Saturday, April 20, 2024

AMGADEVIS-PARICHAYAMU-01

 


  సనాతనములో ఉపాసనా విధానములు,

ఉపాధి సహిత-ఉపాధి రహిత అని రెండు విధములుగా చెప్పబడినది.

 ద్వంద్వ భావనతో ఎదురుగా ఒకయంత్రమునో/మూర్తినో/మేరువునో అసీనము చేసి తాను జీవుడనను భావనతో స్తోత్రము చేయుచు ఆ యాస్థలములలో/ఆవరణములలో పుష్పార్చనకాని,హరిద్ర-కుంకుమార్చనము కాని చేయు విధానము.

 ఆపరమేశ్వరి అనుగ్రహము అవ్యాజముగా ప్రసరించినచో ఆ సాధకుడు చేయుచున్న అజపావిధానమే వానిలో తానొక ఉపాధి మాత్రమే కాదని దానిలో దాగిన ఆదిశక్తి చైతన్య స్వరూపుణియై ప్రాణశక్తి తానై అనేకానేక శక్తులుగా పంచేంద్రియములుగా భాసిస్తున్నదని తెలిసికొనిన వేళ తనకుఇన్నాళ్ళు అడ్డుగా నున్న మిథ్యాప్రపంచమును గుర్తించగలిగి,ఏకాగ్రచిత్తముతో పారమార్థికము వైపు పయనించగలుగుతాడు.

 పరిపక్వతనొందిన అర్చన తన లోని షడంగములను అమ్మౌంకిని గుర్తించుటకు-అమ్మ అనుగ్రహమునుపొందుటకు సాధనములుగా మలచుకుంటాడు.

 అమ్మ,

"షదంగ దేవతాయుక్త" అను దివ్యానుభూతికిలోనవుతాడు.

 హంస సోహం/సోహమ్హంసను గుర్తించి,

 దేవిఖద్గమాల స్తోత్రమును పారాయణము చేయునపుడు,

 మమఖడ్గ సిద్ధ్యర్థం మూలమంత్రేణ షడగన్యాసంకుర్యాత్" అంటూ,

"ఐం-క్లీం_సౌ" అను మంత్రమును మూడుసార్లుకాని/ఆరు సార్లుకాని/తొమ్మొది సార్లుకాని జపిస్తుంటాడు.ఇవి మహాశక్తివంతములు.ఎన్నింటికో సంకేతములు.సత్ఫలిత ప్రదాయకములు.

  

 " సర్వజ్ఞతా తృప్తి అనాదిబోధః స్వతంత్రతా 

   నిత్యా అలుప్తశక్తి అనంతతాచైతివిధౌ

   షఢాషు అంగాని మహేశ్వరస్య"

 

  వీరిని సాధకుడు,



 నమో హృదయదేవి-శిరోదేవి-శిఖాదేవి-కవచదేవి-నేత్రదేవి-అస్త్రదేవి అని స్తుతిస్తూ అమ్మనంతట దర్శిస్తారు.

 ఆ విధానమును మరింతవివరణగా ఆ నామమునకుషడంగ దేవతా నామమునకు కలసంబంధ-బాంధవ్యములను అమ్మ దయతో తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.


  శ్రీమాత్రేనమః.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...