CHIDAANAMDAROOPAA-GOEDAGOOCHI


 చిదానందరూపా-గోడగూచి
 *********************
 కలయనుకొందునా  నిటలాక్షుడు  కలడనుకొందునా
 కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా

 తలితండ్రుల ఆనతిగాన  తరియింపగ తాను
 కమ్మని ఆవుపాలు నైవేద్యము సేయగ తరలెను

 కొండను వెలిసిన శివునికి బొజ్జనింపగ ఇంపుగ
 మెండగు భక్తి తోడ  గోడగూచి నిష్కళంకముగ

 అతివాస్తవికతతో స్వామికి ఆవుపాలను త్రాగించెనుగ
 ఆ విషయము నమ్మనివారి ఆగ్రహమునకు దండన తోడాయెగ

 పరమాత్మలో పదిలముకాగా  పరమాద్భుతమె జరిగెగ
 ప్రమథ గణములలో చేరగ పట్టిన పాలే కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిదిచిదానందుని లీలలు గాక
 చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. 

Comments

Popular posts from this blog

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI