Friday, August 23, 2024

SREESUKTAM-04--KAAM SAHA-SMITAAM-SOSMITAAM


 


 శ్లోకము


  "కాం సోస్మితాం హిరణ్యప్రాకారం అర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం 

   పద్మేస్థితాం పద్మవర్ణాం తాం ఇహోపహ్వయే శ్రియం.


  జాతవేదుని ప్రార్థిస్తున్న భక్తుడు ప్రస్తుత శ్లోకములో,

 ఇహ ఉపహ్వయే-లక్ష్మీదేవి తనకు ఎంతదగ్గరగాఉండాలంటే,తన శ్వాసలో  నిలిచియుండునట్లు సహాయపడుమని  ప్రార్థిస్తున్నాడు.

   లక్ష్మీదేవి తనదగ్గరకు రావాలి,వచ్చితనను వీడకుండాలి,తన మనో సంకల్పమును దృఢపరచినిరంతరము ప్రణవమును నినదించునట్లుచేయాలి వానితో పాటుగా తనశ్వాసలో నిరంతరము నర్తిస్తుండాలి అని కోరుకుంటున్నాడు.

  ప్రస్తుత శ్లోకము పరబ్రహ్మము కాం  అను శబ్దముతో సూచించబడినది.క కారము బ్రహ్మ స్వరూపము.

  వాజ్మానస గోచరము కానిది "కాం" ఇది  అని విశేషించి చెప్పజాలనిది.చూపించజాలనిది.

   ప్రకృతికి మూలకారణమై ఆధారభూతమైనది.

  పంచదశి మంత్రమే శరీరముగా భాసించునది కనుక "కాం"

    లక్ష్మీదేవి సోస్మితాం.సుందర దరహాసముతో తప్తకాంచన వర్ణముతో ప్రకాశించుచున్నది.

   ఆ తల్లి పద్మములో స్థిరముగా కూర్చునియున్నది.ఆ పద్మము పద్మాసనస్థయై పద్మవర్ణముతో ప్రకాశించుచున్నది.

  హిరణ్మయియై  హిరణ్యప్రాకారముతో తేజరిల్లుచున్నది.

   తల్లికి ఆసనముగా సర్వ శుభలక్షణ సమన్వితమైన నా హృదయకమలము నందు ఆసీనురాలినిచేయుము.

   అర్ద్రత-జ్వలనము అను రెండు విశిష్ట లక్షణ శోభిత మహాలక్ష్మి తన కరుణను నాయందు ప్రవేశింపచేసి అనుగ్రహించునట్లు సహాయపడుము.తల్లి కురిపించు అర్ద్రత నన్నుభక్తితో పరవశించి,ప్రకాశించునట్లు అనుగ్రహించునుగాక.

   నా పూజలను స్వీకరించి తృప్తయై శ్రేయంకరియై నా శ్వాసలో నిరంతరము నిలిచి యుండునట్లు సహాయపడుము అనిప్రార్థింపబడుచున్న లక్ష్మీదేవి మనలను ఆశీర్వదించును గాక.

 హిరణ్మయీంలక్ష్మీ సదా భజామి.



No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...