Thursday, March 15, 2018

SAUNDARYA LAHARI-45

సౌందర్య లహరి-44
పరమ పావనమైన నీ పాదరజ కణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
దుర్గ,లక్ష్మి,సరస్వతి,గాయత్రి,రాధ ప్రకృతి పూర్ణరూపములు
గంగ,చండి,తులసి,షష్టి,మానసా దేవి ప్రధానాంశ రూపములు
అనసూయ,అరుంధతి,శచీదేవి,లోపా ముద్రా అమ్మ కళాంశ
రూపములు
పెద్దమ్మ,పోలేరమ్మ,ఎల్లమ్మ,మైసమ్మ అమ్మ అంశ రూపములు
ప్రతి స్త్రీమూర్తిలో పవిత్ర అంశాంశను పదిల పరచగ
ప్రతి స్త్రీరూపము పరమేశ్వరి ప్రతిరూపమే కాగ ఇలను
పూర్ణముగా-అంశలుగ-అంశాంశలుగ-జానపదముగా
గడ్డుతనము తొలగించి బిడ్డలను కాపాడుచున్నవేళ
నీ మ్రోలనేనున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి
పరాశక్తి-పరమేశ్వరి భక్త సంరక్షణార్థము పలురూపములను ధరించి,పరిపాలించుచున్నది.భక్తుల మానసిక స్థితిగతులకు అనుగుణముగా,
" ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కక్కడై తోచు రీతి" భగవతి తన రూపమును-స్వభావమును-పూజా విధానమును అనేకముగా చేసినను,అనుగ్రహమును మాత్రము అవ్యాజముగా(అనుగ్రహించవలసిన కారణము లేక పోయినను) వర్షించుననుటకు పెక్కు ఉదాహరణలు కనిపించుచున్నవి.
"శివ శక్త్యా 

 యుక్తా ప్రభవతి" అని ఆదిశంకరులు కీర్తించినా,లోపా ముద్రార్చిత శ్రీమత్ చరణములను సేవించినా," మాతంగి శ్రీ రాజ రాజేశ్వరి మామవ" అని ముత్తుస్వామి వారు స్తుతించినా,కత్తులు-బల్లెము చేత బట్టి,దుష్టుల తలలను మాలకట్టి,పెద్ద పులి..నువు పెద్ద పులి నెక్కినావమ్మా--అని చిందులేసినా,తల్లి మందస్మితముతో అందరిని కాపాడు చున్న వేళ,నీచెంతనే నున్న నాచేతిని, విడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...