

 *********

 శరీర దృఢత్వమునకు ఆచరించే వ్యాయామమును తపముగా పద్మాసనమువేసికొని,సకలంభువనం-చకలము-బుకలము,ఒంటికాలిపైనిలబడి,ఆహారమును స్వల్పముగా తీసుకుంటూ చేసేవిధానమును అదియును అభీష్టసిద్దికై తపము అనుకుంటే,

 ఏ అభీష్టము లేకుండా,బాహ్యముతో సంబంధము లేకుండా,సర్వకాల సర్వావస్థల యందును సత్తు-చిత్తు రెండును తానైన  పరమాత్మను ధ్యానించుమానసిక వ్యాయామము జపము.దానికి సంఖ్యా నియమము లేదు అభీష్టము కానరాదు.

 ఒక విధముగా చెప్పాలంటే, తమో-రజో గుణములు తాకని శుద్ధ సత్వముతో  ఉపాధి నిరపేక్ష అనుసంధానము.

  ప్రాణి చేస్తే జపము.పరమాత్మ చేస్తే అజపా విధానము.శ్వాసప్రక్రియ.

 ప్రస్తుత శ్లోకములో,అగస్త్య భగవానుడు ,రావణుని నీవు సూర్యనారాయణుని అనుగ్రహముతో వధిస్తావని రామునితో    చెప్పి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడని కథనము.


 శ్లోకము
 ******
" అస్మింక్షణే మహాబాహో రావణం త్వం వధిష్యతి
  ఏవం "ఉక్తా" తత్ అగస్త్యో "జగామ" చ "యథాగతం"

  మహాపరాక్రమ వంతుడైన "రామం నిశాచర పతిం"కి  రావణ వధ అత్యంత సమీపములోనే ఉన్నదనిచెప్పి/దీవించి,తాను ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళి పోయాడట అహస్త్యభగవానుడు.
.అది ఒక లీల.రాక-పోకల రామణీయకతే రామాయణము.స్థూల-సూక్ష్మ సంఘర్షణములే రామాయణము.ధర్మాధర్మముల ద్వంద్వ విధానములే రామాయణము.
 పరమాత్మ నరునిగా జన్మించుట-దైవముగా ధర్మము తో పాటుగా ఎదుగుట రామాయణము.

 ఐహికము అను చుట్టు జలమయమైన ద్వీపములో,       
 ప్రపంచములో,లంకా ద్వీపములో చైతన్యమను సీత ఉండి కథను నడిపించునదే రామాయణము.

  అగస్త్యుడు అసలు ఎందుకు వచ్చాడు? 
 యుద్ధము పూర్తి కాకుండానే ఎందుకు వెళ్ళిపోయాడు?
 అగస్త్యుడు రామునికి స్తోత్ర ఉపదేశము చేస్తున్న సేపు రణరంగపు 
  పరిస్థితి  ఏమిటి?
 అన్న సందేహములకు,
 రణ రంగమును కించిత్ సమయము సమ్మోహనముచేసి,లిప్త మాత్ర కాలమున రామునికి స్తోత్రమును ఉపదేశించి,ఉపాగమ్య అయిన అగస్త్యుడు జగామ వెళ్ళిపోయాడు అని పెద్దలు చెబుతారు.
  మరొక అన్వయము ప్రకారము మనకు మరింత అర్థమగుటకు పాత్రలు కల్పితము/సంకేతము .ప్రాధాన్యత పరమార్థము కనుక,
 సూర్య భగవానుడు ఋతుకర్తయై శిశిర ఋతువును ప్రవేశింపచేశాడు.చెట్లాకులు రాలిపోయి పచ్చదనము వెలవెలబోయింది.కాని రెండు నెలలు కాగానే అదే సూర్యభగవానుడు తన కిరణముల స్వభావమునుస్వరూపమును మార్చివేశాడు.పచ్చదనమే-పచ్చదనమే.పూలు-సౌరభాలు-కోకిల కూజితములు.

 అదే భూమి-అదే నీరు-అదేగాలి-......రెంనెలలఓరిమి నిండు దనమును తెచ్చింది.
 కనుక ఓ మనసా! కానికాలమును ఎదుర్కొనగల శక్తి ఓరిమితో కూడిన కూరిమి.
  శుభపరిణామములకు సంకేతముగా/ సందర్భముగా/ సహాయకారిగా సమస్యలు ఉద్భవిస్తాయి.వానిని న గ కదిలించలేని అగస్త్య నామ ఆలోచనా విధానముతో,సహనముతో,నిర్మూలించుకో అనిచెప్పి.అంతరాత్మగా భావించే "అగస్త్య పరమాత్మ" రామునిలోని /చేతనులలోని అంతఃశక్తిని జాగృతం చేసి అంతర్ధానమయినాడు అని తెలుసుకొనుచున్న వేళ,


  తం  సూర్యం  ప్రణమామ్యహం.


   


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...