Monday, September 2, 2024

SREESUKTAM-09-GAMDHADVAARAAM


  
  శ్లోకము

 " గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం
   ఈశ్వరీగ్0 సర్వభూతానాం తాం ఇహ ఉపహ్వయే  శ్రియం."

     క్షుప్తి పాసా మలాం అన్న సమస్యకు పరిష్కారము ప్రస్తుత శ్లోకము.
   శ్రేయమును కలిగించుటకు మహాలక్ష్మికి నాప్రార్థనను వినిపించు ఓ జాతవేద!
   శ్రేయ స్వరూపిణీయిన మహాలక్ష్మిని,తన పరిమళము ద్వారా భూలక్ష్మిగా ప్రకటింపబడుతున్న భూలక్ష్మికి నేను తనను నా దగ్గరగా వచ్చి నిలిచియుండమని ప్రార్థించుచున్నానని చెప్పు.
    ఆతల్లి,
   ప్రథ్వీ తత్త్వముతో పచ్చిలకులుగా,సౌగంధికవనములుగా ,పండ్లతోటలుగా,పంట పొలములుగా,కొండ చరియలుగా వివిధ రూపములతో తన సుగంధమును  వెదజల్లుతూ మనకు దర్శనమిస్తున్నది.
   ఆ భూలక్ష్మియే తన అనుగ్రహమును పాడి-పంటల రూపముతో ప్రకటింపచేయుచు "ధాన్యలక్ష్మి" గా  దర్శనమిస్తూ ధన్యతను అనుగ్రహిస్తున్నది.
   ఆకలితో పాటు దప్పికను తీర్చుటకై ఆ భూలక్ష్మియే నదీమతల్లిగా మారి జలలక్ష్మిగా కీర్తింపబడుతున్నది.
  ఆ మహాశక్తియే గోవులను తన ప్రతిరూపముగా సృష్టించి పుష్టిని ఇస్తున్నది.
  ఆ గోమాత/గోలక్ష్మి తన గోమయముతో పాడిపంటలను పుష్కలము చేస్తూ,అభూతిని-అసమృద్ధి పూర్తిగా తరిమివేస్తున్నది.
  ఆ గోమాతయే వాక్రూపమై సమస్తమును శుభప్రదము చేస్తున్నది వేదమాతగా/వేద వాగ్మయముగా.
   కనుక,
1. గంధద్వారాం-పరిమళము ద్వారా ప్రకటింపబడుచున్నదియు అగు భూదేవిని,
2.దురాధర్షాం-ఎవ్వరు తొలగించుటకు సాధ్యము కానిదియు,
3.నిత్యపుష్టాం-శాశ్వతముగా పుష్టిని అనుగ్రహించగలదియును,
4.కరీషిణీం-విశేషముగా గోమయమును అనుగ్రహించగలదియు,ఆకర్షణ గా మారి శుభములనొసగునదియును,వేదవాజ్మయ విభవమైనదియును
5.ఈశ్వరీం సర్వభూతాని-సమస్త చరాచర జీవులకు సామ్రాజ్ఞి అయిన దానిని 
6.శ్రియం-శ్రీలక్ష్మీ దేవిని
  ఇప్పిడు 
తాం నీవు, ఇహ-ఇక్కడకి ,ఉపహ్వయే-అహ్వానించుచున్నానన్న(త్రికరముల సాక్షిగా నా శ్వాసలో స్వాసగా/అత్యంత సమీపముగా ఉండి అనుగ్రహించుటకు,ప్రార్థించుచున్నానని చెప్పి,లక్ష్మీ అనుగ్రహమును అందింపుము.

   ప్రథ్వీమయీం  లక్ష్మీం  సదాభజామి.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...