Monday, June 19, 2017

O mahiLaa jaejaelu


మహిళా దినోత్సవము
**********************
మగువ సహకారమేగ మగసిరికి ఆకారము
మగువ సహనశీలమేగ మన జాతికి శ్రీకారము
మగువ గుండె చప్పుడేగ గర్భస్థ శిశువుకి ధైర్యము
అది వినబడుట లేదనేగ పుట్టగానే రోదనము
మగువ ధన్య స్థన్యమేగ స్థితికారక ఆధారము
మగువ ధైర్య స్థైర్యమేగ అభివృద్ధికి అధ్యయనము
మగువ చూపు తెగింపేగ మహా యశో ప్రాకారము
ముమ్మాటికి, ఒకేసారి మూడు క్షిపణుల ప్రయోగము
మగువ సేవా నిరతియేగ విశ్వమాత రూపము
అతిశయమే కానరాని ఆ దేవుని ప్రతి రూపము
భుజము దిగనీయదు కడవరకు బాధ్యతలను తాను
నాలుగు భుజములపై సేదతీరు వరకు
కనుక
" మేమే గొప్ప" అని హుంకరించకండి మగవారు
వానతో పాటుగ శబ్దించిన ఉరుములు అనుకుంటారు
ఎందుకంటే
ఉరుములు ఎంత ఉరిమినా పంటలు పండించలేవు
మౌనముగా కురిసిన వాన చినుకులు తప్ప
అంతే కాదు
వైద్యరంగ ప్రగతి చేసినది ఆమె గర్భసంచిని అద్దె ఇల్లు
అయినా సహిస్తోంది ఓ మనిషి -ఆమె పాదాలపై మోకరిల్లు.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...