Saturday, May 11, 2024

SARVA SAmKSHOBHANA CHAKRAMU-PARICHAYAMU


 


  "అష్టదళ కమలమందు నిష్ఠతో నీ ప్రతిమ నిలిపి

   సృష్టికర్తవనువనుచు తెలిసి ఇష్తముగ సేవించుచుంటి

     ఈశ్వరి నీకిదిగోమంగళం

     త్రిపురంతకవాసిని దేవి నీకిదిగో మంగలం"

 

 పరమేశ్వరి దయతో మనము అష్టదళ విలసితమైన సర్వసంక్షోభణ చక్రములోనికి ప్రవేశించుచున్నాము.ఇక్కడానంగశక్తులు గుప్తతర యోగినులుగా త్రిపురసుందరి సమేతులై విరాజిల్లుచున్నారు.

 అమ్మవారిని లక్ష్మీ స్వరూపముగాకీర్తించేటప్పుడు,

 అనంగ పాయనీ/అనంగపారగావీక్షణ శబ్దములు వింటుంటాము.

  అనంగా అను శబ్దమునకు అవిభాజ్యము/అఖందము/అనంతము/అవిఛ్చిన్నము/ఆది-మధ్య-అంతరహితము అన్న భావముతో సమన్వయిస్తారు.

 మనము ఇంతకుముందు "సర్వాశాపరిపూరక చక్రములో" కామాకర్షిణి మొదలగు గుప్తయోగినుల అనుగ్రహమును తెలుసుకున్నాము.

 సామాన్యముగా ఆకర్షణ అనునది ఒక వస్తువుపైనగాని/ఒకమనిషిపైన కాని/ఒకప్రాంతమునందు గాని/ఒక సంఘటనమునందుగాని నిలిచి,కాలక్రమేణ తగ్గుతుంటుంది.అది ప్రాపంచిక విషయసంబంధమైతే పరిణితి చెందక ఉంటుండి.

 కాని "సర్వసంక్షోభణ చక్రము"నందలి గుప్తతర యోగినులు అనంగులు.అపరిమిత శక్తి సంపన్నులు.వారి అనుగ్రహము సైతము గుప్తతరమే.

 వారే,

 కుసుమా

 మేఖలా

 మదనా

 మదనాతురా

 రేఖా

 వేగిని

 అంకుశా

 మాలిని, అను

 ప్రవృత్తి-నివృత్తి-ఉపేక్ష అను మూడు స్వభావములతో నున్న పంచ కర్మేంద్రియ ధర్మాలు.

 మొదటి యొగిని కుసుమ మానస వికాసమునకు అణిమ,బ్రాహ్మీ,కామాకర్షిణి సహాయపడుతున్నారో సాధకుని సత్సంకల్ప వికసనమునకు సహాయపడుతుంది.పరాత్పరి యొక్క  ప్రాభవమును ఆలోచించు చేతనత్వమును  అనుగ్రహిస్తుంది.మేఖలా శక్తి వృత్తాకార స్వభావముతో వికసించుచున్న శక్తి చైతన్యమును జారిపోకుండా కాపాడుతుంటుంది.మణిపూరక చక్ర స్థానమైన నాభిప్రదేశములో సాధకునితో అవిభాజ్యమైన సంబంధమును కలిగియుండి పరాత్పరి వేరు-నేను వేరు అన్న ద్వంద్వభావనలతో నున్న సాధకునికి మదనే యోగిని నిర్ద్వంద్వ భావమును కలిగిస్తుంటుంది.ఆ భావనలకు ప్రోద్బలముగా మదనాతురే యోగిని ఉన్మత్త స్థితికి,ఉన్నది ఒక్కటే రెండుగా కనిపిస్తున్నవన్నె ఒక్కదాని ఆభాస యే అన్న భావనను కలిగిస్తుంటుంది.పదే పదే పరాత్పరి తలంపుతో పరవళ్ళు తొక్కునట్లుగా చేస్తుంది.అనంగ రేఖే సోదాహరణముగా సత్చిత్ రూపమును అనుభవములోనికి తెస్తుంది.ఉదాహరనకు మనము అద్దములో మనముఖమును చూసుకొనునప్పుడు మనముఖ ప్రతిబింబము కనిపిస్తుంది.అదే అద్దము పగిలిపోతే మన ముఖముంటుందికాని ప్రతిబింబముండదు.పోనీ మనము మన ముఖమును పక్కకు జరిపినా మన ప్రతిబింబము అద్దములో కనిపించది.అంటే మనము చూసే మన ప్రతిబింబము ఆభాస.ద్వంద్వము నివృత్తి అయి నిర్ద్వంద్వము ప్రవృత్తిగా మారు వేళ తటస్థభావము రాకుండా అనంగవేగిని గుర్తుచేస్తుంటుంది.అయినప్పటికి గ్రహించలేని ఎడల అనంగాంకుశిని హెచ్చరించి,సర్వ ద్వంద్వ క్షయంకరీ అయిన త్రిపుర సుందరి చక్రేశ్వరినిచర్చి,

 చతుర్దశార చక్ర ప్రవేశతకు అర్హతను కల్పిస్తుంది.

 ఈ మూడు ఆవరనములు భౌతిక పరిణామములకు,జ్ఞాన వికసనమునకు సంబంధించినవి.సాధకుడు ద్వంద్వములోనే ఉంటూ నిర్ద్వంద్వమును కనుగొనే ప్రయత్నములో ఉంటాడు.

  కనుక ఇకపై చక్రములు త్రికోణాకారములో కుశాగ్రబుద్ధి సంకేతముగా ఉంటాయి.


 యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా

 నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...