Thursday, July 11, 2024

GURUMAMDALAM AMTE?


 



  " అనంత సంసార సముద్రతార

    నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం

    వైరాగ్య సామారాజ్యద పూజనాభ్యాం

    నమోనమః శ్రీ గురుపాదుకాభ్యాం."


   "గు"కారో అంధకారస్య  "రు" కారో తత్ నివారనం.

 వృత్తాకారముగా సంకేతించబడినది మండలము.అనేకానేక గురువు స్వరూపప్రకాశముగా అజ్ఞాననమనే చీకటిని తొలగించి స్వస్వరూపమును దర్శింపచేయునది గురు పాదము.

   పరమేశ్వరుడు ఆదిగురువు.పరమేశ్వరి ఆది శిష్యురాలు.వారు జగత్కళ్యానమునకై అనేకానేక నామరూపములతో గురు-శిష్యులుగా అజ్ఞానంధకారమును తొలగిస్తున్నారు.

   ఈ జగత్ సత్యమునే "దేవీఖడ్గమాల స్తోత్రము" గురుమండలముగా కీర్తిస్తున్నది.

 అంటే,

 కేంద్రస్థానమైన బిందువును చేరాలంటే ఎన్నో వృత్తములను ఆవృతము చేయగలగాలి సాధకుడు.అది గురువు సహాయములేకుండా సాధ్యము కాదు.

  దేవీ ఖడ్గమాల స్తోత్రము గురువులను,దైవ,సిద్ధ,మానవ అని మూడు విభాగములుగా కీర్తిస్తున్నది.

  ఔఘ అన్నశబ్దము సమూహము సమూహమును సూచిస్తుంది.

     సాక్షాత్తుగా పరమేశ్వరుడే ఆదిగురువై పార్వతిదేవి సందేహమును తీరుస్తున్నట్లు( చేతనులను ఉద్ధరించుటకై )

 "కేనోపాయే లఘునావిష్ణోనామ సహస్రకం

  పఠ్యతే? అని తల్లి సందేహమును వ్యక్తముచేయగానే,

  "శ్రీరామ రామ రామేతి " అంటూ స్వామి సెలవిచ్చారుకదా.

  శ్రీవిద్యోపాసన సంప్రదాయములో నాథ అని స్వామిని,మయి అని శక్తిని గౌరవిస్తూ,కీర్తిస్తుంటారు.



  సాధారన సాధకుని ప్రయాణము ద్వైతభావముతో ప్రారంభమయి క్రమక్రమముగా అద్వైతసిద్ధిని పొందగలుగుతుంది.అది ఎప్పుడో,ఎక్కడో,ఏవిధముగానో గమనించగలుగు శక్తిమంతుడు కాడు సాధకుడు.కనుకనే,

 దేశకాల అపరిచ్చిన్నమైన పరమాత్మ తాను అడుగు-అడుగున అనేకరూపములతో ఉండి,ఈ ఇతేర ప్రలోభములు దరిచేయనీయకుండా,సాధ్సకునికి మార్గబంధువవుతాడు.

" శూలాహతారాతి కూటం

  శుద్ధమర్దేంద్రు చూడం

     భజే మార్గబంధుం"

  ఈగురుమండలం ఎక్కడ ఉంటుంది? అన్న సందేహమునకు సర్వానందమయచక్రములోని బిండువు,దాని చుట్టు ఉన్న త్రికోణముల మధ్య ప్రదేశమును గురుమందలముగా కీర్తిస్తారు/

 యుగములు మారుట ఏ విధముగా సత్యమో యుగధర్మములు మారుట కూడా అంతే సత్యము.

 సత్యము ప్రామాణికము-ధర్మము పరిణామక్రమము.

 1.కృతయుగములో శివశక్తులే గురుశిష్యులుగా,

 "చర్యానందమయీ" నామముతో కీర్తింపబడుచున్నవి.

 2.త్రేతాయుగములో " ఉడ్డీశనందనాథ/మయి" గాను,

 3.ద్వాపర యుగములో " సహ్ష్టీశనందమయి" గాను,

 4.కలియుగములో "మిత్రేశనందమయిగాను" కీర్తింపబడుతున్నారు.

   సక్తి ఉపాసన విధానములో క్రమముగా,

 1.ఉపాదానము

 2.విద్య

 3.స్వాధ్యాయనము

 4.సమాధి అను నాలుగు అవస్థలుంటాయి.



 సృష్టిక్రమ ప్రాధాన్యతతో కూడినమూడు అవరనములలో లేని "గురు"ప్రస్తావన స్థితి త్రయ చక్ర మొదటిదైన పదునాలుగు త్రికోనముల చక్రములో ప్రారంభమవుతుంది.ఏవిధముగావిస్తారముగానున్న త్రికోణకిందిభాగము దానికొసవలెనున్న ఉపరితల బిందువుకు సంకేతముగా ఉంటుందో సాధకుని చిత్తము సైతము గురుచినకు బీజము వేస్తుంది.కాని అది అంత సులభము కాదు.కారణము "పరబ్రహ్మము" మాయచే కప్పబడి "మాయావిశిష్టబ్రహ్మమూగానే గోచరిస్తుంటుంది.అదువలన గురుబోధ ఈవిధముగా ఉంటుంది అన్నవిషయము అర్థమవుతుందికాని అనుభవములోనికి రాదు.
 కనుకగురువు సర్వకాలసర్వావస్థలయందు తోడుగానుండి,ముందుగా,
 మంత్రోన్ముఖునిగా/అరాధనోన్ముఖునిగా ఉపాదాన ప్రక్రియను జరిపిస్తాడు.
  రెండవ దశలో అతని జాడ్యములను/అవరోధములను ఆహుతులుగా మార్చీగ్ని సమర్పణమును చేయిస్తాడు.
  తరువాత పరిశుభ్రమయిన మనసుతో మననము చేయగల సామర్థ్యమును అనుగ్రహిస్తాడు.
  త్రిగుణాతీత స్థితిని పొంది,ద్వైతభావను సైతము తొలగించగలిగి ఏకరూపమును దర్శిస్తూ,అనుభవించగలుగు భుక్తిసిద్ధియే సమాధి స్థితి.
   గురువు సాధకుని "వాచకకర్మాసక్తునిగా" చేస్తాడు.తదుపరీఆంగికకర్మాసక్తునిగా"అనుగ్రహహిస్తాడు.
 మూడవసారి స్వాధ్యాయనునిగా మలచి"కర్మాసక్తునిగా"తీర్చిదిద్దితాడు.
 మనో-వాక్కాయ-కర్మలను దాటినతరువాతనే"నిర్గుణబ్రహ్మోపసన" సాధ్యమవుతుంది.
 త్రికరణోపాసనసిద్ధి సాధకునీ త్రిగుణాతీత స్థితిని సిద్ధింపచేస్తుంది.
 "గురుమూర్తిః గుణనిధిః గోమాతా గుహుజంభుః"
    పరమేశ్వరి "మహాత్రికోణాంతరాళే బిందు పరితః" బిందువుచుట్టు ఉన్న ప్రదేశములో నున్న,గురుమండల అనుగ్రహశక్తులు మనలనందరిని అనుగ్రహించునుగాక.
 యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా
 నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.

 

   

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...