Saturday, December 2, 2017

CHIDAANAMDAROOPAA-IDANGAL NAAYANAARU


 చిదానందరూపా-ఇదంగళి నాయనారు
 *******************************

 కలయనుకొందునా  నిటలాక్షుడు  కలడనుకొందునా
 కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొమునా

 అగస్త్యకుల వంశజుడు ఇదంగళ్ ఈశ్వరభక్తుడు
 శైవాగమ విధులను సంతసముగ సలిపెడివాడు

 ఆ లయకారుని  ఆలయ విధులలో సహాయకారి
 ఆకలిగొన్నవారిని  సంతృప్తులచేసెటి ఆత్మయోగి

 అన్నదానమునుచేయగ ధాన్యపు కొరతను తీర్చుకొనగ
 రాజ ధాన్యాగారపు దొంగ సంగతి తను తెలిసికొని

 చాటింపే వేయించెను తన సంపదనంతయు పంచగ
 పరమేశుని తను చేరగ పంచిన సంపద కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు తీర్చును గాక.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...