Wednesday, April 4, 2018

SAUNDARYA LAHARI-KAAMAAKSHI-74

  సౌందర్య లహరి-కామాక్షి-73

  పరమపావనమైన నీ పాదరజకణము
  పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము

  చూత వృక్షముక్రింద  సైకతలింగమును ఉంచి
  చంద్రచూడుని ప్రార్థించె,తనను పెండ్లాడమనె

  అనవరతము  ప్రణవమే  ఆ భుజము మీది చిలుక
  అమాసలేని పున్నములే  ఆ అనందిలభట్టుకిక

 " క" కారమే సృష్టిగా-"మ" కారము స్థితి తత్త్వముగా
   మాయాసతి వీపు ఎంతో మహిమాన్విత మూర్తిగా

   పంచభూతాత్మికమైన  ఆ కాంచీ పట్టణములోన
   ఏకామ్రేశ్వరునితో-కామాక్షి,మమ్మేలుచున్న వేళ

   నీ మ్రోలనే  నున్న నా కేలు విడనాడకమ్మా,నా
   మానస విహారి  ఓ సౌందర్య లహరి.

 "అయోధ్యా మధురా మాయా కాశి కాంచి అవంతికా" అను భారత దేశములోగల సప్త మోక్ష పురములలో ఒకటి
  అమ్మవారు సైకత లింగ పరమేశ్వరుని మామిడిచెట్టుక్రింద నిలిపి, తపమాచరించి
పతిగా పొందినది.పంచభూతాత్మిక క్షేత్రముగా ప్రసిద్ధిచెందినది కంచీపురము." క" కారము సృష్టికి" మ" కారము పోషణకు ప్రతీకలుగా గుర్తిస్తారు.కామాక్షి విలాసము అను గ్రంధము ప్రకారము అమ్మ శక్తిని మన్మథుని యందు ఆవహింపచేస్తుందట.   ..ఇతిహాసకథల ప్రకారము అమ్మ భీకర రూపముతో రాత్రులందు నగరసంచారము చేయుచుండెడిదని,ప్రజలు భయభ్రాంతులయ్యేవారని ,ఆ సమయమున ఆదిశంకరాచార్యుల వారు గర్భగుడికి ఎదురుగా శ్రీచక్రమును ప్రతిష్ఠించారట.మరొక ప్రచారములోనున్న ఆనందిలభట్టు కథ.వారు నిరంతరము అమ్మధ్యాన సమాధిలో రాకాశశిబింబమును దర్శించుచు తరియించేవారట.ఒక అమావాస్య రోజున ధ్యానభగ్నుడైన ఆనందిల భట్టు ఆదేశరాజుగారితో ఆనాడు పూర్ణిమ తిథి అని చెప్పినాడట.అమ్మ భక్తానుగ్రహమేమో తనచేతి కంకణమును నింగికి విసిరి ఆ తల్లి పసిడి కాంతులను పండించుచున్న సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు..

  .


  

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...