Friday, March 1, 2024

ADITYAHRDAYAM-SLOKAM-21

 


      ఆదిత్యహృదయం-శ్లోకము-21

      *********************

 ప్రార్థన


 ******

 "జయతు జయతు సూర్యం  సప్త లోకైక దీపం

  తిమిరహిరణ పాప ద్వేషదుఃఖస్య నాసం

  అరుణకిరన గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం

  సకలభువన వంద్యం భాస్కరం  తం నమామి."

 

  పూర్వ రంగము

  ***********

 పరమాత్మ నాశయత్వేవ  వైభూతం

 తదేవ సృజతి అంటూ ప్రలయము తదుపరి సృష్టి,సృష్టి తదుపరి ప్రళయనిర్వహణమును ఏ విధముగా జరిపిస్తారో వివరించిన అగస్త్య భగవానుడు,ప్రస్తుత శ్లోకములో రెండు ముఖ్య అనుగ్రహములను 

 1.సుషుప్తావస్థ నందు పరమాత్మ చైతన్యమును గురించి,అగ్నిహోత్రునిగా -అగ్నిహోత్ర ఫలముగా స్వామి ఉనికిని సంస్తుతిస్తున్నారు.

 

 శ్లోకము

 ******

 "ఏష సుప్తేషు జాగ్రత్తి భూతేషు పరినిష్ఠతః

  ఏష ఏవాగ్నిహోత్రంచ ఫలంచ ఏవాగ్ని హోత్రిణాం."

  అగస్త్యభగవానుడు సుషుప్తి-జాగ్రుతి అన్న రెండు అవస్థలను సూచిస్తున్నారు.

  ఎవరు సుషుప్తిదశలో నున్నది?ఏది సుషుప్తి దశలోనున్న స్థూలములో జాగృతముగా సూక్షముగా నున్నది అన్నది ప్రస్తుతము.

 ఈ విషయమును అర్థము చేసుకోవాలంటే మనము,

పరమాత్మ-ప్రపంచము అన్న రెండింటి మధ్యనున్న,

 స్థూల శరీరము- సూక్ష్మశరీరము-కారణ శరీరము-మహాకారణ శరీరముల గురించి తెలుసుకునే ప్రయత్నమునుచేద్దాము.

 1.పంచభూతములకలయికచే ఏర్పడినది స్థూలశరీరము.ఇది దృశ్య పదార్థములను చూస్తూ ఆనందిస్తుంటుంది.కాని అలిసినది అను నెపముతో పరినిష్టుడైన/అంతర్యామి యైన పరమాత్మను  తాత్కాలికముగా  విస్మరించి/విడివడి నిద్రిస్తుంటుంది 

 ఆ సమయములో అంతర్యామి యైనపరమాత్మ సైతము నిదురిస్తే ఉపాధి చేతనత్వమును కోల్పోతుంది.ఉపాధి తాను నిదురిస్తున్నప్పటికిని,దానిలో అగ్నిహోత్రముగా ప్రకాశిస్తున్న చైతన్యము 

" వైశ్వానరము" జాగృతముగానే ఉంటుంది.

 అదే ,

 స్థూల శరీరములోని వైశ్వానరమనే అగ్ని-దాని ఫలితమైన మనమునిదురలేచి,యధావిధిగా పూర్వస్థితిని కలిగి,మనజీవనమును కొనసాగించటము.


 

 పంచ ప్రాణములు-ఐదు జ్ఞానేంద్రియములు-ఐదు కర్మేంద్రియములు-బుద్ధి-అహంకారము కలిగియుండి కంటికికానరానిది సూక్ష్మశరీరము.ఇందులో అగ్నిహోత్ర రూపముగానున్న పరమాత్మను "తైజసుడు"అని పిలుస్తారు.స్థూలశరీరమునిద్రావస్థలో నున్నప్పటికిని,సూక్ష్మ శరీరము జాగృతమైయుంటు,మనకు అనేకానేక అనుభూతులను అందిస్తుంటుంది.అవియే స్వప్నములు.మెలకువ రాగానే అవి నిజము కాదని తెలిసికును లక్షణమే అగ్నిహోత్ర ఫలము/ఫలితము.


  తరువాత మరింత సూక్ష్ముముగా కారణ శరీరము,దానిని అధిగమించి మహాకారణము పరమాత్మ అంతర్యామి తత్త్వమును-దాని ఫలితమును మనకు వివరిస్తుంటాయి.


 మనలోని అల్పత్వ జ్ఞానము మనలోనున్న పరమాత్మ,మనకు భిన్నముగా ఎంతో దూరముగా నున్నాడన్న భావనలో మనలను ఉంచుతుంది.


 కాని పరిశోధిస్తూ-పరిశీలిస్తుంటే,ఆ దూరము దగ్గరగా మారుతూ మనలోపలనే పరమాత్మనివాసము అన్న తత్త్వమసి ని స్పష్టముచేస్తుంది.


 అగ్నిహోత్ర పదము సైతము స్థూలములోనిప్పుగాను,సూక్ష్మములోఉపాసన గాను భావింపబడుతున్నది.

అదియే "ఉపనిష్ఠిత" అన్న పదము.మన సమీపముగానున్న అంతర్యామిని పోల్చుకోగలుగుట ఫలితము.

 కర్మము-కర్మాచరణము-కర్మఫలితము పరమాత్మయే అన్న విషయమును,


 "కఠోపనిషత్తులోని నచికేత-యమధర్మరాజ సంవాదము" సైతములో నీవు  నిదురిస్తున్నప్పుడు-నీలో ఏది  మెలకువతో ఉంటుందో  అదియే పరమాత్మ అన్న సత్యము అవగతమగుచున్నవేళ,

  తం సూర్యం  ప్రణమామ్యహం.

 


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...