SIVA NAAMAASHTAKAMU

  శివనామాష్టకము

 .కైలాస శిఖరమున శూలహస్తముదాల్చి పాలించుచున్నాడు
  ఫాలభాగము పైన బాలేందురేఖతో,నిప్పు నేత్రము తెరచి
  లీలగ మన్మథుని కుప్పకూల్చినవాడు అభయము తానైన
  సదాశివుని దయ సంసార దుఃఖంబు సమసిపోవును గాక.

 2.వామదేవుడు ప్రమథగణములచే కొలువబడుచున్నాడు
  వామ భాగమున పార్వతీదేవితో, కనికరము కలవాడు
  రామ సేవితుడు,మేరు వింటిని దాల్చి, త్రిపురములు కూల్చిన
  సదాశివుని దయ సంసార దుఃఖము సమసిపోవును గాక.

3. నీలకంఠుడు వాడు,వృషభధ్వజముతో అలరారుచున్నాడు
   పాలించి శేషుని కంకణముగ ధరించి,గౌరవించిన ధూర్జటి
   కలవరము హరించి,ఎల్లవేళల ఐదు ముఖముల బ్రోచు
   సదాశివుని దయ సంసార దుఃఖము సమసిపోవును గాక.

4.. కాలాతీతుడిగ కపాలమాలలను ధరియించుచున్నవాడు
   అలంకారము చేయుచు భస్మము,దేహమంత ప్రకాశము
   నీలాంబరమును తాకు కేశపాశములు స్థితికార్య సంకేతముగ
   సదాశివుని దయ సంసార దుఃఖము సమసిపోవును గాక.

5. మూడు కన్నులతో ముల్లోకముల స్తుతులు అందుకొనుచున్నాడు
   ఏడు లోకాలను ఏలేటి వాడు, ఎదురులేని ఏకైక సాక్షిగా
   వేడుకొనినంతనే శక్తి ప్రాణేశ్వరుడు తోడు తానవుతాడు
   సదాశివుని దయ సంసార దుఃఖము సమసిపోవును గాక.

6. గంగాధరుడితడానందముగ తాండవమాడుచు నున్నవాడు
   మంగళమొనరింపగ జగతికిన్, అంధకాసుర శతృవు
   పొంగుచును వరమొసంగెనుగ బాణుని కాపరిని తానను
   సదాశివుని దయ సంసార దుఃఖము సమసిపోవును గాక.

7.. దక్షుని అహము జయించి,విశేషపూజలనందుకొనుచున్నాడు
   లక్షణమైన కాశికా పురిని,మణికర్ణిక ద్వీపపు రాజు
   రక్షక హృదయ నివాస దీనజన సమస్తము తెలిసిన
   సదాశివుని దయ సంసార దుఃఖము సమసిపోవును గాక.

8. గిరిజా విలాస నిలయుడు ,నిగమాగమములు తానైనాడు
   శరణము పొందిన వారి కల్ప తరువు,గిరి విరాజ మానుడు
   చరణ పంకజముల స్మరణము భవతరణ సోపానము
   సదాశివుని దయ సంసార దుఃఖము సమసిపోవును గాక.


శివస్తోత్రం పరమ పవిత్రం ఇది

  ఏక కాల పఠనం నిత్యం శతృ దోష నివారణం
  ద్వికాల పఠనం నిత్యం ధనధాన్య సమృద్ధితం
  త్రికాల పఠనం నిత్యం సాక్షాత్ శివ దర్శనం.

  శివ నామాష్టకం సంపూర్ణం.

 ( ఏక బిల్వం శివార్పణం.)

  ఓం తత్ సత్.
  భగవత్ బంధువులు సహృదయతతో నా ఈ ప్రయతములోని లోపములను సవరించి,నన్ను ఆశీర్వదించెదరు గాక.






Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)