Thursday, March 15, 2018

SAUNDARYA LAHARI-44


సౌందర్య లహరి-43

పరమ పావనమైన నీ పాదరకణము

పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము



ఆకలిలో దాగియున్న అగ్నిహోత్ర జ్వాలగా

ఆహారములో సాగుచున్న సృష్టి-స్థితి లీలగ



అక్షరములనేలుచున్న విలక్షణ స్వరముగా

వీక్షణముల బ్రోచుచున్న సాక్షాత్తు కరుణగా



కదలని కనురెప్పల కరుణే కనుసన్నలుగా

ఋతువులు మార్చుచున్న కాలాతీత రూపిణిగా



సర్వకాల సర్వావస్థలలో సన్నిహితముగా

బ్రహ్మాండములతో నీవు బంతులాడుచున్న వేళ



నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా

మానస విహారి ఓ సౌందర్య లహరి.

" అండజ వాహన నువు బ్రహ్మాండంబులు బంతులట్లు ఆడగ "అని శ్రీ కృష్ణ శతకములో గోవర్ధనపర్వతమును చిటికెన వేలితో ఎత్తినపుడు గోపాలురు ప్రస్తుతించిరట.అదే విధముగ శ్రీమాత పదునాలుగు భువన భాండములను బంతులుచేసి లీలగ వానిని తిప్పుచుండును.మణిద్వీప వర్ణనలో ఒక సంఘటన గురించి పెద్దలు ఇలా చెబుతారు.ఒకసారి బ్రహ్మదేవునకు ( అమ్మ అనుగ్రహముతో) సృష్టికర్తగా ఇంతటి వైభవమును పొందగలుగుచున్నాను.ఈ వైభవమునకు కారణమైన జగన్మాతను ఒకసారి చూడవలెననుకున్నాడట.వెంటనే అతిమనోహరమైన ఒక దివ్య విమానము వచ్చి నిలించిందట.తనకోసము వచ్చినదో కాదో అన్న సంశయములో నున్న బ్రహ్మకు దానినుండి ప్రణవము ( ఓంకారము) వినిపించసాగెను.తల్లి అనుగ్రహించినదని సంతసించి,దానినెక్కి,మధ్యలో ఆగి విష్ణువుని,శివుని ఎక్కించుకొని సర్వలోకమునకు ( అమ్మ నివాస స్థానము) వెళ్ళుచుండగా ధాతు ప్రాకారములను దాటి వెళ్ళునప్పుడు వారు లోభమును జయించినాము కనుక ధన-కనక-వస్తువుల పట్ల ఆకర్షితులము కాలేదనుకున్నారట.అంతే.జగదంబ విలాసము.వారికి అష్ట సిద్ధులు కనిపించాయట(అణీమ-గరిమ మొదలగునవి.)వాటిని స్వాధీన పరచుకోవాలనుకున్నారుట ,(అమ్మ దర్శన విషయమును మరచి క్షణకాలము) తల్లి రజో-తమో-సత్వ గుణములు వారు కనుక తెప్పరిల్లి లోనికేగి అమ్మ అనుగ్రహమును పొంది ధన్యులగుచున్న సమయమున ,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.





No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...