Thursday, March 22, 2018

SAUNDARYA LAHARI-54

  సౌందర్య లహరి-53

  పరమపావనమైన  నీ పాదరజకణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  అధిష్ఠాన దేవునిగ  ఆ పరమాత్ముడుండగ
  ధ్యానము-ధ్యేయము-ధ్యాతలను  ఏకము చేస్తు

  నూట ఇరవై ఉపదళములున్న ఎమినిది దళములలో
  అక్షరములను మించిన శుభలక్షణములు నిలుపుకొని

  పంచతత్త్వములను మించిన కృష్ణతత్త్వముతో
  కుండలినీ శక్తిని శివశక్తిగా  మలచుచు

  బ్రహ్మరంధ్ర  సమీపమున పరబ్రహ్మ స్వరూపిణి
  సహస్రారములో  సచ్చిదానందమై  సాక్షాత్కరించుచున్నవేళ

  నీ మ్రోలనే నున్న  నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి  ఓ సౌందర్య లహరి.




 సహస్రార చక్రమును "మకుట" చక్రము అని గౌరవిస్తారు.




 సహస్రార చక్రమును "మకుట" చక్రము అని గౌరవిస్తారు.


  "కులాంగనా-కులాంతస్థా-కౌళిని-కులయోగిని
   అకులా-సమయాంతస్థా" అని " శ్రీ లలితాసహస్ర రహస్యనామ స్తోత్రము" లో శ్రీ మాత షట్చక్రముల-సహస్రారము గురించి మనకు అనుగ్రహముతో వివరించింది.

   కులము అను పదమునకు ఉన్న అర్థములలో సమూహము అనునది ఒకటి.ఆ అర్థమును అన్వయిస్తూ,అమ్మ  అనుగ్రహ తత్త్వమును తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.


    షట్చక్ర సమూహమే షట్చక్ర కులము.షట్చక్రములలో స్త్రీమూర్తి రూపముగా అనుగ్రహించు తల్లి కులాంగనా.ఇచ్చా-జ్ఞాన-క్రియా శక్తుల అవిష్కార పరచు అంతర్శక్తియే
కులాంతస్థా అయిన అమ్మ తత్త్వము.షట్చక్రములలో కుండలినీ శక్తిగా పైపైకి పాకు సామర్థ్యమే (గ్రంధుల ముడి విప్పుతు) కులయోగిని.

  అకులము అనగా సహస్రారము.శివ స్వరూపము.షట్చక్రములు శక్తి స్థానములు.కులమునకు-అకులమునకు మధ్యనున్నసంబంధ తత్త్వమే కౌళిని.

  కుండలినీ శక్తి షట్చక్రములనుదాటి సహస్రాముచేరి శివశక్త్యైక రూపముగా తేజరిల్లును."శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని" అని సహస్రారములోనున్న నిన్ను సందర్శించుచు-సంకీర్తించుచున్న  సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.








  

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...