Thursday, November 7, 2024

TANOTU NAH SIVAH SIVAM-07


   








  తనోతు నః  శివః శివం-07

  **********************

  "వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

   జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ"

    మూలపదార్థమును అన్వేషించే మనసు తిరిగి సాకారమును సాధనముగా చేసుకుందా 

    మనుకున్నట్లున్నది.  

        " ఈశుని మ్రోలా-హిమగిరి బాలా  కన్యతనము ధన్యమైన గాథను " వినిపిస్తూ- 

   కనిపించేటట్లు చేస్తున్నది ఈశ్వరానుగ్రహము.


   స్వామి భూత భర్తరి-సకలజీవులను సంరక్షించేవాడు.జగత్కళ్యానమునకై పలుమార్లు 

   పార్వతిని పరిణయము చేసుకుంటాడు -పరిపాలనమును నిర్వహిస్తాడు.

        అదేజరుగబోతున్నట్లున్నది  ఇప్పుడు.

           మన్మథుని క్షమించి మంగళగౌరిని ను వివాహమాడిన మహాదేవుడు 

   మరొకసారి తన సృష్టి ప్రకటనమును విస్తృతము చేస్తున్నాడు.


        అది ప్రపంచముగా భాసించుచున్న పార్వతీదేవికి-ప్రపంచవిస్తరనమును గావిస్తున్న 

   పరమేశ్వరునికి మనదృష్టిలో మరొక కొత్త అధ్యాయము.కనుకనే మొదటి 

   చరణములో,భుజంగతుంగ మాలిక గా నున్న పాము ఇప్పుడు మణిప్రభా భుజంగముగా 

   మారబోతున్నది ఏ శుభసూచకమునకు తాను పాత్రధారికాబోతున్నదో

                అంతేకాదు మన అదృష్టము

   అందరికి దిక్కైన ఆదిపరాశక్తి తాను అష్టదిక్కులుగా మారి స్వామిని సేవించుకోబోతున్నది.


   వారిది ఒకవినూతన దాంపత్యము.మహాదేవుడు వరుడు/ కాబోయే భర్త(విశ్వమునకు) 

   భర్తకు జోడిగా /భార్యగా వధువుగా అమ్మ దిక్కులుగా తనను తాను ప్రకటించుకుంటోంది.


          గౌరీ కళ్యాణ వైభోగమే.

    అప్పుడు భీష్మించిన పెళ్ళికొడుకు ఇప్పుడు వాత్సల్యముతో,


   పసుపుతో కూడిన ఎరుపు వర్ణములను అమ్మ నుదుటిపై అలంకరించి   విశ్వ 

   గృహస్థాశ్రమమునకు విశ్వేశ్వరుడు కాబోతున్నాడేమో.

   

       అదే అదనుగా భుజంగము తన పడగమీది  కాంతులను 

   పసుపుకుంకుమలుగా /కదంబకుంకుమ ద్రవముగా మలచుకొని స్వామికి 

   అందించగా స్వామి దిక్వధూ నుదుటిపై తన స్వహస్తములతో అలంకరించి ,మన భాషలో 

   చెప్పాలంటే బొట్టు పెట్టి ఒట్టేశాడన్న మాట.ఇక ఏమోలు లేవు.అంతా 

   ఆఅశీర్వచనములే.అదే అన్నమాట/ఉన్నమాట.


  నీనుదుటను కుంకుమను అలంకరిస్తాను ఆ తదుపరి మన సంతతిని తల్లితండ్రులై రక్షిద్దాము.

  అంటున్నాడు తన తాండవ భంగిమతో

.

      శ్రవణానందకరమైన  ఆ మాట ను విననీయకుండా మాయదారి 

  ఇంద్రియములు మరింత విజృంభించి నిజముగా మనకోసమే వీరిద్దరి కళ్యాణము ..లేక


     అదేకదామదించిన ఇంద్రియములు చేస్తున్ననిర్వాకము.


    గిరిజాకళ్యాణము కాముని కాల్చిన తరువాత జరిగినదే కదా.


         ఇంద్రియాతీతుడు మహాదేవుడు.

          అహంకారముతో హుంకరించిన మదగజ చర్మమును 

  ఒలిచివేసి ,తన ఉత్తరీయముగా అలంకరించుకున్నాడు. 

  (స్వామికరుణను గ్రహించలేని ప్రతి జీవి/ఉపాధి మదముతో 

  కళ్ళుమూసుకొని పోయిన ఏనుగే కదా.)


      " ఉత్తర భుజమునందు శుభసూచకముగా ధరించు వస్త్రము ఉత్తరీయము."


 "అనుత్తరీయశ్చ-నగ్నశ్చ" అన్న సూక్తిని గౌరవిస్తూ ఏ శుభకార్యమునందైనను పురుషుడు 

  ఉత్తరీయమును ధరించవలసినదే.కనుక స్వామి తన దిగంబరత్వమును దాటి ఉత్తరీయమును 

  ధరించి పెండ్లికొడుకైనాడు సాంప్రదాయబద్ధముగా


       స్వామి ధరించినది త్వక్-చర్మపు ఉత్తరీయము.సింధుర/గజచర్మపు 

   ఉత్తరీయము.అదియును



  మదముతో అంధత్వముతో నున్న చర్మ ఉత్తరీయము.


    దేనికి సంకేతము ఈచర్య?


  మానవ ఉపాధికి-బాహ్య ప్రపంచమునకు ఉన్న అడ్దము/హద్దు/పొలిమేర  చర్మము.సత్యమైన శివమునకు-సుందరమైన శివమునకు(అంతరమునకు-బాహ్యమునకు)  మధ్యనున్న అవరోధము.అది స్వామి స్పర్శచే పునీతమై శాశ్వత ఆఛ్చాదనముగా అమరబోతున్నదట.

   కదిలేది ప్రపంచము-కదలనిది పరమాత్మ.

   శివం భజమేవ నిరంతరం.

        

 ఏక బిల్వం  శివార్పణం..


   


   


 









No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...