Saturday, October 6, 2018

CHIMTAAMANI GRHAANTASHTHAA-SREE MANNAGARA NAAYIKAA

   చింతామణి గృహాంతస్థా-శ్రీ మన్నగర నాయిక
   *************************************

   భగవత్ స్వరూపులారా!

   నమస్కారములు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ తన నిర్హేతుక కృపాకటాక్షముతో దేవీ శరన్నవరాత్రుల పుణ్యసమయమున ఏ మాత్రము పట్టులేని నా చేతిని పట్టుకొని తన విభవము గురించి వివరణ రూపముగ అందించిన ఆశీర్వచనములను అందుకొని పునీతులమగుదాము.దైవస్వరూపులు ఈ ప్రస్థానములో నా అహంకారము చొచ్చుకొని చేసిన అపరాధములను మన్నించెదరుగాక.

  దుర్గ మాయమ్మ సర్వలోక సృష్టికార్యమును ప్రారంభించుటకు పూర్వము దానిని సూక్ష్మముగా తన సంకల్పముతో సృజించి తాను నివాసముండ తలచెనట.అదియే పరమ పవిత్రమైన చింతామణి గృహము.అందులో తల్లి విశ్వమును వివిధ శక్తులను నిక్షిప్తము చేసెనట.భావనా మాత్ర సంతుష్ట నిర్మిత బ్రహ్మా0డ చత్రమును  చూచుటకు, తత్త్వమును అర్థము చేసుకొనుటకు చర్మచక్షువులు-మానవ మేథ సరిపోదు.ఎందుకంటే అది కేవలము ప్రాకారములు,సరోవరములు,ఉద్యానవనములు శుకపిక కూజితములు మాత్రమే కాదు.సంకేతములు-సందేశములు.అంతర్ముఖ సమారాధ్యా-బహిర్ముఖ సుదుర్లభా.మనలోనే దాగియున్న తల్లిని మనము గుర్తించలేనిది మన అజ్ఞానము.అందరు కాదు లెండి.మన అందరి శరీరములు మణిద్వీపములే.సుధాసాగరములే.సుందర ఉద్యాన వనములే.సుమధుర సంగీత వాటికలే.సురుచిర సుందరములే.

  మనలోని అఖండశక్తి చిన్న పరిణామములో అంగాంగములలో ప్రవేశించి ఆత్మశక్తిని తెలుసుకొనునట్లు చేయునో అదేవిధముగా అమ్మశక్తి వివిధరూపములలో,పరిణామములలో లోహ ప్రాకారములుగా,మణిమానిక్య ప్రాకారములుగా.దివ్య సుధా సాగరములుగా ,సుగంధ పరిమళ పూలతోటలుగా,సుమధుర స్వర కోకిలారవము లుగా,దర్శనమిస్తు,సత్యమును బోధిస్తూ,మన బుద్ధిని మనసుకంటే ఉన్నతముగ మలుస్తు మణిద్వీపములో అమ్మ దివ్యచరణములను చేరుస్తుంది శరణు వేడమని.అమ్మ చేయి పట్టుకొని,ఆనందముతో అడుగులు వేస్తు,అద్భుతాలను చూసేద్దామా.అవధులు లేని ఆనందమును పొందుదామా.

  అమ్మ దయతో పయనము కొనసాగుతుంది.

   శ్రీ మాత్రే నమః.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...